కేసీఆర్.. ఇప్పటికైనా ఆలోచించుకో: వీహెచ్
మీరాకుమార్‌కు మద్దతు ఇవ్వాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కల సాకారం కావడంలో తన వంతు కృషి చేసిన మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్‌కు సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మతతత్వ పార్టీ అయిన బీజేపీకి ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ఇవ్వడం సరికాదన్నారు. ‘ఇప్పటికైనా కేసీఆర్ అలోచించి తెలంగాణకు సహకరించిన మీరాకుమార్‌కు మద్దతు ఇస్తే చరిత్రలో నిలుస్తారు, లేకుంటే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు’ అని వీహెచ్ హెచ్చరించారు. స్కూళ్లు, కాలేజీల్లో డ్రగ్స్ ఉదంతాలపై కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు.