కిల్లర్ హెయిర్ స్టయిల్!
‘వెంట్రుకల గుణం మీద స్టయిల్ ఆధారపడి ఉంటుంది, స్టయిల్ కోసం వెంట్రుకలను ఇబ్బంది పెట్టవద్దు’ ఇలాంటి బోలెడు సలహాలు న్యాయ నిర్ణేతలుగా వచ్చిన వాళ్లు ఔత్సాహికుల కోసం చెప్పారు.
పోర్చుగల్‌లోని లిస్బన్ పట్టణంలో ఇటీవల ‘మెన్స్ హెయిర్ స్టయిల్’ పోటీలు జరిగాయి. పద్దెనిమిది దేశాల నుంచి వెయ్యికి పైగా ఎంట్రీలు వచ్చాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పద్నాలుగు మంది మెన్స్ హెయిర్ స్టయిలిస్ట్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
ఈ పోటీలో ఐర్లాండ్‌కు చెందిన పాల్మాక్ ‘కిల్లర్ కట్’ హెయిర్ స్టయిల్ బహుమతి గెలుచుకుంది.
‘‘ఒక సెలూన్లో బార్బర్‌గా నా కెరీర్ మొదలైంది. తీరికవేళల్లో రకరకాల హెయిర్ స్టయిల్లు ప్రయత్నించేవాడిని. ఆ అలవాటే బహుమతి అందుకునేలా చేసింది’’ అంటున్నాడు పాల్మాక్. ఈయన సెలూన్‌ను మాత్రమే నమ్ముకోకుండా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడు. తన లేటెస్ట్ స్టయిల్స్‌ను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పెడుతుంటాడు.
‘వెంట్రుకల గుణం మీద స్టయిల్ ఆధారపడి ఉంటుంది, స్టయిల్ కోసం వెంట్రుకలను ఇబ్బంది పెట్టవద్దు’ ఇలాంటి బోలెడు సలహాలు న్యాయ నిర్ణేతలుగా వచ్చిన వాళ్లు ఔత్సాహికుల కోసం చెప్పారు. మీ వెంట్రుకలు మందంగా ఉంటే, ఈసారి సెలూన్‌కు వెళ్లినప్పుడు- ‘‘కిల్లర్ కట్ చెయ్ గురూ’’ అని అడగండి. ‘‘అదేమిటి?’’ అని అడిగేతే ప్రపంచ తలకట్టు పోటీలో బహుమతి గెలుచుకున్న ‘కిల్లర్ కట్’ గురించి చెప్పండి.‘‘మీ దగ్గర ఇంతుందా!’’ అన్నట్లు బార్బర్ చూస్తే చూడనివ్వండి. కొత్త విషయం చెబితే వినని వారు ఎవరు ఉంటారు చెప్పండి!