migration problem
-
ప్రభుత్వాన్నే ముంచేసిన.. వలసల వరద..
నెదర్లాండ్స్‌లో నాలుగు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికైన ఏడాదిన్నరకే పేకమేడలా కుప్పకూలింది. యూరప్‌లో చాలా దేశాలు ఎదుర్కొంటున్న వలసల ఉధృతే ఇందుకు ప్రధాన కారణం కావడం అక్కడ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.. నెదర్లాండ్స్‌లోకి వలసలను కట్టడి చేసేందుకు ప్రధాని మార్క్ రుట్టె ప్రతిపాదించిన కఠినతరమైన వలసల విధానం చివరికి ఆయన ప్రభుత్వానికే ఎసరు తెచి్చంది. పాలక సంకీర్ణంలోని మిగతా మూడు భాగస్వామ్య పార్టీలూ ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో రుట్టె రాజీనామా చేశారు. అయితే, భాగస్వాముల మాటకు తలొగ్గి రాజీ పడేకంటే దీర్ఘకాలిక స్వీయ రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్న దూరదృష్టి ఆయన నిర్ణయంలో ప్రతిఫలించిందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతేగాక యూరప్‌లో వలసల సమస్య నానాటికీ ఎంత తీవ్రతరంగా మారుతోందో, అక్కడి రాజకీయాలను ఎంతగా ప్రభావితం చేస్తోందో, దీన్ని రైట్ వింగ్ పార్టీలు సొమ్ము చేసుకోకుండా ఆపడం ప్రధాన పార్టీలకు ఎంత కష్టతరంగా పరిణమిస్తోందో ఈ ఉదంతం మరోసారి తేటతెల్లం చేసిందని చెబుతున్నారు. ► యూరప్‌లోని అత్యంత ధనిక దేశాల్లో నెదర్లాండ్స్‌ది నాలుగో స్థానం ► నెదర్లాండ్స్‌లోకి వలసల సంఖ్య గతేడాది ఏకంగా మూడో వంతు పెరిగి 47 వేలు దాటేసింది! దాంతో ప్రధాని రుట్టె కట్టడి చర్యలను ప్రతిపాదించాల్సి వచి్చంది. ► ఈసారి దేశంలోకి శరణార్థుల సంఖ్య ఏకంగా 70 వేలు దాటొచ్చని అంచనా. ► వలసదారుల దెబ్బకు చాలా యూరప్ దేశాల్లో మాదిరిగానే నెదర్లాండ్స్‌లో కూడా ఇళ్ల ధరలు, అద్దెలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. ► ఇదేగాక పెరుగుతున్న వలసల వల్ల అనేకానేక సమస్యలతో నెదర్లాండ్స్ సతమతమవుతోంది. ► నవంబర్‌లో జరుగుతాయని భావిస్తున్న ఎన్నికల్లో అన్ని పార్టీలకూ ఇది అది పెద్ద ప్రచారాంశంగా మారినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ► ఇప్పుడిక నెదర్లాండ్స్ రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏమిటీ ప్రతిపాదిత విధానం... ప్రధానంగా, నెదర్లాండ్స్‌లో నివసిస్తున్న వలసదారుల పిల్లలకు వలసదారులుగా గుర్తింపు ఇచ్చేందుకు కనీసం రెండేళ్ల వెయిటింగ్ పీరియడ్ ఉండాలని ప్రధాని రుట్టె ప్రతిపాదించారు. దీన్ని సంకీర్ణ భాగస్వాములు తీవ్రంగా వ్యతిరేకించారు. యూరప్‌కు పెనుభారంగా వలసలు... ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితర కారణాలతో యూరప్ దేశాలకు కొన్నేళ్లుగా వలసలు భారీగా పెరుగుతున్నాయి. ► 2015లో సిరియా నుంచి శరణార్థులు వెల్లువెత్తిన నాటి నుంచీ ఈ ధోరణి నానాటికీ పెరుగుతూనే ఉంది. ► కానీ ద్రవ్యోల్బణం తదితరాలతో అసలే ధరాభారం, జీవన వ్యయం నానాటికీ పెరిగిపోతున్న సమయంలో ఈ వలసలు క్రమంగా యూరప్ దేశాలకు తలకు మించిన భారంగా మారుతున్నాయి. ► దీన్ని అవకాశంగా మలచుకుంటూ పలు యూరప్ దేశాల్లో రైట్ వింగ్ పార్టీలు శరణార్థుల పక్షం వహిస్తుండటంతో యూరప్ రాజకీయాలే కీలకమైన, అనూహ్యమైన మలుపు తిరుగుతున్నాయి. చాలా దేశాల్లో ఇప్పటికే రాజకీయాలను నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయి కూడా. ► ఏళ్లుగా పాతుకుపోయిన సంప్రదాయ పార్టీలకు ఈ రైట్ వింగ్ పార్టీల ఎదుగుదల పెను సవాలుగా మారుతోంది. ► జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, హంగరీ మొదలుకుని చిన్నా పెద్దా యూరప్ దేశాలన్నింట్లోనూ ఇదే పరిస్థితి! ► దాంతో రైట్ వింగ్ పార్టీలకు ముకుతాడు వేసేందుకు సంప్రదాయ పార్టీలన్నీ చేతులు కలుపుతున్న కొత్త ధోరణి కూడా కొన్ని దేశాల్లో ఇప్పటికే మొదలైంది. రుట్టె కేంద్రంగా... ► నెదర్లాండ్స్‌లో వలసలపై నెలకొన్న తాజా సంక్షోభం ప్రధాని రు ట్టె సంప్రదాయ వైఖరి కారణంగానే ముదురు పాకాన పడింది. ► 13 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న రుట్టె, దీన్ని కూడా అందివచి్చన అవకాశంగానే మలచుకుని వెంటనే రాజీనామా చేశారు. ► ఇటీవల బలం పుంజుకుంటున్న రైట్‌వింగ్ పార్టీల దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు దేశ ప్రయోజనాలు కాపాడేందుకు అధికారాన్ని కూడా తృణప్రాయంగా వదులుకున్నారన్న ఇమేజీ సాధించి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టే లక్ష్యంతోనే ఆయన రాజీనామా చేసినట్టు కనిపిస్తోంది. ► రైట్ వింగ్ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టడం ద్వారా రుట్టె తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. ► అంతేగాక రాజీనామా ద్వారా యూరప్ యవనికపై వలసల కట్ట డి కోసం గళమెత్తుతున్న బలమైన నేతగా రుట్టె ఆవిర్భవించారు. ► యూరప్‌లోకి వలసల కట్టడికి సంయుక్త ఈయూ బోర్డర్ ఏజెన్సీ వంటివాటి ఏర్పాటును కూడా కొంతకాలంగా ఆయన ప్రతిపాదిస్తున్నారు. అయితే రాజీనామా ద్వారా దేశ ప్రయోజనాల కంటే స్వీయ రాజకీయ ప్రయోజనాలకే ఆయన పెద్దపీట వేసుకున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి! ‘కేవలం ప్రతిపాదిత వలస విధానంపై విభేదాల వల్ల ఏకంగా పాలక సంకీర్ణమే కుప్పకూలడం నమ్మశక్యం కాని నిజం! ఏదేమైనా రాజీనామా నిర్ణయం ప్రధాని రుట్టె రాజకీయ చతురతకు అద్దం పట్టింది’ – మార్సెల్ హనెగ్రాఫ్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్ –సాక్షి, నేషనల్ డెస్క్ -
శరణార్థుల సమస్య తీవ్రం..
- ముదిరిన రోహింగ్యాల సంక్షోభం... - నగరంలోనూ దాదాపు 3,800 మంది రోహింగ్యాలు.. రోహింగ్యా శరణార్థుల సమస్య తీవ్రరూపం దాల్చింది. మయన్మార్ (బర్మా)లో అల్పసంఖ్యాక ముస్లిం తెగకు చెందిన వీరిపై హత్యాకాండ, దాడులు సాగుతుండటంతో బంగ్లాదేశ్ తదితర పొరుగు దేశాలకు పెద్ద ఎత్తున వలసలు పోటెత్తుతున్నాయి. గత నెల 25న మయన్మార్ సైనికస్థావరంతో పాటు, పోలీస్ ఔట్‌పోస్టులపై ‘ఆరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ’ మిలిటెంట్ గ్రూపు దాడి ఘటనలో 12 మంది సైనికులతో పాటు 59 మంది రోహింగ్యా తిరుగుబాటుదారులు మరణించారు. ఆ తర్వాత జరిగిన దాడులు, సైనికచర్యల్లో 400 మంది వరకు ఈ తెగవారు హతం కాగా మళ్లీ మూకుమ్మడి వలసల్లో భాగంగా రెండులక్షలకు పైగా శరణార్థులు బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. మారుమూల సెయింట్ మార్టిన్ దీవిలో తలదాచుకున్న రెండువేల మంది రోహింగ్యాలను బంగ్లాదేశ్ అధికారులు బలవంతంగా తిరిగి వారి దేశానికి పంపించారు. మయన్మార్‌లో గత పదిరోజుల్లో చోటు చేసుకున్న హింస కారణంగా 1,23,600 మంది శరణార్ధులు బంగ్లాదేశ్‌లోకి వచ్చినట్లు ఐక్యరాజ్యసమితి వాలంటీర్లు వెల్లడించారు. తాజా సంక్షోభానికి పూర్వమే దాదాపు నాలుగు లక్షల మంది బంగ్లాదేశ్‌లోకి రావడంతో ఇక శరణార్థులను అనుమతించేది లేదంటూ ఆ దేశం స్పష్టంచేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో పాటు మలేసియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, భారత్‌లలో రోహింగ్యాలు తలదాచుకుంటున్నారు. మనదేశంలో నలభై నుంచి యాభై వేల మంది రోహింగ్యా శరణార్దులున్నట్లు అంచనా వేస్తున్నారు. ఎవరీ రోహింగ్యాలు...? బౌద్ధ మతస్తులు మెజారిటీగా (5 కోట్ల జనాభా) ఉన్న మయన్మార్‌లో దాదాపు 12 లక్షల జనాభాతో బెంగాలీ మాండలికం మాట్లాడే రోహింగ్యాలు ప్రధానంగా రఖైన్ రాష్ట్రంలో నివసిస్తున్నారు. ఆ దేశంలో అధికారికంగా గుర్తించిన 135 జాతుల్లో లేకపోవడంతో వారికి పౌరసత్వం లభించడంలేదు. కనీసం గుర్తింపుకార్డులు ఇవ్వకపోగా, ఏ హక్కులూ కల్పించలేదు. పౌరులుగా గుర్తింపు పొందాలంటే 60 ఏళ్ల పాటు ఆ దేశంలో ఉన్నట్లుగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. రోహింగ్యాలను అక్రమ బంగ్లాదేశీ వలసదారులుగానే అక్కడి అధికారులు పరిగణిస్తుంటారు. పాలకుల విధానాలు కూడా వీరికి వ్యతిరేకంగానే ఉంటున్నాయి. ప్రభుత్వ ప్రేరేపిత హింస కారణంగా 1942లో బర్మా జాతీయుల చేతుల్లో దాదాపు లక్ష మంది వరకు రోహింగ్యాలు హత్యకు గురయ్యారు. 1978లో డ్రాగన్కింగ్ పేరిట చేపట్టిన సైనిక చర్యలో అనేక అకృత్యాలు చోటుచేసుకున్నాయి. దాదాపు మూడులక్షల మంది బంగ్లాదేశ్‌కు పారిపోగా, వారికి ఆహారపదార్ధాలు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరించడంతో చాలా మంది మృత్యువు బారినపడ్డారు. మళ్లీ 1991లో రోహింగ్యాలపై బర్మా ఆర్మీ దాడులకు దిగడంతో 2.68 లక్షల మంది బంగ్లాదేశ్ చేరుకోగా వారిలో 60 శాతం మందిని ఆ దేశం తిప్పి పంపించింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు సాగిన మిలటరీ పాలనలో సైన్యంతో పాటు, మెజారిటీ వర్గాల దాడులు కొనసాగి మానవహక్కుల ఉల్లంఘనలు జరిగాయి. మళ్లీ 2012 అక్టోబర్‌లో హింసాత్మక ఘటనల తర్వాత పెద్ద సంఖ్యలో వలసలు చోటుచేసుకున్నాయి. సాక్షి నాలెడ్జ్ సెంటర్ భారత్‌లో.. దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులతో పాటు, 40 వేల మంది రోహింగ్యా శరణార్థులనుతిప్పి పంపించనున్నట్లు ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజుజూ ప్రకటించారు. వీరి వివరాలను సేకరించాల్సిందిగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. పొరుగుదేశాల శరణార్దులను ఆదుకున్న సుదీర్ఘచరిత్ర భారత్‌కు ఉన్నందున, వీరిని బలవంతంగా మయన్మార్‌కు పంపించవద్దని హ్యుమన్ రైట్స్ వాచ్ సంస్థ కోరింది. భారత్‌లో ప్రధానంగా జమ్మూ కశ్మీర్, తెలంగాణ, హరియాణా, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్‌లో రోహింగ్యాలు ఉంటున్నారు. వీరిలో దాదాపు 3,800 మంది హైదరాబాద్‌లోని బాలాపూర్, పాతబస్తీలోని 16 సెటిల్మెంట్లలో నివసిస్తున్నారు. ఇక్కడి లేబర్ అడ్డాల్లో కూలీలుగా, చెత్త ఏరుకునే వారుగా, చిరువ్యాపారులుగా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. వీరి దుస్థితి పట్ల ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సానుభూతిని వ్యక్తం చేయడంతో ఈ ఉగ్రవాద గ్రూపు వైపు ఈ వర్గం వారు ఆకర్షితులవుతున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
'నా పేరు మోయినాల్.. నేను భారతీయుడినే'
కోల్‌కతా: తాను భారతీయుడినే అని నిరూపించుకునేందుకు ఓ వ్యక్తి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. తన తరుపున ఉన్న న్యాయవాది మధ్యలో మోసం చేసి వెళ్లిపోవడంతో దాదాపు జీవితాంతం జైలులోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఓ స్వచ్ఛంద సంస్థ జోక్యం చేసుకోవడంతో అతడికి తిరిగి విముక్తి కలిగింది. సుప్రీంకోర్టు జోక్యంతో తిరిగి తాను భారతీయుడినే అని నిరూపించుకునే అవకాశం వచ్చింది. ఇది మోయిన్ మొల్లా అనే ఓ వ్యక్తి కథ. మోయినాల్ అనే వ్యక్తి నిరక్షరాస్యుడు. వీరిది బెంగాల్ కు చెందిన ముస్లిం కుటుంబం. బార్పెట్టా ప్రాంతంలో ఉంటున్నారు. 1998లో ఇల్లీగల్ మైగ్రాంట్ టిటర్మినేషన్ ట్రిబ్యునల్స్ లో అక్రమ వలసలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. ఇందులో మోయినాల్ ను కూడా చేర్చారు. దీంతో అతడు కూడా ఫారినర్స్ ట్రిబ్యునల్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అయితే, అతడి తల్లిదండ్రులకు భారత పౌరసత్వం ఉందని, ట్రిబ్యునల్ ముందు హాజరుకావాల్సిన పనిలేదని అంతకుముందు ఉన్న ఓ లాయర్ అతడితో చెప్పడంతో ఎన్నోమార్లు ట్రిబ్యునల్ వద్దకు వెళ్లే వెనుదిరిగాడు. ఆ తర్వాత ట్రిబ్యునల్ వైపు వెళ్లలేదు. దీంతో అతడిని ఫిబ్రవరి 16, 2010లో ఓ పారినర్ గా ట్రిబ్యునల్ గుర్తించింది. అప్పుడు అసలు విషయం తెలుసుకున్న మోయినాల్ వెంటనే తన తరుపున న్యాయవాదిపై కేసు వేశాడు. అయినా హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టి వేయడంతోపాటు అతడిని అదుపులోకి తీసుకోవాలని చెప్పింది. దీంతో పోలీసులు అరెస్టు చేసి గోల్పారాలోని డిటెన్షన్ క్యాంపులో పడేశారు. వాస్తవానికి మోయినాల్ పూర్వీకులు భారతీయ పౌరసత్వం ఉన్నవారే. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వారి కుటుంబీకులు ఇక్కడ ఓటు కూడా వేస్తున్నారు. అంతేకాదు.. స్వాతంత్ర్యానికి పూర్వమే వారి పేరిట భూముల కొనుగోళ్ల పత్రాలు కూడా ఉన్నాయి. అయితే, అతడు నిరక్షరాస్యుడు అవడం మూలంగా వాటన్నింటిని చూపించలేకపోయాడు. తప్పుడు సలహా విని ట్రిబ్యునల్ ముందుకు వెళ్లి ఆధారాలు సమర్పించలేకపోయాడు. ఫలితంగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థ అతడికి సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించడంతోపాటు.. చుట్టుపక్కలవారి నుంచి విరాళాలు వసూలు చేసి అతడి తరుపున సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఈ పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు నాలుగు వారాల్లో ఫారినర్స్ ట్రిబ్యునల్ ముందుకు వెళ్లి తన పౌరసత్వాన్ని నిరూపించుకోవచ్చని చెప్పడంతో ఇక మోయినాల్ సంకెళ్లు తెగినట్లయింది. ఇలా ఎంతో మంది నిరక్షరాస్యులు తమ టెక్నికల్ సపోర్ట్ లేకుండా అనవసరంగా జైలుపాలు అవ్వుతున్నారని మోయిన్ తరుపు న్యాయవాది, స్వచ్ఛంద సంస్థ పేర్కొన్నాయి. అంతకుముందు మైగ్రాంట్స్ గా గుర్తించి భారతీయ సభ్యత్వం ఇచ్చిన ఇల్లీగల్ మైగ్రాంట్ టిటర్మినేషన్ ట్రిబ్యునల్స్(ఐఎండీటీ)ని రద్దు చేయడమే మోయినాల్ సమస్యకు ప్రధాన కారణంగా నిలిచింది.