minister ganta srinivasarao
-
మంత్రి గంటాపై మరో మంత్రి అయ్యన్న చిందులు
-
జవదేకర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి గంటా
-
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి
-
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదలయ్యాయి. ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఎంసెట్‌లో లక్షా 38వేల మంది ఉత్తీర్ణత సాధించారని, 72.28శాతం మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఏపీ ఎంసెట్‌లో భాగంగా 1,90,924 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజరవ్వగా.. 73,371మంది అగ్రి, మెడికల్ పరీక్షలకు హాజరయ్యారు. గతంలో విడుదల చేసిన ఎసెంట్ కీకి సంబంధించి.. 224 అభ్యంతరాలు వచ్చాయని, నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి.. అభ్యంతరాలను నివృత్తి చేస్తుందని మంత్రి గంటా తెలిపారు. గతంలో కంటే ఈసారి ఎంసెట్‌లో విద్యార్థుల అర్హత శాతం తగ్గిందని చెప్పారు. ఇంజినీరింగ్‌లో భోగి సూరజ్ కృష్ణ (95.27శాతం మార్కులు) ఫస్ట్ ర్యాంక్ సాధించగా, రెండో ర్యాంకును మైత్రేయ (94.93), మూడో ర్యాంక్‌ను లోకేశ్వర్‌రెడ్డి, నాలుగో ర్యాంక్‌ను వినాయక్ వర్ధన్ (94.20), ఐదో ర్యాంక్‌ను షేక్ వాజిద్ సొంతం చేసుకున్నారు. ఇక ఎంసెట్ ప్రవేశాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 11 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. అగ్రికల్చర్ విభాగంలో సాయిసుప్రియ (94.78శాతం మార్కులతో) మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. రెండో ర్యాంక్ వాత్సవ్ (93.26), మూడో ర్యాంక్ హర్ష (92.47) సాధించారు. ఏపీ ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బీజేపీతో పొత్తు వదులుకునేందుకూ సై అంటున్న మంత్రి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను గమనించిన అధికార తెలుగుదేశం పార్టీ దానినుంచి బయటపడటం కోసం రాజకీయ డ్రామా మొదలుపెట్టింది. కేంద్రం ప్రభుత్వంలో భాగస్వామిగా గడిచిన నాలుగేళ్లుగా అధికారం పంచుకున్న టీడీపీ తాజా పరిస్థితుల నేపథ్యంలో తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి నెపాన్ని బీజేపీపై నెట్టాలన్న ఎత్తగడను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో మిత్రపక్షాలుగా రంగంలోకి దగి అనంతరం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ టీడీపీ, బీజేపీ భాగస్వామ్య పక్షాలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మిత్రపక్షంగా ఉంటూ అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో కీలకమైన ప్రత్యేక హోదా, రైల్వో జోన్ వంటివి టీడీపీ సాధించలేకపోయింది. కేంద్ర ప్రభుత్వంపై ఏమాత్రం ఒత్తడి చేయలేక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రధానంగా ఓటుకు కోట్లు వంటి కేసుల కారణంగానే బీజేపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి చేయలేకపోతున్నారని సర్వత్రా వినిపించే మాట. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు జరపకపోవడం, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం తెరమీదకు తెచ్చారు. ఒకవైపు ప్రభుత్వంలో కొనసాగుతూనే మరోవైపు ప్రభుత్వంపై పోరాటం చేశామని చెప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. పార్లమెంట్ సమావేశాల్లో అధికారంలో ఉన్న మంత్రులు అశోక గజపతి రాజు, సుజనా చౌదరి బడ్జెట్ ను ఆమోదించగా, ఎంపీలతో అరకొర నిరసనలు చేయించి వదిలేస్తున్నారు. మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భం, దానికితోడు రాష్ట్రంలో ప్రజలు ముఖ్యంగా యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీ రాజకీయ డ్రామా మొదలుపెట్టినట్టు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు నేరుగా స్పందించకుండా కొందరు పార్టీ నేతలు, మంత్రులను తెరమీదకు తెచ్చి వారిద్వారా బీజేపీపై విమర్శలు గుప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాజాగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీపై బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తోందంటూ గురువారం విమర్శలకు దిగారు. రాష్ట్రం ప్రయోజనాల కోసం అవసరమైతే బీజేపీతో పొత్తు వదులుకుంటామని గంటా చెప్పుకొచ్చారు. -
సాక్షి ఎఫెక్ట్ : ‘నారాయణ’ లో గంటా ఆకస్మిక తనిఖీలు
-
సాక్షి ఎఫెక్ట్ : ‘నారాయణ’ లో గంటా తనిఖీలు
సాక్షి, విశాఖపట్నం : చదువుల కోసం నారాయణ-చైతన్య కాలేజీల్లో చేరినవారు ఒక్కొక్కరుగా శవాలై ఇంటికి తిరిగొస్తుంటే ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం. గడిచిన మూడేళ్లలో ఆయా క్యాంపస్‌లలో ఏకంగా 38 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనుమతులు లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తూ, ర్యాంకుల కోసం విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోన్న యాజమాన్యాలే ఇందుకు బాధ్యత వహించాలని పెద్ద ఎత్తున డిమాండ్ సైతం వ్యక్తమైంది. నారాయణ-చైతన్య కాలేజీల్లో నానాటికీ పెరుగుతోన్న విద్యార్థుల ఆత్మహత్యలపై ‘సాక్షి’ పలు సంచలనాత్మక కథనాలను ప్రచురించింది. ఆ కథనాలతో ఇప్పుడు ప్రభుత్వంలో కొద్దిపాటి కదలిక వచ్చింది. గంటా ఆకస్మిక తనిఖీలు : వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం విశాఖ నగరంలోని నారాయణ-చైతన్య హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కాలేజీలకు అనుబంధంగా కొనసాగుతోన్న ప్రైవేట్ హాస్టల్స్‌ను తనిఖీ చేసిన ఆయన.. వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. దానితోపాటు బోధన జరుగుతున్న తీరుపై ఆరాతీశారు. నిబంధనలు పాటించకపోతే ఎవ్వరినైన ఉపేక్షించబోమని అన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఆయన స్పందిస్తూ.. పిల్లల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదని, అవసరమైతే కళాశాల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదుచేసేందుకు వెనుకాడబోమని చెప్పారు. ఈ నెల 16న రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో సమావేశం కాబోతున్నట్లు తెలిపారు. ఇంటర్ బోర్డ్ పేర్కొన్న నిబంధనలను అన్ని కళాశాలలు విధిగా అమలుచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. 158 హాస్టళ్లకు అసలు అనుమతేలేదు : విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని శుక్రవారం మొదటిసారి అంగీకరించిన మంత్రి గంటా.. 24 గంటలు తిరగకముందే నారాయణ కాలేజీల్లో తనిఖీలు చేయడం గమనార్హం. పి.నారాయణ ఏపీ మంత్రిగా కొనసాగుతున్న గడిచిన మూడేళ్లలో నారాయణ-చైతన్య కాలేజీలకు అనుబంధంగా.. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే దాదాపు 158 ప్రైవేట్ హాస్టళ్లు వెలిశాయి. దీనిపై ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క నోటీసు కూడా జారీ కాకపోవడం గమనార్హం. మంత్రులు గంటా, నారాయణలు వియ్యంకులన్న సంగతి తెలిసిందే. -
సొమ్ము దాతది - సోకు మంత్రిది
-
.. నేనే రాజీనామా చేసేవాడ్ని: గంటా
అమరావతి: పదో తరగతి పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్ వాట్సప్‌లో బయటకు వచ్చిందని, పరీక్ష ప్రారంభానికి ముందు పేపర్ లీకైనట్టయితే తానే రాజీనామా చేసేవాడినని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్‌పై మంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు. వాట్సప్‌లో పేపర్ రాగానే ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశామని, వాటర్ బాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని గంటా చెప్పారు. 6.80 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారని మంత్రి తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతినకుండా పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. వాట్సప్‌లో ఓ మెసేజి రావడం, దానిపై అధికారులు ఎలా స్పందించారో, ఏం చర్యలు తీసుకున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరంగా చెప్పారని తెలిపారు. పరీక్ష విధానం చాలా పెద్దదని, పరీక్ష పత్రాల సెట్టింగ్, ముద్రణ, కేంద్రాలకు చేర్చడం.. చాలా అంశాలున్నాయని చెప్పారు. పేపర్ సెట్టింగ్, ప్రింటింగ్, రవాణా చేస్తున్న సమయంలో కానీ పరీక్ష రాయడానికి ముందు గానీ పేపర్ లీకైతే సీరియస్ విషయమని అన్నారు. అలాంటిది ఏమైనా జరిగి ఉంటే ఎవరూ డిమాండ్ చేయకుండానే తాను రాజీనామా చేసి ఉండేవాడిని చెప్పారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత పేపర్ వాట్సప్‌లో బయటకు వచ్చిందని, సంఘటన చిన్నదైనా వివరంగా విచారణ చేయాలని, బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తీసుకోవాలని సీఎం తమకు చెప్పారని తెలిపారు. పోలీసుల కంటే ముందుగానే విద్యాశాఖ అధికారులు స్పందించి, ఎక్కడి నుంచి పేపర్ వచ్చిందో తెలుసుకుని చర్యలు తీసుకున్నారని చెప్పారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి కేసులు ఉన్నాయని, ఈసారి చాలా తక్కువగా ఉన్నాయని గంటా తెలిపారు. -
నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించాలి
విజయవాడ (లబ్బీపేట) : నగదు రహిత చెల్లింపుల అమలులో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ముందంజలో నిలిపి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అందుకు కళాశాలల ప్రిన్సిపాళ్లు తమవంతు పాత్ర పోషించాలని ఆయన కోరారు. నగదు రహిత చెల్లింపులపై కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంగళవారం స్థానిక సిద్ధార్థ ఫార్మశీ కళాశాలలో ఆయన అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో నగదు రహిత చెల్లింపులపై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామాన్ని ఒక కళాశాల దత్తత తీసుకుని, ఆ గ్రామ ప్రజలకు నగదు రహిత చెల్లింపులపై అవగాహన కలిగించి పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆన్లైన్ విధానం, బయోమెట్రిక్ అటెండెన్స్ పారదర్శకంగా నిర్వహించడం వల్ల అర్హులైన విద్యార్థులకు నేరుగా వారి ఖాతాలకు నగదు జమ అవుతుందన్నారు. జిల్లాలో మారుమూల గ్రామాల్లో సైతం ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉండాలని గంటా ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఎస్.రామకృష్ణారావు, రిజిస్ట్రార్ డి.సూర్యచంద్రరావు, పలు కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
గాలేరు–నగరి కాలువకు నీరు విడుదల
అంతా మేమే చేశామని టీడీపీ నేతల ఆర్భాటం వైఎస్ పుణ్యంతోనే నీరు వస్తున్నాయంటున్న ప్రజలు జమ్మలమడుగు: గాలేరు–నగరి వదర కాలువ పూర్తిగా తామే నిర్మాణం చేశామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగానేప్రాజెక్టులు పూర్తయి కృష్ణాజలాలు వస్తున్నాయని టీడీపీ నాయకులు ఆర్భాటం చేశారు. మంత్రిగంటా శ్రీనివాసరావు అవుకు ప్రాజెక్టు సమీపంలో నిర్మించిన గాలేరి–నగరి కాలువపై నిర్మించిన గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. రెండు వేల క్యూసెక్కులైనా విడుదల చేస్తారని అందరూ భావించారు. అయితే మూడుగేట్లు ద్వారా కేవలం ఐదు వందల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయించారు. పైకి మాత్రం వెయ్యి క్యూసెక్కులు విడుదల చేశామని నాయకులు ప్రకటించారు. 20 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించే కాలువలో 500 క్యూసెక్కులే.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కడప జిల్లా, చిత్తూరు, నెల్లూరు ప్రాంత వాసులకు తాగునీరు సాగునీరు అందించడంలో భాగంగా ఏర్పాటు చేసిన గాలేరు–నగరి వరద కాలువ జిల్లాలో పూర్తయింది. మొత్తం 20వేలక్యూసెక్కుల నీరు ప్రవహించే కాలువలో కేవలం 500 క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహిస్తోంది. నీటి విడుదల కార్యక్రమాన్నిS చూడటానికి వచ్చిన ప్రజలు మాట్లాడుతూ ఈ నీరు వస్తుందంటే వైఎస్ పుణ్యమే తప్ప చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని అన్నారు. సీమ అభివృద్ధికి సీఎం కృషి – మంత్రి గంటా రాయలసీమ ప్రాంత అభివృద్ధికోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే మైలవరం ఆయకట్టుకింద ఉన్న 75వేల ఎకరాలకు సాగునీరు. రెండు మున్సిపాలిటిలకు తాగునీరు అందించడంకోసం ప్రయత్నం జరుగుతుందని మంత్రి గంటాశ్రీనివాసరావు అన్నారు. గాలేరి–నగరి కాలువకు నీటిని విడుదల చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కడప జిల్లా అంటే భయపడే పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన నీరు భవిష్యత్తులో హార్టికల్చర్ హాబ్‌కు తోడ్పడుతాయని తెలిపారు. శాసనమండలి డిఫ్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. మైలవరం, గండికోట ప్రాజెక్టులకు వరదనీరు దాదాపు నాలుగు నెలల పాటు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు,ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి,టీబీహెచ్‌ఎల్‌సీ చైర్మన్ ఉప్పలపాడు శ్రీనివాసరెడ్డి,సురేష్‌నాయుడు, రిమ్స్చైర్మన్ మురళీధర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్ధ చైర్మన్ రమణారెడ్డి, గిరిధర్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటు వర్సిటీలు వద్దు
మంత్రి గంటా పర్యటనను అడ్డుకొనేందుకు ఏఐఎస్ఎఫ్ విఫలయత్నం ఎస్కేయూ: ప్రైవేటు వర్సిటీలను అనుమతించవద్దని ఏఐఎస్ఎఫ్ విద్యార్థినాయకులు మంత్రి గంటా శ్రీనివాసరావు పర్యటనను అడ్డుకొనేందుకు విఫల యత్నం చేశారు. ఎస్కేయూ పాలక భవనం ఎదురుగా శనివారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. వర్సిటీల్లోని ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నాయకులను జాన్సన్‌బాబు, మధు, మనోహర్, రామాంజినేయులును అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు భౌతిక దాడులు చేశారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జాన్సన్‌బాబు ఆరోపించారు. ఇటుకలపల్లి పోలీసులు తమను దుర్భాషలాడి , కొట్టారన్నారు. ఇందుకు నిరసనగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఇటుకలపల్లి పోలీస్‌స్టేçÙన్ ముందు ఆదివారం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
మంత్రి గంటాకు విశాఖ మీద ప్రేముంటే..
-
మంత్రి గంటాకు విశాఖ మీద ప్రేముంటే..
విశాఖపట్నం: ఎన్నికలకు ముందు బాక్సైట్ తవ్వకాలపై నిరసన గళం వినిపించిన చంద్రబాబు.. ఇప్పుడు గిరిజన సంపదను తవ్వి ఎత్తుకుపోతామని చెబుతుండటం ఆయన గొప్పతనానికి నిదర్శనమని విశాఖ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ ఎద్దేవా చేశారు. అఖిలపక్షం పిలుపుమేరకు విశాఖ మన్యంలోని 13 మండలాల్లో శనివారం బంద్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమర్ నాథ్ మాట్లాడారు. 'లక్షల కోట్ల విలువైన గిరిజన సంపదను ఎవరికి ధారాదత్తం చేస్తున్నారో చెప్పాలి... మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖ అంటే ప్రేముంటే వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి జీవో నంబర్ 97ను రద్దు చేయించాలి' అని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాల జీవో(నంబర్ 97)ను రద్దు చేసేవరకు గిరిజనుల తరఫున వైఎస్సార్ సీపీ పోరాడుతుందని గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు. -
'సిట్టింగ్ జడ్జీల కొరత.. అందుకే ఐఏఎస్ తో విచారణ'
హైదరాబాద్ : రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై పూర్తిస్థాయి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గంటాతో విద్యార్థిని రిషితేశ్వరి కేసు విచారణ కమిటీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ఆదివారం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. రిషితేశ్వరి ఘటనపై వారు చర్చించారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఉదంతంపై ప్రాథమిక నివేదికను మంత్రి గంటాకు అందజేశారు. విచారణ కమిటీకి మరో వారం రోజుల గడువు పొడిగించినట్లు గంటా తెలిపారు. యూనివర్సిటీకి సెలవులు ఉండటంతో విచారణ కోసం కమిటీ మరో వారం రోజులు గడువు అడిగినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన విచారణ గురించి కమిటీ సభ్యులు వివరించినట్లు చెప్పారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జీల కొరత ఉందని, ఐఏఎస్ అధికారితో విచారణ చేపట్టినట్లు మంత్రి వివరించారు. సీనియర్ల వేధింపులు, ర్యాగింగ్ భరించలేక నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. -
గంటా డ్రైవర్‌పై కేసు
హైదరాబాద్: మంత్రి గంటా శ్రీనివాసరావు కారు డ్రైవర్‌పై కేసు నమోదైంది. మంత్రి గంటా వాహనం ఢీకొని తనకు గాయాలైనట్లు సుమలత అనే బాధితురాలు సుమలత ఫిర్యాదు చేయడంతో అతడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు. -
విజయమ్మ దీక్షకు మంత్రి గంటా మద్దతు
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈనెల 19వ తేదీ నుంచి విజయవాడలో చేపట్టనున్న ఆమరణ దీక్షకు రాష్ట్ర ఓడరేవులు, పెట్టుబడుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత సీమాంధ్ర ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిందని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని భావిస్తున్నామని, తాము ఆశాజీవులమని...రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు గంటా తెలిపారు. ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించి అభిప్రాయాలు సేకరించాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ సహా విశాఖ, విజయవాడ, అనంతపురంలో ఆంటోనీ కమిటీ పర్యటించి వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. శనివారం సాయంత్రం అయిదు గంటలకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నట్లు గంటా తెలిపారు. అనంతరం భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఏపీ ఎన్జీవోల సమ్మెకు మంత్రి తన మద్దతు తెలిపారు.