missed calls
-
సీఎం జగన్ పాలనకు జననీరాజనం
సాక్షి,అమరావతి/చిలకలూరిపేట/గంగాధరనెల్లూరు (చిత్తూరు జిల్లా): రాష్ట్రంలో 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేకూరుస్తున్న మేలును వివరించడం, విపక్షాల దు్రష్పచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కావడంపై వైఎస్సార్ సీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇంటింటా సీఎం జగన్‌కు ప్రజలు నీరాజనం పలికారని చెప్పారు. ఈ నెల 7న ప్రారంభమైన ఈ కార్యక్రమం శనివారంతో ముగిసింది. 22 రోజుల్లో 1.45 కోట్ల కుటుంబాలతో జగనన్న సైన్యం మమేకమైందని తెలిపారు. మెగా పీపుల్స్ సర్వేలో 1.16 కోట్ల కుటుంబాల ప్రజలు సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960–82960 నెంబర్‌కు మిస్డ్ కాల్స్ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో 80 శాతానికిపైగా కుటుంబాలు ముఖ్యమంత్రి జగన్ పాలన పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నట్లు మెగా పీపుల్స్ సర్వేతో నిరూపితమైందన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ముగింపు సందర్భంగా శనివారం 175 నియోజకవర్గాలలో పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు మెగా పీపుల్స్ సర్వే వివరాలు వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ మీడియాతో మాట్లాడారు. ధైర్యంగా ప్రజల ముందుకు... మా ప్రభుత్వం ప్రజలకు మంచి చేసింది. అందువల్లే మేం ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లి చేసిన మంచిని చెప్పగలుగుతున్నాం. మేం చెప్పడమే కాదు... ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరు గురించి అడిగి వివరాలు తీసుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. మొత్తం 1.1 కోట్లకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. వారంతా ముఖ్యమంత్రి జగన్ సందేశాన్ని తమ ఫోన్ ద్వారా విన్నారు. నా నియోజకవర్గంలో 83 శాతం అంటే 77,534 కుటుంబాలను గృహసారథులు, సచివాలయ కన్వినర్లు కలిశారు. ఏ గడపకు వెళ్లినా చిరునవ్వుతో ప్రజలు ఆహ్వానించారు. జగనన్న అందిస్తున్న సుపరిపాలనే దీనికి కారణం. ఈ మెగా పీపుల్స్ సర్వే విజయవంతం కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఆ పార్టీ నాయకులకు నిద్ర పట్టడంలేదు. మా పార్టీకి లభిస్తున్న ప్రజా మద్దతును సహించలేక చంద్రబాబు ప్రజలను దూషించడం మొదలు పెట్టారు. ఇటీవల పల్నాడు జిల్లా పర్యటనలో ప్రజలకు దయ్యం పట్టిందంటూ పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేశారు. – విడదల రజిని, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ప్రజాభిప్రాయానికి ప్రతీక అధికారంలోకి వచ్చిన దాదాపు నాలుగేళ్ల తర్వాత ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలనే ఆలోచన దేశంలో ఏ ఒక్క సీఎంకు రాలేదు. ప్రజల్లోకి నేరుగా వెళ్లి అభిప్రాయాలను సేకరించడం ద్వారా సీఎం జగన్ నూతన ఒరవడి సృష్టించారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా అన్ని రాజకీయ పారీ్టలకు చెందిన వారి ఇళ్లకు వెళ్లాం. ప్రజా మద్దతు పుస్తకంలో ఐదు ప్రశ్నలను చదివి, వారి అభిప్రాయాలను కోరి నమోదు చేశాం. 80 శాతం ప్రజలు సీఎం జగన్ పాలనకు మద్దతు తెలిపారు. ప్రజా మద్దతు పుస్తకం ప్రజాభిప్రాయానికి ప్రతీకలా నిలిచింది. చంద్రబాబు మాదిరిగా దొంగ లెక్కలు వైఎస్సార్సీపీ ఎన్నటికీ చెప్పదు. సీఎం జగనన్న పరిపాలన పట్ల నమ్మకం ఉంది కాబట్టే జగనన్నే మా భవిష్యత్తు మెగా సర్వేను ప్రజలు విశేష స్థాయిలో ఆదరించారు. – దేవినేని అవినాష్, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త రాజకీయాల్లో నూతన ఒరవడి దేశంలో ఎన్నడూ లేని రీతిలో ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు మెగా పీపుల్స్ సర్వే నిర్వహించడం ద్వారా రాజకీయాల్లో నూతన ఒరవడిని సీఎం జగన్ సృష్టించారు. ఎన్నికల హామీల్లో 99 శాతం అమలు చేసి రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలను అందించారు. సుపరిపాలన ద్వారా ప్రజలకు చేరువయ్యారు. సీఎం జగన్ నాయకత్వం పట్ల 80 శాతం కుటుంబాలు పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు పీపుల్స్ సర్వేలో వెల్లడైంది. సీఎం జగన్ పాలనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్త, నాయకులకు అభినందనలు. – ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎంపీ విశేష స్పందన మా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మన భవిష్యత్’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ 1.16 కోట్ల మంది నుంచి మిస్డ్కాల్స్ వచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే ఇందుకు కారణం. ప్రతి గడపలోనూ ప్రజలందరు జగనన్న వెంటే ఉన్నామని స్పష్టంచేశారు. ఎర్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును ప్రోత్సహించే వారిని ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. ఎస్సీ, ఎస్టీలకు టీడీపీ ప్రభుత్వంలో మేలు జరిగిందని చంద్రబాబు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. ఓట్ల కోసం చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు సీఎం వైఎస్ జగన్ పాలనలోనే అత్యంత ఎక్కువగా మేలు కలుగుతోంది. – నారాయణస్వామి, డిప్యూటీ సీఎం మా నమ్మకం నువ్వే జగన్ జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల కుటుంబాల ప్రజలతో వైఎస్సార్సీపీ శ్రేణులు నేరుగా కలిశాయి. ఏడు లక్షల మంది గృహసారథులు, సచివాలయాల కన్వినర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రంలో 80 శాతానికిపైగా కుటుంబాలు సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి. ప్రజలు వారి భవిష్యత్తు కోసం.. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ నినదిస్తున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యమని విశ్వసిస్తున్నారు. ప్రజా మద్దతు పుస్తకంలో ప్రశ్నలకు ప్రజలు స్వచ్ఛందంగా సమాధానాలు ఇచ్చారు. ప్రజల అంగీకారంతోనే సీఎం జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్లను అతికించాం. చంద్రబాబు సంస్కార హీనుడిలా మాట్లాడటం సరికాదు. – మర్రి రాజశేఖర్, ఎమ్మెల్సీ ప్రజా మద్దతు వైఎస్సార్సీపీకే రాష్ట్రంలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఇలాంటి కార్యక్రమాన్ని చేయలేదు. మెగా సర్వేతో ప్రజా మద్దతు వైఎస్సార్సీపీకే ఉందని స్పష్టమైంది. సీఎం జగన్ పాలనకు అనుకూలంగా 80 శాతం ప్రజలు తీర్పు ఇచ్చారు. అవినీతి, వివక్ష లేని పాలనకు మద్దతుగా నిలిచారు. సర్వేలో ఇదే స్పష్టమైంది. 15 వేల సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహించాం. చంద్రబాబు ఇలాంటి సర్వే జీవితంలో ఎప్పుడైనా చేశారా? – మల్లాది విష్ణు, ఎమ్మెల్యే ఇలాంటి సర్వే ఇదే తొలిసారి దేశంలోనే ఇలాంటి సర్వే చేసిన మొదటి ప్రభుత్వం మాదే. 40 ఏళ్లు అనుభవం ఉందని చెప్పుకునే వారు కూడా ఇలాంటి సర్వేకు సాహసించలేదు. కేవలం 22 రోజుల్లో 1.45 కోట్ల కుటుంబాలను కలిశాం. ఇలాంటి కార్యక్రమం చేసే దమ్ము చంద్రబాబుకి ఉందా? కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా వైఎస్సార్సీపీ పాలన చేస్తోంది. ఈ మాట చంద్రబాబు ఒక్కసారైనా ఆయన ప్రభుత్వ హయాంలో చెప్పగలిగారా? మెగా సర్వేను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు . – వెలంపల్లి శ్రీనివాస్, మాజీ మంత్రి -
ఉప్పొంగిన ‘నమ్మకం’.. 1.16 కోట్ల కుటుంబాల మిస్డ్ కాల్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా ‘మా నమ్మకం నువ్వే జగన్..’ నినాదం ప్రతిధ్వనించింది. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి మద్దతు పలికి ఆశీర్వదిస్తూ మళ్లీ ఆయనే అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ 1.16 కోట్ల కుటుంబాల ప్రజలు మెగా పీపుల్స్ సర్వేలో చాటిచెప్పారు. తద్వారా రాష్ట్రంలో 80 శాతానికిపైగా కుటుంబాల ప్రజలు సీఎం జగన్ పాలనకు మద్దతు తెలిపినట్లు స్పష్టమవుతోంది. టీడీపీ సంప్రదాయ ఓటర్లు కూడా వైఎస్సార్సీపీ వైపు మొగ్గుచూపుతున్నారనడానికి మెగా పీపుల్స్ సర్వే ఫలితాలే తార్కాణమని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ప్రతి గడపనూ పలుకరించిన జగనన్న సైన్యం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడం..మెగా పీపుల్స్ సర్వేలో 80 శాతానికిపైగా కుటుంబాలు సీఎం జగన్‌కు మద్దతు తెలపడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నెలకొంది. రాష్ట్రంలో 46 నెలలుగా అమలవుతున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా సీఎం జగన్ ప్రభుత్వం చేకూరుస్తున్న మేలును వివరించడం, విపక్షాల దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా ఈనెల 7న ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వీనర్లు, 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులు వెరసి ఏడు లక్షల మందితో కూడిన క్షేత్ర స్థాయి సైన్యం ప్రతి గడపనూ పలుకరించింది. టీడీపీ సర్కారు, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మధ్య తేడాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని చదివి ఆయా కుటుంబాలకు గృహ సారథులు అందజేశారు. మెగా పీపుల్స్ సర్వేలో భాగంగా ప్రజా మద్దతు పుస్తకంలో ఐదు ప్రశ్నలను చదివి వినిపించి ప్రజాభిప్రాయాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత రసీదు అందచేశారు. సీఎం జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960–82960 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయా కుటుంబాల అంగీకారం మేరకు సీఎం జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్లను ఇంటి తలుపులు, మొబైల్ ఫోన్లకు అతికించారు. 1.16 కోట్ల కుటుంబాల మిస్డ్ కాల్స్ వైఎస్సార్సీపీ శ్రేణులు వెల్లడించిన అంశాలతో ఏకీభవిస్తూ 1.16 కోట్ల కుటుంబాలు ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ మిస్డ్ కాల్స్ ఇచ్చాయి. గృహ సారథుల వద్ద సీఎం వైఎస్ జగన్ ఫోటోతో ఉన్న స్టిక్కర్లను అడిగి మరీ తీసుకుని ఇంటి తలుపులకు, మొబైల్ ఫోన్లకు అతికించుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు నేరుగా జనంలోకి వెళ్లడం ఇదే తొలిసారి అని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు మేలు చేసిన సీఎం జగన్ ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయిలోకి పార్టీ శ్రేణులను పంపి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని ప్రశంసిస్తున్నారు. వెల్లువలా మద్దతు.. సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను దక్కించుకోవడం ద్వారా వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతానికిపైగా హామీలను అమలు చేసి ఎన్నికల మేనిఫెస్టోకు సీఎం జగన్ సరి కొత్త నిర్వచనం ఇచ్చారు. దేశంలో తొలిసారిగా నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలకు రిజర్వు చేస్తూ చట్టం చేసి మరీ పదవులిచ్చారు. నామినేటెడ్ నుంచి కేబినెట్ వరకూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సింహభాగం పదవులు కల్పించి సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో విప్లవాత్మక మార్పులను తెచ్చి ప్రజలకు చేరువయ్యారు. కరోనా మహమ్మారిని సమర్థంగా నియంత్రించి ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వడంతోపాటు ఆ కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులను లెక్క చేయకుండా సంక్షేమ పథకాలను కొనసాగించి ప్రజల మన్ననలను చూరగొన్నారు. దీంతో పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలతోపాటు తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీకి తిరుగులేని విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు. తాజాగా మెగా పీపుల్స్ సర్వేలో 80 శాతానికిపైగా కుటుంబాల ప్రజలు సీఎం జగన్ పాలనకు మద్దతు తెలిపారు. వీటిని పరిగణలోకి తీసుకుంటే వైఎస్సార్ సీపీకి నానాటికీ ప్రజల్లో మద్దతు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇది ప్రతిపక్షాల నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 22 రోజుల్లో 1.45 కోట్ల కుటుంబాలతో మమేకం.. రాష్ట్రంలో ఈనెల 7న ప్రారంభమైన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం శనివారంతో ముగిసింది. మొత్తం 22 రోజుల్లో 15,004 సచివాలయాల పరిధిలోని 1.45 కోట్ల కుటుంబాల ప్రజలతో వైఎస్సార్సీపీ శ్రేణులు మమేకమయ్యాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సీఎం జగన్ 98.5 శాతం అమలు చేయడంతోపాటు 46 నెలల్లోనే సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో నేరుగా రూ.2 లక్షల కోట్లకుపైగా జమ చేయడాన్ని ప్రతి కుటుంబానికి వివరించాయి. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే తేవటాన్ని గుర్తు చేశాయి. పరిపాలన సౌలభ్యం, ప్రజల సౌకర్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించడాన్ని వివరించాయి. సొంతింటి స్వప్నాన్ని సాకారం చేస్తూ 30 లక్షల మందికిపైగా అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాలను ఇవ్వడంతోపాటు, 17,005 జగనన్న కాలనీల్లో ఇళ్లను నిర్మించి ఇస్తుండటాన్ని ప్రతి ఇంటికీ చాటి చెప్పాయి. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే జన్మభూమి కమిటీల్లోని టీడీపీ నేతలకు లంచాలు ఇవ్వనిదే పనులు జరగని విషయాన్ని గుర్తు చేశాయి. -
ఇంటింటా అభిమానం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా సీఎం వైఎస్ జగన్ చేస్తున్న మేలును వివరించడం.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. కార్యక్రమానికి 19వ రోజైన మంగళవారం అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, సచివాలయాల కన్వినర్లు, వలంటీర్లు, గృహసారథులతో కూడిన బృందానికి ప్రతి ఇంటా ఆ కుటుంబ సభ్యులు ఆచ్చియ స్వాగతం పలుకుతున్నారు. 2014 ఎన్నికల్లో 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. వాటిలో ఏ ఒక్కటీ అమలుచేయకపోవడాన్ని జగనన్న సైన్యం ప్రతి ఇంటా వివరిస్తోంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 98.5 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్ అమలుచేయడాన్ని చాటిచెబుతోంది. జగనన్న సైన్యం చేస్తున్న ప్రచారానికి ప్రతి ఇంటా అపూర్వ స్పందన లభిస్తోంది. మోసానికి చంద్రబాబు ప్రతీకైతే.. సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతకు ప్రతీక అని అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు నినదించారు. గత 46 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా తమ కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ చేసిన మేలును వివరిస్తూ.. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ ప్రతి ఇంటా ప్రజలు కొనియాడారు. ఇక జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో నిర్వహిస్తున్న మెగా పీపుల్స్ సర్వేకు కూడా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. సీఎం వైఎస్ జగన్ పాలనకు మద్దతు తెలుపుతూ సోమవారం నాటికి 84 లక్షల కుటుంబాల ప్రజలు 82960–82960 నెంబర్‌కు మిస్డ్కాల్స్ ఇచ్చారు. సీఎం జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్లను గృహసారథులను అడిగి మరీ తీసుకుని.. ఇంటి తలుపులకు, మొబైల్ ఫోన్లకు అతికించుకుని ప్రజలు అభిమానాన్ని చాటుకుంటున్నారు. -
‘జగనన్నే మా భవిష్యత్తు’.. ఇంటింటా సందడి
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు కలసికట్టుగా ఇంటింటికీ వెళ్తున్నారు. జగనన్న ప్రతినిధులుగా వచ్చిన వీరందరినీ.. తమ ఇంటికి బంధువులొచ్చినంత సంబరంగా ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారు. తమ ఇళ్ల వద్దకు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. కొన్ని ఊళ్లలో మేళతాళాలతో ఎదురేగి ఘన స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారు. ‘ఎమ్మెల్యే వద్దకు ప్రజలు వెళ్లడం మామూలే.. అందుకు విరుద్దంగా ప్రజల వద్దకే ఎమ్మెల్యే రావడం అంటే అది కేవలం ఒక్క జగనన్న వల్లే సాధ్యమైంది’ అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లలో ఏ మేరకు లబ్ధి కలిగిందో ప్రజలే ఆనందంగా నేతలకు వివరిస్తుండటం ఊరూరా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. సీఎం వైఎస్ జగన్ పలు విధాలా తమను ఆదుకుంటున్నారని, ఇలా ఆదుకుంటుండటం కొంత మంది పెత్తందారులకు గిట్టడం లేదని అక్కచెల్లెమ్మలు నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత మంచి పనులు చేస్తుంటే సంతోషించాల్సింది పోయి దుష్ప్రచారం చేయడం దుర్మార్గం అని, వారంతా బాగు పడరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, ఎల్లోమీడియా ఎన్ని అబద్ధాలు చెప్పినా.. వాటిని నమ్మే ప్రసక్తే లేదని.. తిరిగి జగనన్ననే మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామని ప్రతినబూనుతున్నారు. ‘వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, రైతుల బాగు కోసం సీఎం జగన్ తీసుకున్నన్ని చర్యలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ సీఎం కూడా తీసుకోలేదు. ఈ నాలుగేళ్లలో చేపట్టిన సంస్కరణలు ఆషామాషీ కాదు. వీటి ఫలితాలు ఎంతటి సంచలనాలు సృష్టిస్తాయో ముందు ముందు తెలుస్తుంది. 85–87 శాతం కుటుంబాలకు లబ్ధి చేకూర్చడమంటే మాటలా! అందువల్లే ఇంత ధైర్యంగా ఇంటింటికి ఆయన ప్రతినిధులుగా ఎమ్మెల్యేలను పంపిస్తున్నారు’ అని తిరుపతికి చెందిన వెంకటయ్య వ్యాఖ్యానించారు. ‘సీఎం జగనే లేకపోయుంటే మా పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదో ఊహించలేం’ అని అనంతపురానికి చెందిన శ్రీదేవి, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రాణి పేర్కొంది.గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను వివరిద్దామనుకున్న నేతల కంటే ప్రజలే ముందుగా స్పందిస్తూ గత చంద్రబాబు పాలను తూర్పారబడుతున్నారు. తామంతా జగన్ వేంటేనని, ఆరు నూరైనా తిరిగి వైఎస్ జగనే సీఎం అవ్వడం ఖాయం అని స్పష్టం చేస్తున్నారు. అన్ని వర్గాలకూ న్యాయం చేశారు ‘జగనన్నే మా భవిష్యత్తు’ మూడో రోజు కార్యక్రమం ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచే ప్రారంభమైంది. అన్ని వర్గాల ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. టీడీపీ సర్కార్‌కూ ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కరపత్రాన్ని చదివి వినిపించినప్పుడు.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమతో పాటు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారనే మాట ప్రతి ఇంటా వినిపించింది. చెప్పింది చెప్పినట్లు చేస్తున్నందు వల్లే ‘జగనన్నే మా భవిష్యత్’ అని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ గత 46 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో తమకు అండదండగా నిలిచారని అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు సంతోషం వ్యక్తం చేశారు. ఈసారి మళ్లీ సీఎం జగన్‌కే తమ మద్దతు అని చెబుతున్నారు. స్వచ్ఛందంగా అభిప్రాయం ప్రజా సర్వేలో భాగంగా ప్రజా మద్దతు పుస్తకంలో స్లిప్పులలోని ఐదు ప్రశ్నలను గృహ సారథులు వినిపించినప్పుడు.. వైఎస్ జగన్ ప్రభుత్వంతోనే తమకు న్యాయం జరిగిందని, మళ్లీ సీఎంగా వైఎస్ జగనే కావాలంటూ ప్రజలు సమాధానం చెబుతున్నారు. వాటిని నమోదు చేయించి, రసీదు తీసుకుంటున్నారు. ఆ తర్వాత గృహ సారథులు అడగక ముందే.. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తున్నారు. ఆ వెంటనే.. ప్రభుత్వానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం వైఎస్ జగన్ సందేశంతో ఐవీఆర్ఎస్ కాల్ రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గృహ సారథుల వద్ద నుంచి వైఎస్ జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్లను తీసుకుని, ఇంటి తలుపునకు, మొబైల్ ఫోన్‌కు అతికించి.. ‘జగనన్నే మా భవిష్యత్’ అంటూ నినదించారు. ఇలా ఊరూరా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి స్వచ్ఛందంగా మద్దతు వ్యక్తం అవుతోంది. 15 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ‘జగనన్నే మా భవిష్యత్’ కార్యక్రమం ఈ నెల 7వ తేదీ ప్రారంభమైంది. సచివాలయానికి ముగ్గురు చొప్పున నియమించిన కన్వీనర్లు, ప్రతి 50 నుంచి వంద ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమించిన గృహ సారథులతో కూడిన ఏడు లక్షల మంది సైన్యం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వలంటీర్లతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్రత్యేకమైన కిట్ బ్యాగ్‌లు అందజేశారు. 14 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా 15,004 సచివాలయాల పరిధిలో 1.60 కోట్ల కుటుంబాలలోని ఐదు కోట్ల మంది ప్రజలను కలుసుకోనున్నారు. ఇదిలా ఉండగా ’మెగా పీపుల్స్ సర్వే’కు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా మద్దతు పుస్తకంలో 21 లక్షలకు పైగా కుటుంబాలు పాల్గొన్నాయి. తొలి రెండు రోజుల్లోనే 82960–82960 నంబర్‌కు 15 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయి. -
వాట్సాప్‌ను కనిపెట్టింది అలానే..!
ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది యాక్టివ్ యూజర్లతో ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ సర్వీసుల దిగ్గజం వాట్సాప్‌ను ఎలా ప్రారంభించారు. అసలు ఈ యాప్‌ను ప్రారంభించాలనే ఆలోచన తమకు ఎలా వచ్చింది అనే విషయాన్ని ఆ కంపెనీ సీఈవో, సహవ్యవస్థాపకుడు జోన్ కౌమ్ రివీల్ చేశారు. మిస్డ్ కాల్సే, వాట్సాప్‌కు అంకురార్పణ అని తెలిపారు. జిమ్‌లో ఉన్నప్పుడు మిస్డ్ కాల్స్ ఎక్కువగా వస్తుండటంతో వాట్సాప్‌ను కనిపెట్టాలనే ఆలోచన తట్టిందని చెప్పారు.. కాలిఫోర్నియాలోని మౌంటేన్ వ్యూలో వందల కొద్దీ సిలికాన్ వ్యాలీ దిగ్గజాలతో నిర్వహించిన ఈవెంట్లో కౌమ్ ఈ విషయం వెల్లడించారు. తాను జిమ్‌లో ఉన్నప్పుడు పదేపదే మిస్డ్ కాల్స్ వస్తుండేవని, ఇది చాలా కోపానికి కారణమయ్యేదని చెప్పారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఒక యాప్‌ను రూపొందించాలని బ్రియన్ యాక్టన్, తాను 2009లో నిర్ణయించామని తెలిపారు. తాము ఓ కంపెనీని ప్రారంభించాలని అనుకోలేదని, ప్రజలకు ఉపయోగపడేందుకు కేవలం ఒక ఉత్పత్తిని మాత్రమే రూపొందించాలని అనుకున్నామని చెప్పారు. ఆపిల్ ప్లే స్టోర్ తమ యాప్‌ను ఆమోదించినప్పటికీ, రాత్రికి రాత్రి ఇది విజయవంతం కాలేదని, ప్రారంభంలో దీన్ని ఎవరూ వాడలేదని గుర్తుచేసుకున్నారు. కానీ మెల్లమెల్లగా 2014లో 400 మిలియన్ మందికి పైగా యూజర్లను సొంతం చేసుకుందని, అదే ఏడాది ఫేస్బుక్ ఈ యాప్‌ను రికార్డు స్థాయిలో 19 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందని తెలిపారు. దీంతో సహ వ్యవస్థాపకులమైన తాము రాత్రికి రాత్రే బిలీనియర్స్ అయినట్టు చెప్పారు. ఈ డీల్ తనకెంతో గుర్తుండిపోయే డీల్ అని తెలిపారు. గతేడాది బ్రియన్ కంపెనీ నుంచి వైదొలిగారని, తనని తాము చాలా మిస్ అవుతున్నట్టు పేర్కొన్నారు. -
ఆ యువతుల వలలో పడ్డారో.. ఇక అంతే
తియ్యటి మాటలతో కవ్విస్తారు ఆపై మీ సొమ్మును ఖాళీ చేయిస్తారు గుర్తుతెలియని ఎస్ఎంఎస్లతో జాగ్రత్త వలలో పడ్డారో.. జీవితం సర్వనాశనం ముచ్చటగా మిస్డ్ కాల్ ఇస్తారు. ఆ పై కొందరు యువతులు తియ్యని మాటలతో ముగ్గులోకి దింపుతారు. మనసు దోచుకునేలా కబురులు చెబుతారు. మీ దగ్గర ఉన్న సొమ్మునంతా ఖాళీ చేయిస్తారు. ఆపై చెప్పాపెట్టకుండా హుడాయిస్తారు.. ఆ వలలో పడ్డారో.. ఇక అంతే.. జీవితం సర్వనాశనం.. గుర్తుతెలియని ఎస్‌ఎంఎస్‌లతోనూ జాగ్రత్త సుమా..! తిరుపతి తుడా: ఇటీవల యువత సామాజిక మాధ్యమాలపై మోజు పెంచుకుంటోంది. యువతీ, యువకులు ఫేస్బుక్, వాట్సాప్ ఇతర సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుంటున్నారు. వాటి యావలోనే బతుకు వెళ్లదీస్తున్నారు. అవికాస్త వికటించడంతో ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తిరుపతి నగరంతోపాటు జిల్లాలోనూ పెచ్చుమీరుతున్నారు. తిరుపతిలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న యువకుడికి పది రోజుల క్రితం మిస్డ్ కాల్ వచ్చింది. మొదట పట్టించుకోలేదు. మరుసటి రోజు మళ్లీ అదే నంబర్ నుంచి మిస్డ్ కాల్ రావడంతో తెలిసిన వాళ్లెవరైనా ఉంటారేమోనని తిరిగి కాల్ చేశాడు. అటుపక్క నుంచి ఓ యువతి హలో.. పవనే కదా.. అంటూ మాటలు కలిపింది. ఆపై ఇద్దరూ రోజూ చాటింగ్‌లో హాయ్.. బాయ్‌లు చెప్పడం మొదలు పెట్టారు. వారం తర్వాత సార్ ఏమీ అనుకోవద్దు.. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను.. డబ్బులు అవసరం ..ఏడుపొస్తోంది.. అనగానే కరిగిపోయిన అతను ఎంత అవసరమని అడిగాడు. రూ.10 వేలు.. సాయంత్రం కల్లా ఇవ్వకుంటే పెద్ద సమస్య వచ్చి పడుతుందని చెప్పడంతో అతను నమ్మి ఆ మొత్తాన్ని ఆ యువతి చేతిలో పెట్టాడు. ఆపై మాటలు కట్.. నంబర్ స్విచ్చాప్.. ఖంగుతిన్న ఆ యువకుడు డబ్బుల కోసమే ఇదంతా జరిగిందని తెలుసుకుని బాధపడ్డాడు. తిరుపతి రాయల్ నగర్‌కు చెందిన ఓ యువకుడికి నాలుగు రోజుల క్రితం వాట్సాప్‌కు హయ్ అని ఓ మెస్సేజ్ వచ్చింది. రాత్రి 9 దాటితే అలా ప్రతిరోజూ హాయ్.. హలో అంటూ మెసేజ్‌లు రావడంతో తిరిగి హౌ ఆర్ యూ అని మెసేజ్ పెట్టాడు. ట్రూ కాలర్ ద్వారా అప్పటికే అతని పేరు తెలుసుకున్న ఓ యువతి మీరు నాకు తెలుసు.. నేను ఎవరినో కనుక్కోండి చూద్దాం అంది. అర్థంగాక అతను జుట్టు పీక్కున్నాడు. మీరు ఎవరు అని అడగడం మొదలు పెట్టాడు. ఆ యువతి బాలాజీ కాలనీలోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటానని చెప్పింది. నేను ఇంత చెప్పాను మరి మీ గురించి చెప్పవచ్చు కదా.. అంటూ అతని డేటా లాగుతూ రోజూ తియ్యని మాటలు చెప్పడం మొదలు పెట్టింది. రెండు రోజుల క్రితం కాల్ చేసి.. నా ఫ్రెండ్‌ను ఆస్పత్రిలో చేర్పించాము.. అర్జెంట్‌గా రూ.18 వేలు కట్టమంటున్నారు.. హాస్టల్లో ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు.. వాళ్ల అమ్మానాన్మలు రావడానికి ఒక రోజు పడుతుంది. మనీ అడ్జస్ట్ చెయ్యి.. వాళ్లు రాగానే తీసి ఇస్తాను అని చెప్పడంతో అతను నిజమే అని నమ్మాడు. తన వద్ద రూ.12,000 ఉందని చెప్పడంతో చాల్లే మిగతా నా దగ్గర ఉంది అని చెప్పి ఆ యువతి స్కూటీలో మాస్క్‌తో వచ్చి తీసుకెళ్లింది. ఆపై ఆ యువతి అడ్రస్ మాయమయ్యింది. ఇప్పటికీ అడ్రస్ లేదు. -
పెరుగుతున్న... ఫోన్ జబ్బు
అవసరం మేరకు వాడితే ఏ వస్తువైనా క్షేమమే. హద్దు దాటితే మాత్రం ఏదైనా ప్రమాదకరమే. దురదృష్టం ఏమిటంటే సెల్‌ఫోన్ వినియోగం అనేది యువతలో అవసరానికి మించి జరుగుతోంది. బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసెన్సైస్ ‘సెల్‌ఫోన్ అధిక వినియోగం-దుష్పరిణామాలు’ అనే అంశంపై ఇటీవల ఒక నివేదికను వెలువరించింది. దీని ప్రకారం ‘నోమో ఫోబియా’కు గురవుతున్న యువత రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే, సెల్‌ఫోన్ తనకు దూరమై పోతుందనే భయమే - ‘నోమోఫోబియా.’ లక్షణాలు: ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి ఇష్టపడరు. తరచుగా మిస్డ్ కాల్స్, మెసేజ్‌లను చెక్ చేసుకుంటారు. ఫోన్ రీఛార్జీలో ఉందా, లేదా అనేది తరచుగా చెక్ చేసుకుంటారు. బాత్రూమ్లోకి కూడా సెల్‌ఫోన్ తీసుకువెళతారు. సెల్‌ఫోన్ రింగ్ అవుతున్నట్లు భ్రమ పడుతుంటారు. పంపిన ఎస్.ఎం.ఎస్‌కు ఎప్పుడు సమాధానం వస్తుందా అని అదే పనిగా ఎదురుచూస్తుంటారు. ఏ పని చేస్తున్నా దృష్టి మాత్రం సెల్‌ఫోన్ మీదే ఉంటుంది. సెల్‌ఫోన్ రెండు నిమిషాల పాటు కనిపించకపోయినా...దాన్ని ఎవరో దొంగిలించినట్లు ఆందోళన పడిపోతారు. ఏ విషయం మీదా దృష్టి నిలపలేకపోవడం, సమూహంలో ఒంటరి కావడం, అకారణ ఆందోళనకు గురికావడం లాంటి ఎన్నో సమస్యలు ‘నోమోఫోబియా’వల్ల వస్తున్నాయి. రానున్న కొద్దిరోజుల్లో మానసిక రుగ్మతల జాబితాలో ఈ నోమోఫోబియా ఎక్కనుంది. అంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ‘అవసరం మేరకు వాడండి’ అని నిపుణులు చెబుతున్న మాటను తు.చ. తప్పకుండా పాటించండి. నోమోఫోబియాకు దూరంగా ఉండండి.