MLA g kishan reddy
-
కాలేజీ రోజులు గుర్తుకువస్తాయి! – అనిల్ సుంకర
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఏటీవీ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘కిరాక్ పార్టీ’. సిమ్రాన్, సంయుక్తా హెగ్డే కథానాయికలు. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్లో థియేట్రికల్ ట్రైలర్‌ను తెలంగాణ బీజేపీ శాసనసభ పక్షనేత జి. కిషన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సినిమాను శుక్రవారం విడుదల చేయనున్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘నిఖిల్ ఎనర్జిటిక్ హీరో. సినిమా ఎంత కిరాక్‌గా ఉన్నా కూడా మంచి మెసేజ్ ఉంటుందని భావిస్తున్నా. దర్శకుడికి మంచి పేరు, నిర్మాతలకు మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘కార్తీకేయ’ సినిమాకు శరణ్ నాతో వర్క్ చేశాడు. ఇప్పుడు తన డైరెక్షన్లో నేను వర్క్ చేశాను. మేమిద్దరం కలిసి చేసిన చిత్రమిది’’ అన్నారు దర్శకుడు చందు మొండేటి. ‘‘ఈ సినిమా చూసిన వారందరూ... సినిమాతో ప్రేమలో పడిపోతారు. కాలేజీ రోజులు గుర్తుకు వస్తాయి. కిషోర్‌గారు ప్రొడక్షన్లో సహకారం అందించారు’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘హ్యాపీడేస్ ఎన్ని రోజులు ఆడిందో.. అంతకంటే ఎక్కువ రోజులు ‘కిరాక్ పార్టీ’ ఆడుతుంది’’ అన్నారు నాగశౌర్య. ‘‘మహిళలకు గౌరవం ఇవ్వాలనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాం. అనిల్‌గారు, కిషోర్‌గారి వల్లే ఈ సినిమా స్టారై్టంది. సుధీర్‌వర్మ మంచి డైలాగ్స్ అందించారు. చందు బౌండెడ్ స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు. చరణ్ అద్భుతంగా తీశాడు’’ అన్నారు నిఖిల్. ‘‘టీమ్ అంతా కష్టపడి చేసిన సినిమా ఇది’’ అన్నారు శరణ్. -
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిషన్‌రెడ్డి!
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డికి పార్టీ జాతీయ స్థాయిలో కీలక పదవి వరించనుంది. కిషన్‌రెడ్డిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. బీజేపీ జాతీయ కార్యవర్గంలో 5 ప్రధాన కార్యదర్శులు, 5 ఉపాధ్యక్ష పదవులకు ఖాళీలు ఏర్పడ్డాయి. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ప్రధాన కార్యదర్శులు జేపీ నడ్డా, రాజీవ్‌ప్రతాప్ రూడీ, రాంశంకర్ ఖతేరియాలతో పాటు ఉపాధ్యక్షులు బండారు దత్తాత్రేయ, ముక్తార్‌అబ్బాస్ నక్వీలను కేబినెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. వీరితో ఏర్పాటైన ఖాళీలతో పాటు అంతకు ముందు నుంచే ఖాళీగా ఉన్న ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల భర్తీకి అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి జి.కిషన్‌రెడ్డి, హర్యానా నుంచి డాక్టర్ అనిల్ జైన్, మధ్యప్రదేశ్ నుంచి కైలాస్ విజయ్‌వర్గీయలతో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి ఒక్కొక్కరిని ప్రధాన కార్యదర్శులుగా నియమించడానికి పేర్లు ఖరారైనట్టు విశ్వసనీయ సమాచారం. కాగా తెలంగాణ నుంచి పి.మురళీధర్‌రావు, ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్‌మాధవ్‌లు జాతీయ ప్రధాన కార్యదర్శులుగా పని చేస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.