mla ijaiah
-
రైతుల కోసం..
కర్నూలు ,నందికొట్కూరు: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీ ఆయకట్టుకు సాగునీరివ్వాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఆందోళన బాట పట్టారు. ఎత్తిపోతల పథకం వద్ద ధర్నా చేసేందుకు మంగళవారం రైతులతో కలిసి ముచ్చుమర్రి నుంచి ర్యాలీగా అక్కడికి వెళ్లారు. నీటి పంపులను పరిశీలించేందుకు అనుమతి లేదంటూ హెచ్ఎన్ఎస్ఎస్ డీఈ బాలాజీ నిరాకరించడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ధర్నాకు దిగారు. ఈ నెలాఖరు వరకు కేసీకి నీరు వదలాలని నినాదాలు చేశారు. ఎస్ఐలు శ్రీనివాసులు, నల్లప్ప, పోలీసులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగం నియోజకవర్గ కన్వీనర్ రమాదేవి, రైతులు రమేష్ నాయుడు, తదితరులను అరెస్టు చేసి ముచ్చుమర్రి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా నిరసన కొనసాగించారు. చివరకు జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ హామీతో ఆందోళన కార్యక్రమం విరమించారు. మాట తప్పిన సీఎం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతం వాసులు ఇక నుంచి మూడు పంటలు పండించుకోవచ్చని చెప్పారని.. అయితే ఒక పంటకు కూడా సరిగ్గా నీరు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. బాబు మాటలకు చేతలకు పొంతన ఉండదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 798 అడుగుల నీటటి మట్టం ఉన్నప్పుడు కూడా కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేయవచ్చునన్నారు. అయితే, ఎందుకో కర్నూలు, కడప రైతులపై సీఎం చిన్న చూపు చూస్తున్నారన్నారు. 106 చెరువులకు ఆక్టోబర్ లోపు నింపుతామని చెప్పి ఇంత వరకు నింపలేదన్నారు. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి హంద్రీనీవాకు 900 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారన్నారు. దీనిపై నిలదీస్తే విడుదల చేయడం లేదని అధికారులు అబద్ధాలు చెబుతున్నారన్నారు. ముందుగా ఈప్రాంత రైతుల పంటలకు నీరు వదలాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన విభాగం కార్యదర్శి ఏసన్న, నాయకులు రమేష్‌నాయుడు, చంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, రియాజ్, తదితరులు పాల్గొన్నారు. -
ఓ నిరుద్యోగి ప్రశ్నకు సీఎం వింత జవాబు
-
నా జవాబులు.. నా ఇష్టం
‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్యాకేజీ... ఈ రెండింటిలో దేనిద్వారా లబ్ధి కలుగుతుంది?’ –మహేశ్‌బాబు (బీటెక్, ఏలూరు) సీఎం చంద్రబాబు సమాధానం హేతుబద్ధత లేని విభజన జరిగింది. రాజధాని లేదు... విద్యాసంస్థలు లేవు... పరిశ్రమలు లేవు. అందరూ నిరాశలో ఉన్నారు. అప్పుడే నవనిర్మాణ దీక్ష తీసుకున్నాం. రాష్ట్రావతరణ వేడుకలు కూడా జరుపుకోలేదు. మన డిమాండ్లు, అవసరాలు, హామీలు వేటినీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు. కేంద్రం చేసిన అన్యాయంపై అవిశ్వాస తీర్మానం పెట్టాం. కేంద్రం మోసం చేసినా మన కష్టంతో రెండంకెల వృద్ధి సాధించాం ఎస్కే ముజా (ఆంధ్రా యూనిర్శిటీ): నిరుద్యోగ భృతిని కొనసాగిస్తారా? మధ్యలోనే ఆపివేస్తారా? సీఎం: మిగిలిన రాష్ట్రాల్లో మధ్యలో నిలిపేయడానికి కారణం ఫ్రేమ్‌వర్క్‌లో లోపం. ఇక్కడ అలాంటి ప్రమాదం లేదు. పూర్తి సాంకేతికతతో బయోమెట్రిక్‌తో రూపొందించిన కార్యక్రమం ఇది. ఎన్నికల కోసం చేపట్టిన కార్యక్రమం కాదు. ఓ నిరుద్యోగి (కడప): మా జిల్లాలో 35 జిల్లా పరిషత్ ఉర్దూ స్కూళ్లు న్నాయి. పీఈటీలు 8 మందే ఉన్నారు. నేను కూడా పీఈటీ ట్రైనింగ్ చేశా. ఉర్దూ స్కూళ్ళలో పీఈటీ పోస్టులన్నీ భర్తీ చేయాలి. సీఎం: ఫిజికల్ లిటరసీ ముఖ్యం. నేను ఉన్నప్పుడు ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించా. అన్నీ చేయాలని ఉంది. ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తాం. హారిక (కేఎల్ యూనిర్శిటీ): హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చారంటున్నారు. అమరావతిలో ఐటీపై మీకున్న విజన్ ఏమిటి? సీఎం: హైదరాబాద్‌లో ఎకో సిస్టమ్ çసృష్టించడం వల్ల నాలెడ్జ్ ఎకానమీకి దోహదపడింది. అమరావతిని అంతకుమించి తీర్చిదిద్దుతాం. తిరుపతిని ఆటోమొబైల్ హబ్‌గా, ఎలక్ట్రానిక్స్ హబ్‌గా రూపొందిస్తున్నాం. తిరుపతిని షెంజెన్లా తయారుచేస్తున్నాం. తిరుపతి నుంచి చెన్నై వరకు ఐటీని అభివృద్ధి చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రవీణ్‌కుమార్: 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, అక్టోబరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందా? ఎన్నికల లోపు వాటిని భర్తీ చేస్తారా? ప్రభుత్వ ఉద్యోగం కోసం లంచం ఇవ్వాల్సిందేనా? సీఎం: ఎవరైనా లంచం అడిగితే 1100కి ఒక్క ఫోన్ చేయండి. కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో ఎక్కడా అవినీతికి చోటులేదు. అవినీతి లేని రాష్ట్రంగా ఏపీ పేరొందాలి. బాగా చదువుకున్న ఎవరికీ అన్యాయం జరగకూడదు. శ్రావణి (నాగార్జున యూనివర్శిటీ): పురుషులతో సమానంగా మహిళలకు ఏవైనా కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారా? సీఎం: హార్డ్‌వేర్ అంతా మహిళల కోసమే ఉంది. గార్మెంట్‌లో 95 శాతం మంది మహిళలే ఉన్నారు. గోపి (ఏఎన్‌యూలో ఎంబీఏ): మీ చర్యల వల్ల ప్రభుత్వ యూనివర్శిటీలు మూతపడతాయంటున్నారు, ప్రైవేట్ యూనిర్శిటీలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? సీఎం: అందుకే ప్రభుత్వ యూనివర్శిటీలు కూడా అక్రిడిటేషన్ తీసుకోవాలంటున్నాం. విట్, ఎస్సార్ఎం వంటి యూనివర్శిటీలకు ప్రోత్సాహం ఇస్తున్నాం. పోటీతత్వం ఉండాలి. మధు, బీటెక్: ‘డేర్ టు డ్రీమ్’ అని మీరు అంటుంటారు. కానీ మాకు 25 ఏళ్ల వయసులోనూ ఏం చేయాలో తెలియడం లేదు. మీరు ముఖ్యమంత్రి కావాలని చిన్నప్పటి నుంచే అనుకున్నారా? సీఎం: నేను చదువుకునేటప్పుడు ఐఏఎస్ కావాలని అనుకున్నా. మన కష్టం ఆ స్థాయికి సరిపోదేమో అనిపించింది. దానికన్నా ఎమ్మెల్యే అవుదామని అనుకున్నా. ఎమ్మెల్యే అయితే ఐఏఎస్‌లనే నియంత్రించవచ్చని అనిపించింది. యూనివర్శిటీలో చదువుతూనే ఎమ్మెల్యేనయ్యా. దళవాయి లోకనాధం (ఎస్వీయూలో పీహెచ్డీ): తిరుపతి వేదికగా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వచ్చాయి. కానీ వాటిలో స్థానికేతరులకు ఉద్యోగాలు ఇస్తున్నారు. స్థానికంగా రిజర్వేషన్లు ఇచ్చేలా చట్టం చేయండి. సీఎం: నూటికి 90 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇస్తున్నాం. ఈ విషయంలో నేను అందరితో సమన్వయం చేస్తున్నా. ఎక్కడైనా ఉల్లంఘిస్తే చెప్పండి. చర్యలు తీసుకుంటాం. కానీ దీన్ని అడ్డం పెట్టుకుని ఉద్యమాలు చేస్తే ఉద్యోగాలు ఊడతాయి. పెట్టుబడులు నాపై నమ్మకంతో వస్తున్నాయి. దళిత ఎంపీపీ మైక్ లాక్కున్న టీడీపీ ఇన్చార్జ్ సాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సీఎం నివాసం వద్ద ప్రజావేదికలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన నిరుద్యోగులు ముఖ్యమంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం సరైన సమాధానం చెప్పకుండా దాటవేశారు. సీఎంను నిరుద్యోగులు అడిగిన ప్రశ్నలివీ.. ఐఏఎస్ కావాలనుకుని ఎమ్మెల్యేనయ్యా: సీఎం ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని గాంధీ, లాల్‌బహదూర్‌శాస్త్రి లాంటి మహనీయుల జయంతి రోజున ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యువతకు భరోసా ఇవ్వడానికే దీన్ని ప్రారంభిస్తున్నామన్నారు. మంగళవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అర్హత సాధించిన సుమారు 2.10 లక్షల మందికి నిరుద్యోగ భృతిని ఈనెల నుంచి ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎంపికైన వారి ఖాతాలో బుధవారం రూ.వెయ్యి జమ చేస్తామని, నెలనెలా దీన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ‘ఆంధ్రప్రదేశ్ యువజన విధానం–2018’ని విడుదల చేశారు. సమాచారశాఖ రూపొందించిన బాపూజీ లఘు చిత్ర సీడీని సీఎం ఆవిష్కరించారు. చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని ఫాక్స్‌కాన్ ఇండియా లిమిటెడ్, కియా మోటార్స్, బ్రాండెక్స్ ప్రతినిధులు ప్రశంసించారు. పుంగనూరు: యువనేస్తం కార్యక్రమం సందర్భంగా మంగళవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ ఉల్లంఘించి వైఎస్సార్ సీపీ దళిత ఎంపీపీ నరసింహులుతోపాటు ఇతరులను అవమానించారు. పట్టణంలోని బిఎంఎస్ క్లబ్లో స్పెషల్ ఆఫీసర్ అరుణ ఆధ్వర్యంలో యువనేస్తం కార్యక్రమం ప్రారంభించారు. ఎమ్మెల్సీ సునీతతోపాటు పుంగనూరు ఎంపీపీ నరసింహులు, జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, కౌన్సిలర్లు దీనికి హాజరయ్యారు. టీడీపీ ఇన్చార్జ్ అనీషారెడ్డి, ఆమె భర్త శ్రీనాథరెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనీషారెడ్డి ఎంపీపీ నరసింహులును వేదిక పైనుంచి దిగిపోవాలని ఆదేశిస్తూ మైక్ లాక్కునేందుకు ప్రయత్నించడం వివాదానికి దారి తీసింది. ‘దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా...?’ అంటూ ఎంపీపీ నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతల జోక్యంతో డీఎస్పీ నారాయణస్వామి, సీఐ సాయినాథ్‌ల ఆదేశాల మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి వైఎస్సార్ సీపీ నేతలను అడ్డుకున్నారు. స్పెషల్ ఆఫీసర్ అరుణ ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, వైఎస్సార్ సీపీ నేతలను లోపలకు రానివ్వకుండా టీడీపీ నేతలను మాత్రం ఎలా అనుమతిస్తారని జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ ప్రశ్నించారు. దీంతో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు అడ్డుకుని కౌన్సిలర్లు మనోహర్, నయాజ్ లను బలవంతంగా లాక్కెళ్లి అరెస్ట్ చేశారు. అనంతరం అధికార పార్టీ నేతలు పోలీసుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. పలువురు నిరుద్యోగులు వెనుతిరిగి వెళ్లిపోవటంతో కంగుతిన్న టీడీపీ నేతలు సర్టిఫికెట్లు ఇస్తాం, తీసుకుని వెళ్లాలంటూ మైకులో అభ్యర్థించారు. ఎమ్మెల్యే ఐజయ్యపై దౌర్జన్యం నందికొట్కూరు: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే జీర్ణించుకోలేని అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. మంగళవారం కర్నూలు జిల్లా నందికొట్కూరులో నిర్వహించిన ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ దీనికి వేదికగా మారింది. జైకిసాన్ పార్కులో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు నాలుగున్నరేళ్లుగా గుర్తులేని నిరుద్యోగ భృతి ఎన్నికల గడువు సమీపిస్తుండడంతో ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులుండగా కేవలం 1.62 లక్షల మంది ఖాతాల్లో మాత్రమే ప్రభుత్వం రూపాయి చొప్పున జమ చేసిందన్నారు. జిల్లాలో 11,911 మందిని, నందికొట్కూరు నియోజకవర్గంలో 2,100 మందిని మాత్రమే ఎంపిక చేయడం సరికాదన్నారు. నీరు–చెట్టు పథకంలో అధికార పార్టీ నేతల దోపిడీ గురించి ఎమ్మెల్యే వివరిస్తుండగా అధికార పార్టీ నేతల జోక్యంతో మైక్‌ను కట్ చేశారు. దొంగల సంగతి ప్రజా కోర్టులో తేలాలని ఎమ్మెల్యే పట్టుబట్టడంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి వాగ్వాదానికి దిగారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేపైకి దూసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఐజయ్య ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. -
ఐజయ్య ఎవరో మీ నాన్ననడుగు
మిడుతూరు: ‘నాలుగేళ్ల ప్రజావ్యతిరేక పాలన గురించి ధైరంగా ప్రజలకు వివరిస్తుండగా పరువుపోతుందన్న బాధతో మైక్ కట్ చేసిన మీ నాన్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడుగు ఎమ్మెల్యే ఐజయ్య అంటే ఎవరో చెబుతారు’ అని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి మంత్రి లోకేష్‌కు హితవు పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా నందికొట్కూరు నియోజకవర్గం బ్రాహ్మణకొట్కూరుకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే ఐజయ్య ఎవరో ఇంతవరకు తనకు తెలియదని వ్యంగ్యంగా మాట్లాడటం తగదన్నారు. మండల పరిధిలోని మాసపేటలో ఎమ్మెల్యే తనయుడు వై.చంద్రమౌళితో కలిసి భరత్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వార్డుమెంబర్‌గా కూడా గెలవలేని తమరు దొడ్డిదారిన మంత్రి పదవిని చేపట్టి.. 23 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యే వై.ఐజయ్యను ఎవరో తెలియదనడం హాస్యాస్పదమన్నారు. నందికొట్కూర్ అభివృద్ధికి నిధులు కావాలని ఎవరూ అడగలేదనడంలో కూడా నిజం లేదన్నారు. అనుక్షణం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే 2016జూలై 18న రూ.6 కోట్లు, సెప్టెంబర్ 8న రూ.5 కోట్లు, అక్టోబర్ 4న రూ.5 కోట్లు, 2017 అక్టోబర్ 4న ఎస్డీఎఫ్ ఫండ్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారని, ఇవేవీ తెలయకుండా మాట్లాడటం అవివేకానికి నిదర్శనమన్నారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి భాస్కరరెడ్డి, కడుమూరు మాజీ సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, నాయకులు లోకేశ్వరరెడ్డి, మల్లికార్జునరెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే వైఎస్ జగన్ ధ్యేయం
పాములపాడు: వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిలాగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన అందిస్తారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పెంచికలపల్లి గ్రామంలో సుంకులమ్మదేవత విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు అతిథులుగా హాజరయ్యారు. వీరిని గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో పాటించాల్సిన విలువలను టీడీపీ కాలరాసిందన్నారు. వైఎస్ఆర్సీపీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు డబ్బు ఎరవేసి కొనుగోలు చేశారన్నారు. తమ అధినేత వెఎస్ జగన్మోహన్రెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారని..అందులో భాగంగానే శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారన్నారు. అనంతరం శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు చంద్రబాబే అన్నారు. మాయమాటలు చెప్పి ఆయన అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చి న ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజా ఆదరణను చూసి టీడీపీకి వెన్నులో వణుకు పుట్టిందన్నారు. అందుకే బీజేపీతో తెగదెంపులు చేసుకుని ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. బాబు నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఓటుతో ఆయనకు గుణపాఠం చెబుతారన్నారు. విజేతలకు బహుమతులు హోరాహోరీగా సాగిన బండలాగుడు పందెంలో కానాలకు చెందిన చెన్నారెడ్డి వృషభాలు 2700 అడుగుల దూరం లాగి మొదటి బహుమతి రూ.30,000 గెలుపొందాయి. వైఎస్ఆర్జిల్లా మల్లాయపల్లె గ్రామానికి చెందిన గోవిందరెడ్డి వృషభాలు 2528 .2 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి రూ. 20,000 , కానాలకు చెందిన చెన్నారెడ్డి వృషభాలు మూడవ బహుమతి రూ.10,000 గెలుపొందాయి. మొదటి బహుమతిని ఎమ్మెల్యే ఐజయ్య తనయుడు, వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు రాజశేఖర్ అందజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చౌడయ్య, ఎస్ఐ రాజగోపాల్ వైఎస్ఆర్సీపీ నాయకులు బాలసుబ్బారెడ్డి, రమణారెడ్డి, దాతలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
అధికార పార్టీ..అడ్డ‘దారి’
జిల్లాలో ఎక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నా.. టీడీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడి దక్కించుకుంటున్నారు. ఈ కోవలోనే కర్నూలు నగరంలో జరుగుతున్న పనులకు టెండర్ పెట్టారు. ఏకంగా రూ.1.25 కోట్ల పనులను సబ్లీజ్తో చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇంజినీరింగ్ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తుండడంచర్చనీయాంశమైంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి పనులకు ప్రతిపాదనలు అడగకపోవడం వివక్షకు తావిస్తోంది. ఎన్నికల కోసమే... ప్రతి నియోజకవర్గం నుంచి రహదారులు, భవనాల శాఖకు వందలాది పనుల కోసం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన రహదారులు సైతం దెబ్బతిని ఉండడంతో మరమ్మతులు, నూతన రహదారులు, అవసరమైన కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. అయితే వీటిలో అనుమతి లభించిన పనులు మాత్రం స్వల్పంగా ఉన్నాయని చెప్పవచ్చు. కొందరు ఎమ్మెల్యేలు పనులకు అనుమతి కోసం ముఖ్యమంత్రి, మంత్రుల, ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా ఆశించిన ఫలితం లభించకపోవడంతో ప్రజలకు ముఖం చాటేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని కొందరు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు మరో ఏడాది గడువు ఉండడంతో కొన్ని పనులైనా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కోదానిలో రూ.15 కోట్ల పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన పనుల వివరాల ప్రతిపాదలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కర్నూలు జిల్లాలో కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు మొత్తం 8 నియోజకవర్గాలకు సంబంధించి రూ.120 కోట్ల పనుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపాదనలు తీసుకోవడం మంజూరయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష... కర్నూలు జిల్లాలో మొత్తం 11 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. అయితే ఐదుగురు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించడంతో అధికార పార్టీలో 8 మంది, ప్రతిపక్ష పార్టీలో ఆరుగురు ఉన్నారు. ఇందులో 8 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో రహదారులు, ఇతర పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకుంది. అయితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల ఉన్న ఆరు నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఎలాంటి ప్రతిపాదనలు తీసుకోలేదని తెలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఇది తమపై వివక్ష చూపడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబునాయుడు తీరుపై తీవ్ర ఆక్షేపణలు గుప్పిస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై వివక్ష చూపుతోంది. ఇది మొదటి నుంచి జరుగుతోంది. మొదట్లో టీడీపీ ఎమ్మెల్యేలు లేని చోట ఇన్‌చార్జ్‌ల పేరుతో పనులు చేయించారు. ఇప్పుడు కేవలం టీడీపీ వారికే పనులు మంజూరు చేస్తున్నారు. మావి నియోజకవర్గాలు కాదా?..మా దగ్గర ఉన్నది ప్రజలు కాదా? వచ్చే ఎన్నికల్లో ప్రజలే టీడీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు. -
ప్రత్యేక హోదా కోసం యువత పోరాడాలి
నందికొట్కూరు: ప్రత్యేక హోదా కోసం యువత ఉద్యమించాల్సిన అవసరముందని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని బసిరెడ్డి డిగ్రీ మెమోరియల్ కళాశాలలో ప్రత్యేక హోదాపై యువతకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఐజయ్య మాట్లాడారు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుమలలో వెంకన్న సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్న వెంకయ్యనాయుడు, పదిహేనేళ్లు కావాలన్న చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని ఏపీని మోసం చేశారన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు భయపడుతున్నారన్నారు. ప్రత్యేక హోదాతోనే యువత భవిష్యత్ ఆధార పడి ఉందన్నారు. హోదా వస్తే రాష్ట్రానికి రాయితీతో కూడిన పరిశ్రమలు వస్తాయని, ఫలితంగా నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. అమరావతిలో తాత్కాలిక రాజధాని, సచివాలయం ఏర్పాటు పేరుతో రూ.కోట్లలో ప్రజాధనం వృథా చేయడం తప్ప అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని తంగెడంచ ఫారం భూములను జైన్, అంబుజూ కంపెనీలకు తక్కువ ధరకు కట్టబెట్టి, బాధితులకు ఇంతవరకు ఉపాధి చూపలేదన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్æరెడ్డి ప్రత్యేక హోదా కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. అందులోభాగంగానే మార్చి 1న కలెక్టరేట్, 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టే ధర్నాలకు ప్రజలు, యువత భారీగా తరలిరావాలన్నారు. సదస్సులో పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌రెడ్డి, మిడుతూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి, నాయకులు జనార్దన్‌రెడ్డి, లోకేష్‌రెడ్డి, బసిరెడ్డి కళాశాల కరస్పాండెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు. హోదాను గాంధేయ మార్గంలో సాధించుకుందాం గాంధేయ మార్గంలో కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందాం. హోదా వస్తే రాష్ట్రంలోనే యువతకు ఉద్యోగం లభిస్తుంది. వేరే రాష్ట్రంలో అక్కడి కంపెనీలు ఆంధ్ర యువతకు ఉద్యోగం ఇచ్చినా చిన్న చూపు చూస్తాయి. ప్రత్యేక హోదా వస్తే మన ఊరిలోనే ఉద్యోగం దొరుకుతుంది. హోదా సాధన కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీ వెంట మేమూ ఉంటాం. – రేణుకదేవి, బసిరెడ్డి డిగ్రీ కళాశాల నందికొట్కూరు యువత గళం విప్పితే ఢిల్లీ దద్దరిల్లాలి యువత గళం విప్పితే ఢిల్లీ దద్దరిల్లాలి. బీజేపీ, టీడీపీలు యువతను తక్కువ అంచనా వేస్తే సత్తా చూపిస్తాం. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం సస్యశ్యామలమవుతుంది. నిరుద్యోగ సమస్య కూడా హోదాతోనే పరిష్కారమవుతుంది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగ్‌మోహన్‌రెడ్డికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. హోదా కోసం ఆయన వెంట నడుస్తాం. – యాస్మిన్, బసిరెడ్డి డిగ్రీ కళాశాల, నందికొట్కూరు -
సీడ్ పార్క్ ఏర్పాటు వెనుక కుట్ర
జూపాడు బంగ్లా: వ్యవసాయం దండగన్న సీఎం చంద్రబాబు నేడు తంగెడంచలో సీడ్‌పార్కు ఏర్పాటు చేస్తారంటే ప్రజలు నమ్మలేకపోతున్నారని కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఎద్దేవా చేశారు. దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందన్నారు. అందుకే సభలో మాట్లాడనివ్వకుండా తన గొంతు నొక్కేశారని విమర్శించారు. కర్నూలు జిల్లా తంగెడంచలో సోమవారం మెగా సీడ్‌పార్కుకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఐజయ్య మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనను మాట్లాడనివ్వకుండా అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఒకే సర్వే నంబర్లపై రెండు జీవోలిచ్చిన టీడీపీ ప్రభుత్వం.. 35 బొల్లవరం రెవెన్యూ పరిధిలో 625.40 ఎకరాల భూమి లేకపోయినా మెగాసీడ్ పార్కుకు అంత భూమి ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. రుణమాఫీ చేశానంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు.. రైతులకు వ్యక్తిగత చెక్కులు ఎందుకు మంజూరు చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇప్పటిదాకా చేసిన రుణ మాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదని విమర్శించారు. మాఫీ డబ్బు బ్యాంకు ఖాతాల్లో పడకపోతే వెంటనే ఫిర్యాదు చేయాలని, 72 గంటల్లోగా ఆ సమస్యను పరిష్కరిస్తానని సీఎం పేర్కొనటం హాస్యాస్పదమన్నారు. -
'సీఎంపై అట్రాసిటీ కేసు పెట్టాలి'
హైదరాబాద్: ఎస్సీలను అవమానిస్తూ చంద్రబాబు చేసిన ప్రకటనతో దళితులు మనోవేదనకు గురవుతున్నారని వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే కె. శ్రీనివాసులు అన్నారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు. తక్షణం రాజీనామా చేసి దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథితో కలిసి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులపై కపటప్రేమ ఒలకబోస్తున్నారని మండిపడ్డారు. దళితులను ఎన్నికల్లో వాడుకుని వదిలేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని చంద్రబాబు హేళన చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ దళిత నేతలు ఇప్పటికైనా ఆలోచించుకోవాలని సూచించారు. దళితులను అవమానించేలా మాట్లాడిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలని శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కాపులను, బీసీలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని పార్థసారథి ఆరోపించారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చొద్దని హితవు పలికారు. బీసీలకు నష్టం జరగకుండా కాపులను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. -
'భయంతోనే చంద్రబాబు డుమ్మాకొట్టాడు'
నందికొట్కూరు(కర్నూలు జిల్లా): 'ఓటుకు కోట్లు' అంశంపై చర్చించడానికి వాయిదా తీర్మానం ప్రతిపాదించగా, తనను నిలదీస్తారెమోనన్న భయంతో అసెంబ్లీ సమావేశం చివరిరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డుమ్మాకొట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య(నందికొట్కూరు నియోజకవర్గం) ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా అధికారపక్షం అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేశారని ఆయన మండిపడుతున్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని, ప్రతిపక్ష నేతకే సరిగా మైక్ ఇవ్వలేదని చెప్పారు.