
'భయంతోనే చంద్రబాబు డుమ్మాకొట్టాడు'
నందికొట్కూరు(కర్నూలు జిల్లా): 'ఓటుకు కోట్లు' అంశంపై చర్చించడానికి వాయిదా తీర్మానం ప్రతిపాదించగా, తనను నిలదీస్తారెమోనన్న భయంతో అసెంబ్లీ సమావేశం చివరిరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డుమ్మాకొట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య(నందికొట్కూరు నియోజకవర్గం) ఆరోపించారు.
ప్రజా సమస్యలపై చర్చించకుండా అధికారపక్షం అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేశారని ఆయన మండిపడుతున్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని, ప్రతిపక్ష నేతకే సరిగా మైక్ ఇవ్వలేదని చెప్పారు.