MLA Suri
-
టీడీపీలో అసమ్మతి; ఎమ్మెల్యే బండారం బట్టబయలు
సాక్షి, అనంతపురం : ధర్మవరం టీడీపీలో అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. ధర్మవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వరదాపురం సూరీపై టీడీపీ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. సూరీ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. అంతేకాదు సూరీ ఆడియో టేపులు విడుదల చేసి ఆయన బండారాన్ని బట్టబయలు చేశారు. ‘ మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మనకు తిరుగుండదు. ఎన్నికల్లో బాగా పనిచేయండి. కౌంటింగ్ పూర్తైన క్షణం నుంచి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు మొదలుపెడదాం. నరుకుదాం. చంపుదాం. ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలీసులకు ముందే చెబుదాం. వారి సహకారం తీసుకుందాం. ఆరు మాసాల్లోగా ప్రత్యర్థులను అంతమొందిద్దాం’ అంటూ సూరీ.. తన కార్యకర్తలతో మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో టేపులు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే సూరి భార్యకు రెండు చోట్ల ఓటు ఈ నేపథ్యంలో ధర్మవరం టీడీపీ నేతలు మద్దిలేటి, రామకృష్ణ, నాగశేషు, గంటాపురం జగ్గు మాట్లాడుతూ.. ‘ వరదాపురం సూరీ నియంతలా వ్యవహరిస్తున్నారు. శ్రమించే కార్యకర్తలకు న్యాయం చేయలేదు. డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేశారు. సూరీ నాయకత్వంలో పనిచేయలేం’ అని అసమ్మతి వెళ్లగక్కారు. కాగా ఇలా వ్యవహరించడం వరదాపురం సూరీకి కొత్తేం కాదు. గతంలో బలవంతపు భూసేకరణను అడ్డుకున్న మహిళా రైతుపై ఆయన నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే. మహిళా రైతును చెప్పుతో కొట్టాలని అనుచరుడికి హుకుం జారీ చేసిన సూరీ... దాడి చేసి వచ్చాక ఎలాంటి కేసు నమోదు చేయొద్దని ఎస్సైకు ఆదేశాలు చేశారు కూడా. -
ఎమ్మెల్యే సూరి భార్యకు రెండు చోట్ల ఓటు
అనంతపురం అర్బన్: ‘ధర్మవరం నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తప్పులతడకగా సిద్ధం చేశారు. బోగస్, వివాహం చేసుకుని వెళ్లిన వారు, రెండు ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు జాబితాలో 6,073 ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ సతీమణి జి.నిర్మలదేవికి రెండు చోట్ల ఓటు ఉంది. రెవెన్యూ అధికారులు ఏళ్లగా పనిచేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వారిని ఎన్నికల విధులకు వినియోగించుకుంటున్నారు. వీటన్నింటిపైన ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అ«ధికారికి 20 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.’ అని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి మలయ్మాలిక్కు ధర్మవరం మాజీ ఎమ్మల్యే, వైఎస్సార్సీపీ నియోజవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న తప్పిదాలపై విచారణ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి మలయ్మాలిక్, సెక్షన్ ఆఫీసర్ రవి శుక్రవారం జిల్లాకు విచ్చేశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో చేపట్టిన విచారణకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హాజరై... ఓటర్ల జాబితాలో జరిగిన తప్పులను ఆధారాలతో సహా అందజేశారు. అధికారులను అధికారపార్టీ ఏవిధంగా ప్రలోభపెడుతోంది, ఏ విధంగా ఇబ్బంది పెట్టి తప్పుడు ఓట్లను నమోదు చేయిస్తోంది వివరించారు. కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ధర్మవరం, అనంతపురం ఆర్డీఓలు తిప్పేనాయక్, కూర్మనాథ్ ఉన్నారు. వెంకటరామిరెడ్డి ఫిర్యాదు ఇలా.. ♦ ఓటర్ల నమోదుకు 2018, సెప్టెంబరు నుంచి అక్టోబరు 31 వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ వ్యవధిలో ఓటరు నమోదుకు 18,429 దరఖాస్తులు వచ్చాయి. సరైన విచారణ నిర్వహించకుండా 5,988 దరఖాస్తులు ఆమోదించారు. ♦ స్థానిక ఎమ్మెల్యే సతీమణి జి.నిర్మలదేవికి రెండు చోట్ల ఓటు ఉంది. పోలింగ్ బూత్ 134లో (సీరియల్ నంబర్ 620) ఒక ఓటు, బూత్ 230లో (సీరియల్ నంబరు 552) మరో ఓటు ఉంది. ♦ ఎం.పి.సుబ్బారావు అనే వ్యక్తికి 108 బూత్‌లో (491), 218 బూత్ నంబర్లో (771) మరో ఓటు ఉంది. రమేశ్‌బాబు అనే వ్యక్తికి బూత్ నంబర్ 1లో (34) ఒక ఓటు, అదే బూత్‌లో(443) మరో ఓటు ఉంది. జి.నరసింహులుకు బూత్ నంబర్ 1లో (373) ఒక ఓటు, అదే బూత్‌లో (605) మరో ఓటు ఉంది. ఇలా బోగస్ ఓట్లు 6 వేల వరకు ఉన్నాయి. ♦ బోగస్ ఓట్ల తొలగింపునకు బీఎల్ఓలు సిఫారసు చేసినా ఏఈఆర్ఓలు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి వాటిపై 9,495 దరఖాస్తులు దాఖలు చేస్తే కేవలం 5,328 ఆమోదించారు. ♦ తొలగింపులకు సంబంధించి ఫారం–7లో దరఖాస్తు చేస్తే వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు సమాచారం ఇవ్వకపోగా కనీసం విచారణ చేయలేదు. పైపెచ్చు దరఖాస్తులు తిరస్కరించారు. ♦ అధికారపార్టీ ఒత్తిళ్లకు తట్టుకోలేక మునిసిపల్ కమిషనర్, ఎన్నికల డిప్యూటీ తహసిల్దారు సెలవుపై వెళ్లారు. బోగస్ ఓటర్లను నమోదు చేయాలని బీఎల్ఓలు, ఏఈఆర్ఓలపై ఒత్తిడి చేస్తున్నారు. అలా చేయని పక్షంలో సెలవుపై వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. ♦ ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని బోగస్ ఓట్ల విషయంపై సీఈఓ, డీఈఓకు 20 సార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. ఈ ఏడాది జనవరి 11న తుది ఓటర్ల జాబితా ప్రకటించారు. అయినా వేల సంఖ్యలో బోగస్, డూప్లికేట్ ఓట్లు అలాగే ఉన్నాయి. ♦ ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని బోగస్ ఓట్ల చేర్చడంపై బీఎల్ఓ, ఏఈఆర్ఓ, ఈఆర్ఓలు, జిల్లా ఎన్నికల అధికారిని విచారణ చేయాలి. ఇందులో బాధ్యులైన వారందరిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. ♦ కొందరు రెవెన్యూ అధికారులు దీర్ఘకాలికంగా జిల్లాలోనే పనిచేస్తున్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతోæ వారిని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వారిని యథావిధిగా జిల్లాలోనే కొనసాగిస్తూ ఎన్నికల విధులు అప్పగించారు. ఎమ్మెల్యే సూరి భార్యకు రెండు చోట్ల ఓటు ఈమె పేరు జి.నిర్మలాదేవి. ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సతీమణి. పట్టణంలో డబ్ల్యూఏయూ 316364, ఇంటి నెంబర్ 2–1, డబ్ల్యూఏయూ 1222975, ఇంటి నెంబర్ 25–585 పేరిట రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. ఈ ఉదాహరణను పరిశీలిస్తే.. స్థానికంగా దొంగ ఓట్ల నమోదు ఏ స్థాయిలో సాగిందో అర్థమవుతోంది. -
మహిళలను కించపరిచేలా ఎమ్మెల్యే సూరి వ్యాఖ్యలు
-
ల్యాండ్‌మైన్ : పరిటాల శ్రీరాం వర్సెస్ ఎమ్మెల్యే సూరి
పరిటాల శ్రీరాం , ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య వివాదం రాజుకుంది. ఓ భూమి తగాదా వ్యవహారం ఈ రెండు వర్గాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. వ్యవహారం ఆ పార్టీ ఉన్నతస్థాయి దృష్టికి చేరినా.. ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నట్లు తెలిసింది. రూ.కోట్లతో ముడిపడిన భూమి చుట్టూ తిరుగుతున్న ఈ ‘దందా’లో పైచేయి సాధించడం అటుంచితే.. తేడా వస్తే రెండు వర్గాల మధ్య ‘ల్యాండ్’మైన్ పేలడం తథ్యమనే చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ఓ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించి 13 ఎకరాల పొలం ఉంది. ప్రస్తుత మార్కెట్లో ఈ భూమి విలువ రూ.7కోట్ల పైమాటే. ఓ ముస్లిం వ్యక్తి ఈ పొలాన్ని కొనుగోలు చేయగా.. అందులో తమకూ హక్కు ఉందని ఇటీవల ముగ్గురు వ్యక్తులు తెర మీదకొచ్చారు. వీరిలో ఒకరు ఎమ్మెల్యే సూరి వర్గీయుడైన వెంకటేష్. ఆ పొలంలో 7 ఎకరాలు తనదనేది ఇతని వాదన. ఈ నేపథ్యంలో వ్యవహారాన్ని పొలం కొనుగోలు చేసిన ముస్లిం వ్యక్తి పరిటాల శ్రీరాం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే ‘పంచాయితీ’ తెంచేందుకు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ మేరకు రంగంలోకి దిగిన శ్రీరాం అనుచరులు ‘కొంత మొత్తం ఇస్తాం.. పొలం వదిలెయ్’మని ఒకసారి, స్థలం మరోచోట ఇప్పిస్తామని ఇంకోసారి వెంకటేష్‌తో బెదిరింపులకు పాల్పడినా ఫలితం లేకపోయింది. చివరకు జేసీబీలతో పొలం చదును చేసే ప్రయత్నంలో ఉండగా వెంకటేష్ హైకోర్టును ఆశ్రయించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే సమయంలో ఎమ్మెల్యే సూరి అండ కోరినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న శ్రీరాం వర్గీయులు మరింత రెచ్చిపోయి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. కలకలం రేపిన కిడ్నాప్ గత మే 10న పరిటాల శ్రీరాం ఓ కేసు విషయమై ధర్మవరం కోర్టుకు హాజరయ్యాడు. ఆ సమయంలో వెంకటేశ్ వ్యవహారం కూడా శ్రీరాం అనుచరులు చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నాలుగు రోజులకే ధర్మవరం ఆర్డీఓ ఆఫీసు ఎదుట వెంకటేశ్‌ను కిడ్నాప్ చేశారు. శ్రీరాం అండతో రామగిరి సర్పంచ్ శ్రీనివాసులు అలియాస్ శీన ఈ కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. విషయం ఎమ్మెల్యే సూరి దృష్టికి వెళ్లడంతో ఎస్పీతో మాట్లాడి, వెంకటేశ్‌ను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరినట్లు సమాచారం. అదేవిధంగా ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేయడం.. విషయం ఉన్నత స్థాయిలో చర్చనీయాంశం కావడంతో కిడ్నాప్ చేసి రామగిరికి తీసుకెళ్లిన వెంకటేశ్‌ను అక్కడి పోలీసుస్టేషన్లో అప్పగించినట్లు సమాచారం. ఆ తర్వాత అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో ఆయనను వదిలేసినట్లు తెలుస్తోంది. ‘దందాలకు పాల్పడితే గట్టిగా ఉండాలి’ ఒకే పార్టీలోని రెండు ముఖ్య వర్గాల మధ్య వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. సర్దిచెప్పాల్సిన టీడీపీ రాష్ట్రస్థాయి ముఖ్యనేత పోలీసు శాఖ ఉన్నత స్థాయి అధికారితో ఆరా తీసి.. ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘కిడ్నాప్ చేసి దందాలకు పాల్పడితే గట్టిగా ఉండాలి. అవసరమైతే అడ్డు తొలగించాలి’ అని చెప్పినట్లు సమాచారం. ఈ ‘ల్యాండ్’మైన్ రెండు వర్గాల మధ్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని టీడీపీ వర్గీయుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ‘పంచాయితీ’లో ఎవరి బేరం బెడిసికొట్టినా.. గొడవకు సిద్ధంగా ఉన్న ట్లు సమాచారం. ఇదే సమయంలో ధర్మవరం, రాప్తాడులో ఈ విషయమై ప్రజలతో పాటు రాజకీయ, వ్యాపార వర్గాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. -
అనంతపురం జిల్లా టీడీపీలో వర్గపోరు
-
ధర్మవరంలో ఉద్రిక్తత
⇒ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే సూరి వర్గాల బాహాబాహీ ⇒ ఇరు వర్గాల మధ్య రాళ్ల వర్షం.. పోలీసు జీపు అద్దాలు ధ్వంసం ధర్మవరం: అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ధర్మవరం పట్టణంలోని తారకరామాపురం సబ్‌స్టేషన్ వద్ద పరిటాల వర్గీయులు పవన విద్యుత్ కేబుల్ పనులు చేస్తున్నారు. కనగానపల్లి మండలం తల్లిమడుగుల గ్రామం వద్దనున్న గాలిమరల నుంచి ఉత్పన్నమయ్యే పవన విద్యుత్ (విండ్ పవర్)ను ధర్మవరం 220/122/33 సబ్‌స్టేషన్‌కు పంపేందుకు సరయు కంపెనీ టెండర్ సబ్‌కాంట్రాక్టు తీసుకుని ఈ పనులు చేస్తున్నారు.అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారని, వాటిని ఆపివేయాలని ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులు పరిటాల వర్గీయులకు సూచించారు. ఆ మాటలను ఖాతరు చేయకుండా శుక్రవారం చిగిచెర్ల రోడ్డు వద్ద పనులు కొనసాగించారు. ఈ క్రమంలో చిగిచెర్ల రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే సూరికి చెందిన నితిన్‌సాయి కన్స్ట్రక్ష న్స్ చేస్తోంది. ఈ పనులను పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే కేబుల్ పనులు చేస్తున్న వారిని పిలిచి మందలించి వెళ్లిపోయారు. అయినా వారు పనులు ఆపకపోవడంతో ఆర్అండ్బి, ట్రాన్స్‌కో, పోలీసులకు ఆయన ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో పట్టణ సీఐ హరినాథ్ అక్కడికి వెళ్లి పనులు చేస్తున్న పరిటాల వర్గీయులను అడ్డుకున్నారు. తోపులాట.. రాళ్ల దాడి..: మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం.. రామగిరి, చెన్నేకొత్తపల్లి నుంచి సుమారు 200 మంది అనుచరులను «ధర్మవరానికి పంపారు. అప్పటికే సూరి వర్గీయులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, రాళ్లు రువ్వుకోవడం జరిగింది. అనంతపురం నుంచి వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసు వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే సూరి అనుచరులు దాదాపు 15 మంది గాయపడ్డారు. జరిగిన ఘటనపై ఎమ్మెల్యే వరదాపురం సూరి ఎస్పీ రాజశేఖరబాబుకు ఫిర్యాదు చేశారు. -
పరిటాల సునీత,సూరి వర్గాల మధ్య ఘర్షణ