mla sv mohan reddy
-
కోడలు మంత్రి కావడంతో ఎమ్మెల్యే ...
సెంటు స్థలం లేని పేదలు ఆవాసం కోసం వృథాగా ఉన్న భూముల్లో గుడిసెలు వేసుకుంటే అది అక్రమం..వెంటనే పోలీసులు వాలిపోతారు..రెవెన్యూ అధికారులు దగ్గర ఉండి స్థలాలను ఖాళీ చేయిస్తారు. కాళ్లకు మొక్కినా కనికరించరు. అదే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే..తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాలంటే ప్రభుత్వ స్థలం తక్కువ ధరకు లీజుకు దొరుకుతుంది. ఒకటి కాదు రెండు కాదు..ఏకంగా 99 ఏళ్లు ఆ భూమిని స్వాధీనంలో ఉంచుకోవచ్చు. ఆర్థికంగా ఎదగనూ వచ్చు. ఇందుకు ఏ నిబంధనలు అడ్డురావు. పైగా మంత్రి బంధువుగా ఉంటే వ్యవహారాన్ని అడ్డులేకుండా చక్కబెట్టుకోవచ్చు. కర్నూలు నగరంలో ఇలానే జరుగుతోంది. విలువైన పర్యాటక స్థలాన్ని కాజేయడానికి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చురుగ్గా పావులు కదుపుతుండడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, కర్నూలు ; అధికారపార్టీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కన్ను పర్యాటక శాఖ స్థలంపై పడింది. ఇప్పటికే ఆయన.. భారీగా క్రైస్తవ ఆస్తులను లీజు పద్ధతిలో తీసుకున్నారు. అదే పద్ధతిలో పర్యాటక శాఖ స్థలాలను కైవసం చేసుకోవాలని యత్నిస్తున్నారు. కోడలు భూమా అఖిలప్రియ పర్యాటక శాఖ మంత్రిగా ఉండడంతో వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఏకంగా 99 ఏళ్ల పాటు నామమాత్రపు లీజుకు ఎకరన్నర స్థలాన్ని తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా కర్నూలు వెంకటరమణ కాలనీలో ఉన్న పర్యాటకశాఖ స్థలాన్ని లీజు ప్రాతిపదికన తీసుకుని భారీ షాపింగ్ మాల్స్ ఏర్పాటు కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. అయితే, ఎటువంటి టెండర్ల ప్రక్రియ లేకుండానే చేజిక్కించుకోవాలనేది ఆలోచనగా ఉంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులల్లో టెండర్లను పిలిచినప్పటికీ ఎవరూ అడ్డురాకుండా చేసుకునేలా ఆయన అనుచరులు బెదిరింపులకు కూడా దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సదరు స్థలం వద్దకు ఎమ్మెల్యే అనుచరులు రాకపోకలు సాగిస్తూ వ్యవహారాలు నడుపుతున్నారు. దీంతో పర్యాటకశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మునిసిపాలిటీలోని టెండర్ల వ్యవహారంలో ఏకచక్రాధిప్యతంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కన్ను ఇప్పుడు పర్యాటకశాఖ స్థలంపై పడడం చర్చనీయాంశమైంది. ఎవరూ పోటీలో లేకుండా...! కర్నూలులో వెంకటరమణ కాలనీకి మంచి గుర్తింపు ఉంది. పర్యాటక శాఖకు ఇక్కడ సుమారు 5 ఎకరాల వరకు స్థలం ఉంది. ఇందులో క్యాంటీన్, లాడ్జింగ్‌తో పాటు బారు కూడా పర్యాటకశాఖకు ఉంది. అదేవిధంగా ఒక ఫంక్షన్‌హాల్ నిర్వహిస్తున్నారు. ఇంకా రెండు ఎకరాల వరకూ ఖాళీ స్థలం ఉంది. ఇందులో ఎకరన్నర స్థలంపై ఎమ్మెల్యే ఎస్వీమోహన్ రెడ్డి కన్ను పడింది. ఈ స్థలాన్ని తక్కువ ధర లీజుకే కాజేయాలనేది ఆయన యత్నంగా ఉంది. వాస్తవానికి ఏదైనా ప్రభుత్వశాఖకు చెందిన స్థలంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే టెండర్లను పిలవడం పరిపాటి. అక్కడ ఏమి ఏర్పాటు చేయాలనే విషయాన్ని సదరు శాఖనే నిర్ణయిస్తుంది. అయితే, కర్నూలులోని వెంకటరమణ కాలనీలోని పర్యాటకశాఖ స్థలం విషయంలో మాత్రం ఇప్పటివరకు పర్యాటకశాఖ టెండర్‌ను పిలవలేదు. ఎటువంటి టెండర్ ప్రక్రియ లేకుండానే లీజు పద్ధతిలో తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ టెండర్ అనివార్యమైతే... ఎవరు టెండర్లో పాల్గొనకుండా చూసుకోవాలనేది కూడా ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యే అనుచరులు రెండు, మూడు రోజులకోసారి పర్యాటకశాఖ స్థలం వద్దకు వెళ్లి చక్కర్లు కొడుతున్నారని ఆ శాఖ ఉద్యోగులే వాపోతున్నారు. ఇప్పటికే కార్పొరేషన్ పనుల్లో ఏ చిన్న కాంట్రాక్టర్ బరిలో ఉండకుండా ఎమ్మెల్యే తన మనుషులకే టెండర్లను కట్టబెడుతున్నారు. అదీ అంచనా వ్యయాన్ని పెంచి పనులు దక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కోడలు మంత్రి అఖిప్రియ చూస్తున్న పర్యాటక శాఖపై కన్నేశారు. లీజు పద్ధతిలో పర్యాటక స్థలాన్ని చేజిక్కించుకునేందుకు యత్నించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
'చల్లా'రని సెగ!
నామినేటెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో సెగలు రేపుతోంది. సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డికి కడప రీజియన్ ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే ఆ పదవి వద్దని ఆయన తేల్చిచెప్పారు. టీడీపీలో చేరిన సమయంలో తనకు ఎమ్మెల్సీ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చి విస్మరించిందని మండిపడుతున్నారు. ఇన్ని రోజులుగా పార్టీని అంటిపెట్టుకున్న తనను ఈ విధంగా అవమానిస్తారా అని వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కర్నూలు : టీడీపీ అధిష్టానంపై ఆ పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారు. ఇన్నాళ్లు వాడుకొని వదిలేస్తారా అని మండిపడుతున్నారు. నామినేటెడ్ పోస్టుల వ్యవహారం ఇందుకు వేదికగా మారింది. 2014లో పామర్రు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వర్ల రామయ్యకు ఆర్టీసీ రాష్ట్రస్థాయి చైర్మన్ పోస్టు ఇచ్చి...1983లో ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసినతనకు రీజియన్ స్థాయి పోస్టు ఇవ్వడం ఏమిటని చల్లా రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు భూమా నాగిరెడ్డి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డి కూడా నామినేటెడ్ పోస్టును ఆశించారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ పోస్టును ఇస్తామని కూడా ఆయనకు టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుత నామినేటెడ్ పోస్టుల్లో స్థానం దక్కకపోవడంపై ఏవీ కినుక వహించారు. పెరుగుతున్న విభేదాలు.. కర్నూలులో ఎంపీ టీజీ, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆళ్లగడ్డలో మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, ఫరూఖ్ కుమారుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. బనగానపల్లెలో ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, చల్లా రామకృష్ణా రెడ్డి, కోడుమూరులో విష్ణు, కొత్తకోట వర్గాలకు పొసగడం లేదు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి, తుగ్గలి నాగేంద్రల మధ్య కూడా విభేదాలు పొడచూపాయి. బహిరంగ వేదికల మీద వీరు పరస్పరం విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి వైఖరిపై పార్టీలోని అనేక మంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. పాణ్యం నియోజకవర్గంలో కూడా ఇన్చార్జీ ఏరాసు ప్రతాపరెడ్డి వైఖరిపై పార్టీ నేతలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ కనీసం కార్యకర్తలకు పనులు ఇవ్వకుండా సొంతానికి చేసుకుంటుండంపై ఆ పార్టీ నేతలు కుమిలిపోతున్నారు. ఇన్చార్జ్ మంత్రిపై అసహనం.. జిల్లాలో విభేదాలు పెరిగిపోవడం..అసంతృప్తులు ఎక్కువగా ఉండడంతో ఇన్చార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసులుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలో జిల్లాకు చెందిన పార్టీ నేతలతో గురువారం జరిగిన సమావేశంలో ఇన్చార్జ్ మంత్రిగా కాల్వ శ్రీనివాసులు పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదని మంత్రిని నిలదీశారు. అదేవిధంగా మంత్రి అఖిలప్రియ వైఖరితో పాటు నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని కూడా సీఎం మందలించినట్టు సమాచారం. సీనియర్ పార్టీ నేతలను కలుపుకుని పోవడంతో పూర్తిగా విఫలమయ్యారని స్పష్టం చేసినట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. -
ఏపీ ప్రజలను నిలువునా మోసం చేశారు
-
ఏపీ ప్రజలను నిలువునా మోసం చేశారు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రజలను నిలువునా మోసం చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తిరుపతి సాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరులతోమాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న ఆలోచన ఏపీ సర్కార్ చేయడం లేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా రావటం వల్ల పారిశ్రామికంగా అభివృద్ధి చెంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రత్యేక ప్యాకేజీల వల్ల ఎలాంటి లాభం ఉండదని గుర్తు చేశారు.