తెలుగుదేశం పార్టీ ప్రజలను నిలువునా మోసం చేసిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తిరుపతి సాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరులతోమాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలన్న ఆలోచన ఏపీ సర్కార్ చేయడం లేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా రావటం వల్ల పారిశ్రామికంగా అభివృద్ధి చెంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ప్రత్యేక ప్యాకేజీల వల్ల ఎలాంటి లాభం ఉండదని గుర్తు చేశారు.