పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేస్తేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం గురువారమిక్కడ ముగిసింది. అనంతరం పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. ఫిరాయింపుకు పాల్పడిన 20మందిపై అనర్హత వేటు వేస్తేనే శాసనసభకు హాజరు అవుతామని ఆయన తెలిపారు. ‘ ఫిరాయింపులపై ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. 20మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడమే కాకుండా వారిలో నలుగురిని మంత్రులు చేశారు.