ప్రజా సమస్యలను చర్చించకుండా సభను దారి తప్పించే కుటిల వ్యూహాలకు శాసన సభను వేదికగా మార్చొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావులకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కమిటీ ఆన్ జనరల్ పర్పసెస్ సమావేశాన్ని ఈనెల 11వ తేదీన నిర్వహిస్తామని చెప్పడం, అందులో ప్రతిపక్షం నుంచి కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్పీకర్తో కలిపి మొత్తం 25 మందిని దీనికి పిలుస్తుండగా.. తనతో కలిపి కేవలం ముగ్గురికే ప్రతిపక్షం నుంచి అవకాశం ఇవ్వడమేంటని నిలదీశారు. దామాషా పద్ధతిని పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము ఢిల్లీలో ధర్నా చేస్తున్నరోజే ఈ సమావేశం నిర్వహించడం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు.