mla varma
-
నిధులున్నా.. పనుల్లేవు ∙
సాక్షి, కొత్తపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ భవనాలకు ఆర్భాటంగా శంకుస్థాపనలు చేశారే తప్ప భవనాలను మాత్రం నిర్మించలేదు. నియోజకవర్గంలో రూ.2,800 కోట్లతో అభివృద్ధి చేశానని ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే వర్మ.. ఈ ఐదేళ్ల కాలంలో శంకుస్థాపనలు చేసిన పలు భవనాలను ఇప్పటికీ నిర్మించలేదు. నిధులు విడుదలైనప్పటికీ వాటిని ఎందుకు నిర్మించలేదన్న ప్రశ్నలకు సమాధానాన్ని ఎవరూ చెప్పడం లేదు. నిధులు మంజూరైనా పనులను ప్రారంభించకపోవడంతో సర్వత్రా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే వర్మ వాకతిప్ప పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి 2017 అక్టోబర్ 29తేదీన శంఖుస్థాపన చేశారు. మండల కేంద్రం కొత్తపల్లి పంచాయతీ భవనం నిర్మాణానికి మండల మహిళా సమాఖ్య కార్యాలయం ఖాళీ స్థలంలో 2017 నవంబర్ 19న శంఖుస్థాపన చేశారు. ఈ భవనాల నిర్మాణ పనులు ప్రారంభించలేదు. ఈ రెండు భవనాలకు రూ.15 లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. పాత భవనాలను కూల్చివేసి, కొత్త వాటిని నిర్మించకపోవడంతో ఆ కార్యాలయాలు పరాయిపంచన నడుపుతున్నారు. గోర్స గ్రామం శెట్టిబలిజపేటలో కమ్మునిటీ భవనానికి 2016 నవంబర్ 8న ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రూ.5 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టే ఈ భవనాన్ని ఇప్పటికీ నిర్మించలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. -
ఎమ్మెల్యే వర్మను సస్పెండ్ చేయాలి
తూర్పుగోదావరి, పిఠాపురం: గొల్లప్రోలు నగరపంచాయతీ శానిటరీ ఇన్స్పెక్టర్ శివలక్ష్మిను అవమానించిన ఎమ్మెల్యే వర్మను టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక విష్ణాలయంలో కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కులవివక్ష పోరాట సమితి మండల కేఎస్ నాయకులు ఏలేటి నానిబాబు మాట్లాడుతూ మహిళ అని చూడకుండా శానిటరీ ఇన్స్పెక్టర్ శివలక్ష్మి చేతులతో మురుగును తీయించిన వర్మపై తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గంలో నియంత పాలన చేస్తూ, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే మహిళా అధికారి పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడం తగదన్నారు. జిల్లా నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ సిబ్బందిని నియమించడం చేతగాని వ్యక్తి మహిళా అధికారిపై అనుచితంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. నియోజకవర్గంలో అధికారులకు, సిబ్బందికి రక్షణ లేకుండా పోయిందన్నారు. తక్షణం శానిటరీ ఇన్స్పెక్టర్కు ఎమ్మెల్యే క్షమాపణ చేప్పాలన్నారు. లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మహిళా అధికారిపై దౌర్జన్యానికి పాల్పడిన ఎమ్మెల్యే వైఖరిని ఖండించాల్సింది పోయి సస్పెన్షన్ ఆర్డర్స్ జారీ చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో వ్యవసాయకార్మిక సంఘం జిల్లా సహాయకార్యదర్శి కూరాకుల సింహాచలం, రజకవృత్తి దారులు సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు, డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి అంజిబాబు, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, సమాచారహక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు పప్పు దుర్గారమేష్, ఐఏన్టీయూసీ నాయకులు కేశవరపు అప్పలరాజు, లాయర్ అసోసియేషన్ నాయకులు జీఎస్ భాస్కర్, ప్రజా సంఘాలు నాయకులు నాగేశ్వరరావు, కొజ్జారపు త్రిమూర్తులు, సురేష్, అశోక్ పాల్గొన్నారు. -
కో అంటే కోటి...
ఈ చిత్రం చూశారు కదా...కోళ్లను చేతుల్లోకి తీసుకొని ఢీ కొట్టిస్తున్నవారు ఎవరో కాదు ... ఒకరు కాకినాడ ఎంపీ తోట నరసింహం...ఇంకొకరు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ. ఇద్దరూ అధికార పార్టీకి చెందిన నేతలే. ఈ ఘటన జరిగి ఇరవై నాలుగ్గంటలైనా ‘చట్టం తన పని తాను’ ఎందుకు చేసుకుపోలేదు. ప్రసార మాద్యమాల్లో హల్చల్ చేసినా...పత్రికల్లో ఫొటోలతో ప్రచురితమైనా జిల్లా అధికారులు ఎందుకు స్పందించలేదన్నదే ప్రశ్న. కోడి పందేల నిర్వహణపై కోర్టులు... కన్నెర్ర చేస్తున్నాయి జిల్లా కలెక్టర్... ససేమిరా అంటున్నారు జిల్లా ఎస్పీ... చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్నారు...చట్టానికి ప్రతినిధులైన వీరంతా ఒకే మాటపై ఉంటే ఏమి జరగాలి.. కచ్చితంగా చట్టం అమలు జరగాల్సిందే... ఆచరణలో...చట్ట‘బద్ధకం’గా పని చేయడంతో వ్యవస్థలను అవహేళన చేస్తూ ... జిల్లాలో పందేలు పరుగులు తీస్తున్నాయి.. కో...అంటే కోటి రూపాయలంటూ కాళ్లు దువ్వుతున్నారు... సాక్షి ప్రతినిధి, కాకినాడ: బరి గీస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు. బరికి స్థలమిస్తే యజమానులపై కేసు నమోదు చేస్తామంటున్నారు. కోడి పందేలే కాదు పేకాట, గుండాట, ఆశ్లీల నృత్యాలు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని చేస్తున్న హెచ్చరికలను నిర్వాహకులు ‘డోంట్ కేర్’ అనడం పోలీసులకు సవాల్‌గా మారింది. సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలే పండక్కి ముందే పందెం కోళ్లతో ఢీకొట్టిస్తూ మీ వెనుకే కాదు ... మీతోపాటు మేం ఉన్నామంటూ అధికార పార్టీ నేతలు భరోసానివ్వడంతో ‘కో అంటే కోటి’ అంటూ కోడి పందేలు వేసేందుకు బరిలు సిద్ధమవుతున్నాయి. ఏజెన్సీ, మెట్ట, కోనసీమ అనే తేడా లేకుండా పందెం కోళ్లు రె‘ఢీ’ అవుతున్నాయి. కోనసీమలోనైతే మరింత ఎక్కువగా బరులు ఏర్పాటవుతున్నాయి. మంత్రులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా శిబిరాలు ఇలా... ఒక్క మురమళ్లే కాదు జిల్లాలో దాదాపు 26 మండలాల్లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో జరిగిన ప్రాంతాల్లోనే మరింత హుషారుగా నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు. కపిలేశ్వపురం మండలం కపిలేశ్వరపురం, కేదారిలంక, వల్లూరు, పిఠాపురం మండలం పి.దొంతమూరు, మండపేట మండలం మండపేట, ద్వారపూడి, ఏడిద, వై.సీతానగరం, గొల్లప్రోలు మండలం కొడవలి, చెందుర్తి, తుని మండలం తేటగుంట, వి.కొత్తూరు, మల్లవరం, రాజరపేట, డి.పోలవరం, వల్లూరు, కుమ్మరిలోవ, ప్రత్తిపాడు మండలం రాచపల్లి, ఉత్తరకంచి, లంపకలోవ తోట, ధర్మవరం, మామిడికుదురు మండలం గోగన్నమఠం, పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని వేట్లపాలెం, మేడపాడు, వాలు తిమ్మాపురం, గోకవరం మండలం కృష్ణునిపాలెం, మల్లవరం, కామరాజుపేట, తంటికొండ, మలికిపురం మండలంలోని లక్కవరం, మలికిపురం, శంకరగుప్తం, గుడపల్లి, రాయవరం మండలం రాయవరం, కూర్మపురం, చెల్లూరు, మాచవరం, ఆత్రేయపురం మండలంలోని పేరవరం, తాడిపూడి, వసంతవాడ, లొల్ల, జగ్గంపేట మండలం కట్రావులపల్లి, రాజపుడి, కొత్తూరు, రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో కె.బాలాంత్రమ్, పేకేరు, మసకపల్లి, జగన్నదగిరి, కాజు లూరు, అల్లవరం మండలంలోని గోడి, గోడిలంక, కొమరిగిరిపట్నం, అల్లవరం, గుండెపుడి, ఉప్పలగుప్తం మండలం ఎన్.కొత్తపల్లి, గొల్లవిల్లి, చల్లపల్లి, బీమనపల్లి, ఎస్.యానాం, రాజమండ్రి రూరల్ పరిధిలోని కావలగొయ్యి, పిడింగొయ్యి, కొలమూరు, బొమ్మూరు, వేమగిరి, అమలాపురం రూరల్‌లోని హిందుపల్లి, సమనస, సాకుర్రు, తొండంగి మండలం సీతారాంపురం, పి.చిన్నయ్యపాలెం, బెండపూడి, రావకంపాడు, పి.అగ్రహారం, కోన ప్రాంతాలు, బుచ్చియ్యపేట, పెరుమల్లపురం, వకడారిపేట, అద్దరిపేట, వేమవరం, రంపచోడవరం పరిధిలోని పందిరిమామిడి, బందపల్లి, జగమెట్లపాలెం, గెద్దాడ, వాడపల్లి, తామరపల్లి, ఆకూరు, ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని రాజుపాలెం,కేసనకుర్రు, ఎదుర్లంక, నీలపల్లి,చెయ్యేరు, కాట్రేనికోన ప్రాంతాల్లో మళ్లీ జరుగనున్నాయి. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కోళ్ల సందడితోపాటు పేకాట, గుండాటలు కూడా భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నోట్ల ఇబ్బందులు... పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలు కన్నా పందెంగాళ్లకు నోట్ల సమస్య ఇబ్బందికరంగా మారింది. ఏటీఎంలలో నగదు రాకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో కరెన్సీ వేట మొదలైంది. ఎక్కడెక్కడ నగదు ఉందో తెలుసుకుని, వారి వద్ద నుంచి ఏదో ఓ గ్యారంటీ చూపించి డబ్బు సమీకరించేపనిలో పడ్డారు. కొందరు చెక్కుల ద్వారా, మరికొందరు ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేసేలా సిద్ధపడుతున్నారు. భోగి నాడే రూ.కోట్లాది పందేలకు సిద్ధం గతేడాది పోలీసులు, అధికారులు ఎన్ని ఆంక్షలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కోడి పందేలు ఆగలేదు. తొలుత కత్తుల్లేకుండా, ఆ తర్వాత కత్తులు కట్టేసి రక్తం చిందించారు. ఈసారి కూడా అదేరకంగా పావులు కదుపుతున్నారు. గత భోగి నాడు రూ.7 కోట్ల వరకూ పందేలు జరిగినట్టు అంచనా. ఈసారి రూ.10 కోట్ల వరకు పందేలు ఒక్క భోగి రోజునే జరుగుతాయని అంచనా. మురమళ్ల వద్ద భారీ ఏర్పాట్లు ఐ.పోలవరం మండల ముఖద్వారం మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం వెనుక శరభయ్య చెరువు సమీపంలో అధికార పార్టీ నేత కనుసన్నల్లో సుమారు 15 ఎకరాలలో కోడి పందేలకు నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరూ వీక్షించేలా ప్రత్యేక వసతులు కూడా కల్పిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రధాన పోటీదార్లకు వాట్సాప్‌ల్లో ఆహ్వానాలు కూడా పంపించారని తెలిసింది. -
మహాకుట్ర.. బందిఖానాలో గురువు
పిఠాపురం టౌన్: శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో చోటు చేసుకున్న అనేక అక్రమాలు, మోసాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. సంస్థానం ఆవరణలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే వర్మ సమక్షంలో ఆలయ ఈఓ చందక దారబాబు పలు వివరాలను వెల్లడించారు. సంస్థానానికి చెందిన కారులోని డాష్ బోర్డులో దొరికిన కొన్ని డాక్యుమెంట్లను ఆయన బయట పెట్టారు. వీటి ప్రకారం సంస్థానం ఆస్తులన్నింటిని దస్తావేజు నెం.11.2017 ప్రకారం ట్రస్టు చైర్మన్‌గా వ్యవహరించిన రెడ్డెం శేషారావు(బాబులు)పేరున రాయించుకున్నారన్నారు. పిఠాపురం సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో ఈ మేరకు రిజిష్టర్ అయినట్టు తెలిపారు. అంతేకాకుండా సవరణ డాక్యుమెంటు నం.125.2017 ప్రకారం రెడ్డెం బాబులు, చక్కా దత్త చలపతిరావు, చక్కా చలపతిరావు, గ్రంధి సూర్యనారాయణమూర్తి ఏకమై పాత కమిటీ చేసిన అవినీతిని విచారించేందుకు వారు వాడుకున్న డబ్బులు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సర్వ హక్కులు పొందడమే కాకుండా సేవా ట్రస్టులన్నింటి మీద తమకు మాత్రమే అధికారం ఉండే విధంగా సవరణ డాక్యుమెంటులో పొందుపరిచినట్టు తెలిపారు. గురువును మోసం చేసి వేలిముద్రల సేకరణ గురువు రామస్వామిని మోసం చేసి ఆయన్ని నిద్రమత్తులో ఉంచి డాక్యుమెంటు వివరాలు తెలియజేయకుండా ఆయన వేలిముద్రలు తీసుకుని సంస్థానానికి దేశంలో ఉన్న మొత్తం ఆస్తిని తనకు చెందే విధంగా బాబులు సబ్రిజిష్ట్రార్ను బెదిరించి సంస్థానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత సవరణ వీలునామా రాయించుకున్నారని ఈ విషయాన్ని సబ్‌రిజిష్ట్రార్ స్వయంగా వివరించారని ఆలయ ఈఓ చందక దారబాబు తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పుడు గురువు రామస్వామికి తెలియచేయగా డాక్యుమెంట్లలో ఉన్న విషయాలు తనకు తెలియవని చెప్పారని ఈఓ తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు వెంటనే తాను మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్, పోలీసు అధికారులు, సబ్ రిజిస్ట్రార్, ప్రభుత్వ డాక్టర్‌ను పిలిపించి వారి సమక్షంలో సంస్థానం ఆస్తుల మొత్తం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో ఉండే విధంగా గురువు రామస్వామి వీలునామా రాశారని తెలిపారు. అంతేకాకుండా రెడ్డెం బాబులు చైర్మన్‌గా ఉన్న ట్రస్ట్ 2017 ఏప్రిల్ ఒకటి నుంచి రెన్యువల్ కాలేదని అందువల్ల ఆ కమిటీకి చట్ట బద్ధత లేదన్నారు. ఈ కమిటీ నిర్వహించిన రూ.9 కోట్ల లావాదేవీలకు సంబంధించి ఏవిధమైన అధికారిక చట్టబద్ధత లేదని అందువల్ల చట్టరిత్యా నేరం కిందకు వస్తుందన్నారు. కొంతమొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినప్పటికీ మిగిలిన లావాదేవీలకు ఏవిధమైన బిల్లులు, పద్దులు అందుబాటులో లేవన్నారు. ఇదిలా ఉండగా గురువు రామస్వామి కొన్ని సంవత్సరాలుగా సంతకం చేయలేని స్థితిలో ఉండగా ఆయన పేరున రూ.50 వేలు, రూ.90 వేలు చెక్కులు ఫోర్జరీ సంతకంతో డ్రా చేశారన్నారు. 1998 నుంచి ఉన్న సంస్థానం కమిటీలు స్వలాభాపేక్షతో విధులు నిర్వహించారని, భక్తుల సౌకర్యార్థం, ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమాత్రం చేయలేదన్నారు. దాంతో మొత్తం కమిటీల యొక్క లావాదేవీలన్నింటిని క్షుణ్ణంగా విచారించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈఓ చందక దారబాబు తెలిపారు. బందిఖానాలో గురువు తొమ్మిది నెలల నుంచి గురువు రామస్వామిని బందిఖానాలో ఉంచి భక్తులెవ్వరినీ కలవనీయకుండా చేశారని ఈఓ చందక దారబాబు తెలిపారు. ప్రస్తుతం ఆయన వీల్‌చైర్‌లో ఆలయ ప్రాంగణంలో తిరుగుతున్నారని ఆయన కోరిక మేరకు సంస్థానంలో సంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమాలు జరగాలని, విద్యా, వైద్య మహిళాభివృద్ధికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కృషి చేయాలని తెలిపారు. ఆయన మరణానంతరం సంస్థానంలోనే మహానిర్యాణం(సమాధి)చేసి దత్త సంప్రదాయం ప్రకారం పూజాది క్రతువులు నిర్వహించాలని వీలునామాలో రాసినట్టు తెలిపారు. వీటిని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్‌కు తెలియజేస్తామన్నారు. ఎమ్మెల్యే వర్మ, పలువురు పట్టణ ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. -
కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన
తూర్పు గోదావరి: టీడీపీకి చెందిన పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ అనుచితంగా మాట్లాడారంటూ కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు ఆందోళనకు దిగారు. అత్యవసర విభాగానికి వైద్యం కోసం వచ్చిన ఓ వ్యక్తికి సేవలు సరిగ్గా అందించలేదంటూ శుక్రవారం రాత్రి డాక్టర్లను ఎమ్మెల్యే వర్మ దూషించారు. దీనిపై సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుంటే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఉదయం సిబ్బంది మంతనాలు జరుపుతున్నారు. -
ఎస్ఈజెడ్పై బహిరంగ చర్చకు సిద్ధమా?
ఎమ్మెల్యే వర్మకు దొరబాబు సవాల్ గొల్లప్రోలు : ఎస్ఈజెడ్పై పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చేస్తున్న అసత్యప్రచారాలు మానుకోవాలని, ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమాని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు సవాల్ విసిరారు. గొల్లప్రోలులో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఈజెడ్పై ఎమ్మెల్యే చేసిన ప్రకటనలపై ఖండించారు. ఎస్ఈజెడ్పై ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించేందుకు నియోజకవర్గంలో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన తెలిపారు. ఎస్ఈజెడ్ భూములు పార్టీ అధినేత జగన్ మోహ¯Œæరెడ్డికి చెందినవని, ఎస్ఈజెడ్ను దివంగత సీఎం వైఎస్ ఏర్పాటు చేశారంటూ ఎమ్మెల్యే అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఎస్ఈజెడ్ ఏర్పాటుకు జీఓను చంద్రబాబు జారీ చేశారని, ఈ భూములన్నీ చంద్రబాబు బినామీల పేరిట ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ఈ ప్రాంతంలో ఏరువాక చేపట్టిన చంద్రబాబు.. ఎస్ఈజెడ్కు సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ మాటను విస్మరించారని విమర్శించారు. మంత్రి యనమల, ఎమ్మెల్యే కలసి తొండంగి మండలంలో దివీస్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూసేకరణ చేపట్టి రైతులను, కోన గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రైతులు భూములను లాక్కోవడం, చెరువుల్లో మట్టి అమ్ముకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అక్కర్లేదని, ప్యాకేజీ ముఖ్యమని రాష్ట్ర ప్రజల మనోభాలను దెబ్బతీశారన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కురుమళ్ల రాంబాబు, పట్టణ కన్వీనర్ పర్ల రాజా, పిఠాపురం మున్సిపాలిటీ ఫ్లోర్‌లీడర్ గండేపల్లి బాబీ, గొల్లప్రోలు నగర పంచాయతీ ఫ్లోర్‌లీడర్ తెడ్లపు చిన్నారావు, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మొగలి అయ్యారావు, మాజీ సర్పంచ్ చిన్నారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
వర్మా.. ఇదేమి ఖర్మ!
ఓట్లేసిన పాపానికి తలలు పట్టుకుంటున్న ఓటర్లు ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా అదే పంథా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బెదిరింపులు మాకీ ఉద్యోగాలు వద్దంటూ లాంగ్ లీవ్‌లోకి తనకిష్టం లేకపోతే వీఆర్‌లో పెట్టాలంటూ ఒత్తిళ్లు చివరకు అగ్నిమాపక సిబ్బందినీ వదలని వైనం కోతికి కొబ్బరి కాయ దొరికింది ... కొమ్మ, కొమ్మపై గంతులేస్తూ సందడి చేస్తోంది.దానికో అర్థం, పరమార్థం ఉంది. ఎందుకంటే ఆకలితో ఉన్న సమయంలో కొబ్బరి ముక్క దొరకడం ... తన పొట్ట నిండబోతుందనే ఆనందం ఆ కుప్పిగంతుల్లో కనిపిస్తుంది. మరి ఈ కథనంలో ఈయనను ఎమ్మెల్యే పదవి వరించింది. ఆ మరుసటి రోజునుంచీ ఒకటే చిందులు. ఈ చిందుల్లో అక్రమాల ఆతృతే కనిపిస్తోంది. తనతోపాటు తన అనుచరుల పొట్ట నింపడానికి ఎదుటివారి బతుకులను చిదిమేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. స్వతంత్రంగా పోటీ చేసినా ప్రధాన పార్టీలను కాదని ఆ నియోజకవర్గ ప్రజలు ఓట్లేశారు. ఆ రుణం తీర్చుకోవల్సింది పోయి రణన్నినాదంతో రభస చేస్తున్నారు. అభివృద్ధిని వదిలేసి అడుగడుగునా అకృత్యాలకు పాల్పడుతున్నారు... అదెలాగో మీరే చదవండి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో పలు శాఖలకు ఉన్నతాధికారులున్నా ఆ ప్రాంతానికి మాత్రం ఆయనే సర్వాధికారి. ఆ రాజ్యంలో ఎవరైనా రాజుగారి మాట జవదాటారో శంకరగిరి మాన్యాలే. చక్రవర్తి వస్తున్నారంటే భుజంపై కండువా చంకలో పెట్టుకుని ‘జీ హుజూర్’ అనే రాజులకాలం తరహా సంస్కృతి అక్కడ నడుస్తోంది. ఆయన అనుమతి లేనిదే ఆ రాజ్యంలో అడుగుపెట్టే ధైర్యం ఎవరూ చేయలేరు. అటువంటి రాజ్యంలో పనిచేయడమంటే అధికారులు హడలెత్తిపోతున్నారు. పిఠాపురం సంస్థానాధీశుల కాలంలో కూడా ప్రజలు ఈ తరహా పాలన చూసి ఉండరన్న వ్యంగ్యం వినిపిస్తోంది. ఆయనెవరో కాదు పిఠాపురం ఎమ్మెల్యే (టీడీపీ) ఎస్వీఎస్ వర్మ. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పిఠాపురం నియోజకవర్గంలో పని చేయాలంటేనే అధికారులు ఠారెత్తిపోతున్నారు. వేధింపులు మరీ మితిమీరిపోయాయి. అక్కడ పనిచేయలేక ఒక్కొక్కరు ఊళ్లు వదిలిపోతున్నారు. రెవెన్యూ, పోలీసు, విద్య, వ్యవసాయంతోపాటు చివరకు అగ్నిమాపకశాఖను కూడా ఆ నేత విడిచిపెట్టడం లేదు. ఇలా దాదాపు అన్ని శాఖల అధికారులు ఆ నియోజకవర్గంలో అడకత్తెరలో పోక చెక్కలైమితిమీరిపోయాయి. అక్కడ పనిచేయలేక ఒక్కొక్కరు ఊళ్లు వదిలిపోతున్నారు. రెవెన్యూ, పోలీసు, విద్య, వ్యవసాయంతోపాటు చివరకు అగ్నిమాపకశాఖను కూడా ఆ నేత విడిచిపెట్టడం లేదు. ఇలా దాదాపు అన్ని శాఖల అధికారులు ఆ నియోజకవర్గంలో అడకత్తెరలో పోక చెక్కలై పోతున్నారు. ఎంఈఓ మరణానికి వేధింపులే కారణం... పిఠాపురం మండల విద్యాశాధికారిగా పనిచేసిన శర్మ హఠాన్మరణానికి గురవడానికి కారణం ఆ ముఖ్యనేత, అతని అనుచరగణం ఒత్తిళ్లే శర్మను బలితీసుకున్నాయని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. పాఠశాల భవన నిర్మాణాలు, విద్యార్థుల యూనిఫారాల కొనుగోలులో కమీషన్ల కోసం ఆ ముఖ్యనేత చెప్పినట్టు నడుచుకోకపోవడమే శర్మ చేసిన తప్పు. ఆగ్రహం కట్టలు తెంచుకున్న ఆ ముఖ్యనేత తిట్ల పురాణం లంఘించుకోవడంతో ఎంఈఓ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై గుండెపోటుతో మృతి చెందారని అప్పట్లో ఉపాధ్యాయులు ధ్వజమెత్తారు. కాంట్రాక్టుల కోసం కమిషనర్‌పై... ∙ఆ జాబితాలో పిఠాపురం మున్సిపల్ కమిషనర్ బి.రాము కూడా ఉన్నారు. రాము పిఠాపురం కమిషనర్‌గా పనిచేసే సందర్భంలో తాను చెప్పినట్టుగా మున్సిపల్ కాంట్రాక్టులు నామినేషన్ పద్దతిపై తన సోదరుడు బినామీదారులకు ఇవ్వకపోవడం ఆ ముఖ్యనేతకు నచ్చలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పాదగయ క్షేత్రంలో జరిగిన సమావేశంలో అందరి ముందూ నోరుపారేసుకోవడంతో ఆత్మాభిమానం అడ్డువచ్చి ఉద్యోగం ఎక్కడైనా చేసుకోవచ్చననే రాము వేరే చోటుకు బదిలీపై వెళ్లిపోయారు. వీఆర్‌లోకి ఎస్ఐ గొల్లప్రోలు ఎస్సైగా పనిచేసిన బుచ్చిబాబును కూడా ఇదేరకమైన వేధింపులకు గురిచేసి బలవంతంగా వీఆర్‌లోకి పంపేశారు. అది భార్య, భర్తల కేసు. భర్త చిత్రహింసలకు గురిచేస్తున్నాడని భార్య ఇచ్చిన ఫిర్యాదుపై చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవడమే అక్కడ ఎస్ఐ చేసిన నేరం. ఆ కేసులో భర్త ఆ ముఖ్యనేత అనుచరుడు కావడం, తన అనుచరుడని తెలిసి కూడా కేసు పెడతావా అంటూ ఎస్ఐ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చట్ట ప్రకారం నడుచుకున్న ఎస్ఐపై తన అనుచరుడితో వేధింపులు ఫిర్యాదు ఇప్పించి వీఆర్‌కు పంపించేశారు. ఎస్సైని కూడా వీఆర్లోకే... ∙భూ లావాదేవీలకు అడ్డుపడుతున్నాడనే కారణంతో దళితుడైన కొత్తపల్లి తహసీల్దారు పినిపే సత్యనారాయణపై కేసు నమోదుకు కూడా ఆ ముఖ్య నేత వెనుకాడ లేదంటే అతని వేంధిపులు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తహసీల్థార్పై కేసు నమోదు చేయమన్నప్పటికీ మండల మెజిస్ట్రేట్ కావడంతో తటపటాయించిన పిఠాపురం టౌన్ ఎస్సై సన్యాసి నాయుడును కూడా వి.ఆర్‌లో పెట్టించారు. అడ్డగోలుగా పట్టాలు ఇవ్వనందుకే బదిలీ వేటు ∙ పిఠాపురం జగ్గయ్య చెరువులో ఇళ్ల పట్టాలు తన అనుచరుల పేరున రాసివ్వాలని ఆ ముఖ్యనేత తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. తాను ఆపని చేయలేనన్న అప్పటి తహసీల్దారు రియాజ్ హుసేన్‌పై బదిలీ వేటు వేయించారు. అనంతరం వచ్చిన తహసిల్థార్పై ఒత్తిడి తెచ్చి 700 పట్టాలు రద్దు చేయించడం, వాటిలో ఉన్న నిరుపేదల కట్టడాలను అడ్డగోలుగా కూల్చివేత యత్నాలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తేవడంతో ఆ ముఖ్యనేత తోకముడవక తప్పింది కాదు. అగ్నిమాపక శాఖనూ వదలని వైనం.. ∙అగ్నిమాకశాఖ శకటాలకు ఉన్న ఇంజిన్లతో పంట పొలాలకు నీరు తోడించడమనే కొత్త సంప్రదాయానికి కూడా ఆ ముఖ్యనేతకే చెల్లింది. అగ్నిప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు మాత్రమే వినియోగించే అగ్నిమాపకశాఖ సేవలను ఇష్టారాజ్యంగా సోమవారం పొలాలకు నీరు తోడడానికి వినియోగించడంతో ఆ శాఖ సిబ్బందిపై ఎంత ఒత్తిడి తెచ్చారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయం ‘సాక్షి’లో ప్రచురితమవడంతో ఉన్నతాధికారుల జోక్యంతో చివరకు మంగళవారం నిలిపివేశారు. ఇలా కోతికి కొబ్బరికాయ దొరికిన చందంగా అధికారం ఉందికదా అని కుప్పి గంతులేస్తూ అధికార గణాన్ని ఇబ్బందుల చేస్తున్న ఎమ్మెల్యే వర్మ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే మెుండిపట్టుదలతో నిలిచిన ఓ నెల జీతాలు గొల్లప్రోలు మండల విద్యాశాఖాధికారిగా తునికి చెందిన ఒక స్కూల్ అసిస్టెంట్‌ను నియమించేందుక మాట ఇచ్చారు. దీని వెనుక ఆమ్యామ్యాల ఒప్పందం కుదరడంతో గొల్లప్రోలులో పనిచేస్తున్న ఎంఈఒను సెలవుపై వెళ్లిపోవాలని ఒత్తిడులు పెట్టారు. సెలవు అనంతరం తిరిగి జాయిన్ చేసుకోకుండా మోకాలడ్డుతున్న కారణంగా గతనెల గొల్లప్రోలులో 122 మంది ఉపాధ్యాయుల జీతాలు నిలిచిపోయాయి. ఎంఈఓను జాయిన్ కానీయకుండా... తన అనుచరులు చెప్పిన పనులు చేయడం లేదనే కారణంతో పిఠాపురం ఎంఈఓ రమణమ్మపై కక్షకట్టి బదిలీపై వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. సెలవు ముగించుకుని తిరిగొచ్చిన ఆమెను జాయిన్ చేసుకోవద్దని ఎంపీడీఓ సుబ్బారావుకు తనదైన శైలిలో హుకుం జారీ చేశారు. ఉన్నతాధికారులు చెప్పారా లేదా అని వెనుకాముందు చూసుకోకుండా ముఖ్యనేత చెప్పినట్టే సెలవు నుంచి తిరిగొచ్చిన ఆమెను జాయిన్ చేసుకోడానికి నిరాకరించిన ఎంపీడీఓ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అనివార్యంగా ఆమెను జాయిన్ చేసుకున్నారు.