MLC constituency
-
తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక.. మీకెందుకు ఓటెయ్యాలి..?
సాక్షి, హైదరాబాద్: ‘మహబూబ్‌నగర్– హైదరాబాద్– రంగారెడ్డి’ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నిక దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. విద్యాశాఖలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో.. ఓటర్లను ఆకట్టుకోవడం తలనొప్పిగా మారుతోంది. బదిలీలు, పదోన్నతులు పూర్తవకపోవడం, 317 జీవో ద్వారా టీచర్లు ఇష్టంలేని ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం, భాషా పండితుల వివాదం వంటివి ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రభావం చూపుతున్నాయి. ఉపాధ్యాయులకు ఫలానా మేలు చేశామని నేతలు బలంగా చెప్పుకొని ఓట్లు అడిగే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. అభ్యర్థులు ఎక్కడికెళ్లినా.. ఓటెందుకు వేయాలని, సమస్యలు ఏం పరిష్కరించారని నిలదీస్తున్న పరిస్థితి ఎదురవుతోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. దీనికి తగిన సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు. అంతేకాదు టీచర్ల అసంతృప్తికి ప్రభుత్వ నిర్ణయాలే కారణమని వివరించేందుకు అనుకూల సంఘాలు ముందుకురాని పరిస్థితి. సంఘాల నేతలతో కలసి వెళ్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులను ఏదో ఒక సంఘం బలపరుస్తోంది. వారి మద్దతుతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వెళ్లాల్సి వస్తోంది. ఇది కూడా తమకు సమస్యగా మారిందని అభ్యర్థులు చెప్తున్నారు. ఏళ్ల తరబడి బదిలీలు, పదోన్నతులు జరగలేదు. ఎన్నికల ముందు షెడ్యూల్ ఇచ్చినా రోజుకో వివాదం వెంటాడుతోంది. వేసవి సెలవుల వరకు ఈ ప్రక్రియ ముందుకు సాగేట్టు కన్పించడం లేదు. కొంతమందిని మాత్రం రాజకీయ పైరవీలతో బదిలీలు చేశారు. ఏ ఉపాధ్యాయ సంఘం కూడా ఈ పైరవీ బదిలీలను గట్టిగా వ్యతిరేకించిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో సంఘాల నేతలపై టీచర్లు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు కోర్టు వివాదాల నేపథ్యంలో బదిలీలు, పదోన్నతులకు నోచుకోని భాషా పండితుల్లో సంఘాల పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. స్పౌజ్‌లు, నాన్–స్పౌజ్, 317 జీవో ద్వారా బదిలీ అయిన టీచర్లు సంఘాల నేతలను నిలదీసేందుకు ఇదే అవకాశంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో సంఘాల నేతలను ప్రచారానికి తీసుకెళ్తే ప్రతికూలత తప్పడం లేదని అభ్యర్థులు చెప్తున్నారు. రకరకాల హామీలు ఇస్తున్నా.. పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో టీచర్ ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల నాటికే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ తెప్పించిన ఘనత తమదేనని ప్రభుత్వ సానుకూల టీచర్ సంఘాలు చెప్తున్నాయి. తాము మద్దతిస్తున్న అభ్యర్థులను గెలిపిస్తే ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తమదని అంటున్నాయి. మరోవైపు ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్ రావడానికి తమ పోరాటాలే కారణమని, ప్రతీ సమస్య పరిష్కారంలో తామే ముందుంటున్నామని మరికొన్ని సంఘాలు ఓటర్లకు వివరిస్తున్నాయి. ఇక స్వతంత్రంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రం.. ప్రభుత్వంపై, సంఘాలపై టీచర్లలో నెలకొన్న అసంతృప్తి తమకు కలసివస్తుందని భావిస్తున్నారు. పోటీ ఎక్కువగానే.. ‘మహబూబ్‌నగర్– హైదరాబాద్– రంగారెడ్డి’టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో 29,501 ఓట్లు ఉన్నాయి. ఇందులో 15,425 పురుష, 14074 మహిళా టీచర్లు ఉన్నారు. ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. సోమవారం నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురి పేర్లను ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థిగా పాపన్నగారి మాణిక్ డ్డి, పీఆర్టీయూ టీఎస్ నుంచి గుర్రం చెన్నకేశవరెడ్డి, ఎస్టీయూటీఎస్ నుంచి బి.భుజంగరావు, పీఆర్టీయూ తెలంగాణ నుంచి కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, టీపీటీఎఫ్ నుంచి వినయబాబు, బీజేపీ మద్దతులో ఎవీఎన్ రెడ్డి, జీటీఏ నుంచి కాసం ప్రభాకర్, ఎల్సీ జీటీఏ నుంచి ఎస్.రవీందర్, బీసీటీఏ నుంచి విజయకుమార్, టీయూటీఎఫ్ నుంచి మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. సాంకేతిక విద్యాసంస్థల్లోని అధ్యాపక ఓట్లనే నమ్ముకుని బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థిగా అయినేని సంతోష్ కుమార్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి బరిలోకి దిగుతున్నా.. సమర్థించే సంఘాలు కన్పించడం లేదు. -
కరీంనగర్: అజ్ఞాతంలోకి రెబెల్స్.. మాజీ మేయర్ ఫోన్ స్విచ్ఛాఫ్
సాక్షి, కరీంనగర్: జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్సీ బరిలో నిలుచున్న పలువురు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండడంతో ఎక్కడికి వెళ్లారన్నది అంతుపట్టని విషయంగా మారింది. వారితో సంప్రదింపులు జరిపేందుకు ఎమ్మెల్యేలు, మంత్రి గంగుల కమలాకర్ రంగంలోకి దిగారు. పార్టీ అభ్యర్థులుగా భానుప్రసాద్, ఎల్.రమణ బరిలో ఉన్నా.. ఎమ్మెల్సీ బరిలో నిలుచున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ఎమ్మెల్సీ పదవి ఆశించ భంగపడ్డ నేత కావడంతో తన భవిష్యత్తుపై స్పష్టమైన హామీ లభించేంత వరకు తాను బయటికి వచ్చేది లేదని సన్నిహితులకు చెప్పినట్లు తెలిసింది. చదవండి: ఆసుపత్రిలో చేరిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం ఇదే సమయంలో ఎమ్మెల్సీ బరిలో నిలుచున్న ఇండిపెండెంట్ అభ్యర్థులతో రవీందర్‌సింగ్ తెరవెనుక మంతనాలు సాగిస్తున్న విషయం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో బుధవారం పలువురు అసంతృప్త, బరిలో నిలిచిన నేతలు, వారి మద్దతుదారులతో రవీందర్‌సింగ్ రహస్యంగా సమావేశమయ్యారు. వేములవాడలో కొందరు నేతలతో రహస్యంగా నిర్వహించిన సమావేశం తాలూకు ఫొటోలు ఈ ప్రచారానికి ఊతమిస్తున్నాయి. ఇక సిరిసిల్లలో మాదాసి వేణు నామినేషన్ ఆమోదం పొందింది. ఈయన కూడా ఎంపీటీసీల ఆత్మగౌరవం నినాదంతోనే ఎమ్మెల్సీ బరిలోకి దిగుతున్నారు. చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్ ఎన్నికై మూడేళ్లవుతున్నా.. పైసా విదల్చని పదవులు ఉండి ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇతని అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన పలువురు నేతలు కూడా ఎవరికీ అందుబాటులో లేరు. వేణును బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మరోవైపు జగిత్యాల జిల్లా ఎంపీటీసీల గౌరవ అధ్యక్షుడు నగేశ్ యాదవ్ వీడియో వైరల్‌గా మారింది. అధికారాలు లేని తమ ఎంపీటీసీ వ్యవస్థను రద్దు చేయాలని లేదా తమకు ప్రభుత్వం కేటాయించిన రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి అభ్యర్థి కోసం యత్నాలు..! ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బరిలో ఉన్న ఇండిపెండెంట్లు, రెబెల్స్ అంతా ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెబెల్స్ మంతనాలు ప్రారంభించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే క్రమంలో విడిపోయి పోటీ చేస్తే ప్రయోజనం ఉండదని, వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉమ్మడి అభ్యర్థిగా తనకు మద్దతు ఇవ్వాలని రవీందర్‌సింగ్ వేములవాడలో పలువురు అసంతృప్త నేతలను కలిసి విజ్ఞప్తిచేశారు. ఈ విషయంలో రేపు సాయంత్రానికి లేదా ఎల్లుండి ఉదయానికి స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. శిబిరాన్ని సందర్శించిన మంత్రి హైదరాబాద్ వెళ్లిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల విడిది శామీర్‌పేటలోని ఓ రీసార్ట్‌ను మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారని తెలిసింది. ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడారని.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా వారితోనే ఉన్నారని సమాచారం. మరోవైపు శిబిరాల్లో ఉన్న నేతలు తమకే ఓటు వేస్తారా? లేక ఎదురు తిరుగుతారా? అన్న భయం గులాబీ సీనియర్ నేతలను వెంటాడుతోంది. ఎంపీటీసీలు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వీరు పార్టీ అభ్యర్థులకు కాకుండా ఇతరులకు ఓటేయకుండా వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు గులాబీ నేతలు. బరిలో 24 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల స్క్రూటినీ (నామినేషన్ల పరిశీలన) ముగియగా.. ముగ్గురి నామినేషన్లు తిరస్కరించినట్లు బుధవారం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రకటించారు. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 27 మంది అభ్యర్థులు 53 నామినేషన్లు సమర్పించారని, వాటిలో నుంచి శ్రీకాంత్ సిలివేరు, రాజు పిడిశెట్టి, వేముల విక్రమ్ రెడ్డి నామినేషన్లు తిరస్కణకు గురైనట్లు చెప్పారు. బరిలో 24 మంది ఉన్నట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం, శుక్రవారం రెండు రోజుల గడువు ఉందని వివరించారు. ఓటు మాదే.. సీటు మాదే.. ఎంపీటీసీల ఆత్మగౌరవం నిలిపేందుకు తాను ఎమ్మెల్సీ బరిలో నిలిచానని రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఎంపీటీసీలకు న్యాయంగా రావాల్సిన నిధులను గ్రామపంచాయతీలకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ ఖజానాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన తాము.. వారికి ఏ పనీ చేయలేక ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీలకు నిధులు, విధులు, పూర్వపు అధికార వైభవం తీసుకొచ్చేందుకు తాను పోటీ చేసి తీరుతానని తెలిపారు. తమ ఓట్లతో పారిశ్రామిక వేత్తలకు సీట్లు ఎలా ఇస్తారని నిలదీశారు. సీనరేజీ గ్రాంట్లు, వెహికిల్స్ అలవెన్స్, ఈజీఎస్ ఫండ్స్, స్టాంప్ డ్యూటీల ద్వారా వచ్చే నిధులను తమకు రాకుండా మళ్లించడం ఎంత మేరకు న్యాయమని, తమ గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. తమ ఆత్మగౌరవం నిలవాలంటే తామే బరిలో ఉంటామని, ఓటు మాదే–సీటు మాదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీల ఆత్మగౌరవం కాపాడే బాధ్యత తనపై ఉందన్నారు. -
ఎవరి ధీమా వారిదే..
సాక్షి ప్రతినిధి,నల్లగొండ: వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఆదివారం పోలింగ్ ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులు వారి వారి అంచనాల్లో నిమగ్నమయ్యారు. అధికార టీఆర్ఎస్తోపాటు బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో 60 శాతం పోలింగ్ జరగడంపై పార్టీల్లో చర్చ జరుగుతోంది. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 50శాతానికి అటూ ఇటుగా పోలింగ్ నమోదు అయింది. ప్రాథమిక అంచనాల ప్రకారం టీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని, కాంగ్రెస్, లెఫ్ట్ అభ్యర్థులు తమవంతు ఓట్లను సాధించుకుంటారనే చర్చ జరుగుతోంది. శ్రీహరికి.. ఓటే లేదట! హన్మకొండ: ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ విషయంలో చేదు అనుభవం ఎదురైంది. పోలింగ్ సమయానికి తన ఓటు ఏ బూత్‌లో ఉందో చూసుకునే సరికి ఎక్కడా కనిపించలేదు. గత పట్టభద్రుల పోలింగ్‌లో కడియం ఓటేశారని, ఇప్పు డు ఎందుకులేదని కొందరు అధికారులను అడగడంతో వారు ముందు ఆందోళన పడ్డారు. ఎందుకైనా మంచి దని.. పాత ఓటర్ల జాబితా, ప్రస్తుత ఓటర్ల ముసాయిదా జాబితా అన్నింటిని పూర్తిగా పరిశీలించారు. వాటిలో కడియం ఓటు లేదు.