MLC Prabhakar
-
కేసీఆర్ ఇష్టంతో కేటీఆర్ ఎమ్మెల్యే కాలేదు
-
కేసీఆర్ ఇష్టంతో కేటీఆర్ ఎమ్మెల్యే కాలేదు
‘ఫ్యూచర్ పర్ఫెక్ట్–కేటీఆర్’ పుస్తకావిష్కరణలో ఎమ్మెల్సీ ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: ‘‘రాజకీయ నాయకుల వారసులు ఇప్పుడు వచ్చినంత తేలిగ్గా కేటీఆర్ రాజకీయాల్లోకి రాలేదు. కేసీఆర్ ఇష్టంతో ఆయన ఎమ్మెల్యే కాలేదు. ఆయనకు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వని రోజులు కూడా ఉండేవి. అయినా కేటీఆర్ కష్టపడి, ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చారు తప్ప కేసీఆర్ ప్రోత్సహించి రప్పించలేదు’’అని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుపై తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ దిలీప్ కొణతం రచించిన ‘ఫ్యూచర్ పర్ఫెక్ట్ కేటీఆర్’ పుస్తకాన్ని సోమవారం జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలసి ఆవిష్కరించారు. ప్రభాకర్ మాట్లాడుతూ కేటీఆర్‌లో తొలుత వీసమెత్తు కూడా రాజ కీయ లక్షణాలు కనిపించలేదని, కానీ 2006 తర్వాత ఆయనలో ఆ లక్షణం కనిపిం చిందని అన్నారు. రామ్మోహన్ మాట్లాడుతూ కొందరు తమ వారసుల్ని రాజకీ యా ల్లోకి తీసుకొచ్చి మంత్రులను చేస్తున్నారని, కానీ కేటీఆర్ అలా కాదని వ్యాఖ్యా నిం చారు. రాష్ట్రం ప్రగతిబాటలో కొనసాగేందుకు కేటీఆర్ చాలా కష్టపడ్డారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణను కాంగ్రెస్ నాశనం చేసింది
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని 42 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణను సర్వనాశనం చేసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. జూన్ 1వ తేదీన సంగారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ సభలో కాంగ్రెస్ టీఆర్ ఎస్పై చార్జీషీట్ పెడతాననడంపై ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘టీఆర్ఎస్పై ఏమని చార్జిషీట్ పెడతారు? కాంగ్రెస్ తమ పాలనలో జరిగిన అన్యాయాలపై చార్జిషీట్ వేస్తుందా? అమిత్ షా టూర్ తో బీజేపీ నేతలు అభాసు పాలయినట్టే కాంగ్రెస్ కూడా రాహుల్ టూర్ తర్వాత అభాసు పాలు కాక తప్పదు? కాంగ్రెస్ పదేళ్ల పాలన అక్రమాలను తెలంగాణ ప్రజలు మరిచి పోలేదు. రాహుల్ కు కాంగ్రెస్ నేతలు అబద్దాలు చెప్పి తప్పుదోవ పట్టించొద్దు..’అని కర్నె పేర్కొన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో మహబూబ్‌నగర్ నుంచి వలసలు ఉండేవని, ఇపుడు వలసలు వాపస్ వచ్చినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై చార్జి షీట్ వేస్తారా అని నిలదీశారు. టీడీపీతో పొత్తు గురించి మాట్లాడిన జైపాల్‌రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నందుకు ఆ పార్టీ నేతలు సిగ్గు పడాలని అన్నారు. తమ సర్వేలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోతారని తేలిం దని.. అది తప్పని ఉత్తమ్ నమ్మితే హుజూర్ నగర్ నుంచి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. -
‘కారెక్కిన’ టీడీపీ ఎమ్మెల్యే సాయన్న
సాక్షి, హైదరాబాద్: టీడీపీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎం.ఎస్. ప్రభాకర్‌లు ‘గులాబీ’ గూటికి చేరారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో గురువారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అధికారిక నివాసంలో తనను కలసిన సాయన్న, ప్రభాకర్లకు కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ ప్రభాకర్‌ను మంత్రి హరీశ్‌రావు వెంట బెట్టుకుని రాగా, ఎమ్మెల్యే సాయన్నను టీడీపీ నుంచి ఇటీవల టీఆర్ఎస్లో చేరిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు వెంటతీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా సాయన్న, ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేసీఆర్ అమలు చేస్తున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలను చూసే తాను టీఆర్ఎస్లో చేరానని, ముఖ్యంగా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం చేస్తున్న కృషి అభి నందనీయమని సాయన్న పేర్కొన్నారు. నిరంతర విద్యుత్, తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం వంటివి తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. టీఆర్ఎస్లో చేరినందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పారు. టీడీపీలో తనకు ఎలాంటి ఇబ్బం దులు కలగలేదని, అన్నివిధాలా తనకు ఆదరణ లభించింద న్నారు. టీడీపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఆ పార్టీని వీడాల్సిన పరిస్థితులు ఎదురవడం తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని... అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తల ఒత్తిడి మేరకే తాను పార్టీ వీడాల్సి వచ్చిందని సాయన్న పేర్కొన్నారు. టీఆర్ఎస్లో చేరినందున టీడీపీకి, టీటీడీ బోర్డు సభ్యుని పదవికి రాజీ నామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌లో అన్యాయం: ఎమ్మెల్సీ ప్రభాకర్ కాంగ్రెస్‌లో కార్యకర్తలు, నాయకులకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ ప్రభాకర్ ఆవేదన చెందారు. కాంగ్రెస్‌ను వీడి, టీఆర్ఎస్లో చేరడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, రాష్ట్ర, గ్రేటర్ అభివృద్ధి కూడా ఆయనతోనే సాధ్యమని బలంగా నమ్ముతున్నానన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేస్తానని ప్రభాకర్ తెలిపారు. -
కాంగ్రెస్, టీడీపీలకు షాక్
-
కాంగ్రెస్, టీడీపీలకు షాక్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ ఎంసీ) ఎన్నికలకు ముందు టీడీపీ, కాంగ్రెస్ లకు షాక్ తగిలింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే జి. సాయన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ గురువారం టీఆరెఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ సమక్షంలో వీరు గులాబీ కండువా కప్పుకున్నారు. పరిస్థితులకు అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీలో చేరారని ఎమ్మెల్యే సాయన్న తెలిపారు. జంటనగరాల్లో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులతో జీహెచ్ ఎంసీలో టీఆర్ఎస్ పుంజుకుంటుందని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీలో ఉన్నప్పటికీ తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదని వాపోయారు. టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు కారు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. -
స్నాచర్ల కట్టడికి చట్టాల్లో సవరణ: నాయిని
సాక్షి, హైదరాబాద్: జంట కమిషనరేట్ల పరిధిలో వరుసగా రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లను కట్టడి చేయడానికి పోలీసు విభాగం అన్ని చర్యలు తీసుకుంటోందని హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారమిక్కడి నాగోలు కో-ఆపరేటివ్ బ్యాంకు కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కాలనీ వెబ్‌సైట్‌ను ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొలుసు దొంగలపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు వారికి తేలిగ్గా బెయిల్ దొరక్కుండా చేసేందుకు కసరత్తు చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలను సవరించాలని నిర్ణయించామని హోం మంత్రి చెప్పారు. -
'కొడుకుల కోసమే ఆస్ట్రేలియా వెళ్లారు'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి రూ.10 లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ ఆరోపించారు. ఆస్ట్రేలియాలో ఉన్న ఇద్దరు కుమారులను కలిసేందుకే సదారాం అక్కడికి వెళ్లారని అన్నారు. కామన్వెల్త్, పార్లమెంటరీ అసోసియేషన్ సమావేశాలను అసెంబ్లీ కార్యదర్శి వెళ్లడమేంటని ఆయన ప్రశ్నించారు. శాసన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ ను తప్పుదోవ పట్టించి ఆస్ట్రేలియాకు తీసుకెళ్లారని ఆరోపించారు. ఆస్ట్రేలియా నుంచి ఆహ్వానం లేకపోయినా తామే వస్తామంటూ లేఖ రాశారని వెల్లడించారు. అసెంబ్లీ కార్యదర్శిగా మరో దఫా ఆయనను కొనసాగించగడం సరికాదన్నారు. సమర్థులైన అసెంబ్లీ అధికారులు చాలా మంది ఉన్నారని, కావాలంటే సదారాంను ఓఎస్డీగా పెట్టుకోవాలని సూచించారు.