MN Roy
-
Manabendra Nath Roy మానవవాద విప్లవకారుడు
ఒక వ్యక్తి శక్తిగా ఎలా మారగలడో తెలుసు కోవాలంటే ఎం.ఎన్. రాయ్ జీవితాన్ని అధ్యయనం చేయాలి. భారతీయుడైన రాయ్, మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాప కుడు (1917) కావడమేమిటీ? ఆయనలోని నిరంతర భావజాల సంఘర్షణ ఆయనను ఏదో ఒక ఆలోచనా ధోరణికి కట్టుబడి ఉండ నివ్వలేదు. ర్యాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాప నతో పాటు భారత రాజ్యాంగ చిత్తుప్రతిని తయారు చేసి ప్రచురించారు. భారత దేశానికి స్వాతంత్య్రం లభించిన సమయానికే ఆయన ‘నూతన మానవ వాదానికి మేనిఫెస్టో’ని (న్యూ హ్యూమనిస్ట్ మేనిఫెస్టో) రూపొందించి విడుదల చేశారు. తను స్థాపించిన ఇండియన్ రినైజాన్స్ ఇనిస్టిట్యూట్ ద్వారా దేశాన్నే కదిలించారు. డెహ్రాడూన్‌లో ఆయన నివాసమున్న చోటు నుండే ఆ సంస్థను నిర్వ హించారు. అది ఆ కాలంలో ‘హ్యూమనిస్ట్ హౌస్’గా పేరు పొందింది. ఉత్తర భారత దేశం నుండే కాకుండా దక్షిణాది రాష్ట్రాల నుండి కూడా ఆయన అనుచరులు, అభిమా నులు అక్కడికి తరలి వెళ్ళారు. మతతత్వ భావనకు వ్యతిరేకంగా పనిచేయడమే తన సంస్థ ప్రథమ కర్తవ్యమ న్నారు రాయ్. అందుకే ‘ఎడ్యుకేట్ ద ఎడ్యు కేటెడ్’ – విజ్ఞానవంతుల్ని వివేకవంతుల్ని చేద్దామన్న ఆలోచనని వ్యాప్తి చేశారు. 1887 మార్చ్ 21న పశ్చిమ బెంగాల్లో రాయ్ పుట్టినప్పుడు పెట్టిన పేరు నరేంద్ర నాథ్ భట్టాచార్య. క్యాలిఫోర్నియాలో ఉండగా అక్కడి నిఘా విభాగాల దృష్టి మరల్చడానికి మానవేంద్ర నాథ్ రాయ్‌గా పేరు మార్చుకున్నారు. 14వ ఏటే అనుశీలన్ సమితిలో చేరారు. అది రహస్యంగా పని చేసే ఒక విప్లవ సంఘం. కొద్ది కాలానికే ఆ సంఘం నిషేధానికి గురయ్యింది. ఆ తర్వాత జతిన్ ముఖర్జీ నిర్వహణలో నడిచే జుగాంతర్ గ్రూపులో చేరారు. ‘జతిన్ ముఖర్జీని కలవడమే తన జీవితంలో ఒక గొప్ప మలుపు’ అని తన గ్రంథం (చైనాలో నా అనుభావాలు)లో రాసుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జుగాంతర్ సభ్యులు ఎన్నో కార్య క్రమాలు చేస్తుండేవారు. ఆ కాలంలో రాయ్ జర్మన్ల సహాయంతో ఇండోనేషియాకు వెళ్ళి వస్తుండేవారు. ఆయుధాలు సమకూర్చు కుని, బ్రిటిష్ పాలకుల్ని తరిమి కొట్టాలన్నది ఆయన ఉద్దేశం.రహస్యంగా అమెరికాలో ఉన్నప్పుడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని ఎవిలిన్ ట్రెంట్‌తో స్నేహం పెరిగి పెండ్లి చేసుకున్నారు. తప్పనిసరై అక్కడి నుండి మెక్సికో చేరుకున్నారు. అక్కడ ఆయనకు తగిన భద్రత, గుర్తింపు లభించాయి. అందుకే ఆయన ‘జ్ఞాపకాల పుస్తకం’లో – మెక్సికో తనకు కొత్త జన్మ నిచ్చిందని రాసుకున్నారు. అక్కడ ఉన్న రోజుల్లోనే మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత మూడేళ్ళకు 1920లో మరో ఆరుగురు నాయకులతో కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించగలిగారు.మానవేంద్ర నాథ్ రాయ్ తర్వాత కాలంలో వ్లాదిమిర్ లెనిన్, జోసెఫ్ స్టాలిన్‌ను కలిసి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్‌లో భాగస్వాము లయ్యారు. 1926లో దాని విధి విధానాల రూపకల్పనలో పాలు పంచుకున్నారు. ఆ విధి విధానాల్ని చైనా కమ్యూనిస్ట్ పార్టీ అవలంబించేట్లు ఒప్పించ డానికి రాయ్ 1927లో చైనా వెళ్ళారు. కానీ, ఆ ప్రయత్నం విఫలమైంది. రాయ్ ఒప్పించ లేక పోయారని కాబోలు, 1929లో ఆయ నను కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ నుండి బహి ష్కరించారు. 1930లో రాయ్ భారత్‌కు తిరిగి రాగానే, ఆయన కోసం గాలిస్తున్న బ్రిటిషు ప్రభుత్వం 1924 నాటి కాన్పూర్ బోల్షివిక్ కుట్ర కేసుతో అరెస్ట్ చేసి ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు నుండి విడుదలై వచ్చాక రాయ్ నాలుగేళ్ళ పాటు ఇండి యన్ నేషనల్ కాంగ్రెస్‌లో సభ్యుడిగా ఉండి బయటపడ్డారు. 1946లో డెహ్రాడూన్‌లో భారతీయ సాంస్కృతిక పునర్వికాస కేంద్రాన్ని స్థాపించారు. ఆ సంస్థ ఆధునిక భౌతిక దృక్కోణంలో మానవవాదాన్ని ప్రచారం చేసింది. చార్వాక, లోకాయత, బౌద్ధ దర్శనాల అధ్యయనానికి వేదిక అయ్యింది. రాయ్ జీవితం నుండి, ఆయన ప్రతిపాదించిన ర్యాడికల్ హ్యూమనిజం నుండి దేశంలోని సోషలిస్ట్లు, కమ్యూనిస్ట్‌లు,కాంగ్రెస్ వాదులు, పార్టీరహిత కార్యకర్తలు ఎంతోమంది ప్రేరణ పొందారు. 1954 జనవరి 25న తన 67వ ఏట గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ‘ఉత్పత్తి చేస్తున్న వారికి ఆర్థిక స్వాతంత్య్ర సాధన’ అన్నది రాయ్ ఆశయాలలో ఒకటి. -వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీతడా. దేవరాజు మహారాజు -
అతడు మానవవాద విప్లవకారుడు!
అలుపెరుగని సత్యాన్వేషి, కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపకుడు, ప్రపంచ మానవ వాద విప్లవకారుడు ఎంఎన్ రాయ్– తీవ్ర జాతీయ వాదంలోంచి, ప్రపంచ కమ్యూనిస్ట్ రాజకీయాలతో మమేకమై, తర్వాత కాలంలో రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడయ్యారు. ఒక వ్యక్తి శక్తిగా ఎలా మారగలడో తెలుసుకోవాలంటే ఎంఎన్ రాయ్ జీవితాన్ని అధ్యయనం చేయాలి. భారతీయుడైన రాయ్, మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుడు (1917) కావడమేమిటీ? విచిత్రమని పిస్తుంది. కానీ అది వాస్తవం. ఆయనలోని నిరంతర భావజాల సంఘర్షణ ఆయనని ఏదో ఒక ఆలోచనా ధోరణికి కట్టుబడి ఉండనివ్వలేదు. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపనతో పాటూ భారత రాజ్యాంగ చిత్తుప్రతిని కూడా తయారు చేసి, ప్రచురించారు. భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన సమయానికే ఆయన ‘నూతన మానవ వాదాని’కి మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేశారు. ఒక జీవితకాలంలో ఒక వ్యక్తి ఇన్ని పనులు ఎలా చేయగలిగా రన్నది అంతుపట్టని విషయం. డెహ్రాడూన్‌లో తన నివాసమున్న చోటనే ‘ఇండియన్ రినైజాన్స్ ఇనిస్టిట్యూట్’ను స్థాపించారు. ఇది ఆ కాలంలో ‘హ్యూమనిస్ట్ హౌస్’గా పేరు పొందింది. భారతీయ సమాజంలో మనువాదుల ప్రభావంతో శతాబ్దాలుగా వేళ్ళూనుకుని ఉన్న మతతత్వ భావనకి వ్యతిరేకంగా పనిచేయడమే తన సంస్థ ప్రథమ కర్తవ్యమన్నారు రాయ్. ఎంఎన్ రాయ్ అసలు పేరు నరేంద్రనాథ్ భట్టాచార్య. 21 మార్చి 1887న పశ్చిమ బెంగాల్ 24 ఉత్తర పరగణాల్లో ఒక పూజారి కుటుంబంలో పుట్టారు. బాల్యంలో తండ్రి దీనబంధు భట్టాచార్య దగ్గరే సంస్కృతం, కొన్ని సనాతన శాస్త్రాలు చదువుకున్నారు. అప్పుడే అతనిలో కొత్త ఆలోచనలు ప్రారంభమయ్యాయి. 14 వ ఏట వెళ్ళి ‘అనుశీలన్ సమితి’ అనే విప్లవ సంస్థలో చేరారు. కానీ కొద్ది కాలానికే ఆ సంఘం నిషేధానికి గురయ్యింది. ఆ తర్వాత జతిన్ ముఖర్జీని కలవడమే తన జీవితంలో ఒక గొప్ప మలుపు – అని తన గ్రంథం (చైనాలో నా అనుభవాలు)లో రాసుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘జుగాంతర్’ సభ్యులు ఎన్నో కార్యక్రమాలు చేస్తుండేవారు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఆ కాలంలో రాయ్ జర్మన్ల సహాయంతో బ్రిటిష్ వాళ్లను తరమడానికి ఆయుధాల సేకరణకు ప్రయత్నించారు. 1916లో రాయ్ అమెరికా చేరుకున్నారు. కానీ, బ్రిటిష్ గూఢచారులు అతని కదలికల్ని గమనిస్తూనే ఉన్నారు. రాయ్ శాన్ఫ్రాన్సిస్కోలో అడుగు పెట్టగానే అక్కడి ప్రాంతీయ వార్తా పత్రికలో రాయ్ గురించి ఓ సంచలన వార్త ప్రచురితమై ఉంది. ‘‘ప్రఖ్యాత బ్రాహ్మణ విప్లవకారుడు, ప్రమాదకారి అయిన జర్మన్ గూఢచారి నరేంద్రనాథ్ భట్టాచార్య అమెరికాలో అడుగు పెట్టాడ’’న్నది ఆ వార్త సారాంశం. దొరక్కుండా ఉండటానికి రాయ్ వెంటనే క్యాలిఫోర్నియాకు వెళ్ళిపోయారు. అక్కడ పేరు మార్చుకుని, మానవేంద్రనాథ్ రాయ్ (ఎంఎన్ రాయ్)గా చలా మణీ అయ్యారు. క్యాలిఫోర్నియా నుండి తప్పనిసరై మెక్సికో చేరుకున్నారు. అనతి కాలంలోనే అక్కడి సోషలిస్ట్‌లతో కలిసి ‘మెక్సికన్ కమ్యూనిస్ట్ పార్టీ’ని స్థాపించారు. ఆ తర్వాత మూడేళ్ళకు 1920లో మరో ఆరుగురు నాయకులతో కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించగలిగారు. రాయ్ తర్వాత కాలంలో లెనిన్, స్టాలిన్లను కలిసి 1926లో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ స్థాపించారు. 1930లో ఆయన భారత దేశానికి తిరిగి రాగానే, బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆరేళ్ళు జైలు శిక్ష విధించింది. ఆ కాలంలోనే రాయ్ తొమ్మిది సంపుటాల ‘‘ప్రిజన్ డైరీలు’’ రాశారు. జైలు నుండి విడుదలైన తరువాత 1946లో రాయ్ డెహ్రా డూన్లో ‘ఇండియన్ రినైజాన్స్ ఇనిస్టిట్యూట్’ స్థాపించారు. ఆ సంస్థ ఆధునిక భౌతిక శాస్త్ర దృక్కోణంలో మానవ వాదాన్ని ప్రచారం చేసింది. పత్రికలు, పుస్తకాలు ముద్రించడం; సభలూ, సమావేశాలే కాదు, కార్యాశాలలు నిర్వహించడం నిరంతరం కొనసాగుతూ ఉండేవి. ఫలితంగానే బలమైన మానవ వాద సాహిత్యం వచ్చింది. రాయ్ జీవితం నుండి, ఆయన ప్రతి పాదించిన రాడికల్ హ్యూమనిజం నుండి దేశంలోని సోషలిస్ట్లు, కమ్యూనిస్ట్‌లు, కాంగ్రెస్ వాదులు, పార్టీ రహిత కార్యకర్తలు ఎంతో మంది ప్రేరణ పొందారు. మతతత్వంపై పోరాడిన రాయ్, 25 జనవరి 1954న తన 67వ ఏట, గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుత క్లిష్ట పరి స్థితుల్లో మానవవాద ఆలోచనా ధోరణిని బలోపేతం చేసు కోవాల్సి ఉంది. ఈ బాధ్యత దేశంలోని యువతరానిదే! దేవరాజు మహారాజు వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు గ్రహీత, జీవ శాస్త్రవేత్త. -
గ్రేహౌండ్స్ పని తీరును అభినందించిన రాయ్
హైదరాబాద్: రాష్ట్రంలో నక్సల్స్ అణచివేతకు పని చేస్తున్న గ్రేహోండ్స్ పని తీరును గవర్నర్ సలహాదారు ఎం.ఎన్. రాయ్ మంగళవారం అభినందించారు. పోలీసు ఆస్తుల విభజనను సమీక్షించిన సందర్భంగా ఆయన ఈ రోజు గండిపేట్, ప్రేమావతి పేటలోని గ్రేహోండ్స్ ప్రధాన కార్యాలయాలను సందర్శించారు. ఆయన వెంట డీజీపీ బి. ప్రసాదరావు, గ్రేహోండ్స్ డీజీపీ జె.వి. రాముడు ఉన్నారు. ఎలాంటి వాతావరణంలో నైనా చురుకుగా పనిచేసే చిచ్చర పిడుగులాంటి గ్రేహౌండ్స్ కమెండోల యాంటి నక్సలైట్ ఆపరేషన్ నైపుణ్యాన్ని చూసి ఆయన అభినందించారు. అపాయెంటెడ్ డే సమీపిస్తున్న కొలది పోలీసుశాఖలో విభజన ప్రక్రియను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హోం,పోలీసుశాఖలను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర గవర్నర్ సలహాదారుడు , ఎం.ఎన్.రాయ్ పోలీసుశాఖకు చెందిన ఆస్తుల పంపకం కోసం వివిధ భవనాలను స్వయంగా మంగళవారం సందర్శించారు. పంపకాల కోసం తీసుకుంటున్న పనులను ఆయన సమీక్షించారు. ఇందులో భాగంగా గత రెండురోజులుగా ఆయన రాష్ట్ర డీజీపీ హెడ్‌క్వార్టర్స్‌లోని వివిధ విభాగాలను తిలకించారు. డీజీపీ కార్యాలయంలోని నాలుగు అంతస్తుల్లో ఉన్న అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీల కార్యాలయాలతోపాటు అదే ప్రాంగణంలోని పోలీసు కమ్యూనికేషన్స్, రైల్వే పోలీసు, పోలీసు రిక్రూట్మెంట్, పోలీసు హౌజింగ్ కార్పోరేషన్ల కార్యాలయాలను రాయ్ సందర్శించారు. అలాగే బేగంపేట్‌లోని గ్రేహౌండ్స్ ప్రధాన కార్యాలయం, యాంటి టైస్ట్ ఆపరేషన్ విభాగం అక్టోపస్ కార్యాలయాలను కూడా రాయ్ సందర్శించారు. చివరిలో ఆయన యాంటి నక్సలైట్ నిఘా విభాగం ఎస్ఐబీ కార్యాలయాన్ని కూడా సందర్శించారు.