mobile screens
-
పాపం కంటిపాపలు
తల్లిదండ్రులకు కంటిపాపలైన చిన్నారుల్లో కంటిచూపు క్రమంగా క్షీణిస్తోంది. సగటున ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు హ్రస్వదృష్టి (దూరంలోని వస్తువులు సరిగా కని్పంచని) సమస్యతో బాధపడుతున్నట్టు అంతర్జాతీయ విశ్లేషణ ఒకటి హెచ్చరించింది. ఆసియాలోనైతే సమస్య మరీ దారుణంగా ఉంది. జపాన్‌లో ఏకంగా 85 శాతం, కొరియాలో 73 శాతం మంది బాలలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆఫ్తల్మాలజీలో తాజాగా ప్రచురితమైన అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు ఖండాల పరిధిలోని 50కి పైగా దేశాల్లో విస్తృతంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆందోళనకర గణాంకాలు వెలుగులోకి వచి్చనట్టు పేర్కొంది. అధ్యయనంలో భాగంగా 50 లక్షలమందికి పైగా బాలలు, టీనేజర్లను పరీక్షించారు. స్కూలు పుస్తకాలతో కుస్తీకి తోడు స్క్రీన్ సమయం విపరీతంగా పెరగడం, ఆరుబయట గడిపే సమయం తగ్గడం పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2050 నాటికి కోట్లాది మంది పిల్లల కంటిచూపు బాగా ప్రభావితం అవుతుందని హెచ్చరించారు. హ్రస్వదృష్టి సాధారణంగా స్కూలుకు వెళ్లడం మొదలు పెట్టే దశలోనే మొదలవుతుంది. కళ్ల ఎదుగుదల ఆగిపోయేదాకా, అంటే 20 ఏళ్లొచ్చేదాకా సమస్య తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. సగం యువతకు సమస్యే → ప్రపంచవ్యాప్తంగా 36 శాతం మంది బాలలు హ్రస్వదృష్టితో బాధపడుతున్నారు. → 1990 నుంచి 2023 మధ్యకాలంలోనే సమస్య ఏకంగా మూడు రెట్లు పెరిగింది. → పిల్లల్లో హ్రస్వదృష్టి ఆసియా దేశాలతో పోలిస్తే ఆఫ్రికా దేశాల్లో ఏకంగా ఏడు రెట్లు తక్కువగా ఉండటం విశేషం. → ఉగాండాలో అతి తక్కువగా కేవలం ఒక్క శాతం మంది పిల్లల్లో మాత్రమే హ్రస్వదృష్టి నమోదైంది. → ఆఫ్రికా దేశాల్లో పాఠశాల విద్య ఆరు నుంచి ఎనిమిదేళ్ల వయస్సులో ప్రారంభమ తుంది. పైగా పిల్లలు ఆరుబయట ఎక్కువగా గడుపుతున్నారు. దాంతో అక్క డ బాలలు, యువకుల్లో సమస్య తక్కువగా ఉంది. → జపాన్‌లో ఏకంగా 85%, దక్షిణ కొరియాలో 73% పిల్లలకు హ్రస్వదృష్టి ఉంది. → చైనా, రష్యాల్లో 40 % కంటే ఎక్కువగా, యూకే, ఐర్లాండ్, అమెరికాల్లో 15 శాతానికి పైగా పిల్లల్లో సమస్య ఉంది. → మిగతా ఖండాలతో పోలిస్తే ఆసియాలో 2050 నాటికి ఏకంగా 69 శాతం మంది హ్రస్వదృష్టి బారిన పడతారు. → అప్పటికి ప్రపంచ యువతలో కనీసం సగానికి సగం ఈ సమస్యను ఎదుర్కొంటారు. → వర్ధమాన దేశాల్లో 2050 నాటికి 40% మంది దీని బారిన పడే అవకాశముంది. → పిల్లలను రెండేళ్ల వయసులోనే బడిబాట పట్టించే సింగపూర్, హాంకాంగ్ వంటిచోట్ల సమస్య విస్తరిస్తోంది. → కోవిడ్ లాక్డౌన్ సమయంలో బాలల్లో హ్రస్వదృష్టి సమస్య బాగా పెరిగింది. → కోట్లాది మంది ఇళ్లకే పరిమితమై స్మార్ట్ ఫోన్లు, టీవీలు విపరీతంగా చూడటం దీనికి ప్రధాన కారణం. అమ్మాయిల్లోనే ఎక్కువ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లోనే హ్రస్వదృష్టి ఎక్కువగా కని్పస్తున్నట్టు అధ్యయనం తేలి్చంది. ‘‘అబ్బాయిలతో పోలిస్తే ఎదిగేక్రమంలో వాళ్లు ఇంట్లో గానీ, స్కూల్లో గానీ ఆటలపై, ఆరుబయట, గడిపే సమయం తక్కువ. వీటికితోడు ఆహారపు అలవాట్లు తదితరాల వల్ల చాలా చిన్నవయసులోనే రజస్వల అవుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వారిలో చాలావరకు టీనేజ్లోనే హ్రస్వదృష్టి బారిన పడుతున్నారు’’ అని పరిశోధకులు పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అరచేతిలో అడిక్షన్
అర్ధరాత్రి.. మీరు గాఢ నిద్రలో ఉన్నారు. ఒక్కసారిగా ఫోన్ మోగడంతో ఉలిక్కిపడి లేచారు. ఈ టైంలో ఫోనా?! ఎవరికి ఏమైందోనన్న ఆందోళనతో మంచం పక్కనే ఉన్న ఫోన్ అందుకుని కంగారుగా స్క్రీన్ వైపు చూశారు. అంతే, ఆశ్చర్యం, కాసింత గందరగోళం.. ఎందుకంటే మీకు అస్సలు ఫోనే రాలేదు. జన సమ్మర్థం ఉన్న ప్రాంతం.. అక్కడ మీరూ ఉన్నారు. అంతలో ఎవరిదో ఫోన్ రింగవుతోంది. ఆ వెంటనే మీ చేయి కూడా మీ జేబులో ఉన్న ఫోన్ మీదికి వెళ్లింది. మీ పక్కనే ఉన్న వ్యక్తి ‘హలో..’ అనడంతో మీకు అర్థమైంది.. రింగైంది మీ ఫోన్ కాదని. అసలు ఆ రింగ్ టోన్ కూడా మీ ఫోన్‌ది కాదు. ఆ విషయం మీకూ తెలుసు.. అయినా రింగ్ వినపడగానే మీ చేయి అలా మీ ఫోన్ మీదికి వెళ్లిపోయింది. ఫుల్ ట్రాఫిక్.. బైక్‌పై వెళుతున్నారు. జేబులో ఉన్న మీ ఫోన్ అప్పటికే రెండు మూడు సార్లు రింగైంది. కానీ ఫోన్ బయటకు తీసి మాట్లాడలేని పరిస్థితి. ఎవరు ఎందుకు కాల్ చేస్తున్నారో అని ఆలోచిస్తూ.. వేగంగా ట్రాఫిక్‌ను దాటి వెళ్లి బైక్‌ను అలా రోడ్డు పక్కన నిలిపి ఫోన్ బయటకు తీసి చూసి షాకయ్యారు. అక్కడ ఎలాంటి కాల్ రాలేదు. మరి రెండు మూడు సార్లు మీరు విన్న ఆ రింగ్ ఎక్కడిది? ఇల్లు.. ఇల్లాలు.. పిల్లలు.. ఓ అందమైన ఇల్లు.. ఆ ఇంట్లో మీరూ, మీ భార్య, ఇద్దరు పిల్లలు. మీరు బయటికి వెళ్లింది మొదలు.. ఇంట్లో ఎదురు చూపులు మొదలవుతాయి. ఉండబట్టలేక పిల్లలు అడిగేస్తారు.. నాన్న ఇంకెప్పుడొస్తారమ్మా? అని. ఆ నాన్న కోసమే ఎదురుచూస్తున్న అమ్మ.. ‘కాసేపట్లో వచ్చేస్తారులే’ అంటూ పిల్లలను సముదాయిస్తుంది. మీరు ఇంట్లోకి అడుగు పెట్టగానే.. ఇక ఆ ఇంట్లో సందడే సందడి. పిల్లల అల్లరితో అది తార స్థాయికి చేరుతుంది. అప్పుడు ఆ ఇల్లు.. నందనవనాన్ని తలపిస్తుంది. గృహమే కదా స్వర్గసీమ అన్న నానుడిని మరిపిస్తుంది. అలాకాకుండా, మీరు ఇంట్లోకి వచ్చీ రావడంతోనే జేబులోంచి మొబైల్ తీసి దానికి అంకితమైపోతే.. గంటల తరబడి దానికే దాసోహమైతే.. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయేంతగా మీ ఫోనే మీకు ప్రపంచమైతే.. మీ ఇల్లాలి సంగతేంటి? నాన్నతో కలిసి అల్లరిచేయడం కోసం ఎదురుచూస్తున్న ఆ పసిబిడ్డల పరిస్థితేంటి? అటు మొబైల్‌తో మీరు.. ఇటు మీ పలకరింపు కోసం నిరీక్షిస్తూ మీ ఇల్లాలు, మీకు బోలెడన్ని కబుర్లు చెప్పాలని పరితపిస్తూ మీ పిల్లలు. ఇంట్లో నలుగురు ఉన్నా.. అంతా నిశ్శబ్ధం! మీకు, మీ భార్యాపిల్లలకు మధ్య అంతులేని అగాథం! కుటుంబానికి టైం కేటాయించడానికి, మొబైల్‌తో టైంపాస్ చేయడానికి మధ్య ఎంత తేడా ఉందో చూడండి.. మనల్ని మనకు కాకుండా చేస్తుంది.. మన చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందంటే యావత్ ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్టే. అవసరం మేరకు దానిని వినియోగించుకుంటే.. అరచేతిలో అద్భుతమవుతుంది. అంతకు మించి అదే పనిగా దానితో కాలక్షేపం చేస్తే మాత్రం అనర్థాలకు మూలమవుతుంది. ఇలా అతిగా ఫోన్ వాడేవారు దానికి బానిసలవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు, యువత పలు మానసిక సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వ్యసనం చాలా ప్రమాదకరం. మన జీవితంపై, మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మనల్ని మనకు కాకుండా చేస్తుంది. మన వారిని మనకు దూరం చేస్తుంది. సెల్‌ఫోనే మనకు జీవితమైనప్పుడు.. ఒంటరి తనాన్ని ఆశ్రయిస్తాం. స్నేహితులకు, బంధువులకు దూరమవుతాం. భార్యాబిడ్డలతోనే ఉంటున్నా.. వారికి అందనంత దూరంలో సెల్‌ఫోన్‌తో సేదదీరుతాం. నిద్ర రాదు.. ఆకలి వేయదు. కళ్లకు తప్ప మెదడుకు పని లేకపోవడంతో మెదడు మొద్దుబారి జ్ఞాపకశక్తి తగ్గడమేగాక.. పలు మానసిక రుగ్మతలకు ద్వారాలు తెరుస్తుంది. ఇలా అయితే బానిస అయినట్టే! మీరు అదే పనిగా ఫోన్ చెక్ చేసుకుంటున్నారా? ఎలాంటి కాల్ రాకుండానే.. వ చ్చినట్టు, ఏ నోటిఫికేషన్ రాకుండానే ఏదో మెసేజ్ వ చ్చినట్టు భ్రమపడుతున్నారా? మీకు ఎలాంటి కాల్ వచ్చే పరిస్థితి లేకున్నా.. ఎవరైనా కాల్ చేస్తారేమోనని ఎదురు చూస్తున్నారా? ఫోన్‌కు మెసేజ్ రావడమే ఆలస్యం.. చేస్తున్న పనిని ఉన్నఫళంగా వదిలేసి క్షణాల్లోనే వాటిని చూసేస్తున్నారా? సోషల్ మీడియాలో గంటల తరబడి గడుపుతున్నారా? అవసరం ఉన్నా లేకున్నా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ లక్షణాలు, లేదా వీటిలో కొన్ని అయినా మీలో కనిపిస్తే.. మీరు స్మార్ట్‌ఫోన్‌కు బానిస అయినట్టే లెక్క. ఒక్కసారి పరీక్షించుకుందాం.. మనం బయటికి వెళ్లేటప్పుడు ఎప్పుడైనా ఓ సారి మొబైల్‌ను ఇంట్లోనే ఉంచుదాం. ఆ తర్వాత మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయో గమనిద్దాం. ఏదో పోగొట్టుకున్నట్టు.. దేని మీదా ధ్యాస లేనట్టు.. చేసే పనిమీద ఏకాగ్రత కుదరనట్టు.. ఫోన్లో మునిగిఉన్న వాళ్లను చూస్తే ఉక్రోషం తన్నుకొస్తున్నట్టు.. ఆకలేస్తున్నా అన్నం తినబుద్ధికానట్టు.. చికాకు.. చిరాకు.. పిచ్చెక్కుతున్నట్టు.. వెంటనే ఇంటికి వెళ్లి ఫోన్ తీసుకోవాలని తెగ ఆరాటపడిపోతున్నట్టు.. ఇలా మనలో మెదులుతున్న ఆలోచనల స్థాయిని బట్టి తెలుసుకోవచ్చు.. మనం ఏ స్థాయిలో మొబైల్‌కు బానిసయ్యామో. ఫోన్‌కు బానిసవ్వడం అన్నది తీవ్రంగా ఉందనిపించినప్పుడు వెంటనే మానసిక నిపుణుడిని సంప్రదించాలి. సైకలాజికల్ కౌన్సెలింగ్ అవసరం ప్రతి దానికి సెల్ ఫోన్ మీద ఆధారపడటం ఎక్కువైంది. ఈ అడిక్షన్ అనేది.. సెల్‌ఫోన్ లేకుంటే రోజు గడవదేమో అన్న స్థితికి చేరుకుంది. కొద్దిసేపు మొబైల్ కనపడకపోయినా, చార్జింగ్ పెట్టుకునే సౌకర్యం లేకపోయినా ఆందోళనకు గురవుతున్నారు. ఫోన్ రింగ్ కాకున్నా రింగ్ టోన్ వినిపిస్తున్నట్టు అనిపించడాన్ని రింగ్సైటీ అంటారు. అదేపనిగా ఫోన్ వినియోగించడం వల్ల, ఇన్ఫర్మేషన్ ఓవర్ లోడ్ వల్ల ఈ సమస్య సంభవిస్తుంది. ఈ సమస్యకు సైకలాజికల్ కౌన్సెలింగ్ అవసరం. – ఎం.లహరి, సైకాలజిస్ట్ నోటిఫికేషన్లు ఆపేద్దాం.. మన పనిలో మనం తలమునకలై ఉన్నప్పుడు ఫోన్‌కు వచ్చే అనవసర నోటిఫికేషన్లు మన ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. వాటి ప్రభావం మన పనితీరుపైనా పడుతుంది. ఫోన్‌కు నోటిఫికేషన్ రాగానే ఏదైనా ముఖ్యమైన మెస్సేజ్ వ చ్చిందేమోనని తెగ ఆరాటపడిపోతాం. అందుకే సోషల్ మీడియా యాప్‌లకు సంబంధించిన అన్ని నోటిఫికేషన్లను ఆఫ్‌లో పెట్టుకోవడం ఉత్తమం. అంతకు మించి సమయం ఇవ్వొద్దు.. రోజుకు ఎంత సేపు స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం.. ఏయే యాప్‌లలో ఎక్కువసేపు గడుపుతున్నామో స్పష్టంగా తెలుసుకోవాలి. ఇందుకోసం మన మొబైల్లోనే ఆప్షన్లుంటాయి. మొబైల్ స్క్రీన్‌పై మనం గడుపుతున్న సమయాన్ని వాటి సాయంతో అంచనా వేస్తూ.. మన అవసరం మేర మాత్రమే ఫోన్‌ను వినియోగిస్తూ.. ఫోన్ వాడకం సమయాన్ని క్రమంగా తగ్గించుకుందాం. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం.. సాధారణంగా మనం ఖాళీగా ఉన్నప్పుడే స్మార్ట్ ఫోన్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాం. అలాగే వీకెండ్లలో వీడియోలు చూస్తూనో, గేమ్‌లు ఆడుతూనో లేదా ఫ్రెండ్స్‌తో చాటింగ్‌లు చేస్తూనో గంటల తరబడి గడిపేస్తాం. అలా కాకుండా ఖాళీ వేళల్లో,సెలవులు, వీకెండ్లలో విశ్రాంతి తీసుకోవడం, స్నేహితులను కలవడం, లేదా కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లడం వంటి కార్యక్రమాలు పెట్టుకోవాలి. ప్రతి సమాచారానికి ఫోన్ల మీదే ఆధారపడకుండా.. పుస్తకాల నుంచీ పొందుతుండాలి. బెడ్‌కు దూరంగా.. మొబైల్ మనకు పక్కనే ఉంటే దానిని వాడాలనిపిస్తుంది. నిద్రపట్టకపోయినా, మెలకువ వచ్చినా.. పక్కన ఫోన్ ఉంటే ఇట్టే అందుకుంటాం. ఈ అలవాటును అధిగమించాలంటే మన బెడ్‌కు దూరంగా.. మన చేతికి అందనంత దూరంలో ఫోన్ పెట్టుకోవడం ఉత్తమం. అసలు స్విచ్ఛాఫ్ చేసుకుంటే మరీ మేలు. – తమనంపల్లి రాజేశ్వరరావు,ఏపీ సెంట్రల్ డెస్క్ -
స్క్రీన్కు అతుక్కుంటే ప్రమాదమే!
న్యూఢిల్లీ: పన్నెండేళ్లలోపు చిన్నారులు ఎక్కువ సేపు స్క్రీన్లకు అతుక్కుపోతే మెదడు పనితీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గత 23 సంవత్సరాలపాటు 30,000 మంది చిన్నారుల మెదడు ఇమేజ్‌లను విశ్లేషించి సంబంధించిన సమగ్ర అధ్యయనాన్ని హాంకాంగ్, చైనా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల బృందం బహిర్గతంచేసింది. చిన్నారుల మెదడు సంక్లిష్ట అభివృద్ది క్రమంపై ‘డిజిటల్’ ప్రభావం స్థాయిని లెక్కించేందుకు ఈ అధ్యయనం చేపట్టారు. మెదడు అభివృద్ధి చెందే క్రమంలో కొత్త రకం పనులు చేయాల్సి వచ్చినపుడు న్యూరాన్ల నెట్వర్క్ ఏ మేరకు మార్పులకు లోనవుతుందనే అంశాలనూ శాస్త్రవేత్తలు పరిశీలించారు. రీసెర్చ్ కోసం చిన్నారి మెదడు 33 విభిన్న ఇమేజ్‌లను విశ్లేషించారు... ► ఎక్కువ సేపు టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటంతో 12 ఏళ్లలోపు చిన్నా రుల మెదడు పనితీరు ప్రభావితమవుతోంది ► దీంతో మెదడు పైపొర కార్టెక్స్లో నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయి ► జ్ఞాపకశక్తి, ప్లానింగ్ సామర్థ్యం, స్పందించే గుణంలో మార్పులు వస్తున్నాయి ► దీంతో స్పర్శ, ఒత్తిడి, వేడి, చల్లదనం, నొప్పి వంటి ఇంద్రియ సంబంధ అంశాలను మెదడు ప్రాసెస్ చేసే విధానంలోనూ మార్పులు కనిపించాయి ► జ్ఞాపకశక్తి, వినడం, భాష వంటి వాటిని గుర్తుంచుకునే మెదడు భాగంలో నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి ► దృశ్య సమాచారాన్ని సరిపోల్చే మెద డు భాగంలో భౌతిక మార్పులు కనిపించాయి ► ముఖ్యంగా ‘ట్యాబ్’ను వినియోగించే వారి మెదడు పనితీరు, సమస్యల పరిష్కార సామర్థ్యం బాగా తగ్గిపోయాయి. ► మేథస్సు, మెదడు పరిమాణం తగ్గిపోవడానికి వీడియో గేమ్స్, అత్యధిక ఇంటర్నెట్ వినియోగమే కారణమని రీసెర్చ్ వెల్లడించింది. ► డిజిటల్ అనుభవాలు చిన్నారుల మెదడులో మార్పులు తెస్తున్నాయని అధ్యయనం కరస్పాండింగ్ రచయిత, హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన హూయిలీ చెప్పారు. -
గుడ్ న్యూస్.. ఇక ఫోన్ స్క్రీన్ పగలదు
ఎంత కొత్త మోడల్ కొన్నా.. ఎంత ఖరీదైన ఫోన్ కొన్నా.. ఒక్కసారి కిందపడిందంటే స్క్రీన్ గ్లాస్ పగలడం ఖాయం. ఫోన్ స్క్రీన్ అనే కాదు.. గాజు ఏదైనా కాస్త ఒత్తిడిపడితే పుటుక్కుమంటుంది. కానీ అత్యంత గట్టిగా ఉండి ఓ మోస్తరు ఒత్తిడి తట్టుకునే సరికొత్త గాజు త్వరలోనే అందుబాటులోకి రానుంది. కెనడాకు చెందిన మెక్‌గిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. సాధారణ గాజును, ఆక్రిలిక్ (దృఢంగా ఉండే పారదర్శక ప్లాస్టిక్)ను కలిపి ఈ సరికొత్త గాజును రూపొందించారు. సాధారణ గాజుతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ ఒత్తిడిని తట్టుకుంటుందని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త అలెన్ ఎర్లిచర్ తెలిపారు. ముత్యాల తరహాలో.. ఆల్చిప్పల్లో ముత్యాలు రూపొందే పద్ధతి ఆధారం గానే శాస్త్రవేత్తలు సరికొత్త గ్లాస్‌ను తయారు చేశారు. ఆల్చిప్పల లోపలి వైపు ‘నెక్ర్’గా పిలిచే పదార్థం ఉంటుంది. పెళుసుగా ఉండే కాల్షియం కార్బోనేట్ పదార్థం, సాగే గుణమున్న ఆర్గానిక్ (కొన్ని రకాల ప్రొటీన్లు) పదార్థం కలిసి ‘నెక్ర్’గా రూపొందుతాయి. దీనితో రూపొందే ఆల్చిప్పలు, ముత్యాలు దృఢంగా ఉంటూనే.. ఒత్తిడిని తట్టుకోగలుగుతాయి. ఈ నిర్మాణాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. పెళుసుగా ఉండే గాజును, సాగే గుణమున్న ఆక్రిలిక్‌ను కలిపి దృఢమైన గ్లాస్‌ను రూపొందించారు. దీని తయారీ సులువని, ధర కూడా తక్కువని తెలిపారు. స్మార్ట్ఫోన్ల స్క్రీన్లతోపాటు టీవీలు, మానిటర్లు వంటివాటికి ఈ గాజును వినియోగించవచ్చన్నారు. -
మొబైల్ స్క్రీన్ కంటే మరుగుదొడ్డే నయం!
మన రోజువారీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వస్తువుగా మొబైల్ ఫోన్ మారిపోయింది. మనలో చాలా మంది పొద్దున లేవగానే ఫోన్ ఎక్కడుందా అని వెతుక్కుంటాం. ఫోన్ చెక్ చేసుకున్న తర్వాతే మిగతా కార్యక్రమాలు మొదలు పెడతాం. అయితే మనం రోజూ పదులసార్లు టచ్ చేసే మన మొబైల్ స్క్రీన్‌పై టాయ్లెట్లో కంటే మూడు రెట్లు అధికంగా బ్యాక్టీరియా ఉంటుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఫోన్ వినియోగదారుల్లో కనీసం 35 శాతం మంది ఎప్పుడూ తమ మొబైల్ స్క్రీన్లను ఎటువంటి లిక్విడ్లు ఉపయోగించి శుభ్రపరచలేదని ఇంగ్లండ్‌కు చెందిన ‘ఇన్య్సూరెన్స్ టూ గో’ సంస్థ చేసిన పరిశోధనలో వెల్లడైనట్లు స్కై.కామ్ వెబ్సైట్ పేర్కొంది. స్మార్ట్ ఫోన్లు వాడే ఇరవై మందిలో ఒక్కరు మాత్రమే ఆరు నెలలోపు తమ మొబైల్ స్క్రీన్లను శుభ్రం చేసుకుంటున్నారు. ప్రముఖ కంపెనీలకు చెందిన మూడు ఫోన్ల స్క్రీన్లపై ఉన్న బ్యాక్టీరియాను వీరు పరీక్షించారు. ఒక్కో స్క్రీన్‌పై సుమారుగా 84.9 యూనిట్ల క్రిములను గుర్తించారు. స్మార్ట్ ఫోన్ వెనుకవైపు 30 యూనిట్ల క్రిములు, లాక్ బటన్‌పై 23.8 యూనిట్లు, హోమ్ బటన్‌పై సుమారుగా 10.6 యూనిట్ల క్రిములు ఉంటాయని పరిశోధనలో వెల్లడైంది. టాయ్‌లెట్, ఫ్లష్‌పై 24 యూనిట్ల క్రిములు ఉంటాయి. ఆఫీసులో ఉపయోగించే కీ బోర్డులు, మౌస్లపై ఐదుశాతం క్రిములు ఉంటాయి. మొబైల్ ఫోన్ల స్క్రీన్లపై ఉన్న ఈ బ్యాక్టీరియా కారణంగా చర్మసంబంధిత వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పెద్దవాళ్లు ప్రతీ ఐదుగురిలో ఇద్దరు(40 శాతం), 35 సంవత్సరాల లోపు వారు 60 శాతం మంది లేచిన వెంటనే ఐదు నిమిషాల వరకు ఫోన్లతోనే గడుపుతున్నారు. అలాగే పడుకునే ఐదు నిమిషాల ముందు వరకు ఫోన్లను పరిశీలిస్తున్న వారిలోనూ 60 శాతం మంది 35 సంవత్సరాల లోపు వారే ఉన్నారు. -
చూడు.. నువ్వు మాత్రమే చూడు..
బస్సులో లేదా రైల్లో వెళ్తున్నారు.. రద్దీగా ఉంది.. చాలా ముఖ్యమైన మెయిల్ లేదా మెసేజ్ చెక్ చేసుకోవాలి.. మీరు నెట్ ఓపెన్ చేయగానే.. పక్కనున్నవాళ్లు, నిల్చున్నవాళ్లు లుక్కేయడం మొదలుపెట్టారు.. ఇలాంటి సన్నివేశాలు మనం అడపాదడపా చూస్తునే ఉంటాం.. టర్కీలోని బిస్మిల్‌కు చెందిన సెలాల్ గోగర్ మాత్రం చూస్తూ ఊరుకోలేదు. తనక్కూడా ఎదురైన ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని కనిపెట్టాడు. మొబైల్ స్క్రీన్‌పై కనిపించే మెసేజ్‌లు, మెయిళ్లు మనకు మాత్రమే కనిపించేలా చేశాడు. దీని కోసం ప్రత్యేకమైన కళ్లద్దాలను తయారుచేశాడు. మొబైల్ రిపేర్ వ్యాపారంలో ఉన్న సెలాల్ మొబైల్ తో అనుసంధానమై ఉండే కళ్లద్దాలను రూపొందించాడు. మొబైల్లో ఓ ప్రత్యేకమైన చిప్, అద్దాలలో ఓ చిప్ బిగించాడు. దీని వల్ల మిగతావాళ్లు మన ఫోన్ చూసినా.. వారికక్కడ ఇలా అంతా తెల్లగా కనిపిస్తుంది. కళ్లద్దాలు వేసుకున్న మనకు మాత్రమే మొబైల్ స్క్రీన్‌పై ఉన్నది కనిపిస్తుంది. ఈ టెక్నాలజీని ఆన్ఆఫ్ చేయడానికి బ్లూటూత్‌ను వినియోగించాడు. అంటే.. బ్లూటూత్ ద్వారా బటన్ ఆన్ కాగానే.. స్క్రీన్ తెల్లగా అయిపోతుంది. కళ్లద్దాలు పెట్టుకున్న మనకు మాత్రమే వివరాలు కనిపిస్తాయి. ఆఫ్ చేయగానే.. మళ్లీ స్క్రీన్ మీద వివరాలు మామూలుగా అందరికీ కనిపిస్తాయి. అంతేకాదు.. ఈ టెక్నాలజీని బ్లూటూత్‌తో కలిపి కేవలం రూ.700 లోపే అమ్మాలని సెలాల్ యోచిస్తున్నాడు. పేటెంట్ తీసుకునే విషయంలో బిజీగా ఉన్న అతడు త్వరలోనే దీన్ని మార్కెట్లోకి తేనున్నాడు. -
సభకు LEDలు,ప్రత్యేక మొబైల్ స్క్రీన్ల ఏర్పాటు