mode code violation
-
టీడీపీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రవేశ పెట్టిన పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలను ఓటర్లను ప్రలోభపరిచేవిధంగా టీడీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. ఇలా చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ధనం ద్వారా అమలు చేస్తున్న ఈ పథకాలతోపాటు నిరుద్యోగ భృతి కింద యువతకు డబ్బులు చెల్లించేందుకు చంద్రబాబు సర్కారు జీఓలు కూడా జారీచేసిందని తెలిపారు. ప్రస్తుతం అమలవుతోన్న ప్రభుత్వ పథకాలను ప్రకటనలు, వీడియోల ద్వారా ప్రచారం చేసుకోవడం ఎన్నికల నియమాలు ఉల్లంఘించడమేనని.. ఇది ఓటర్లను తప్పుదోవ పట్టించడమేనని వివరించారు. ఇదేవిధంగా తెలుగుదేశం పార్టీ హోర్డింగ్‌ల ద్వారా చేస్తున్న ప్రచారంలో కూడా ఎన్నికల సంఘం నియమ నిబంధనలను ఉల్లంఘించిందని మరో ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు లక్షల రూపాయలు హోర్డింగ్‌ల కోసం ఖర్చు పెట్టవచ్చని అయితే ప్రతి జిల్లాలో టీడీపీ 600 హోర్డింగ్ లను ఏర్పాటుచేసి తద్వారా 66,60,000 వ్యయం చేసిందని వెల్లడించారు. ఆంధ్రజ్యోతి,ఈనాడు దినపత్రికలలో తెలుగుదేశం పార్టీకి మేలు చేసి ఓటర్లను తప్పుదారి పట్టించేవిధంగా పెయిడ్ ఆర్టికల్స్ వస్తున్నాయని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిభందనలకు విరుద్దంగా ఉన్న పెయిడ్ ఆర్టికల్స్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీకి నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
కోడ్ ఉల్లంఘించిన రాహుల్?
-
కోడ్ ఉల్లంఘించిన రాహుల్?
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలో బీజేపీ- కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. నిన్న కాక మొన్న బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ను ఎన్నికల కమిషన్ తీవ్రంగా మందలించగా, ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే కోడ్‌ను ఉల్లంఘించినట్లు కనపడుతోంది. ఆయన మోడల్ కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది. హస్తాన్ని ఇక మీదట కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తుగా ఉండకుండా చూడాలని, దాంతోపాటు జాతీయ పార్టీ గుర్తింపును కూడా రద్దుచేయాలని బీజేపీ కోరింది. జనవేదనా సమ్మేళన్ పేరుతో ఢిల్లీలో ఒక సభ నిర్వహించిన రాహుల్ గాంధీ.. అక్కడ మతపరమైన వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపించింది. శివుడు, గురునానక్, బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు, మహ్మద్ ప్రవక్త అందరూ కాంగ్రెస్ గుర్తు అయిన హస్తాన్నే చూపిస్తారంటూ తమ ఎన్నికల గుర్తు గురించి మతపరమైన ప్రచారం చేసుకున్నారని తెలిపింది. ఫిర్యాదుతో పాటు.. రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన సీడీని కూడా జతచేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ వ్యాఖ్యలు వ్యక్తిగతం అని ఏమీ చెప్పలేదని, అందువల్ల ఆ పార్టీ కూడా తప్పు చేసినట్లే అవుతుంది కాబట్టి పార్టీకి సైతం కోడ్ ఉల్లంఘన వర్తిస్తుందని ఆ ఫిర్యాదులో బీజేపీ తెలిపింది. ఎన్నికల నిబంధనలకు సంబంధించి ఉత్తర్వులలోని 16ఎ, 18 పేరాలను ఉల్లంఘించినందున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తును రద్దుచేయాలని బీజేపీ నేతలు కోరారు.