model market
-
దుక్నం తెరవలె!
సాక్షి, సిటీబ్యూరో: ‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న నానుడిని తలపిస్తున్నాయి మోడల్ మార్కెట్ల తీరు. నిర్మాణానికి నోచుకున్నా వినియోగంలో లేకుండాపోవడంతో ఉసూరుమంటున్నాయి. కోట్లాది రూపాయల వ్యయం చేసినా ఆశించిన ఫలితం చేకూరడంలేదు. గ్రేటర్ నగరంలో పదివేల మందికి ఒక మార్కెట్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకనుగుణంగా వివిధ ప్రాంతాల్లో తొలిదశలో 200 మోడల్ మార్కెట్లను నిర్మించాలనుకున్నారు. ఇందుకు దాదాపు రూ.130 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా వేశారు. ఇప్పటి వరకు 38 మార్కెట్లను నిర్మించారు. కానీ.. వీటిని వినియోగంలోకి తెచ్చారా.. అవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయా? అంటే అదేం లేదు. లబ్ధిదారులకు కేటాయింపులు పూర్తయిన దాదాపు పది మార్కెట్లలో సైతం అన్ని దుకాణాలు వినియోగంలోకి రాలేదు. ఇవి ప్రజలకు ఉపకరించడం లేదు. ఆది నుంచీ ఆటంకాలే.. మోడల్ మార్కెట్ల కేటాయింపుల కోసం నోటిఫికేషన్లు వెలువరిస్తున్నా అద్దె ధరలు ఎక్కువగా ఉన్నాయని చాలా మార్కెట్లలో వ్యాపారాలు నిర్వహించేందుకు ముందుకు రావడం లేరు. ఎస్సీ, ఎస్టీలు, స్వయం సహాయక మహిళా బృందాలకు షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్లున్నా చాలా చోట్ల కేటాయింపులు పెండింగ్‌లోనే ఉన్నాయి. అద్దెల నిర్ణయించారిలా.. మోడల్ మార్కెట్ నిర్మించిన ప్రాంతంలోని స్థలం రిజిస్ట్రేషన్ విలువ, మార్కెట్ నిర్మాణానికి చేసిన ఖర్చులో 15శాతం అద్దె వచ్చేలా ఏడాదికి అద్దె ధరలు నిర్ణయించారు. ఉదాహరణకు స్థలం రిజిస్ట్రేషన్ విలువ, మోడల్ మార్కెట్ నిర్మాణ ఖర్చు వెరసీ మొత్తం రూ.3 లక్షలైతే, సదరు మార్కెట్ ద్వారా ఏటా రూ.3 లక్షల అద్దె వచ్చేలా వాటిల్లోని దుకాణాల విస్తీర్ణాన్ని బట్టి అద్దెలు నిర్ణయించారు. అలా నిర్ణయించిన కనీస ధరకన్నా ఎక్కువ ఉంటే వేలం ద్వారా కేటాయిస్తున్నారు. ఈ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదే విషయాన్ని వివరిస్తూ అద్దె ధర తగ్గించేందుకు అనుమతించాల్సిందిగా ప్రభుత్వానికి నివేదించగా, 15 శాతం స్థానే 10 శాతానికి తగ్గిస్తూ జీఓ జారీ చేసి కూడా దాదాపు రెండేళ్లయింది. అయినప్పటికీ.. దుకాణాలు నిర్వహించేందుకు వ్యాపారుల నుంచి స్పందన కనిపించడం లేదు. అధికారుల అశ్రద్ధ కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. కేటాయించిందీ స్వల్పమే.. ఇప్పటి వరకు నిర్మాణాలు పూర్తయిన 38 మార్కెట్లలోని 571 షాపులకుగాను కేవలం 121 షాపులకే అద్దె ఒప్పందాలు పూర్తయ్యాయి. మిగతా 450 దుకాణాలకు కేటాయింపులే పూర్తికాలేదు. తాజా కూరగాయల్ని ప్రజలకు అందించే ‘మన కూరగాయలు’ కోసం కూడా మోడల్ మార్కెట్లలో ఒక దుకాణాన్ని కేటాయిస్తున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ♦ సికింద్రాబాద్ జోన్ శాంతినగర్‌లోని మోడల్ మార్కెట్ నిర్మాణం పూర్తవడంతోపాటు అందులోని17 దుకాణాలకు వేలం జరగ్గా 7 దుకాణాలకు లీజు అగ్రిమెంట్ కూడా పూర్తయింది. కానీ ఇంతవరకు ఒక్క దుకాణం కూడా తెరచుకోలేదు. ఇలాంటి పరిస్థితే దాదాపుగా మెజారిటీ మోడల్ మార్కెట్లలో నెలకొంది. ♦ అల్వాల్ సర్కిల్లోని రైల్‌నగర్, కౌకూర్లలోని రెండు మోడల్ మార్కెట్లలో ఒక్కోదాంట్లో 15 దుకాణాలకు ఐదు పర్యాయాలు వేలంపాటలు నిర్వహించినా ఎవరూ ముందుకు రాలేదు. ♦ మల్కాజిగిరి సర్కిల్లో 16 దుకాణాలకు పదిసార్లు టెండర్లు పిలిచినా నిర్వహణకు ఎవరూ రాలేదు. ♦ ఎల్బీనగర్ సరూర్‌నగర్‌లోని మోడల్ మార్కెట్లోని 15 దుకాణాలకు వేలం పూర్తయినా డిపాజిట్ల చెల్లింపులు జరగలేదు. అగ్రిమెంట్లు పూర్తికాలేదు. సంతోష్‌నగర్‌లోని నిర్మాణం పూర్తయిన 21 దుకాణాల్లో ఐదింటికి వేలం పూర్తయినా అగ్రిమెంట్లు కాలేదు. ♦ అన్ని మోడల్ మార్కెట్లలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అక్కడ కళకళ.. ఇక్కడ వెలవెల.. ♦ ఇటీవల ప్రగతి భవన్లో పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ వివరించాక జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు నేరుగా వెళ్లి గజ్వేల్‌లోని సమీకృత మార్కెట్‌ను, అందులోని వివిధ దుకాణాలను సందర్శించి అద్భుతమని కీర్తించారు. నగరంలో మోడల్ మార్కెట్లు పూర్తయినా.. దుకాణాలు, వ్యాపారాలు లేక.. ప్రజలు రాక వెలవెలబోతున్నాయి. ♦ సికింద్రాబాద్ మోండా మార్కెట్లో అన్ని రకాల దుకాణాలతో, సకల హంగులతో అభివృద్ధి పరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. -
మోడల్ మార్కెట్ ముందుకు సాగేనా!
భువనగిరి : భువనగిరి వ్యవసాయ మార్కెట్‌ను అన్ని హంగులతో, అత్యాధునిక సదుపాయాలతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు గత కాంగ్రెస్ సర్కార్ 2012 జూన్‌లో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీఓను కూడా జారీ చేసింది. వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని నాటి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందే తడవుగా అధికార యంత్రాంగమూ స్థల సేకరణకు కసరత్తు ప్రారంభించింది. ఇదిగోఅదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప.. రెండేళ్లవుతున్నా స్థల సేకరణ పూర్తి చేయలేదు. మోడల్ మార్కెట్ ఏర్పాటైతే ధాన్యం అమ్ముకోవడానికి, నిల్వ చేసుకోవడానికి ఇబ్బందులు ఉండబోవని ఆశించిన ఈ ప్రాంత రైతాంగానికి నిరాశే మిగిలింది. వర్షం వస్తే ధాన్యం తడవడం, కొట్టుకుపోవడం రైతన్నకు షరా మామూలైంది. ఎంపికైన నాలుగిట్లో భువనగిరి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు అత్యాధునిక వ్యవసా య మార్కెట్లు ఏర్పాటు చేయాలని గత పాలకు లు తలపెట్టిన వాటిలో భువనగిరి ఒకటి. ఇందులో భాగంగా ఈ మార్కెట్లలో విశాలమైన యార్డుతో పాటు ధాన్యం నిలువ చేసేందుకు గోదాంలు, హర్వేస్టింగ్, ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీ గోదాంలు, రైతులకు విశ్రాంతి గదులు, మంచినీటి వసతి, ప్లాట్ ప్లామ్స్, ఆధునిక తూకం యంత్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు అతీగతి లేదు. స్థల సేకరణలో జాప్యం మెడల్ మార్కెట్ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణలో తీవ్రజాప్యం జరుగుతోంది. స్థల సేకరణకోసం అప్పట్లో జాయిట్ కలెక్టర్, మా ర్కెటింగ్ ఉప సంచాలకులు, అర్డీఓ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో కమి టీ కూడా ఏర్పాటు చేశారు. కాగా మార్కెట్‌కు సుమారు 20 ఎకరాలకు పైగా స్థలం సేకరించాలని కమిటీ నిర్ణయించింది. ముందుగా పట్టణంలోని మూడుచోట్ల ప్రైవేట్, ప్రభుత్వ స్థలాలను అధికారులు పరిశీలించారు. ఆ తర్వాత ముగ్దుం పల్లి, అనాజిపురం, తుక్కాపురంలోనూ స్థలాల ను పరిశీలించి వాటిని కొనుగోలు చేయటానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించా రు. చివరకు బొమ్మాయపల్లి శివారులోగల ప్రైవే ట్ స్థలం కొనుగోలు చేయాలని నిర్ణయించి అం దుకు రంగం సిద్ధం చేశారు. అయితే అనంతా రం వద్ద ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండటంతో ప్రైవేట్ స్థలం కొనుగోలు చేసి లక్షల రూపాయలు వృథా చేయడమెందుకని పలువురు ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థలం కొనుగోలుకు కోట్లాది రూపాయలు చెల్లిస్తే మిగతా పనులకు నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉందని భావించిన ఉన్నత అధికారులు నిర్ణయాన్ని మార్చుకున్నారు. అనంతారం శివారులోనే అనువైన స్థలమని.. అనంతారం గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 200లో 30 ఎకరాల స్థలం మోడల్ మార్కెట్ యార్డుకు అనువైన స్థలంగా భూసేకరణ కమిటీ నిర్ధారించింది. ఈ స్థలంలో మార్కెట్ యార్డును అన్ని హంగులతో నిర్మించవచ్చునని అధికారులు భావించారు. అనంతారం స్థలం మార్కెట్ యార్డు ఏర్పాటుకు అనువైనదిగా గుర్తించడం జరిగిందని, ప్రభుత్వం వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉందిని, త్వరలోనే ఆమోదం పొందుతుందని అప్పట్లో భువనగిరికి వచ్చిన జాయింట్ కలెక్టర్ కూడా చెప్పారు. కానీ రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినా ఆ ఊసే ఎత్తడం లేదు. ఏది ఏమైనా ఈ ప్రాంత రైతుల అవసరాలను గుర్తించి మోడల్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ నానాటికీ ఊపందుకుంటోంది. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కూడా అధికారులతో కలిసి అనంతా రం వద్ద స్థలాన్ని పరిశీలించారు. మోడల్ మార్కెట్‌కు కృషి చేస్తా : - పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి భువనగిరిలో మోడల్ మార్కెట్ ఏర్పాటుకు అన్ని విధాలా కృషి చేస్తా. మార్కెట్ ఏర్పాటుకు అవసరమైన 30 ఎకరాల స్థలం కోసం అధికారులతో మాట్లాడుతా. భువనగిరి శివారులో ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని, లేకుంటే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా భూసేకరణ చేస్తాం. ఇందుకు సంబంధించి నిధులు కూడా అందుబాటులో ఉన్నాయి. మోడల్ మార్కెట్‌ను ఏర్పాటు చేసి రైతుల ఇబ్బందులను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. -
మరిసారన్నా..
ఇండోర్ స్టేడియం... దయనీయం క్రీడల అభివృద్ధి కోసం ప్రతిపాదించిన ఇండోర్ స్టేడియం పరిస్థితి దయనీయంగా మారింది. నాలుగేళ్ల క్రితమే నిర్మాణం పూర్తయినా క్రీడాకారులకు ఉపయోగపడడడం లేదు. రూ.3.50 కోట్లతో నిర్మించిన స్టేడియాన్ని కార్పొరేషన్ డంప్ యార్డుగా మార్చారు. ఇటీవలే చెత్త పోయడం నిలిపివేశారు. హన్మకొండ, కాజీపేట వాసులకు ఓపెన్ ఎయిర్ స్టేడియంలు, ఇండోర్ స్టేడియంలు, స్విమ్మింగ్‌ఫూల్ అందుబాటులో ఉన్నాయి. వరంగల్ క్రీడాకారులకు ఆ సౌకర్యం లేకుండా పోయింది. పార్క నో... జిల్లా కేంద్రంలో మహిళల ఆర్థిక స్వావలంబనకు టైక్స్టైల్స్ పార్కు ఏర్పాటు విషయంలో మంత్రి సారయ్య చేస్తున్న చర్యలు ఏమీ లేవు. పార్కు కు కేటాయించిన స్థలం కబాకు గురైంది. మంత్రి నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలున్నాయి. మో‘డల్’ మార్కెట్ వరంగల్ కూరగాయల మార్కెట్ ప్రాంతం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. మార్కెట్లో కనీస వసతులు లేవు. రూ.3 కోట్లతో మోడల్ మార్కెట్‌గా అభివృద్ధి చేస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. ‘నీటి’మూటలే... వరంగల్ ప్రజలకు ప్రతిరోజూ తాగునీరు అందిస్తామని మంత్రి సారయ్య చెప్పిన మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. నగర ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి జైపాల్‌రెడ్డి రూ.178 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఆ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. సదరు కాంట్రాక్టరుకు బిల్లుల చెల్లింపులు జరిగినట్లు తెలిసింది. నాసిరకం పైపులైన్లు, అధికార పార్టీ నేతల, అధికారుల కమీషన్ల కక్కుర్తితో పనులు నాసిరకంగా సాగాయి. నాణ్యతలేని పైపులైన్లతో నగర ప్రజలకు తాగు నీటి కష్టాలు తొలగడంలేదు. కలగానే... మ్యూజియం ఖిలావరంగల్ కోటలో మ్యూజియం నిర్మాణం కోసం ఇప్పటికి మూడుసార్లు శంకుస్థాపన జరిగింది. పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు. గుండు చెరువు సమీప స్థలంలో 2010 మే 26న అప్పటి పర్యాటక శాఖమంత్రి గీతారెడ్డిచే శంకుస్థాపన చేయించారు. స్థల వివాదంతో అది అటకెక్కింది. కోటలోని మరో స్థలంలో 2012 మార్చి 19న శంకుస్థాపన జరిగింది. ఇప్పటికీ ఇది మందుకుపడడంలేదు. అంతరిక్ష విజ్ఞానం అందించే ప్లానిటోరి యం మూతపడింది. కార్పొరేషన్ ప్రాంగణంలో ఉన్న ప్రతాపరుద్ర ప్లానిటోరియం మూడేళ్లుగా తాళం వేసి ఉంది. ప్రొజెక్టర్ కొనలేక పోవడంతో ఈ దుస్థితి దాపురించింది.