mogili
-
చిత్తూరు రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు మరణించడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి కనుమ రహదారిలో బస్సు, రెండు లారీలు ఢీ కొన్న ఘటనలో ఎనిమిది మంది ఘటనా స్ధలంలోనే మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళుతున్న ఆర్టీసీ బస్సును పలమనేరు వైపు నుంచి ఐరన్ లోడుతో వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: విజయవాడలాగే.. ఏలూరు వరదలు మ్యాన్ మేడ్! -
పాప పుట్టిన 13 రోజులకే.. తండ్రీకొడుకుల విషాదం!
సాక్షి, కరీంనగర్: ఆ కుటుంబంలో పాప జన్మించింది.. అందరూ ఆనందంగా ఉన్నారు.. వైద్యులు డిశ్చార్జి చేయడంతో ఇంటి పెద్ద తల్లీబిడ్డను ఇంటికి పంపించాడు.. తర్వాత తన కుమారుడితో కలిసి ఆటోలో వెళ్తుండగా ఇసుక లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరినీ కబళించింది. వివరాల్లోకి వెళ్తే.. వీణవంక మండలంలోని మామిడాలపల్లికి చెందిన దరిపెల్లి జ్యోతి డెలివరీ కోసం కరీంనగర్‌లోని ఆస్పత్రిలో చేరింది. ఈ నెల 14న పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే, జ్యోతికి ఇన్ఫెక్షన్ కావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, వైద్యం చేయించారు. రెండు రోజుల క్రితమే అక్కడి నుంచి కరీంనగర్ ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు సోమవారం డిశ్చార్జి చేశారు. దీంతో జ్యోతి భర్త మొగిలి(45) తన భార్యాబిడ్డను ఆటోలో ఇంటికి పంపించాడు. కుమారుడు శివసాయి(12)తో కలిసి కూరగాయలు, పండ్లు, ఇంటి సామగ్రి తీసుకొని, తన సొంత ఆటోలో మామిడాలపల్లికి బయలుదేరాడు. మానకొండూర్ మండలంలోని రంగపేట వద్ద ఇసుక లారీ వేగంగా వచ్చి, ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మొగిలి, శివసాయి అక్కడికక్కడే మృతిచెందారు. లారీ పైనుంచి వెళ్లడంతో శివసాయి మృతదేహం నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాలను చూసి, కన్నీరుమున్నీరుగా విలపించారు. న్యాయం చేయాలని ఆందోళన.. అనంతరం బంధువులు కరీంనగర్–జమ్మికుంట రహదారిపై ఆందోళన చేపట్టారు. మానకొండూర్, తిమ్మాపూర్ సీఐలు రాజ్‌కుమార్, ఇంద్రసేనారెడ్డిలు విరమించాలని కోరగా తమకు న్యాయం జరిగేవరకు మృతదేహాలను తీసేది లేదని తేల్చిచెప్పారు. ఈ సంఘటనతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచి పోయి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఓవైపు పాప జన్మించడం, మరోవైపు ఇద్దరి ప్రాణాలు పోవడంతో ఆ కుటుంబ పరిస్థితిని చూసి, స్థానికులు కంటతడి పెట్టారు. అతివేగంగా వెళ్తున్న ఇసుక లారీలతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేతల పరామర్శ.. ప్రమాద విషయం తెలుసుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మానకొండూర్ బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఘటనాస్థలికి చేరుకొని, బాధితులను పరామర్శించి, ఓదార్చారు. -
బంగారమ్మ మురుకులకు ‘ఫిదా’ అవ్వాల్సిందే..
స్ఫూర్తి చిత్తూరు జిల్లాలో ‘మొగిలి’ తెలియని వారుండరు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా మొగిలీశ్వరస్వామికి ఎంత పేరుందో, మొగిలిలోని బంగారమ్మ మురుకులకూ అంత పేరుంది. ఆమె తయారు చేసే మురుకుల రుచే వాటికి రాష్ట్రవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చింది. మొగిలి ఊళ్లో నుంచే చెన్నై– బెంగళూరు హైవే వెళ్తుంది. రోడ్డును ఆనుకొనే బంగారమ్మ మురుకుల అంగడి ఉంటుంది. అటునుంచి వెళ్లే ప్రతి కారు, ఇతర వాహనం ఏదైనా ఆగి బంగారమ్మ మురుకులు కొనుక్కొని వెళ్లాల్సిందే. దిన కూలీ అయినా లక్షల జీతం తీసుకునే ఉద్యోగి అయినా వేరుశనగ, బియ్యం పిండి మిశ్రమంతో బంగారమ్మ తయారు చేసే ఆ నోరూరించే మురుకులకు ‘ఫిదా’ అవ్వాల్సిందే. బయటి నుంచి చూస్తే బంగారమ్మ దుకాణం చిన్నదిలా కనిపించొచ్చు.. కొంచెం లోపలికి తొంగి చూస్తే కష్టాన్ని ఎదిరించిన స్ఫూర్తి గాథ కనిపిస్తుంది. పదిమందికి ఉపాధి కల్పించాలన్న తపన తాండవిస్తుంది. కుంగిపోయిన జీవితాన్ని కూడా ఉత్తేజపరిచే స్ఫూర్తిమంతమైన బంగారమ్మ మురుకుల నేపథ్యం సాక్షి పాఠకుల కోసం.. కష్టాల సుడి.. కన్నీటి తడి.. బంగారమ్మకు 16 సంవత్సరాలకే మేనమామ ఆదెన్నతో పెళ్లిజరిగింది. కొద్దికాలం బాగానే ఉన్నా, భర్తకున్న రెండెకరాల పొలంలో వానల్లేక పంటలు పండలేదు. తినడానికి తిండిలేని పరిస్థితిలో కట్టెలు అమ్మింది. వచ్చే ఆదాయం దేనికీ సరిపోకపోవడంతో భర్తతో టీ అంగడి పెట్టించింది. కాలక్రమేణా సంసారం పెద్దదైంది. ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు కుటుంబంలో చేరారు. టీ అంగడిలో వచ్చేది తినేందుకే సరిపోలేదు. దీంతో ఎలాగో కష్టపడి మరికొంత అప్పు చేసి, మురుకుల వ్యాపారం ప్రారంభించింది. ఆమె తయారు చేసిన మురుకులు రుచిగా ఉండటంతో త్వరలోనే వ్యాపారం పుంజుకుంది. చూస్తుండగానే చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసేంతగా ఎదిగింది. వీటిలో వచ్చిన ఆదాయంతోనే ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లూ చేసింది. అంతా బాగుందనుకున్న సమయంలో కూతుళ్లిద్దరూ వైధవ్యంతో తల్లిపంచన చేరారు. ఈ కష్టం నుంచి కోలుకునేలోగానే ఒక కొడుకు రోడ్డు ప్రమాదంలో చని పోయాడు. వృద్ధాప్యంతో మంచాన పడ్డ భర్త, ఇద్దరు కూతుళ్ల బాధ్యత, మతిస్థిమితం లేని కుమారుడు, చనిపోయిన కుమారుడి కుటుంబ బరువు అన్నీ బంగారమ్మ మీదే పడ్డాయి. అయితే కష్టాలకు ఆమె కుంగిపోలేదు. ఎదురు నిలిచింది. కన్నీళ్లను మరచిపోడానికి కుటుంబం మొత్తాన్నీ పనిలో నిమగ్నమయేలా చేసింది. నాణ్యతే ఆమె ట్రేడ్‌మార్క్ ఈ కాలంలో కొంచెం లాభం కనిపించేసరికి ఆశ మొదలవుతుంది. దీంతో కల్తీ చేయడం, నాణ్యత తగ్గించడం లాంటివి చేస్తుంటారు. కానీ బంగారమ్మ నాణ్యతలో ఏ మాత్రం రాజీ పడదు. ముడిసరుకులు స్వయంగా సిద్ధం చేసుకుంటుంది. అందుకే ఇళ్లలో శుభకార్యాలకు, ఇతర ఫంక్షన్లకు అడ్వాన్స్‌లు ఇచ్చి మరీ మురుకులు ఆమె చేత తయారు చేయించుకుంటారు. ఎక్కడెక్కడినుంచో వస్తారు..! తాను తయారు చేసే ఈ మురుకుల రుచి చూడటానికి ఎక్కడెక్కడినుంచో వస్తారని బంగారమ్మ మురిపెంగా చెబుతోంది. ప్రస్తుతం రోజూ రూ.10 వేలకు పైగా వ్యాపారం జరుగుతోంది. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారెవరినీ ఆమె మరచిపోలేదు.కష్టం ఎంతటి వారినైనా కుంగదీస్తుంది. అయితే దాన్ని ఎదిరించి కొత్త తోవ వెతుక్కోవాలనుకుంటే మాత్రం బంగారమ్మ మురుకులు రుచి చూడాల్సిందే – గాండ్లపర్తి భరత్‌రెడ్డి, సాక్షి, చిత్తూరు -
ఇన్నోవా-లారీ ఢీ: ముగ్గురి మృతి
-
పరిహారం చెల్లించలేదని..ఆత్మహత్యాయత్నం
కరీంనగర్ : దేవాదుల కాలువ తవ్వకాల్లో భూమి కోల్పోయిన ఒక రైతు పరిహారం చెల్లించలేదని విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపురం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మొగిలి అనే రైతు దేవాదుల ప్రాజెక్టు కోసం తవ్వుతున్న కాలువలో భూమి కోల్పోయాడు. అందుకు పరిహారం చెల్లించకుండా అధికారులు కాలువ తవ్వకాలు చేపట్టడంతో అడ్డుకునేందుకు విషం తాగే ప్రయత్నం చేశాడు. అయితే, అక్కడే ఉన్న పోలీసులు తన ప్రయత్నాన్ని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ విషయంపై అధికారులను వివరణ కోరగా మేం పరిహారం చెల్లించామని తెలిపారు. అయితే, పరిహారం చెల్లించే నాటికి భూమి మొగిలి పేరుమీద పట్టా కాలేదు. దీంతో ఆ భూమికి చెందిన పాత యజమాని లబ్దిపొందినట్లు సమాచారం.