Mohammed Rafi
-
దేశం పాడిన గాయకుడు
కిశోర్ కుమార్ మీద సంజయ్ గాంధీ కినుక వహించాడు. ‘ఇరవై సూత్రాల పథకం’ ప్రచారం కోసం దూరదర్శన్ లో మొదలెట్టిన ‘గీతోం భరీ షామ్’లో పాడమని కిశోర్‌ని సంజయ్ గాంధీ ఆదేశించాడు. డబ్బులు లేకుండా కిశోర్ పాడడు. ఆదేశిస్తే అసలు పాడడు. దాంతో కిశోర్ గొంతుకు రేడియోలో తాళం పడింది. సినిమాల్లో పాడిస్తే ఏం గొడవోనని నిర్మాతలు వెనక్కి తగ్గారు. ‘ఆరాధన’ సూపర్ హిట్ తర్వాత కిశోర్‌కు వచ్చిన తిప్పలు ఇవి. అప్పుడు కొంతమంది రఫీ దగ్గరకు వచ్చి ‘కిశోర్‌కు శాస్తి జరిగింది. ఈ కాలాన్ని ఉపయోగించుకోండి’ అన్నారు. రఫీ ఏం మాట్లాడలేదు. ఢిల్లీ వెళ్లి సంజయ్‌ను కలిశాడు. ‘మీరు కిశోర్ మీద బ్యాన్ ఎత్తేయండి. అందుకు బదులుగా ఒకటి కాదు పది ప్రోగ్రామ్‌లు చేసిస్తాను’ అన్నాడు. ఆ వెంటనే నౌషాద్‌ను వెంటబెట్టుకుని దూరదర్శన్‌లో ప్రోగ్రామ్ ఇచ్చాడు. కిశోర్ బ్యాన్ పోయింది.పత్రికలు కూడా కిలాడీవి. రాజేష్ ఖన్నా స్టార్డమ్తో కిశోర్ గొంతు గిరాకీలోకి రాగానే ‘రఫీ పని అయిపోయింది’ అని రాయడం మొదలెట్టారు. రికార్డింగులు లేక రఫీ గోళ్లు గిల్లుకుంటున్నాడని రాశారు. కిశోర్ తైనాతీలు ఇవన్నీ తెచ్చి కిశోర్‌కి చూపించారు. కిశోర్ సంతోషించాడా? ప్రెస్‌మీట్ పెట్టి ‘ఇలాంటి వెధవ రాతలు మానండి. ఆయనంటే నాకు చాలా గౌరవం. మీరు ఎవర్ని గెలిపించి ఎవర్ని ఓడిస్తారు?’ అన్నాడు. ఈ ఇద్దరిని కొంతమంది ఫలానా మతం అనుకుంటారు. ఈ ఇద్దరు మాత్రం ఈ దేశవాసులు. రామ్, రహీమ్‌ల సన్మతి ఎరిగినవారు.రంజాను మాసంలో రికార్డింగుకు వచ్చి ‘హుక్కే మే ధువా’ (హుక్కా పొగ) అనే పదం చూసి పాడనన్నాడు రఫీ ఉపవాసానికి భంగమని. మతం అంటే అంత నిష్ఠ. సాటి మతం పట్ల? అంతే నిష్ఠ. ‘మన్ తర్పత్ హరి దర్శన్ కో ఆజ్’.... ‘బైజూ బావరా’లో రఫీ పాడితే కన్నీరు ఆగదు వినేవారికి. ఆ కాలంలో అనేక ఆలయాల్లో ఇది ప్రభాతగీతం. దీనిని పాడింది, రాసింది, స్వరం కట్టింది... రఫీ, షకీల్ బదాయునీ, నౌషాద్. ‘నా గొంతు రొటీన్ అవుతోంది. నాకు భజనలు పాడాలని ఉంది’ అని రఫీ వస్తే ఖయ్యాం ఆ కోరిక మన్నించి భజనలు పాడించి అపురూపమైన రికార్డు విడుదల చేశాడు. ‘రఫీ గొంతులో దేవుడు ఉన్నాడు’ అని అందరూ అనేవారే. ఆ దేవుడు అల్లాయా, ఈశ్వరుడా వెతకడం అల్పుల పని.1950–70ల మధ్య మన దేశ సినీ సంగీతం దాదాపు అన్ని భాషల్లో స్వర్ణయుగం చూసింది. సినిమా – దేశవాసులను కలిపే కొత్త మతం అయ్యింది. కళాకారులు వినోద ఉల్లాసాలకే కాదు సామ రస్య, సౌభ్రాతృత్వాలకు ప్రవక్తలుగా మారారు. దేశ విభజన చేదు నుంచి జనాన్ని బయట పడేయడానికి గుర్తెరిగి బాధ్యతగా నడుచుకున్నవారే అందరూ! ‘తూ హిందు బనేగా నా ముసల్మాన్ బనేగా ఇన్సాన్ కీ ఔలాద్ హై ఔలాద్ బనేగా’... (నువ్వు హిందువువి కావద్దు, ముసల్మానువి కావద్దు, మనిషిగా పుట్టినందున మనిషిగా మిగులు) అని సాహిర్ రాయగా రఫీ పాడి చిరస్మరణీయం చేశాడు. మదన్ మోహన్ ట్యూన్ చేసిన ‘కర్‌చలే హమ్ ఫిదా’... రఫీ పాడితే నేటికీ సరిహద్దు సైనికులకు తేజోగీతమే. గాంధీజీని బలిగొన్నారన్న వార్త తెలియగానే సంగీత దర్శకులు హన్స్‌లాల్–భగత్రామ్, గీతకర్త రాజేంద్ర కిషన్ కలిసి ఆయనకు నివాళిగా ‘సునో సునో అయ్ దునియావాలో బాపు కీ ఏ అమర్ కహానీ’ రూపొందిస్తే ఇంకెవరు పాడతారు రఫీ తప్ప! బాపు పాదాల ఎదుట పారిజాతాల కుప్ప గదా ఈ పాట.సరళత్వము, తీయదనము, స్వచ్ఛత... వీటిని ప్రదర్శించడం ద్వారా ముప్పై ఏళ్ల పాటు పాడి కోట్ల మంది అభిమానులను పొందిన అమృత గాయకుడు రఫీ. ‘సుహానీ రాత్ ఢల్ చుకీ, ‘చౌద్వీ కా చాంద్ హో’, ‘బహారో ఫూల్ బర్సావో’, ‘ఓ దునియా కే రఖ్వాలే’, ‘ఖోయా ఖోయా చాంద్’, ‘దీవానా హువా బాదల్’, ‘క్యా హువా తేరా వాదా’... ఈ పాటలకు అంతూ పొంతూ ఉందా? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు... ఏ ప్రాంతమో ఏ భాషో... అందరూ రఫీ అభిమానులు. రోజువారీ పనిలో, కాయకష్టంలో, సేద తీరే వేళ, వేడుకల్లో రఫీ.. రఫీ... రఫీ! కూతురిని అత్తారింటికి సాగనంపేటప్పుడు ప్రతి తండ్రి తలుచుకుని ఉద్వేగాశ్రువులు రాల్చే పాట ‘బాబుల్ కి దువాయే లేతీ జా’... షంషాద్ బేగం, గీతాదత్, లతా, ఆశా... అందరూ రఫీకి జోడీలే. దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, షమ్మీ కపూర్, అమితాబ్... అందరూ అభినయకర్తలే. రఫీ పాడటంతో సగం నటన. మిగిలిన సగమే వీరు చేయాల్సి వచ్చేది.55 ఏళ్లకు మరణించాడు రఫీ. రేపటి డిసెంబర్ 24కు శత జయంతి. అయినా ఇన్నాళ్లకూ కాసింత కూడా మరపునకురాని సుర గాయకుడు. పాటనూ, ప్రేమనూ పంచి అందరి చేత ‘రఫీ సాబ్’ అనిపించుకున్నవాడు. ఆయన మృతదేహం ఆస్పత్రిలో ఉంటే ‘భూపిందర్ సింగ్ – రఫీ తమ్ముడు’ అని సంతకం పెట్టి ఇంటికి చేర్చిన గాయకుడు భూపిందర్ది ఏ మతం? చనిపోయిన అన్న రఫీది ఏ మతం? ఆ రోజు ఆకాశం నుంచి ఆగని వర్షం. ఇసుక వేస్తే రాలని జనం. గాంధీ గారు మరణించినప్పుడు ఇంత జనం వచ్చారట. రఫీ శత జయంతి ముగియనున్న ఈ వేళ అందరం వెలికి తీయవలసింది, జాగృత పరచవలసినది ఆయన పంచిన ఈ ప్రేమనే, ప్రేమమయ గీతాలనే! విద్వేష గీతాన్ని ఎవరు ఆలపించాలనుకున్నా కావలించుకుని వినిపిద్దాం రఫీ గీతం – జిందాబాద్ జిందాబాద్ అయ్ మొహబ్బత్ జిందాబాద్. జీతే రహో రఫీ సాబ్! అభీనా జావో ఛోడ్కర్ కె దిల్ అభీ భరా నహీ... -
ఇఫీలో శతాబ్ది వేడుకలు
అక్కినేని నాగేశ్వరరావు, రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, తపన్ సిన్హా... భారతీయ చిత్రసీమలో ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. నటులుగా ఏఎన్నార్, రాజ్ కపూర్, గాయకుడిగా మహమ్మద్ రఫీ, దర్శకుడిగా తపన్ సిన్హా చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ) ఘనంగా నివాళులర్పించనుంది. 55వ ఇఫీ వేడుకలు గోవాలో ఈ నెల 20న ఆరంభమై 28 వరకూ జరుగుతాయి.22న అక్కినేని నాగేశ్వరరావు, 24న రాజ్ కపూర్, 26న మహమ్మద్ రఫీ, 27న తపన్ సిన్హాలకు చెందిన శతాబ్ది వేడుకలను జరపడానికి ‘ఇఫీ’ నిర్వాహకులు ప్లాన్ చేశారు. గోవా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ చిత్రోత్సవాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇక నలుగురు లెజెండ్స్ నివాళి కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. ⇒ నలుగురు లెజెండ్స్ కెరీర్లో చెరగని ముద్ర వేసిన చిత్రాలను, పాటలను ప్రదర్శించనున్నారు. ఏఎన్నార్ క్లాసిక్ మూవీ ‘దేవదాసు’, రాజ్ కపూర్ కెరీర్లో మైలురాయి అయిన ‘ఆవారా’, తపన్ సిన్హా దర్శకత్వంలో రూపొందిన చిత్రాల్లో అద్భుత చిత్రం ‘హార్మోనియమ్’ చిత్రాలను ప్రదర్శించడంతో పాటు ‘హమ్ దోనో’లో మహమ్మద్ రఫీ పాడిన పాటలను వినిపించనున్నారు. కాగా, వీక్షకులకు నాణ్యతతో చూపించడానికి ఈ చిత్రాలను పునరుద్ధరించే బాధ్యతను నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ ఫిల్మ్ ఆరై్కవ్ ఆఫ్ ఇండియా తీసుకుంది. అలాగే ఈ ప్రముఖుల సినిమా కెరీర్‌కి సంబంధించిన ఏవీ (ఆడియో విజువల్) చూపించనున్నారు. ⇒నలుగురు కళాకారుల ప్రత్యేక నివాళిలో భాగంగా వారి విజయాలను గౌరవిస్తూ పద్మశ్రీ సుదర్శన్ పటా్నయక్ గోవాలోని కళా అకాడమీలో సృష్టించే ‘శాండ్ ఆర్ట్’ ఇల్ల్రస్టేషన్ని ప్రదర్శించనున్నారు. ⇒ సినిమా రంగంలో, భారతీయ సంస్కృతిపై వీరు వేసిన ముద్రకు ప్రతీకగా ఈ నలుగురు దిగ్గజాలకు అంకితం చేస్తూ ప్రత్యేక స్టాంపును ఆవిష్కరించనున్నారు. ⇒ ఈ నలుగురి కెరీర్లో తీపి గుర్తులుగా నిలిచిపోయిన చిత్రాలకు సంబంధించిన ఫొటోలు, అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రత్యేకమైన ఫొటోలతో ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి ‘ఇఫీ’ ప్లాన్ చేస్తోంది. ⇒ రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ కెరీర్‌లోని చిత్రాల్లోని 150 పాటలు, ఏఎన్నార్, తపన్ సిన్హా చిత్రాల్లోని 75 పాటలు... మొత్తంగా 225 పాటలతో ఓ సంగీత విభావరి జరగనుంది.భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ నలుగురు కళాకారుల శతాబ్ది వేడుకల్లో భాగంగా ఇంకా పలు కార్యక్రమాలను ప్లాన్ చేశారు. -
చలో దిల్దార్ చలో... చాంద్ కే పార్ చలో...
పాటకు శ్రోత దొరికాక బాగుంటుంది. జీవితానికి సరైన సహచరి దొరికాక బాగుంటుంది. రఫీ తెల్లవారు లేచి నాష్టా పూర్తి చేసి, ఇంటి గార్డెన్‌లోకి వెళ్లి కూచున్నాక మరి ఆయనకు ఎవరూ అంతరాయం కలిగించరు. ఎందుకంటే ఆ సమయాన ఆయన ఆ రోజున రికార్డు చేయబోయే పాటను సాధన చేస్తాడు. పాట ఎవరికీ వినిపించదు. పాదంలోని బొటనవేలు లయగా కదులుతూ ఉంటుంది. పాటను ఆయన లోగొంతుకలో స్మరిస్తూ ఉంటాడు. ఆ సమయాన ఆయన ఆహ్వానించేది రెంటినే. ఒకటి భార్య చిర్నవ్వుని. రెండు ఆమె చేతి మసాలా టీని. చాయ్ పత్తా, చక్కెర, బాదంపప్పు పొడి, యాలకులు వేసి బిల్కిస్ బానో మాత్రమే తయారు చేసే ఆ టీ బహు ప్రఖ్యాతం. రఫీ ఎదుటివారి మీద ప్రేమ కొద్ది ఒక రూపాయి ఫీజుకి పాట పాడిన సందర్భాలున్నాయి. కాని ఎంత బతిమిలాడినా భార్య చేసిచ్చిన ఫ్లాస్క్‌లోని టీ మాత్రం ఎవరికీ ఇచ్చేవాడు కాదు. అది ఆయనది. ఆయన కోసం బిల్కిస్ చేసినది. ‘పాకిజా’లో రఫీ ‘చలో దిల్దార్ చలో చాంద్ కే పార్ చలో’ అంటే లతా ‘హమ్భీ తయ్యార్ చలో’ అంటుంది. రఫీ కోసం బిల్కిస్ బానో కూడా అలా ఎప్పుడూ తయారుగా ఉండేది. బిల్కిస్ లేకపోతే రఫీ వ్యక్తిగత జీవితంలో లేడు. రెండో భార్య రఫీ లాహోర్ నుంచి ముంబై వచ్చి గాయకుడిగా స్థిరపడే సమయంలోనే బంధువుల అమ్మాయిని నిఖా చేసుకున్నాడు. వాళ్లకు ఒక కుమారుడు కలిగాడు. అయితే దేశ విభజన రఫీ భార్యను చాలా కలవరానికి గురి చేసింది. ఆమె తల్లిదండ్రులు ఆ అల్లర్లలో మరణించారు. ఆమె లాహోర్‌కు వెళ్లిపోయింది. రఫీ ఆ తర్వాత బిల్కిస్ బానోను వివాహం చేసుకున్నాడు. రఫీకి మొత్తం నలుగురు అబ్బాయిలు. ముగ్గురు అమ్మాయిలు. అయితే రఫీ పెద్దకొడుకు సయీద్ తమ తల్లికే పుట్టాడని బిల్కిస్‌బానో సంతానం అనుకునేది. చాలా ఏళ్ల పాటు వారికి ఆ అబ్బాయి సవతి సోదరుడనే తెలియకుండా బిల్కిస్ బానో అందరినీ సమానంగా పెంచింది. రఫీ మాటల పొదుపరి. ‘ఇదిగో’ అని అతను పలికే ఒక్క శబ్దానికి ఉండే బహుళ అర్థాలతో ఆమె కాపురం చేసింది. భార్య బిల్కిస్ బానోతో మహమ్మద్ రఫీ భోజన ప్రియుడు రఫీ పాటను నిండుగా పాడతాడు. భోజనం కూడా అంతే నిండుగా చేస్తాడు. రేపు ఉదయాన నాష్టా ఏం చేస్తారు అని రాత్రి, రాత్రికి ఏం వొండుతారు అని నాష్టా సమయంలో తప్పక అడిగేవాడు. ఆయనకు చెప్పాలి కూడా. బిల్కిస్ చెప్పేది. ఆయనకు ఆకుకూరలు వేసి చేసిన మాంసం, బంగాళాదుంప–మాంసం అంటే బహుప్రీతి. ఆయన గొంతులోని తీపికి డయాబెటిస్ రావడంతో ఆయనకు స్వీట్లు తినే యోగ్యం తక్కువగా ఉండేది. ఇల్లు భార్య చూసుకునేది. డబ్బు వ్యవహారాలు బావమరిది చూసుకునేవాడు. రఫీకి పాట మాత్రమే తెలుసు. లేదా భార్య సమక్షాన కూచుని పిల్లలతో గాలిపటాలు ఎగరేయడం తెలుసు. రఫీ పిల్లలను తీసుకొని సినిమాకు వెళ్లేవాడు. అయితే ఎవరైనా చూస్తారు అని సినిమా మొదలైన పదిహేను నిమిషాల తర్వాత, ముగిసే పదిహేను నిమిషాల ముందు తీసుకొచ్చేసేవాడు. పిల్లలు అందుకే సినిమాకు వెళదాం అంటే మేము రాము అని హటం చేసేవారు. ‘ఆయనతో కలిసి మేం చూసిన సినిమాల క్లయిమాక్స్ ఏమిటో మాకు ఇంతవరకు తెలియదు’ అని వారు నవ్వుతారు. బిల్కిస్ వారిని బుజ్జగించేది. పాటల మహరాజుకు ఇవి చేతనయ్యేవి కావు. రఫీ తన జీవితంలో కేవలం ఒక్క సినిమా రెండుసార్లు చూశాడు. అది ‘షోలే’. అయితే ఆ సినిమాలో రఫీ పాడిన పాట ఒక్కటీ లేదు. లండన్‌లో పిల్లలు రఫీ కెరీర్ పీక్‌లో ఉండగానే రఫీ పిల్లలు లండన్‌లో స్థిరపడ్డారు. రఫీ, బిల్కిస్ బాంబే నుంచి లండన్‌కు రాకపోకలు సాగించేవారు. భర్తతో ఎవరైనా సుదీర్ఘ జీవితమే ఆశిస్తారు. కాని రఫీ తన 55వ ఏట జూలై 31, 1980న మరణించాడు. నిత్యం నిర్మాతల, సంగీత దర్శకుల రాకపోకలతో కళకళలాడిన వారి ఇల్లు మౌనం దాల్చింది. ఆ ఇంటిని ఆ తర్వాత బిల్కిస్ బానుయే నిలబెట్టుకుంటూ వచ్చింది. భర్త చనిపోయాక ఆమె జరీ వర్తకం చేసేది. రఫీ ఇంటిని దర్శించుకుందామని వచ్చే అభిమానులకు ఆమె చల్లని పలకరింపు దక్కేది. ప్రార్థనలు వెంబడించాలి రఫీ పదేళ్ల వయసులో తన వీధి ముందు నుంచి పాడుతూ వెళ్లే ఫకీర్ మోహంలో పడ్డాడు. ఆ ఫకీర్ అది గమనించి ‘నువ్వూ పెద్ద గాయకుడివి అవుతావులే’ అని ఆశీర్వదించాడు. రఫీని ఎవరైనా ‘మీ పిల్లలను మీ పాటకు వారసులుగా ఎందుకు తీర్చిదిద్దలేదు’ అని అడిగితే ఆయన నవ్వి ‘ఎవరైనా ఏదైనా అవ్వాలంటే ప్రార్థనలు వెంబడించాలి. నన్ను వెంబడించే ప్రార్థనలే నన్ను ఇంతవాణ్ణి చేశాయి. తయారు చేస్తే ఎవరూ కళాకారులు కాలేరు. వాళ్లకై వాళ్లు తయారు కావాలి’ అని అనేవాడు. బిల్కిస్ ఆ అభిప్రాయానికే కట్టుబడింది. పిల్లలు వ్యాపారాల్లో స్థిరపడేందుకు ప్రోత్సహించింది. కళకారులను కళతో మాత్రమే అర్థం చేసుకుంటే సరిపోదు. వారి జీవిత భాగస్వామితో పాటు తెలుసుకోవాలి. తమలోని కళకు తామే సామ్రాట్టు అయిన అనేకమంది తమ జీవితానికి మాత్రం భార్యలను అధిపతులను చేశారు. రఫీ కూడా అంతే. జీవితం ఎపుడూ ఒకరు నడిపేది కాదు. స్త్రీ పురుషులు ఒకరి చేయి ఒకరు గట్టిగా పట్టుకుంటేనే అది సాధ్యమవుతుంది. రఫీ పాట, రఫీ–బిల్కిస్ల జీవితం అదే చెబుతుంది. సాథీ హాత్ బఢానా సాథీ హాత్ బఢానా ఏక్ అకేలా థక్జాయేగా మిల్కర్ బోజ్ ఉఠానా – సాక్షి ఫ్యామిలీ -
వైరల్ : భలే గమ్మత్తుగా పోలీస్ ట్రైనింగ్
పోలీస్ ట్రైనింగ్‌లో శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజులో 18 గంటల పాటు వివిధ రకాల ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొనడంతో ఒళ్లు నొప్పులు పుట్టడం ఖాయం. ఎంతైనా అలాంటి కఠిన శిక్షణ ఉంటేనే కదా.. వారు శారీరకంగానూ, మానసికంగానూ ధృడంగా తయారయ్యేది. తాజాగా తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ట్రైనీ పోలీసులకు శిక్షణ ఇస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(వైరల్: వీళ్లు మనసు దోచుకున్న దొంగలు!) వివరాలు.. మహ్మద్ రఫీ.. తెలంగాణ పోలీసుశాఖలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్న రఫీ ట్రైనీ పోలీసులకు శిక్షణ అందిస్తున్నాడు. పోలీసైన రఫీకి బాలీవుడ్ లెజెండరీ సింగర్ మహ్మద్ రఫీ పాటలంటే ప్రాణం.. ట్రైనీ పోలీసులకు శిక్షణ కఠినంగా అనిపించకుండా ఉండేదుకు రఫీ పాటలు పాడుతూ శిక్షణ నిర్వహిస్తుంటాడు . తాజాగా 1970లో వచ్చిన హమ్‌జోలీ సినిమా నుంచి రఫీ పాడిన 'దల్ గయా దిన్.. హో గయి శామ్' పాటను పాడుతూనే శిక్షణ నిర్వహించాడు. ఈ వీడియోనూ ఇండియన్ పోలీస్ సర్వీస్ అసోసియేషన్ తన ట్విటర్లో షేర్ చేస్తూ..' ఇవి శిక్షణకు సంబంధించి మా రఫీ చేస్తున్న పాటలు.. ఒకరేమో పోలీస్.. మరొకరేమో లెజండరీ సింగర్..ఇద్దరు పేర్లు కామన్‌గా ఉన్నా.. మా రఫీ కూడా పాటలు బాగా పాడుతాడు. ట్రైనీ పోలీసులకు శిక్షణ అందిస్తూనే వారికి ఇంటి బెంగను, శారీరక శ్రమను మరిచిపోయేలా చేస్తాడు.. నిజంగా ఇది అతనికున్న గొప్ప అభిరుచి' అంటూ క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. -
కిరాతకుడు రఫీకి ఉరి
సాక్షి, అమరావతి: అభం, శుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అత్యంత హేయంగా లైంగిక దాడికి పాల్పడి, కిరాతకంగా హత్య చేసిన మహమ్మద్ రఫీకి(25) ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు నగరంలోని పోక్సో న్యాయస్థానం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. పసి పిల్లలపై లైంగిక దాడులు, బాలికలపై అత్యాచారాలు, ప్రేమను అంగీకరించని వారిపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో కిరాతకుడైన రఫీని ఉరి తీయాలంటూ పోక్సో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అభినందనీయమని అన్ని వర్గాల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పోక్సో చట్టం కింద ఉరిశిక్ష పడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆడుకుంటున్న చిన్నారిపై... చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన ఐదేళ్ల చిన్నారి గతేడాది నవంబర్ 7వ తేదీ రాత్రి కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీలో జరిగిన ఓ వివాహానికి తల్లిదండ్రులతో కలసి వెళ్లింది. భోజనాలు చేసిన తర్వాత ఆడుకుంటూ ఒంటరిగా కన్పించిన బాలికకు మదనపల్లెకి చెందిన లారీ డ్రైవర్ మహ్మద్ రఫీ(25) ఐస్‌క్రీమ్ ఇప్పిస్తానని ఆశ చూపించి కల్యాణ మండపంలో ఉన్న బాత్రూమ్కు తీసుకెళ్లాడు. అరవకుండా నోరు నొక్కాడు. పాశవికంగా లైంగిక దాడి చేశాడు. తర్వాత బాలిక గొంతు నులిమి చంపేసి, శవాన్ని కల్యాణ మండపం పక్కన గుంతలో పడేసి పారిపోయాడు. పోలీసులు బాలిక మృతదేహాన్ని గుర్తించారు. పట్టించిన సీసీ కెమెరా... కల్యాణ మంటపంలోని సీసీ కెమెరాల్లో ఉన్న ఫుటేజీల ఆధారంగా పోలీసులు విచారించగా రఫీ చేసిన దారుణం బట్టబయలైంది. రఫీని 2019 నవంబర్ 16న అరెస్టు చేశారు. మదనపల్లె జూనియర్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. రఫీ తన 15వ ఏటే ఓ బాలికపై అత్యాచారయత్నం చేసినందుకు కొన్నాళ్లు జువెనైల్ హోమ్‌లో ఉన్నట్లు విచారణలో తేలింది. నేర ప్రవృత్తి మానకుండా అమానుషానికి పాల్పడిన రఫీకి న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు. జగన్ సర్కారు చొరవతో... తెలంగాణలో దిశ కేసు వెలుగుచూసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ చిన్నారి హత్యకేసు విచారణను చిత్తూరులోని పోక్సో కోర్టులో నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా లోకనాథరెడ్డిని నియమించింది. గతేడాది డిసెంబర్ 12న విచారణ ఆరంభించిన పోక్సో కోర్టు నిందితుడు రఫీ అరెస్టయిన వంద రోజుల్లోనే విచారణ పూర్తిచేసి ఉరిశిక్ష విధించింది. నిందితుడు రఫీ భార్య సైతం ఈ తీర్పును సమర్థించడం గమనార్హం. ఇలాంటి తీర్పులు వస్తే తప్పు చేయడానికి ఎవరైనా భయపడతారని, దీనివల్ల అఘాయిత్యాలు తగ్గుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ మహ్మద్ రఫీ
-
మనసుకు నచ్చిన సేద్యం దిశగా..
ఒత్తిళ్లతో కూడిన రొటీన్ ఉద్యోగం కొనసాగిస్తూ, రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారం తింటూ అనారోగ్యం పాలవడం కన్నా ప్రకృతి వ్యవసాయం చేపట్టి ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని సమాజానికి అందించడమే మేలైన జీవనమార్గమని భావించారు మహమ్మద్ రఫీ. కార్పొరేట్ ఐటీ కంపెనీలో ఏడాదికి రూ. 12 లక్షల ఆదాయాన్నిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి సొంత జిల్లా నెల్లూరుకు వెళ్లిపోయారు. మరికొందరు మిత్రులతో కలసి 250 ఎకరాల భూమిని కొని, ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఆరోగ్యదాయకమైన సిరిధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేసి తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నారు. ఏడాదంతా స్థిరమైన, సరసమైన ధరకే ఆకుకూరలు, కూరగాయలను, మున్ముందు పండ్లను కూడా అందించడం తమ అభిమతమని ఆయన అంటున్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం పురిణి గ్రామంలో రైతు ఖాదర్ బాషా కుమారుడైన మహమ్మద్ రఫీకి వ్యవసాయంపై మక్కువ ఉన్నప్పటికీ.. కొత్తగూడెంలో మైనింగ్ ఇంజినీరింగ్ బీటెక్ చదివారు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంటెక్ చదివిన తర్వాత హైదరాబాద్‌లో టీసీఎస్‌లో చేరారు. కొద్ది ఏళ్లలోనే టీమ్ లీడర్‌గా ఎదిగారు. ఏడాదికి రూ. 12 లక్షల జీతం అందుకుంటున్నప్పటికీ సంతృప్తి లేదు. రొటీన్ ఉద్యోగం, రసాయనిక అవశేషాలతో కలుషితమైన ఆహారం, నగర జీవనశైలితో అనారోగ్య సమస్యలు.. వెరసి సంతృప్తి లేని జీవితం. అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో కొన్ని సంవత్సరాల క్రితం సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిపై శిక్షణా శిబిరానికి హాజరయ్యారు. అంతే.. ప్రకృతి వ్యవసాయంపైనే దృష్టి పెట్టారు. పదేళ్లుగా చేస్తున్న ఉద్యోగం వదిలి 18 మంది మిత్రులతో కలసి భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేసి నెల్లూరు జిల్లా కలువాయి మండలం పర్లకొండలో 250 ఎకరాల భూమి కొని, రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. యూకలిప్టస్ చెట్లతో అడవిని తలిపించేలా ఉన్న భూమిని కొనుగోలు చేసి ప్రస్తుతం 120 ఎకరాలను సాగులోకి తెచ్చారు. 30 బోర్లు తవ్వించారు. వాన నీటి సంరక్షణ కోసం ఒకటిన్నర, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో రెండు చెరువులు తవ్వించారు. 30 ఒంగోలు జాతి ఆవులు, 18 గేదెలు కొనుగోలు చేశారు. పాలేకర్ పద్ధతిలో జీవామృతం, కషాయాలను ఉపయోగించి పంటలు పండిస్తున్నారు. నాటుకోళ్లను పెంచుతున్నారు. కొర్రలు, అరికలు, అండుకొర్రలు, సామలు, ఒరిగెలను 50 ఎకరాల్లో.. మునగ 20 ఎకరాల్లో, ఆకుకూరలను 5 ఎకరాల్లో, ఆపిల్ బెర్ను 7 ఎకరాల్లో, మామిడిని 10 ఎకరాల్లో, అరటిని 5 ఎకరాల్లో, 8 ఎకరాల్లో కరివేపాకు సాగు చేస్తున్నారు. ఆవులు, గేదెలకు పశుగ్రాసాన్ని 5 ఎకరాల్లో జీవామృతంతో సాగు చేస్తున్నారు. నిమ్మ, సీతాఫలం, బొప్పాయి, దానిమ్మ తదితర తోటలు వేయబోతున్నారు. సేంద్రియ సర్టిఫికేషన్ తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. తమ వ్యవసాయ క్షేత్రానికి 60 కిలోమీటర్ల దూరంలోని నెల్లూరు నగరంలో ప్రస్తుతం తమ ప్రకృతి వ్యవసాయోత్పత్తులను విక్రయిస్తున్నామని రఫీ తెలిపారు. ఫతేఖాన్‌పేట రైతు బజార్లో స్టాల్‌ను తెరిచారు. ఇటీవలే ఒక మొబైల్ వ్యాన్‌ను సైతం ఏర్పాటు చేసుకొని నెల్లూరులోని వివిధ ప్రాంతాల్లో రసాయన రహిత ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. ఆరోగ్యదాయకమైన జీవనానికి కట్టె గానుగ నూనెల ఆవశ్యకతను గుర్తెరిగి తమ వ్యవసాయ క్షేత్రంలోనే కట్టె గానుగను ఏర్పాటు చేసి హళ్లికర్ ఎద్దుల సహాయంతో నిర్వహిస్తున్నారు. సొంతంగా పండించిన వేరుశనగ, నువ్వులతోపాటు బయటి నుంచి కొని తెచ్చిన కొబ్బరితో నూనెలను తయారుచేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తుండటం విశేషం. ఏడాది పొడవునా స్థిరమైన ధర ఆరోగ్యదాయకమైన రసాయనాల్లేని ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రకృతి వ్యవసాయోత్పత్తులంటే జనం భయపడేంత ఎక్కువ ధరకు అమ్మకూడదని నిర్ణయించుకున్నాం. ఏడాది పొడవునా స్థిరంగా ఒకే ధరకు ఆకుకూరలు, కూరగాయలను వినియోగదారులకు అందిస్తున్నాం. కిలో రిటైల్ ధర టమాటో, దోస, వంకాయలు రూ. 20, మునక్కాయ రూ. 2.00 –2.50, ఆకుకూరలు కిలో రూ. 30కే విక్రయిస్తున్నాం. మున్ముందు హైదరాబాద్, చెన్నైలలోని సేంద్రియ దుకాణదారులకు తమ ఉత్పత్తులను సరఫరా చేయనున్నాం. – మహమ్మద్ రఫీ (90002 31112), పర్లకొండ, కలువాయి మండలం, నెల్లూరు జిల్లా – పులిమి రాజశేఖర్‌రెడ్డి, సాక్షి, నెల్లూరు సెంట్రల్ -
కవితల మహ్మద్ రఫీ!
బొంరాస్‌పేట: అమ్మ ప్రేమ నిరంతరంఆకాశంలో మెరుపు అమ్మ కోసం..ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలుసుకోలేక‘పిచ్చి’తనంతో బలవంతపు మరణాలు..అభంశుభం తెలియని బాలికలపైపైశాచిక దాడులు కసాయి సాక్షాలు..చంకన పిల్ల వయస్సులో ఉన్న చిన్నారులుకీచక, నీచ బుద్ధిహీనులు అమానవీయ మరకలు..కన్నవారికి శోకాలు.. సమాజానికి కలంకాలు భావితరాలకు ఇవేనా గుణపాఠాలుబంగారు భవితకు ఎవరువేయాలి బాటలు? ఈ కవితలు బడికి దూరమై చికెన్‌సెంటర్ నిర్వహిస్తున్న ఓ ముస్లిం యువకుడి కలం నుంచి జాలువారుతున్న తెలుగు కవితా కుసుమాల మాల. పరిగి మండలం గుముడాలకు చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన మహ్మద్‌రఫీ పదో తరగతి వరకు చదివి ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పదో తరగతివరకు చదివి మానేశాడు. కుటుంబ పోషణకు మండల పరిధిలోని తుంకిమెట్లలో ఐదేళ్లుగా చికెన్ సెంటర్ నడుపుతున్నారు. సందేశాత్మక కవితలతో.. చికెన్ సెంటర్లో గిరాకీ లేనప్పుడు కాలక్షేపం కోసం కవితలు రాయడం రఫీకి హాబీగా మారింది. మనసుకు తోచినట్లు అంశాలను ఎంచుకొని అలవోకగా ప్రేమ, సందేశాత్మక కవితలు రాయడం కొనసాగిస్తున్నారు. ‘నీవు నవ్వితే చాలునెలవంక సిగ్గుపడుతది. నీనడక చూసిహంస అసూయ పడుతది. నడుము నాట్యంతోనెమలి పురి పూరుగుడిసైతది. అంటూ అలవోకగా కవితలు అల్లడంలో రఫీ అందెవేసిన చెయ్యి. హిందీ ప్రముఖ గాయకుడు మహ్మద్‌రఫీ, బాలుపాడిన పాటలంటే ఈ కవితల రఫీ చెవికోసుకుంటాడు. చిన్ననాటి నుంచి కవితల పట్ల ఉన్న ఆసక్తితో సునాయసంగా, సహజంగా రాయాలేగాని కృత్రిమ కవితలు రాయలేనని చెబుతున్నాడు రఫీ. షార్ట్ ఫిలిం తీయాలనుకున్నా నా కవితలు చదివినవారు విన్నవారు చాలా బాగున్నాయని అంటున్నారు. పుస్తక రూపంలో, ఫొటో ఆల్బం చేయించాను. నాకవితలతో ఏఒక్కరు మారినా నాకు సంతృప్తి మిగిలిస్తుంది. సోషల్ మీడియాలో సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ చేయాలి ఉంది. త్వరలో షార్ట్ ఫిలిం తీసే ప్రయత్నాలు చేస్తున్నా. నేనే కథ రాశాను. షూటింగ్‌కు సిద్ధంగా ఉంది.– మహ్మద్‌రఫీ -
మా మది నిన్ను పిలిచింది...
-
పెద్దవాళ్లకు కూడా కోపాలు తప్పవు
మ్యూజిక్ గాయకుడు మహమ్మద్ రఫీ పీక్‌లో ఉన్నప్పుడు మ్యూజికల్ నైట్స్‌కు చాలా డిమాండ్ ఉండేది. రఫీ తానే సొంతగా కొన్ని నైట్స్ చేసేవాడు. సినిమాల అవకాశాలు తగ్గినవాళ్లు కొన్ని చేసేవారు. ఫీల్డ్‌లో కొత్తగా వచ్చిన కల్యాణ్‌జీ-ఆనంద్జీ తాము చేస్తున్న మ్యూజికల్ నైట్స్‌లో పాడమని రఫీని అడిగారు. నేను బిజీగా ఉన్నాను లతాను అడగండి అని రఫీ అన్నాడు. వాళ్లకు కోపం వచ్చింది. చాలా కాలం రఫీతో పాటలు రికార్డింగ్ చేయించలేదు. గమనిస్తే వాళ్ల సంగీతంలో రఫీ పాటలు తక్కువ ఉంటాయి. అలాగే సంగీత దర్శకుడు ఖయ్యామ్కూడా రఫీని తన మ్యూజికల్ నైట్‌లో పాడమని అడిగితే- ముందు నువ్వు సంగీత దర్శకుడిగా పేరు సంపాదించు. ఆ తర్వాత మ్యూజికల్ నైట్ పెట్టు అన్నాడు రఫీ. అది మనసులో పెట్టుకుని ఖయ్యాం చాలాకాలం రఫీకి బదులుగా మహేంద్ర కపూర్ చేత పాడించాడు. హమ్ కిసీసే కమ్ నహీ (1977) సినిమాలో రఫీ పాడిన ‘క్యా హువా తేరా వాదా’ పాటకు ఫిల్మ్‌ఫేర్ వచ్చింది. అయితే అదే సంవత్సరం అమర్ అక్బర్ ఆంథోనికి సంగీతం అందించిన లక్ష్మీకాంత్-ప్యారేలాల్కు ఉత్తమ సంగీత దర్శకులుగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చింది. ఉత్తమ గాయకుడిగా అవార్డు తీసుకున్నవాడు ఆ పాటను పాడాలి. లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌ల ముందు తాను హమ్ కిసీసే కమ్ నహీకి సంగీతం అందించిన ఆర్.డి.బర్మన్ ట్యూన్‌ను పాడితే వాళ్లకెక్కడ కోపం వస్తుందోనని రఫీ ఆ వేడుకకు వెళ్లడానికి భయపడ్డాడు. ఆ సంగతి తెలిసి లక్ష్మీకాంత్ ప్యారేలాల్లు తాము ఆర్కెస్ట్రా అరేంజ్ చేసి ఆర్.డి,బర్మన్ పాటైనా సరే మేము సహకరిస్తాం అని చెప్పి రఫీ చేత పాడించారు. రఫీ ఊపిరి పీల్చుకున్నాడు. పెద్దవాళ్ల కష్టాలు ఇలా ఉంటాయి. -
ఓల్డ్ ఈజ్ బ్యూటీఫుల్
టెక్నాలజీ ఎంత మారినా పాత వస్తువులు ఎప్పటికీ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఒకప్పుడు రాగాలు పలికిన గ్రామ్‌ఫోన్, పూర్తిగా చెక్క, ఇత్తడితో చేసిన టెలిఫోన్ ఇప్పటి వారికి కొత్తగానే ఉంటాయి.బీదర్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇలాంటి పాత వస్తువులను సోమవారం బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అమ్మకానికి పెట్టాడు. ఆ దారంట వెళ్లేవారు వాటిని ఆసక్తిగా తిలకించారు. - ఫొటో: మహ్మద్ రఫీ -
మన గొంతులో పాటలా...మనతోటే ఉన్నట్టుగా..!
1937 ప్రాంతంలో... ‘లాహోర్’లో కె.ఎల్. సైగల్గారి సంగీత కార్యక్రమం జరపడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. సరిగ్గా ప్రోగ్రాం మొదలు కాబోతుండగా కరెంటు పోయింది. కరెంటు వస్తేగాని పాడనని కె.ఎల్. సైగల్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అప్పుడో కుర్రవాడు నిర్వాహకుల్ని కలిసి, ‘‘అయ్యా నా తమ్ముడికి ఒక్క ఛాన్సు ఇస్తే కరెంటు వచ్చే వరకూ... ప్రేక్షకుల్ని ఆనందపరుస్తాడు...’’ అని వినయంగా అన్నాడు. అప్పటికే ప్రేక్షకులు నానా గోలా చేస్తుండటంతో నిర్వాహకులు ఒప్పుకోక తప్పలేదు. ఆ బుడత గాయకుడే మహమ్మద్ రఫీ. హాలు మొత్తం 13 సంవత్సరాల ఈ బుడతడి ప్రజ్ఞకు ఊగిపోయింది. అక్కడున్న సంగీత దర్శకుడు శ్యామ్ సుందర్ ‘రఫీ’ని దగ్గరికి పిలిచి ‘‘నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. బొంబాయి వచ్చెయ్’’... అని ఆహ్వానం పలికాడు.రఫీ పుట్టింది అమృత్సర్ దగ్గరున్న ‘కోట్లా సుల్తాన్సింగ్’ అనే ఊళ్లో (అవిభక్త పంజాబ్‌లో ఉండేదది). చిన్నతనం నుంచీ రఫీకి సంగీతం అంటే ప్రాణం. హిందుస్తానీ, శాస్త్రీయ సంగీతాల్లో మహామహుల దగ్గర శిక్షణ పొంది అద్భుతమైన స్వర సంపద మూటగట్టుకున్నారు రఫీ.1944లో అంటే తన ఇరవయ్యవ ఏట రఫీ తన మొదటి పాటని ‘గుల్బలోచ్’ అనే పంజాబ్ సినిమా కోసం శ్యామ్‌సుందర్ సంగీత దర్శకత్వంలో పాడారు. ఆ తరవాత నౌషాద్ ‘పెహలేఆప్’, ఆ తరువాత లైలా మజ్ఞు, జుగ్ను, అన్‌మోల్‌ఘడీ... ఇలా ఏ సినిమాలో పాడినా రఫీ తన స్వరమంత్రజాలంతో ప్రేక్షకుల్ని సమ్మోహనపరిచేవారు. హుషారు పాటైనా, విషాదమైనా, తత్వమైనా, ఏదైనా సరే రఫీ స్వరంలో ప్రాణం పోసుకునేది. గాయకుడు తలత్ మహమూద్ ధూమపానం అలవాటు రఫీకి వరమైంది. అదెలా అంటే... నౌషాద్కి సిగరెట్టన్నా, దాని వాసనన్నా మహా చికాకు. స్టూడియోలో తలత్ సిగరెట్ తాగడం చూసిన నౌషాద్ ఆ చికాకులోనే, అర్జంటుగా రమ్మని రఫీకి కబురెట్టారు. అసలు సంగతేమంటే, ‘బైజొబావ్రా’ పాటలన్నీ తలత్ పాడాల్సింది. ‘సిగరెట్’ పెట్టిన చికాకుతో నౌషాద్‌గారు మొత్తం పాటలన్నీ రఫీతో పాడించారు. ఆ సినిమా ఓ మైలురాయిగా సినీ చరిత్రలో మిగిలిపోతే, మహమ్మద్ రఫీ స్వరం దేశమంతా మారుమోగి పోయింది. అంతే! సంగీత ప్రపంచంలో ఓ ‘విజేత’ అవతరించాడు. ఓ అమర గాయకుడు అవతరించాడు. ‘మన్ తర్పత్’ పాట విన్న ఆనందంలో కన్నీరు కార్చని శ్రోతలేడు. హీరో భరత్ భూషణ్‌కి శాశ్వత కీర్తినిచ్చిందా సినిమా. రఫీ వెనుతిరిగి చూడలేదు. విజయపరంపర.. ప్రవాహం. ‘చాహే కోయీ ముఝే జంగ్లీ కహే’ అని రఫీ పాడుతుంటే ‘యా... హూ...’’ అంటూ కుర్రకారు వెర్రెత్తి అరిచారు. ‘ఏ మేరా ప్రేమ్ పఢ్కర్’ అని రఫీ సుమధురంగా ఆలపిస్తే ప్రేమని ద్వేషించే వాళ్లు కూడా ప్రేమలేఖలకు తలవొంచారు.‘‘ఓ దేఖో ముఝ్సే రూఠ్‌కర్... మేరీ జాన్ జారిహ హై’ అని ‘అలక’ మీదున్న ‘చిలకని’ రఫీసాబ్ తన స్వరంతో సవరిస్తుంటే కుర్రకారు ప్రియురాళ్లని అదే పాట పాడి అనునయించారు. రఫీ లేకపోతే ఖచ్చితంగా షమ్మీ ‘షమ్మి’ కాడు. దేవానంద్, దిలీప్, రాజ్‌కపూర్, షమ్మికపూర్, శశికపూర్, జాయ్‌ముఖర్జీ, రాజేంద్రకుమార్, మనోజ్ కుమార్, ధర్మేంద్ర.. ఇలా తరాలు గడిచిపోయినా రఫీ ‘స్వరం మాత్రం మారలేదు. ఒక్కసారి మాత్రం కిశోర్ కుమార్ సృష్టించిన సంగీత ప్రభంజనానికి కాస్త పలచబడ్డా... ‘హ్కిసీసే కమ్‌నహీ’ అని అన్నట్టుగా మళ్లీ అద్భుతంగా పుంజుకుంది. చిట్టచివరి క్షణం వరకూ అదే ఊపు! ఎన్ని పాటలో!! అందుకే ఆయన్ని మ్యూజిక్ ‘మెజీషియన్’ అనేవారు. రఫీని స్మరించుకోవడం అంటే... భారతీయ సంగీతాన్ని స్మరించుకోవడమే. రఫీకి అంజలి ఘటించడమంటే... చలనచిత్ర సంగీతానికి సాష్టాంగ నమస్కారం చెయ్యడమే!మహమ్మద్ రఫీ పరమపదించిన రోజున (31 జూలై 1980) బాంబే మొత్తం మూగబోయింది. వేలాది మంది అభిమానులు రఫీ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మన గొంతులో పాటలా... మన కళ్లల్లో కలగా... మన జీవితంలో భాగంలా... మనతోటే ఉన్నట్టుగా...! అభీనా జావో ఛోడ్ కర్... ఏ దిల్ అభీ భరా నహీ’’ అని పాడుకుంటే, ఆయనే మరలి వస్తారు... మధుర స్మృతిగా.