Mohsin
-
భర్తతో విభేదాలు.. విడాకుల కోసం కోర్టుకు నటి ఊర్మిళ మటోండ్కర్!
-
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన.. ఇకపై
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కొత్తగా మూడు టోర్నమెంట్లు ప్రవేశపెట్టింది. దేశవాళీ క్రికెట్ 2024- 2025లో భాగంగా చాంపియన్స్ వన్డే కప్, చాంపియన్స్ టీ20 కప్, చాంపియన్స్ ఫస్ట్‌క్లాస్ కప్ టోర్నీ నిర్వహిస్తామని తెలిపింది. ప్రస్తుతం పురుషుల క్రికెట్లో మాత్రమే ఈ మూడు టోర్నమెంట్లు ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేసింది.కాగా పాకిస్తాన్లో ఇప్పటికే నేషనల్ టీ20 కప్, ఖైద్- ఈ - ఆజం ట్రోఫీ, ప్రెసిడెంట్స్ ట్రోఫీ, ప్రెసిడెంట్స్ కప్, హెచ్‌బీఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్ వంటి డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు ఉన్నాయి. వీటికి అదనంగా పై మూడు టోర్నమెంట్లను పీసీబీ ప్రవేశపెట్టింది.ఈ విషయం గురించి పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. ‘‘దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌కు మధ్య చాంపియన్స్ టోర్నమెంట్లు వారధిగా నిలవడమే కాకుండా.. క్రికెటింగ్ ఎకోసిస్టమ్‌ను పునరుత్తేజితం చేసే విధంగా ఉంటాయి. ప్రతిభ ఆటగాళ్లను గుర్తించి.. వారి నైపుణ్యాలకు పదునుపెట్టి.. గ్లోబల్ వేదికపై రాణించేలా వారిని తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం’’ అని తెలిపాడు. చాంపియన్స్ టోర్నీల్లో డాల్ఫిన్స్, లయన్స్, పాంథర్స్, స్టాలియాన్స్, వోల్వ్స్ పేర్లతో ఐదు జట్లు ఉంటాయని పేర్కొన్నాడు.గత మూడేళ్లుగా ఆకట్టుకుంటున్న 150 మంది టాప్ డొమెస్టిక్ క్రికెటర్లతో పాటు సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లు కూడా ఇందులో పాల్గొంటారని మొహ్సిన్ నఖ్వీ వెల్లడించాడు. ప్రతి జట్టుకు పాకిస్తానీ మాజీ సూపర్‌స్టార్ మెంటార్‌గా ఉంటాడని వెల్లడించాడు. విశేష అనుభవం ఉన్న వారిని మాత్రమే కోచ్‌లుగా నియమించుకుంటామని స్పష్టం చేశాడు.కాగా గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు చేదు అనుభవాలు ఎదుర్కొంటోంది. ద్వైపాక్షిక సిరీస్‌లలో వైట్‌వాష్‌కు గురవడంతో పాటు.. వన్డే వరల్డ్‌ప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో కనీసం నాకౌట్ దశకు చేరకుండానే నిష్క్రమించింది. ఇక పీసీబీ చైర్మన్ నియామకం, హెడ్‌కోచ్‌ల విషయంలోనూ హైడ్రామా జరిగింది. అదే విధంగా.. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌లేమి, క్రమశిక్షణా రాహిత్యం మీద కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పీసీబీ దేశవాళీ క్రికెట్ స్థాయి నుంచి ప్రక్షాళన చర్యలు చేపట్టింది.ఈ నేపథ్యంలో పీసీబీ దేశవాళీ క్రికెట్ స్థాయి నుంచి ప్రక్షాళన చర్యలు చేపట్టింది. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి సైతం ఇటీవల.. కఠిన నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే.ప్రధాన ఆటగాళ్లు మినహా మిగతావాళ్లెవరైనా ఏదేని కారణం చేత జాతీయ జట్టుకు దూరమైతే.. దేశవాళీ క్రికెట్లో ఆడిన తర్వాతే టీమిండియాలో ఆడే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ధిక్కరించిన ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లపై వేటు వేస్తూ.. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. అయితే, శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్లో తనను తాను నిరూపించుకుని శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా రీఎంట్రీ ఇచ్చాడు. ఇక పీసీబీ సైతం తాజా చర్యతో బీసీసీఐ బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. -
ACC: ఏసీసీ బాస్‌గా పాక్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ?
ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) తదుపరి అధ్యక్షుడిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నియమితుడు కానున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. నఖ్వీ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ప్రస్తుతం ఏసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే.జై షా వైదొలిగిన వెంటనేరెండేళ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత ఈ ఏడాది జనవరిలో.. మరోసారి ఏసీసీ బాస్‌గా బాధ్యతలు చేపట్టాడు జై షా. ఏడాది పాటు అతడి పదవీకాలాన్ని పొడిగిస్తూ ఏసీసీ నిర్ణయం తీసుకున్న క్రమంలో.. ఇప్పటికీ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నాడు. అయితే, రొటేషన్ పాలసీ ప్రకారం ఈసారి ఈ పదవి పాక్ బోర్డు చైర్మన్‌ను వరించనున్నట్లు ఏసీసీ వర్గాలు తెలిపాయి.‘‘వచ్చే ఏడాది ఏసీసీ సమావేశంలో.. నఖ్వీ నియామకానికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేస్తారు. తదుపరి రెండేళ్లపాటు ఏసీసీ ప్రెసిడెంట్‌గా నఖ్వీ కొనసాగే అవకాశం ఉంది. జై షా వైదొలిగిన వెంటనే అతడి స్థానంలో నఖ్వీ బాధ్యతలు చేపడతాడు’’అని సదరు వర్గాలు జాతీయ మీడియాతో వెల్లడించాయి.వచ్చే ఏడాది భారత్లోకాగా వచ్చే ఏడాది భారత్‌లో ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నీ పురుషుల ఆసియాకప్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. 2026లో స్వదేశంలో జరిగే టీ20 ప్రపంచకప్‌కు ముందుగా ఈ టోర్నీ నిర్వహిస్తారు.గతంలోనూ 2023 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా పాకిస్తాన్లో ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. అయితే భారత్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించడంతో ‘హైబ్రిడ్ మోడల్’తో భారత్ ఆడిన మ్యాచ్‌ల్ని శ్రీలంకలో ఏర్పాటు చేశారు. ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ విజేతగా నిలిచింది. అనంతరం 2027 ఆసియా కప్‌నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది.అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్లో ఆసియాకప్ జరుగనుంది. ఈ రెండు టోర్నీల్లోనూ భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లతో పాటు టెస్టు హోదా దక్కని ఒక ఆసియా జట్టు పాల్గొంటుందని ఆసియా క్రికెట్ మండలి తెలిపింది. -
కొవ్వొత్తి చుట్టూ తిరిగే చిమ్మట జీవితాలు
పాకిస్తానీ రచయిత మొహ్సీన్ హమీద్ తొలి నవల అయిన, ‘మోథ్ స్మోక్’ 1998లో లాహోర్‌లో మండుతున్న వేసవిలో, ఒకానొకప్పుడు జూనియర్ బ్యాంకర్ అయిన దారాషికో (దారూ) తను చేయని హత్యకి, జైల్లో కూర్చునుండగా ప్రారంభం అవుతుంది. పేదింటి దారూ ధనిక కుటుంబానికి చెందిన ఔరంగజేబ్ (ఓజీ)షాకి స్నేహితుడు. దారూ బాల్యం కాలేజీలో చేరేంతవరకూ సామాన్యంగానే గడుస్తుంది. తరువాత అతని స్నేహితులు ఉన్నత విద్యకోసం అమెరికాకు వెళ్ళిపోతారు. ఓజీ తిరిగి అమెరికా నుండి వెనక్కి రావడంతో దారూ అభద్రతాభావం ఎక్కువవుతుంది. తనకి లేకపోయిన ప్రతీదీ ఓజీ వద్ద ఉంటుంది. పెజొరో కారు, మంచి ఉద్యోగం, అందమైన భార్య ముంతాజ్, కొడుకు. వాళ్ళవల్ల దారూ తిరిగి ఆ ధనిక వృత్తంలోకి అడుగుపెట్టి , బ్లాక్ లేబెల్ విస్కీలు తాగే పార్టీకి వెళ్ళిన మర్నాడే అతని ఉద్యోగం పోతుంది. అదే దారూ అంతానికి ప్రారంభం. ముంతాజ్ పట్ల అతనికున్న కాంక్షా, అతని హెరాయిన్ సేవనం హెచ్చవుతుండగా, అతని సామాజిక, ఆర్థిక హోదా దిగజారుతుంటాయి. ‘నేను ఆమె పట్ల ఆకర్షితుడైనట్టే ఆమె కూడా అయింది. ముంతాజ్ అనే కొవ్వొత్తి చుట్టూ తిరిగే చిమ్మటని నేను. ఆమె కూడా కొవ్వొత్తి అయిన నా చుట్టూ తిరిగే చిమ్మటే’ అంటాడు దారూ. నవల శీర్షిక– దారూ, ముంతాజ్ మధ్యన పెంపొందిన ప్రేమకి రూపకం. కొవ్వొత్తి చుట్టూ ప్రాణాంతకమైన మోహంతో తిరిగి, పొగగా మారి స్వీయ నాశనాన్ని ఎదురుకునే చిమ్మటని ఉటంకిస్తుంది. నవల్లో అధికభాగం దారూ దృష్టికోణంతోనే ఉన్నదైనప్పటికీ, అతనికి డ్రగ్స్ సరఫరా చేసే రిక్షా అతనితో సహా నవల్లో ఉన్న పాత్రలందరి ఆలోచనా ధోరణులూ పాఠకులకు పరిచయం చేయబడతాయి. తను ఎందుకు ‘మంచి/చెడ్డ వ్యక్తో’ అని ప్రతీ పాత్రా వివరిస్తుంది. లంచగొండి అవడం ఎంత అవసరమో అని ఓజీ, భర్త ఆప్త మిత్రుడితో ఎందుకు సంబంధం పెట్టుకోవలిసి వచ్చిందో అని ముంతాజ్, తను డ్రగ్స్ తీసుకోవడమేకాక అమ్మే దశకి కూడా ఎందుకు చేరుకున్నానో అని దారూ చెప్తారు. జీవితం గిరగిరా తిరుగుతూ చేతుల్లోంచి ఎలా జారిపోగలదో అర్థం అవుతుంది పాఠకులకి. తన్ని తాను లోకువ చేసుకుంటూ వినిపించే దారూ స్వగతాలకి అదనంగా, ఇతర గొంతులూ వినిపిస్తాయి. ‘డ్రమెటిక్ మొనొలోగ్’ అన్న ప్రక్రియని నవల్లో విరివిగా ఉపయోగించారు రచయిత. నవల పాకిస్తాన్ ధనిక వర్గపు దురాశా, అభద్రతనీ కనపరిచి– ధనిక వర్గానికీ, పేదవారికీ ఉన్న వ్యత్యాసాన్ని కూడా విశదపరుస్తుంది. పాత్రలని సాంప్రదాయికమైన నైతిక చట్రంలో చూపకుండా– వైరుధ్యం, వంచనతో నింపారు హమీద్. అమెరికన్ పదజాలాన్ని భారీగా ఉపయోగించారు. నవల్లో సమకాలీన పాకిస్తాన్ కనిపించినప్పుడు, ఇది నిజంగా ప్రపంచానికి తెలిసిన దేశమేనా! అన్న అనుమానం కలుగుతుంది. పుస్తకంలో ఉన్న ఏ పాత్రా అనవసరమయినది అనిపించదు. పాకిస్తానుకీ, ఇండియాకీ మధ్యనున్న పరమాణు సంబంధమైన పోటీ అన్న ప్రస్తావన పలుమార్లు కనిపిస్తుంది. నవల– మానవ ఘర్షణలు, ప్రేమ, ద్రోహం, ఓటమి, అసమానతల గురించినది. కథనంలో చమత్కారం, నిష్కల్మషతా కనబడతాయి. పుస్తకం బెట్టీ ట్రాస్క్ అవార్డు గెలుచుకుని, పెన్/హెమింగ్వే అవార్డుకి ఫైనలిస్టుగా ఎంచుకోబడింది. దీని ఆధారంగా, అజ్ఫర్ అలీ దర్శకత్వంతో తీసిన పాకిస్తానీ ఫిల్మ్ ‘దాయిరా’(వృత్తం) వచ్చింది. రాహుల్ బోస్‌తో తీయాలనుకున్న హిందీ సినిమా ఆర్థిక కారణాల వల్ల ఆగిపోయింది. యు. కృష్ణ వేణి -
‘సింగిల్ హ్యాండ్ స్నాచర్’..మోసిన్
స్నాచింగ్... ఈ పేరు చెప్పగానే ఓ ద్విచక్ర వాహనం, దానిపై హెల్మెట్/మాస్క్‌లతో దూసుకువచ్చే ఇద్దరు వ్యక్తులు గుర్తుకువస్తారు. దీనికి భిన్నంగా సిటీలో సింగిల్ హ్యాండ్ స్నాచింగ్ సైతం జరిగింది. మధ్య మండలంలోని అబిడ్స్ ఠాణా పరిధిలో గతేడాది ఈ ‘సింగిల్ హ్యాండర్’ పంజా విసిరాడు. ఓ ఆటోను వెంబడిస్తూ వచ్చిన దుండగుడు... అదును చూసి అందులోని ప్రయాణికురాలి మెడలో గొలుసు తెంచుకుపోయాడు. ఎనిమిది నెలలుగా మిస్టరీగా ఉన్న ఈ నేరగాడు మరెవరో కాదు... మహ్మద్ మోసిన్ అలీ షాగా తేలింది. శనివారం పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన రెండు ముఠాలకు చెందిన నలుగురిలో ఇతడొకడు. పండిత పుత్ర... మాదిరిగా నగరానికి చెందిన మహ్మద్ సర్వర్ అలీ షా వత్తిరీత్యా వైద్యుడు. ప్రస్తుతం దుబాయ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఈయన కుమారుడే మోసిన్ అలీ షా. చిన్నప్పటి నుంచీ నేరాలు చేస్తుండటంతో కుటుంబానికి దూరమయ్యాడు. కాచిగూడలోని ఛాపెల్ బజార్లో ఓ గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. ఓ యువతితో అయిన పరిచయం ప్రేమగా మారింది. ప్రేయసితో కలిసి జల్సాలు చేయడం కోసం స్నాచింగ్స్ బాటపట్టాడు. ఏడాదిన్నర కాలంలో ఆసిఫ్‌నగర్, హుమాయూన్‌నగర్, జూబ్లీహిల్స్, ఎస్ఆర్నగర్, రాంగోపాల్‌పేట్, చిక్కడపల్లి, చిలకలగూడ, నాంపల్లి, అబిడ్స్, నల్లకుంట, సుల్తాన్‌బజార్ ఠాణాల పరిధిలో 18 గొలుసు దొంగతనాలు చేశాడు. కొన్ని నేరాలు చేయడానికి కోఠికి చెందిన విద్యార్థి సయ్యద్ జమీల్ హుస్సేన్‌ను వాడుకున్నాడు. అతడికి ఉన్న అవసరాలకు ఆసరాగా చేసుకుని నేరాలు చేసేప్పుడు తన వెంట తిప్పుకున్నాడు. పక్కా ప్లాన్ తో.. తన అవసరాలకు తగ్గట్టు సిటీలో వరుస స్నాచింగ్స్ చేసిన ఘరానా దొంగ మోసిన్ అలీ పోలీసులకు చిక్కకుండా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. వీరు ఓ నేరం చేసిన తర్వాత ఆ సొత్తును సొమ్ము చేసుకునేవాడు. అది ఖర్చయ్యే వరకు మరో స్నాచింగ్ చేసే వాడు కాదు. గతేడాది మేలో అలిషా అనే వ్యక్తి నుంచి చోరీ వాహనమైన నీలి రంగు పల్సర్ ఖరీదు చేశాడు. అబిడ్స్ స్నాచింగ్‌తో పాటు మిగిలినవీ దీని పైనే తిరుగుతూ చేశాడు. కేవలం స్నాచింగ్స్ చేయడానికి మాత్రమే దీన్ని వినియోగించే వాడు. ఇతడి ప్రేయసి కాచిగూడలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఆమెను కలవడానికి వెళ్తున్న నేపథ్యంలోనే వివిధ కారణాలు చెప్పి అక్కడి పార్కింగ్ నిర్వాహకుడితో పరిచయం పెంచుకున్నాడు. ఓ స్నాచింగ్ చేసిన తర్వాత వాహనాన్ని ఆ పార్కింగ్‌లోనే పెట్టి మిగిలిన సమాయాల్లో యాక్టివా వాహనంపై తిరిగేవాడు. వాట్సాప్ ద్వారా క్రై మ్ అప్డేట్స్... మోసిన్ షాను అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ బందం అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో టాస్క్‌ఫోర్స్‌తో పాటు శాంతిభద్రతల విభాగం పోలీసులు అరెస్టు చేసిన దొంగలు, నగరంలో జరుగుతున్న స్నాచింగ్స్‌కు సంబంధించిన సమాచారం ఉండటం చేసి అవాక్కయ్యారు. ఆరా తీయగా... వార్తల్ని మార్పిడి చేసుకునే ఓ వాట్సాప్ గ్రూప్‌లో తాను సభ్యుడిగా మారానని చెప్పాడు. ఆ గ్రూప్ ద్వారానే పోలీసుల కదలికలు, నగరంలో స్నాచింగ్స్ తీరుతెన్నులు తెలుసుకుంటూ పంజా విసిరేవాడినని వివరించాడు. మోసిన్ షా తాను స్నాచింగ్ చేసిన మర్నాడు ఈ గ్రూప్‌తో పాటు పత్రికల్నీ క్షుణ్ణంగా పరిశీలించే వాడట. ఎక్కడైనా సీసీ కెమెరాల్లో తన ఫొటో రికార్డు అయిందా? ఆ వివరాలు పోలీసులు గుర్తించారా? తదితర అంశాలు తెలుసుకోవడానికి ఇలా చేసే వాడినని టాస్క్‌ఫోర్స్ విచారణలో బయటపెట్టాడు. అబిడ్స్ ఠాణా పరిధిలో 2015 అక్టోబర్ 29న ఆటోలో ప్రయాణిస్తున్న మహిళపై సింగిల్‌గా పంజా విసిరిన ఫుటేజ్ కొన్ని రోజుల తర్వాత బయటకు రావడంతో కాస్తంత ఉలిక్కిపడ్డాడట ఈ ఘరానా స్నాచర్. మోసిన్, జమీల్‌లను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించిన ఆసిఫ్‌నగర్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
కూర వండలేదని హత్య
నవవధువును కడతేర్చిన భర్త జీడిమెట్ల: భర్త చేతిలో ఓ నవవధువు హత్యకు గురైంది. తప్పతాగి వచ్చిన ఆ దుర్మార్గుడు కూర వండలేదని గొంతు నులిమి భార్య ఉసురుతీశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ దారుణ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై భూపాల్ గౌడ్, మృతురాలి తల్లిదండ్రుల కథనం ప్రకారం... మెదక్‌జిల్లా ఆందోల్ మండలం తాడ్మనూర్ గ్రామానికి చెందిన మహ్మద్ హుస్సేన్, మహబూబ్ బీలకు ముగ్గురు కుమార్తెలు. రెండో కుతురు మోసిన్(19)ను గాజులరామారం డివిజన్ శ్రీరాం నగర్లో ఉండే దూరపు బంధువు మహ్మద్ ఫరీద్ 3వ కుమారుడు ఎండీ ఎజాస్(22)కు ఇచ్చి ఐదు నెలల క్రితం పెళ్లి చేశారు. కట్నం కింద అతనికి రూ.40 వేల నగదు, తులం బంగారంతో పాటు వంటసామగ్రి, బైక్ ఇచ్చారు. ఎజాస్ కూలి పనులు చేస్తుంటాడు. భార్య మోసిన్ అంటే మొదటి నుంచీ అతనికి ఇష్టం లేదు. బుధవారం రాత్రి 10 గంటలకు తప్ప తాగి ఇంటికి వచ్చిన ఎజాస్ అన్నం పెట్టమని భార్యను అడిగాడు. అన్నం వడ్డించిన ఆమె కూర వండలేదని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన ఎజాస్ భార్యతో గొడవపడి.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం సమీపంలో ఉండే బంధువులకు విషయాన్ని చెప్పి తెల్లవారుజామున 3 గంటలకు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. వెంటనే సీఐ సత్యనారాయణ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మోసిన్ హత్య విషయం తెలిసి నగరానికి చేరుకున్న ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని రాక్షసుడికి ఇచ్చి చంపుకున్నామని వారు రోదించిన తీరు అందరి హృదయాలను కలిచి వేసింది.