Mosquito bites
-
వర్షాకాలం: దోమల్ని తరిమి కొట్టే చిట్కాలు, ఈ మొక్కల్ని పెంచండి!
వర్షాకాలం వచ్చిందంటే... మేమున్నామంటూ దోమలు విజృంభిస్తాయి. దీంతో సీజనల్‌గా వచ్చే అనేక వ్యాధుల్లో చాలావరకు వివిధ రకాల దోమల వల్లే వస్తాయి. అందుకే దోమలను నివారించే కొన్ని సహజమైన నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం.వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో తడి, తేమ లేకుండా వాతావరణ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. చిన్నపిల్లలు, వృద్ధులుంటే మరింత జాగ్రత్త అవసరం. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. ఇంటిని, ఇంటి చుట్టుపక్కలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. టైర్లు, చిన్ని చిన్న ప్లాస్టిక్ డబ్బాలు, కుండలు లాంటివాటిల్లో కూడా నీరు ఉండిపోకూడా జాగ్రత్త పడాలి. వర్షాకాలంలో ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు, కిటికీలను మూసి ఉంచాలి. దోమతెరలను వాడాలి.దోమలు తీపి వస్తువులు, శరీర దుర్వాసనకు ఆకర్షితులవుతాయని మనందరికీ తెలుసు, అయితే కొన్ని సుగంధ పరిమళాలు వాటికి నచ్చవు. అలాంటి కొన్ని రకాలు వాసనలొచ్చే మొక్కల్ని పెంచుకుంటే చుట్టూ ఉన్న దోమలు, ఇతర కీటకాల బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. సాధారణంగా దోమల నివారణకు రసాయన రహిత పద్ధతుల ద్వారా దోమలను నివారించే ప్రయత్నాలు చేయాలి.పెరటి మొక్కలులెమన్ గ్రాస్: ఇంట్లో లెమన్ గ్రాస్ చెట్టు పెంచుకుంటే దోమలు రావు. లెమన్ గ్రాస్ కుండీల్లో పెంచుకోవచ్చు. దీన్ని ఇంటి బాల్కనీ లేదా మెయిర్ డోర్ దగ్గర ఏర్పాటు చేయాలి. లెమన్ గ్రాస్ వాసనకు దోమలు పారి పోతాయి.నిమ్మ ఔషధతైలం ఈ మొక్కను హార్స్‌మింట్ అని కూడా అంటారు. దీని సుగంధం దోమలను దూరం చేస్తుంది. ఇంకా తులసి మొక్కలు, బంతి పువ్వు మొక్కలు కూడా దోమల నివారణకు పనిచేస్తాయి. వేపాకుల్లో ఔషధ గుణాలు దోమల నివారణకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు నిప్పుల్లో వేపాకులు వేసి కాల్చాలి. దాని నుంచి వచ్చే పొగ ఇంట్లో వ్యాపించేలా చూసుకోవాలి. ఈ పొగ ప్రభావంతో దోమల బెడద క్రమంగా తగ్గుతుంది. వేపనూనె చర్మానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది. కర్పూరం సువాసన కారణంగా దోమలను అరికట్టడానికి ఉపయోగించవచ్చు.వెల్లుల్లి ఉత్తమ సహజ దోమల వికర్షకాలలో ఒకటిగా చేస్తుంది. వెల్లుల్లి ఘాటైన రుచి , వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. వెల్లుల్లిని నీటిలో వేసి మరిగించి, ఆ నీటికి చుట్టూ పిచికారీ చేయండి. కొబ్బరినూనె, లవంగాలు: దోమలు కుట్టకుండా ఉండాలంటే కొబ్బరినూనె మిశ్రమాన్ని చర్మానికి రాసుకుంటే ఫలితం బాగుంటుంది. కొబ్బరినూనెలో కొద్దిగా నిమ్మరసం, లవంగాలు వేసి గోరువెచ్చగా వేడి చేయండి. ఈ మిశ్రమాన్ని బాటిల్లో నిల్వ చేసి రోజూ సాయంత్రం చర్మానికి రాసుకుంటే దోమలు కుట్టవు.టీ ట్రీ ఆయిల్ ఈ వాసన దోమలకు అస్సలు పడదు. హోం డిప్యూజర్, కొవ్వొత్తులు, క్రీమ్, లోషన్ వంటి వాటిల్లో టీ ట్రీ ఆయిల్ కలుపుకోవచ్చు. అలాగే దోమ కుట్టిన చోట ఈ నూనె రాస్తే దురద తగ్గుతుంది.మస్కిటోకాయిల్స్, రిపెలెంట్స్, ఇలా నేచురల్ ప్రొడక్ట్స్ వాడాలి. ఒడోమస్ వంటి ఉత్తమ నాణ్యతగల, హాని చేయని క్రీములు వాడవచ్చు. చిన్న పిల్లలు రాత్రి పూట కాళ్లను పూర్తిగా కవర్ చేసే దుస్తులు వేయాలి. -
రాజమౌళి ఈగలాగ.. దోమలు కూడా రివెంజ్ తీర్చుకుంటాయా?
వర్షాకాలం వచ్చేసింది.. ఈ సీజన్లో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే దోమలు మనుషులనే ఎందుకు కుడతాయి? ఎంతమంది ఉన్నా అదేపనిగా కొందరినే ఎందుకు టార్గెట్ చేసి అటాక్ చేస్తాయి? మరికొందరిని మాత్రం అస్సలు కుట్టవు ఎందుకో? ఇలా మనలో మనమే చాలాసార్లు ప్రశ్నలు వేసుకుంటుంటాం. అయితే నిజానికి ఈ విషయంలో దోమలకేమీ పక్షపాతం ఉండదట. దీని వెనుక సైన్స్ ఉందంటున్నారు పరిశోధకులు. మనకు నచ్చిన ఆహారాన్ని తీసుకున్నట్లే దోమలు కూడా వాటికి నచ్చిన వాళ్ల రక్తం తాగేస్తాయి. అంతలా దోమలను ఆకర్షించే అంశాలేంటి? దీని వెనకున్న స్టోరీ ఏంటీ చదివేద్దాం. ► సాధారణంగా దోమల్లో మగదోగమలు మనిషిని కుట్టవు. ఇవి చెట్ల రసాలపై ఆధారపడి జీవిస్తాయి. ఆడదోమల్లోనే మనిషిని కుట్టేందుకు అవసరమైన ముఖ విన్యాసం ఉంటుంది. అందువల్ల ఇవే మనిషి రక్తాన్ని పీలుస్తాయి.అట్లాగని రక్తం వీటి ఆహారం అనుకోవద్దు. కేవలం గుడ్లు పెట్టడానికి అవసరమైన ప్రొటీన్ దోమలకు మనిషి రక్తం ద్వారా లభిస్తుంది. దీనికోసమే అవి మనుషులను కుడతాయి. Yesterday, we visited Kyenjojo SS who are making mosquito repellent Vaseline.In 2021, Uganda had the 3rd highest global burden of malaria cases (5.1%) and the 7th highest level of deaths (3.2%). In creating this Vaseline, the students are looking to prevent rather than cure. pic.twitter.com/97EEujl6Tl— Investors Club Ltd Ug (@InvestorsClubUg) July 12, 2023 ► ఏ, బీ బ్లడ్ గ్రూపుల వారితో పాటు ఏబీ పాజిటివ్ ఉన్న బ్లడ్ గ్రూపుల వారిని దోమలు ఎక్కువగా కుడతాయని కొన్ని అధ్యయానాలు చెబుతున్నాయి. ఎందుకంటే వీరి శరీరం నుంచి వచ్చే ఒక రకమైన వాసనను పసిగట్టి దోమలు అటాక్ చేస్తాయట. ► చర్మంపై సహజంగా లభించే యాసిడ్ల వచ్చే వచ్చే వాసనకు దోమలు ఆకర్షితమం అవుతాయని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ► ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేవారి శరీర ఉష్ఱోగ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు దోమ కాటుకు గురికాక తప్పదట. Imagine not killing a mosquito that is sitting on your arm sucking your blood pic.twitter.com/jv7ts5uSvt— greg (@greg16676935420) July 17, 2023 ► కార్బన్ డై ఆక్సైడ్ అంటే దోమలుకు అమితమైన ఇష్టం, ఎకువగా సిఓ2 వదిలేవాళ్ళ చుట్టూ దోమలు వాలిపోతుంటాయట. ► గర్బవతులు, ఒబేసిటీతో బాధపడేవారి రక్తంలో మెటబాలిక్ రేట్స్ అధికంగా ఉంటాయట. అందుకే వీరిని దోమలు టార్గెట్ చేస్తాయట. ► చెమట ఎక్కువగా వచ్చేవారిలో లాక్టిక్ యాసిడ్, అమ్మోనియా రసాయనాల వల్ల దోమలు కుడతాయి. ► అంతేకాకుండా నల్లరంగు దుస్తులు ఎక్కువగా వేసుకుంటే దోమలు అట్రాక్ట్ అవుతాయట. దోమతెరల్లో ఎన్నో వినూత్న రకాలు, ఇవి ట్రై చేయండి The mosquitoes in Haiti would just fold it back https://t.co/RJi3hXsrQG— 💲LEX💲 (@Zoboylex) July 17, 2023 -
ఆడ దోమలు మాత్రమే ఎందుకు కుడతాయో తెలుసా?!
దోమ కాటు బారిన పడకుండా ఉండాలంటే, మన నివాసాలకు దగ్గరలో వాటి ఆవాసాలు లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే దోమలు ఇంట్లో తిరగకుండా పరిశుభ్ర వాతావరణం కల్పించుకోవాలి. చికిత్స కన్నా నివారణే ఉత్తమమని గుర్తించాలి. దోమ కాటు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ►ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ చేరకుండా జాగ్రత్త పడాలి. నిల్వ నీటిలో దోమలు గుడ్లు పెడతాయి. ఎక్కడైనా నీరు నిలిచినట్లు ఉంటే దాన్ని శుభ్రం చేయడం లేదా ఆ నీటిలో కాస్త కిరోసిన్ వేయడం ద్వారా దోమలు చేరకుండా చూడొచ్చు. అలాగే మురికి నీటిలో నడవడం కూడా మంచిది కాదు. ►ఇంట్లో పగిలిన కిటికీలు, ద్వారాలు సరిచేయించడం, కిటికీలకు, ద్వారాలకు తెరలను అమర్చడం మంచిది. రిపెల్లెంట్లు, దోమల బ్యాట్లు చాలా వరకు దోమల నివారణకు ఉపయోగపడతాయి. ►బెడ్‌పై దుప్పట్లు దిండ్లు ఇష్టారీతిన ఉంచకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. దోమతెరను వాడడం అత్యుత్తమ నివారణా మార్గం. ►ఆరుబయట సాయంకాలాలు, ఉదయాలు అచ్ఛాదన లేకుండా తిరగవద్దు. ఈ సమయంలో దోమకాటు ప్రమాదకరం. మిగిలిన సమయాల్లో కూడా శరీరమంతా కప్పే దుస్తులు వాడడం వల్ల దోమకాటునుంచి కాపాడుకోవచ్చు. ►శరీరంలో సరైన ఇమ్యూనిటీ పెంచుకోవడం మంచిది. ఇందుకోసం సమతుల ఆహారం, నియమిత వ్యాయామం అవసరం. వీలైనంత ఎక్కువగా ద్రవరూప ఆహార పదార్ధాలు తీసుకోవాలి. నిల్వ ఆహారానికి దూరంగా ఉండాలి. ►కొన్ని రకాల వ్యాధులకు టీకాలున్నాయి. అవసరమనుకుంటే ఈ వ్యాక్సినేషన్ ఉపయోగపడుతుంది. ►శరీరంలో ఏదైనా అనారోగ్య చిహ్నాలు కనిపిస్తే వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించాలి. అశ్రద్ధ ప్రమాదకరం. దద్దుర్లు.. దురద దోమ కుట్టగానే వెంటనే మనకు తెలియదు. ఎందుకంటే దోమ విడుదల చేసే ఒక రసాయనం మనకు నొప్పి, జిల తెలియకుండా అవి రక్తం పీల్చేందుకు సాయం చేస్తాయి. అయితే దోమలు కుట్టిన కొద్ది సేపటికి బెందులు(దద్దుర్లు) రావడం జరుగుతుంది, అలాగే జిల కూడా ఆరంభమవుతుంది. దోమ లాలాజలంలో ఉండే యాంటీ కోయాగ్యులెంట్(రక్తం గడ్డ కుండా ఉంచే రసాయనం) వల్ల ఈ రియాక్షన్లు వస్తాయి. వీటిని గీరిన కొద్దీ పెద్దవి అవుతుంటాయి. ఈ దద్దుర్లు, దురద నివారణకు కొన్ని మార్గాలు.. యాంటీ హిస్టమైన్ క్రీమ్ లేదా అలెర్జీ నివారణ ఆయింట్మెంట్ పూయవచ్చు. ఇవి లేనప్పుడు గ్రీన్ టీ బ్యాగును తడిపి కుట్టిన చోట ఉంచడం వల్ల రిలీఫ్ వస్తుంది. ∙ దద్దుర్ల ద్వారా వచ్చే దురద నివారణకు తేన అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే అలోవీరా జెల్ కూడా దురద నివారణకు ఉపయోగపడుతుంది. ∙ తులసి ఆకుల రసం దద్దుర్లను నయం చేయడం, దురదను తగ్గించడమే కాకుండా దోమలు దరి చేరకుండా రక్షణనిస్తుంది. లాంవడర్ పుష్పాల ద్వారా వచ్చే ఆయిల్ దోమలను తరిమివేస్తుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ రక్షణ ఇస్తుంది. చర్మానికి కూడా మంచిది. ∙ లెమన్ యూకలిప్టస్ ఆయిల్, గ్రీక్ కాట్నిప్ ఆయిల్ సైతం దోమలను తరిమి వేయడంలో, దురద నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ∙ పైవేవీ దొరక్కపోతే వెనిగర్, వంట సోడా, వెల్లుల్లి, టూత్‌పేస్టును ట్రై చేయవచ్చు. వీటివల్ల దురద తగ్గుముఖం పడుతుంది. ఆడ దోమలే ఎందుకు కుడతాయి.. దోమల్లో మగదోమలు మనిషిని కుట్టవు. ఇవి సాధారణంగా చెట్ల రసాలపై ఆధారపడి జీవిస్తాయి. ఆడదోమల్లోనే మనిషిని కుట్టేందుకు అవసరమైన ముఖ విన్యాసం ఉంటుంది. అందువల్ల ఇవే మనిషి రక్తాన్ని పీలుస్తాయి. అట్లాగని రక్తం వీటి ఆహారం అనుకోవద్దు. కేవలం గుడ్లు పెట్టడానికి అవసరమైన ప్రొటీన్ దోమలకు మనిషి రక్తం ద్వారా లభిస్తుంది. దీనికోసమే అవి మనుషులను కుడతాయి. కుట్టి ఊరుకోకుండా పలు వ్యాధులను వ్యాపింపజేస్తాయి. అలాగే దోమలన్నీ ప్రమాదకారులు కాకపోవచ్చు. కొన్ని ప్రజాతులు మాత్రమే ప్రమాదకర వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. ముఖ్యంగా క్యూలెక్స్, అనాఫిలస్, ఏడిస్ జాతుల దోమల కాటు వల్ల పలు డేంజరస్ వ్యాధులు సంక్రమిస్తుంటాయి. కొందరికే ప్రత్యేకం? మనుషుల్లో కొందరు మిగిలినవారి కన్నా ఎక్కువగా దోమలను ఆకర్షిస్తారని, అందువల్ల వీరినే ఎక్కువగా కుడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. కొందరి శరీరాల జోలికి పొమ్మన్నా దోమలు పోవు. ఈ వ్యత్యాసానికి కారణాలేంటి అంటే దోమల్లో ఉండే ఘ్రాణ శక్తి అని చెప్పవచ్చు. దోమలకు కార్బన్ డై ఆక్సైడ్(సీఓ2) ఇష్టం. అందువల్ల ఎక్కువ సీఓ2 వదిలేవాళ్ల చుట్టూ ఎక్కువగా దోమలు మూగుతాయి. అంటే అధికంగా పనిచేసేవాళ్లు, వర్కౌట్లు చేసేవాళ్లకు దోమకాటు అవకాశాలు ఎక్కువ. అలాగే శరీరం నుంచి ఎక్కువ వేడి ఉత్పత్తి చేసేవాళ్లను కూడా దోమలు ఇష్టపడతాయి. ఉదాహరణకు గర్భిణీ స్త్రీలు. అలాగే శ్వాసలో లాక్టిక్ ఆసిడ్ వాసన ఉన్నవాళ్లను కూడా దోమలు ప్రేమిస్తాయి. రిపెల్లెంట్లు ఎంత సేఫ్? ఆధునిక యుగంలో దోమల నుంచి కాపాడటానికి పలు రకాల రిపెల్లెంట్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని రిపెల్లెంట్లను అగ్గిపుల్లతో వెలిగించి వాడాలి, కొన్నింటిని కరెంట్ ద్వారా వాడవచ్చు. వీటి ద్వారా విడుదలయ్యే రసాయనాలు దోమలను తరిమి కొడతాయి. అయితే అన్ని రకాల రిపెల్లెంట్లు మనిషికి మంచివి కావు. వీటివల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి. శ్వాస సంబంధమైన సమస్యలు, కళ్లు ఎర్రబారడం, జలుబు, దగ్గు, ఆస్తమా వంటి సమస్యలు రిపెల్లెంట్ల కారణంగా వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల కెమికల్ రిపెల్లెంట్లను వాడే బదులు సహజసిద్ధమైన రిపెల్లెంట్లు లేదా ఎలక్ట్రానిక్ తరంగాలు ఉత్పత్తిచేసే రిపెల్లెంట్లను వాడడం మంచిదని సిఫార్సు చేస్తున్నారు. -డి. శాయి ప్రమోద్ చదవండి: Mosquitoes: బోదకాలు, చికున్ గున్యా, కాలా అజర్.. ఇంకా -
మరింత తగ్గిన దోమకాటు జ్వరాలు
సాక్షి, అమరావతి: ఈ ఏడాది దోమకాటు జ్వరాలు మరింతగా తగ్గాయి. జ్వరాల తీవ్రత లేకపోవడంతో పెద్ద ఉపశమనం లభించినట్లయింది. 2019–20తో పోలిస్తే 2020–21లో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా కేసులు భారీగా తగ్గాయి. 2019తో పోలిస్తే 2020లోను, 2020తో పోలిస్తే 2021 రెండు నెలల్లోను ఈ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది అంటే జనవరి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఏడు వారాల్లో లెక్కిస్తే చికున్‌గున్యా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఫిబ్రవరి చివరికి వేసవిలోకి వచ్చినట్లే. దీంతో దోమకాటు జ్వరాల ప్రమాదం తక్కువే. ఇక చూసుకోవాల్సిందల్లా కలుషిత నీటివల్ల వచ్చే డయేరియా, టైఫాయిడ్ వంటి కేసులను నియంత్రించుకోవడమే. కొద్దినెలలుగా కోవిడ్ కారణంగా ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర ఒత్తిడిలో ఉన్నా దోమకాటు వ్యాధుల నియంత్రణపై పైచేయి సాధించింది. కలుషిత నీటి నియంత్రణకు కార్యాచరణ సాధారణంగా వేసవి కాలంలో కలుషిత నీరు తాగడం వల్ల డయేరియా, టైఫాయిడ్ వంటి కేసులు వస్తుంటాయి. వీటి నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖ సంయుక్త కార్యాచరణతో ముందుకెళుతున్నాయి. పల్లెటూరి నుంచి పట్టణాల వరకు తాగునీరు పరిశుభ్రంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించారు. 26 లక్షల దోమతెరల పంపిణీ లక్ష్యం రాష్ట్రంలో ఏజెన్సీతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా దోమల ప్రభావం ఎక్కువగా ఉన్న చోట దోమతెరల పంపిణీ సత్ఫలితాలు ఇస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి 25.94 లక్షల దోమతెరలు పంపిణీ చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 1.14 లక్షల దోమతెరలు పంపిణీ చేశారు. ఎల్ఎల్ఐఎన్ (లాంగ్ లాస్టింగ్ ఇన్సెక్టిసైడల్ నెట్స్) పేరుతో ఇచ్చే ఈ దోమతెరలు దోమల నుంచి ఊరటనివ్వగలవు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇవి మంచి ఫలితాలిచ్చాయి. వచ్చే సీజన్ నాటికి వీలైనంత వరకు దోమతెరలు పంపిణీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. తగ్గిన కేసుల తీవ్రత గతంతో పోలిస్తే దోమకాటు జ్వరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. మా ముందున్న లక్ష్యం సురక్షిత మంచినీరు అందించి డయేరియా, టైఫాయిడ్ వంటి జబ్బులు రాకుండా నియంత్రించడమే. దీనికోసం కార్యాచరణ రూపొందించాం. మిగతా శాఖలతో సమన్వయం చేసుకుంటున్నాం. – డాక్టర్ గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు -
వామ్మో..స్కేబిస్
అనంతపురం న్యూసిటీ: జిల్లా ప్రజలను మొండి వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. చర్మ సంబంధిత వ్యాధులైన స్కేబిస్ (గజ్జి), దోమ కాటు వ్యాధులతో చిన్నారుల నుంచి పెద్దల వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్వజనాస్పత్రిలోని చర్మవ్యాధి విభాగంలో రోజూ వచ్చే 250 కేసుల్లో 30 శాతం కేసులు ఇవే ఉంటున్నాయి. ఇక జిల్లాలోని వివిధ పీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల్లో ఈ అంటు వ్యాధులతో చిన్నారులు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భరించలేనినవ్వలు స్కేబిస్ (గజ్జి) ఇది అంటు వ్యాధి. ఒంటిపై దద్దుర్లుగా వచ్చి గుళ్లలుగా వ్యాప్తి చెందుతుంది. భరించలేని నవ్వలు వస్తాయి. దద్దుర్లు వచ్చిన చోట రుద్దడం కారణంగా పుండుగా మారి ఇబ్బంది పెడుతుంది. ప్రధానంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఎక్కువగా వస్తుంటుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి మరింత త్వరితగతిన అంటుతుంది. ఒక వ్యక్తికి సోకితే పదిహేను రోజుల్లో వ్యాధి బయటపడుతుంది. వర్షాకాలం సీజన్లో అధికంగా ఈ వ్యాధి వస్తుంటుంది. ఇంట్లో ఒకరికి సోకిందంటే మిగతా వారికి దశలవారీగా వ్యాప్తి చెందుతుంది. అలాగే దోమకాటు ద్వారా ఒంటిపై దద్దుర్లు ఏర్పడుతాయి. వందల్లో కేసులు ఈ సీజన్లో వందల కేసులు నమోదవుతున్నాయి. వివిధ పీహెచ్సీ, ఏరియా ఆస్పత్రి, సీహెచ్‌సీ, జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో అధిక సంఖ్యలో రోగులు క్యూకడుతున్నారు. ప్రజా రోగ్యంపై అవగాహన కల్పించాల్సిన అధికారులు నిద్రమత్తులో ఉన్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపాటి సమస్యనేనంటూ తీసిపారేస్తున్నారు. ఇదీ సంగతి శరీరంలోని చేతులూ కాళ్ల మధ్యలో చిన్న గుళ్లలుగా (పుండ్లు) ఏర్పడి, వ్యాధి ఏమని తెలుసుకునేలోపే ఒంటిపై వ్యాప్తి చెందుతుంది స్కేబిస్. శరీరంలో ఏదో ఒక ప్రాంతం నుంచి అన్ని భాగాల్లో గుళ్లలుగా ఏర్పడుతాయి. భరించలేని నవ్వలు. రుద్దుకుంటే (రాపిడి చేస్తే) మరింత నవ్వలు. చివరకు అవి పుండ్లుగా మారి ఇబ్బంది పెడతాయి. వర్షాకాలం సీజన్లో ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి ♦ వర్షాకాలంలో చర్మవ్యాధులైన స్కేబిస్, దోమకాటు వ్యాధులు అధికంగా వస్తాయి. ♦ స్కేబిస్ వ్యాధికి గురైన వారు యాంటీ స్కేబిటిక్ లోషన్లు (పర్మైట్, స్కేబెక్స్)వాడాలి. ♦ లోషన్ పట్టించిన 24 గంటలకు స్నానం చేసుకోవాలి. ♦ దురదలు అధికంగా ఉంటే సిట్రిజెన్ మాత్ర వాడాలి. ♦ పుండుగా మారినప్పుడు వైద్యుడి సలహాతో యాంటీబయాటిక్స్ వాడాలి. ♦ వ్యాధి సోకిన వారి వస్త్రాలను మరొకరు ధరించరాదు. ♦ వ్యాధి తగ్గిన వెంటనే వస్త్రాలు వేడి నీటిలో శుభ్రంగా కడుగుకోవాలి. ♦ కుటుంబంలో ఒకరికీ ఈ వ్యాధి సోకితే మిగితా వారు ముందస్తుగా లోషన్ పట్టించుకోవాలి. ♦ ఇక దోమకాటు వ్యాధులకు గురికాకుండా పరిశుభ్రత్తకు పెద్ద పీట వేయాలి. ♦ మస్కిటో కాయిల్స్, దోమతెరలు వాడాలి. ♦ వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలి. నెలకు 600 కేసుల పైమాటే ఇటీవల కాలంలో స్కేబిస్, దోమకాటు వ్యాధులతో వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. నెలకు దాదాపుగా 600 కేసులకుపైగానే ఈ వ్యాధులతో బాధపడేవారు వస్తున్నారు. ప్రధానంగా స్కేబిస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి. దగ్గర్లోని ఆస్పత్రిలో సంప్రదించి వైద్యం పొందాలి. లేని పక్షంలో ఇతరులకు వ్యాíపిస్తుంది.– డాక్టర్ బలరామిరెడ్డి, చర్మవ్యాధి నిపుణులు, సర్వజనాస్పత్రి -
‘దోమలు కుడుతున్నా లెక్కచేయడం లేదు’
సాక్షి, లక్నో : ప్రభుత్వ పథకాల అమలు కోసం రాష్ట్ర మంత్రులు రేయింబవళ్లు కష్టపడుతున్నారని యూపీ మంత్రి అనుపమా జైస్వాల్ చెప్పుకొచ్చారు. అన్ని వర్గాల ప్రయోజనాల కోసం చేపట్టిన పథకాల అమలుకు మంత్రులు దోమలు కుడుతున్నా లెక్కచేయకుండా పనిచేస్తున్నారని ఆమె కితాబిచ్చారు. మంత్రులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఎక్కడా ఫిర్యాదు చేయకుండా మరింత ఉత్సాహంగా ముందుకెళుతున్నారన్నారు. ఇలా పనిచేస్తున్నందుకు తమకు వచ్చే సంతృప్తే తమకు బలాన్నిస్తోందని వ్యాఖ్యానించారు. యూపీ మంత్రి సురేష్ రాణా దళితుని ఇంట పార్శిల్ భోజనం చేయడంతో రేగిన దుమారంపై స్పందిస్తూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ మంత్రి నిర్వాకంపై విపక్షాలతో పాటు వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు తాను దళితుల ఇళ్లలో భోజనాలకు వెళ్లబోనని, తన ఇంటికే వారిని ఆహ్వానించి విందు ఇస్తానని కేంద్ర మంత్రి ఉమాభారతి వ్యాఖ్యానించి మరో వివాదానికి తెరతీశారు. బీజేపీ నేతలు, మంత్రులు ఆచితూచి మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించినా బీజేపీ నేతలు నోరుజారి వివాదాల్లో కూరుకుపోతున్నారు. -
దోమ కాటు.. కాలుష్యం పోటు
సాక్షి,మేడ్చల్ జిల్లా: అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ..అధ్వానంగా పారిశుద్ధ్యం..కాలుష్యం..దోమకాటులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోగాల పాలతున్నారు.. ఇదీ గ్రామాల్లో దుస్థితి. అధికారులు పన్నులు వసూలుపై చూపిస్తున్న శ్రద్ధ అధిభివృద్ధి పనులపై చూపించడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో 77 గ్రామ పంచాయతీలు ఉండగా, 3.50 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. హైదరాబాద్ మహానగరానికి కూత వేటు దూరంలో ఉన్న పల్లెల్లో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం , దోమలు, ఈగలు, కాలుష్యం,దుర్వాసన వంటి సమస్యల కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో శానిటేషన్, వాటర్ వర్స్, డంపింగ్ యార్డులు, డస్ట్ బిన్లు, డ్రైనేజీలు, కల్వర్టులు , కమ్యూనిటీ హాళ్లు, అంతర్గత రోడ్లు, శశ్మాన వాటికలు వంటి, అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా, ప్రజాప్రతినిధుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అటుకెక్కుతున్నాయి. జవహర్ నగర్ డంపింగ్ యార్డుతో జవహర్‌నగర్, చీర్యాల, నాగారం, బండ్లగూడ, అహ్మద్‌గూడ, దమ్మాయిగూడెం గ్రామాలకు కాలుష్య సమస్య పొంచి ఉంది. ఈ డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న దుర్వాసనకు తోడు నీరు కూడా కాలుష్యంగా మారుతోంది. దీంతో ఇక్కడి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో అంతర్గత రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో వర్షా కాలంలో ప్రజల కష్టాలు వర్ణణాతీతం. ఆదాయం ఎక్కువే.. జిల్లాలో 77 గ్రామ పంచాయతీలు ఉండగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 12 గ్రామ పంచాయతీలు మినహాయించి మిగతా గ్రామాలన్నీ మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. గ్రామాల ప్రజల నుంచి ముక్కు పిండి ఏడాదికి వివిధ పన్నుల పేరుతో రూ.100 కోట్లు పంచాయతీ శాఖ వసూలు చేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.91 కోట్లు పన్నులు వసూలు చేసిన జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో పన్నులు పెంచడం ద్వారా రూ.100 కోట్లు లక్ష్యంగా చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు వివిధ పన్నుల ద్వారా రూ.62 కోట్లు వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులు మార్చి కల్లా మిగతా రూ.38 కోట్ల పన్నులు రాబట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం కింద రెండు పర్యాయాలు 77 గ్రామ పంచాయతీలకు రూ.15.30 కోట్ల నిధులు విడుదల చేసింది. అయినప్పటికీ గ్రామాల్లో అభివృద్ధి పనులు ముందుకు సాగటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. గ్రామపంచాయతీలకు సమకూరే ఆదాయంలో 30 శాతం సిబ్బంది జీతభత్యాలకు, 15 శాతం పారిశుద్ధ్య పనులకు, 15 శాతం విద్యుత్ దీపాలు, 15 శాతం నీటి సరఫరా, 20 శాతం నిధులు గ్రామంలో అభివృద్ధి పనులకు, 5 శాతం నిధులు ఇతర ఖర్చులకు (స్టేషనరీ తదితర వాటికి) వినియోగించాల్సి ఉన్నా ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
దోమలతో జర జాగ్రత్త గురూ!
న్యూఢిల్లీ: ప్రణాళికలు లేని నిర్మాణ పనులు, పరిశ్రమలు, వలసల పెరుగుదల భారతదేశ పట్టణాల్లో మలేరియా కేసులు పెరగడానికి కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన ప్రణాళికలు లేకుండా భవనాలు కట్టడం, పరిశ్రమలను స్థాపించడంవల్ల... దోమల పునరుత్పత్తికి దోహదం చేస్తోందని, అందుకే పట్టణ ప్రాంతాల్లో మలేరియా బాధితులు అధికంగా ఉంటున్నారని మలేరియా వ్యాధుల విభాగం అధినేత జీఎస్ సోనాల్ తెలిపారు. భవననిర్మాణం చేసేవాళ్లు, పారిశ్రామిక వేత్తలు చెత్తను సరైన పద్ధతిలో పారవేసినప్పుడే దోమల పునరుత్పత్తి నివారణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. అందుకోసం కొత్త నిర్మాణాలు చేపట్టేటప్పుడు, పరిశ్రమలు నెలకొల్పేటప్పుడు తప్పనిసరిగా ఆరోగ్యశాఖను సంప్రదించాలని ఆయన సూచించారు. మురికి లేదా నిల్వ ఉన్న నీటిలోని ఆడ ఎనాఫిలిస్ దోమ కాటువల్ల మలేరియా వస్తుందని, 2010లో భారత్‌లో 45వేల మలేరియా మరణాలు నమోదయ్యాయని సోనాల్ తెలిపారు. దేశం మొత్తంలో మలేరియా మృతుల సంఖ్య తగ్గిపోతుంటే.. పట్టణాల్లో మాత్రం మలేరియా కేసులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. దోమతెరలు ఉపయోగించడం, నిల్వ నీటిని తొలగించడం, చెత్త నిల్వ ఉండకుండా చేయడం వల్ల భారతదేశంలో మలేరియా కారణంగా సంభవిస్తున్న వేల మరణాలను తగ్గించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. గాలిలోని వాహకాల ద్వారా వ్యాపించే డెంగీ, మలేరియా వంటి వ్యాధుల సంఖ్య వేసవిలో పెరుగుతుందని, దోమలను బట్టి వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు. మూతలు లేని పాత్రల్లో నీరు నిల్వచేయొద్దని, కూలర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పోయకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని, నీరు నిల్వ ఉండి ఎటూ వెళ్లడానికి మార్గంలేకపోతే.. ఆ నిల్వ నీటిపై కిరోసిన్ చల్లడంవల్ల దోమలను నివారించొచ్చని ైవె ద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇవేవి సాధ్యంకాని సమయంలో కీటక సంహారక మందులను, దోమ తెరలను వాడాలని సూచిస్తున్నారు. దోమల నుంచి పి-వైవాక్స్, పి-ఫాల్సిపారం, పి-ఓవేల్, పి-మలేరియే అనే నాలుగు రకాల మలేరియాలు మనుషులకు వ్యాపిస్తాయని, వాటిలో మొదటి రెండు భారత ఉపఖండంలో ఎక్కువగా ఉండగా... చివరి రెండు ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు. వైవాక్స్ క్లోరోక్వినైన్తో వెంటనే తగ్గిపోగా... ఫాల్సిపారం అనేక సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు. సరైన సమయంలో చికిత్సనందించకపోతే ఈ జ్వరం మెదడు, కిడ్నీలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
బోదను మరిచారా?
రాయవరం, న్యూస్‌లైన్ : తాము చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ శాపగ్రస్థులుగా మారుతున్నారు ఫైలేరియా వ్యాధి గ్రస్థులు. దోమకాటుతో సోకే ఈ వ్యాధితో శరీరంలో భాగాలు బాగా వాచిపోతాయి. ఆభాగంలో బరువు అధికంగా ఉంటుంది. దాంతో కురూపులవుతుంటారు. ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రతీ ఏటా నవంబర్ 11న ఫైలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఆ సందర్భంగా డీఈసీ మాత్రల పంపిణీని నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటి వరకు 13 విడతలుగా ఫైలేరియా దినోత్సవాన్ని నిర్వహించిన జిల్లా యంత్రాంగం గతేడాది 14వ విడత ఫైలేరియా దినోత్సవాన్ని నిర్వహించలేదు. బోదవ్యాధిని నిర్లక్ష్యం చేస్తున్నారనడానికి ఇదే ప్రత్యక్ష తార్కాణం. ఫైలేరియా వస్తుందిలా... ప్రపంచ వ్యాప్తంగా దీన్ని లింఫాటిక్, సబ్ క్యూటినస్, సీరస్ క్యావిటీ ఫైలేరియాలుగా విభజించగా మన దేశంలో లింఫాటిక్ ఫైలేరియా వ్యాధిగ్రస్థులు మాత్రమే ఉన్నారు. దీనినే బ్రాంకఫ్టిన్ ఫైలేరియగా కూడా పిలుస్తారు. క్యూలెక్స్ ఆడదోమ కుట్టడం వలన ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. దోమల నియంత్రణ ఏదీ.. దోమల నిర్మూలన కేంద్రాలు రామచంద్రపురం, మండపేట, అమలాపురం, పెద్దాపురం, పిఠాపురం మున్సిపాల్టీల్లో ఒక్కొక్కటి, రాజమండ్రిలో రెండు, కాకినాడలో మూడు ఉన్నాయి. పల్లెల్లో దోమల నిర్మూలన కేంద్రాలు లేకపోవడంతో దోమలు దారుణంగా ప్రబలుతున్నాయి. ఫైలేరియా శాఖకు సిబ్బంది కొరత ఫైలేరియా శాఖ సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. పట్టణాల్లో దోమల నియంత్రణకు ఎబేట్ అనే దోమల మందును స్ప్రేచేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఫీల్డ్ స్టాఫ్ 96మంది ఉండాల్సి ఉండగా కేవలం 36మంది మాత్రమే ఉన్నారు. రామచంద్రపురం, అమలాపురం యూనిట్లలో రెండేళ్లుగా ఫీల్డ్ వర్కర్లు ఒక్కరూ లేరు. హెల్త్ ఇనస్పెక్టర్లు పూర్తిస్థాయిలో ఉన్నా సుపీరియర్ ఫీల్డ్ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇన్సెక్ట్ కలెక్టర్లు తగినంతమంది లేరు. 28 నుంచి 30 వరకు డీఈసీ మాత్రల పంపిణీ బోధ వ్యాధి నియంత్రణలో భాగంగా జిల్లాలో ఈనెల 28 నుంచి 30వ తేదీవరకు మూడురోజులపాటు 1.20 కోట్ల డీఈసీ మాత్రల పంపిణీకి చర్యలు చేపట్టినట్టు జిల్లా ఫైలేరియా అధికారిణి డాక్టర్ జక్కంశెట్టి శశికళ తెలిపారు. రెండేళ్లు పైబడి, 65 సంవత్సరాల లోపు ఉన్న 50 లక్షల జనాభాకు ఈ మాత్రలు అందజేస్తామన్నారు. అదేవిధంగా 54 లక్షల ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నామన్నారు. ఆ మూడురోజుల్లో ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశ కార్యకర్తలు, పారామెడికల్ సిబ్బంది డీఈసీ మాత్రల పంణీలో పాల్గొంటారన్నారు. ఫైలేరియా శాఖలో సిబ్బంది కొరత ఉన్న విషయం వాస్తవమేనన్నారు. జిల్లాలో ఫైలేరియా తీరు 1972లో మన జిల్లాలో 11 శాతం మంది ఫైలేరియా వ్యాధి క్రిమి కలిగిన వారు ఉండేవారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ బోధ వ్యాధి నివారణను పైలట్ ప్రాజెక్టుగా మన జిల్లాలో 1999 నవంబర్ 11న ప్రారంభించింది. 1999లో వ్యాధికారక క్రిమి రేటు జిల్లాలో 4 శాతం ఉండేది. 2010 నాటికి 0.14 శాతానికి తగ్గినట్టు జిల్లా ఫైలేరియా అధికారిణి డాక్టర్ శశికళ తెలిపారు. {పస్తుతం జిల్లాలో 15,533మంది బోధ వ్యాధిగ్రస్థులు ఉన్నట్టు సీనియర్ ఎంటమాలజిస్ట్ ప్రసాద్ తెలిపారు. రాయవరం, మాచవరం, రామచంద్రపురం, మండపేట, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, నేలటూరు, అంగర, పిఠాపురం ప్రాంతాలలో ఈ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉన్నారు. 1999 నుంచి 2012 వరకు ప్రతీ ఏటా ఫైలేరియా దినోత్సవం జరిగింది. -
రెండు కొక్కేలతో రక్తకణాలకు అతుక్కుంటుంది!
మలేరియా పరాన్నజీవి గుట్టువిప్పిన భారత సంతతి శాస్త్రవేత్త వాషింగ్టన్: దోమకాటు వల్ల మనిషిలోకి ప్రవేశించి క్రమంగా ఎర్ర రక్తకణాలను తినేస్తూ.. ప్రాణాలు హరించే మలేరియా వ్యాధికారక ప్లాస్మోడియం వైవాక్స్ పరాన్నజీవి గుట్టును భారత సంతతి శాస్త్రవేత్త నీరజ్ తోలియా విప్పారు. భారత్‌లోని ప్లాస్మోడియం జాతుల్లో అతి ప్రమాదకరమైన వైవాక్స్ పరాన్నజీవి మనిషి ఎర్ర రక్తకణాలకు రెండు ప్రొటీన్ కొక్కేలతో అతుక్కుంటుందని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన నీరజ్ కనుగొన్నారు. ఎర్ర రక్తకణంపై ఉండే రెండు ప్రొటీన్లను, తనలోని రెండు ప్రొటీన్లను ఉపయోగించి అది రెండు దశల ప్రక్రియ ద్వారా కొక్కేలను తయారు చేసుకుంటుందని ఆయన తేల్చారు. దీంతో మనిషి ఎర్ర రక్తకణాలపై ఆ ప్రొటీన్లను తొలగించేందుకు లేదా ప్లాస్మోడియం ప్రొటీన్లను నివారించేందుకు కొత్త టీకాలు, మందులు కనుగొంటే.. ఈ పరాన్నజీవిని నిర్మూలించొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.