MSCI
-
అదానీ గ్రూపు షేర్లకు ఎంఎస్సీఐ షాక్, కానీ..!
సాక్షి, ముంబై: బిలియనీర్ గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూపు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్ బర్గ్ కార్పొరేట్ మోసాల ఆరోపణల తరువాత అదానీ గ్రూపు భారీగా నష్టాలను మూటగట్టుకుంది. మార్కెట్ క్యాప్‌లో 100 బిలియన్ డాలర్ల కోల్పోయింది. తాజాగా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ట్రాకింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ (ఎంఎస్సీఐ) అదానీ గ్రూపు షేర్ల వెయిటేజీని తగ్గించింది. దీంతో శుక్రవారం కూడా మార్కెట్లో అదానీ ఫ్లాగ్షిప్ కంపెనీ షేర్ల నష్టాలు కొనసాగుతున్నాయి. ఇండెక్స్ ప్రొవైడర్ఎంఎస్సీఐ) నాలుగు అదానీ గ్రూప్ స్టాక్‌ల ఫ్రీ-ఫ్లోట్ డిగ్జినేషన్లను ఫ్రీఫ్లోట్‌ను తగ్గించింది. అయితే దాని గ్లోబల్ ఇండెక్స్‌ల నుండి ఏ స్టాక్లను తొలగించలేదని తెలిపింది. జనవరి 30 నాటికి ఎంఎస్సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ ఏసీసీ ఫ్రీ ఫ్లోట్లను తగ్గించింది. నువామా ఆల్టర్నేటివ్ & క్వాంటిటేటివ్ రీసెర్చ్ అంచనాల ప్రకారం, ఈ చర్య తీసుకున్నది. మిగిలిన అదానీ గ్రూప్ కంపెనీలకు ఉచిత ఫ్లోట్లు అలాగే ఉంటాయని తెలిపింది. నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల నుండి మొత్తం 428 మిలియన్ డాలర్ల ఔట్ ఫ్లో ఉంటుందని ఎంఎస్సీఐ అంచనా వేసింది. ఇందులో అదానీ ఎంటర్ప్రైజెస్ 161 మిలియన్ డాలర్ల, అదానీ ట్రాన్స్మిషన్ 145 మిలియన్ డాలర్ల , అదానీ టోటల్ గ్యాస్ 110 మిలియన్ డాలర్లు, ఏసీసీ 12 మిలిన్ డాలర్లు ఉంటాయని తెలిపింది. అలాగే ఎంఎస్సీఐ ఇండెక్స్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా, సీసీ పవర్ & ఇండస్ట్రియల్లను జోడించగా బయోకాన్‌ను తొలగించింది. తాజా మార్పులు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయి. షేర్ల పతనం ఈ నేపథ్యంలో అదానీ ఎంటర్ప్రైజెస్ 8శాతం, అదానీ టోటల్ గ్యాస్ 6.4 శాతం అదానీ ట్రాన్స్మిషన్ 5 శాతం, అదానీ పవర్ 5 శాతం అదానీ విల్మార్ 3 శాతం క్షీణించాయి. మరోవైపు అదానీ పోర్ట్స్ అదానీ గ్రీన్ ఎనర్జీ, ఏసీసీ, ఎన్డీటీవీ, అంబుజా సిమెంట్ లాభాల్లు ఉన్నాయి. -
మోతీలాల్ ఓస్వాల్ ఎంఎస్‌ఈఐ ఇండెక్స్ ఫండ్
మోతీలాల్ ఓస్వాల్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ‘మోతీలాల్ ఓస్వాల్ ఎంఎస్సీఐ ఈఏఎఫ్‌ఈ టాప్ 100 సెలక్ట్ ఇండెక్స్ ఫండ్’ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. దీనిద్వారా ఎంఎస్‌ఈఐ ఈఏఎఫ్ఈలో టాప్–10 దేశాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చని పేర్కొంది. యూరోప్, ఆస్ట్రేలియా తదితర 21 వర్ధమాన మార్కెట్ల వెయిటేజీతో ఎంఎస్సీఐ ఈఏఎఫ్ఈని ఏర్పాటు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి తీసుకొచ్చిన మొదటి ఇండెక్స్ ఫండ్ ఇదని, దీనివల్ల అంతర్జాతీయంగా ఉన్న చక్కని అవకాశాలను కోల్పోకుండా చూసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ నూతన ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్వో) ఈ నెల 15న మొదలై.. 25న ముగుస్తుంది. -
ఎంఎస్‌సీఐలో చోటు- షేర్ల హైజంప్
ముంబై: ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పెట్టుబడులకు ప్రామాణికంగా పరిగణించే ఎంఎస్సీఐ ఇండియా ఇండెక్స్ తాజాగా సవరణలు చేపట్టింది. ఆరు నెలలకు ఒకసారి నిర్వహించే సమీక్షలో భాగంగా 12 షేర్లకు చోటు కల్పించనుంది. మరో రెండు షేర్లను ఇండెక్సు నుంచి తొలగించనుంది. అదానీ గ్రీన్, ట్రెంట్, యస్ బ్యాంక్ బాలకృష్ణ, అపోలో హాస్పిటల్స్, ఇప్కా ల్యాబొరేటరీస్, ఎంఆర్ఎఫ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, పీఐ ఇండస్ట్రీస్, ముత్తూట్ ఫైనాన్స్ జాబితాలో చోటు సాధించనున్నాయి. అయితే బాష్, ఎల్ఐసీ హౌసింగ్‌ను తొలగిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇండెక్సుల ఏర్పాటు, నిర్వహణలో ఎంఎస్సీఐ అతిపెద్ద సంస్థకాగా.. పలు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఈ ఇండెక్స్ ఆధారంగా పెట్టుబడి కేటాయింపులు చేపడుతూ ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండెక్సులో భాగంకానున్న కంపెనీల కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. వెరసి లాభాలతో పరుగు తీస్తున్నాయి. ఇతర వివరాలు చూద్దాం.. జోష్‌లో.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో అదానీ గ్రీన్ ఎనర్జీ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 898 వద్ద ఫ్రీజయ్యింది. యస్ బ్యాంక్ 5 శాతం పెరిగి రూ. 44.15 వద్ద ఫ్రీజయ్యింది. ఇతర కౌంటర్లలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ 6.5 శాతం జంప్‌చేసి రూ. 1571ను తాకగా.., అపోలో హాస్పిటల్స్ 7 శాతం దూసుకెళ్లి రూ. 2,168కు చేరింది. ఈ బాటలో పీఐ ఇండస్ట్రీస్ 2.2 శాతం పుంజుకుని రూ. 2303 వద్ద, ట్రెంట్ 2 శాతం పెరిగి రూ. 710 వద్ద ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో పీఐ రూ. 2325 వద్ద, ట్రెంట్ రూ. 780 వద్ద గరిష్టాలకు చేరాయి. ఇక కొటక్ మహీంద్రా బ్యాంక్ 2 శాతం లాభంతో రూ. 1,790ను తాకగా.. ఎంఆర్ఎఫ్ 1 శాతం బలపడి రూ. 70,064కు చేరింది. అయితే తొలుత రూ. 3105కు పెరిగిన ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ ప్రస్తుతం 3.4 శాతం క్షీణించి రూ. 2923 వద్ద కదులుతోంది. తొలుత రూ. 2145కు జంప్ చేసిన ఇప్కా ల్యాబ్స్ 1.3 శాతం క్షీణించి రూ. 2034 వద్ద ట్రేడవుతోంది. ఇదేవిధంగా ఇంట్రాడేలో రూ. 1215కు ఎగసిన ముత్తూట్ ఫైనాన్స్ 2 శాతం నీరసించి రూ.1161 వద్ద కదులుతోంది. -
నష్టాలకు బ్రేక్ - సెన్సెక్స్ 359 ప్లస్..
బీఎస్ఈ సెన్సెక్స్ ఎనిమిది నెలల కనిష్ట ముగింపు స్థాయి నుంచి బుధవారం కోలుకుంది. దీంతో ఆరు రోజుల సెన్సెక్స్ నష్టాలకు, ఏడు రోజుల నిఫ్టీ నష్టాలకు తెరపడింది. ఎంఎస్‌సీఐలో చైనా షేర్లను చేర్చడంపై నిర్ణయం వాయిదా పడడం, ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండటంతో బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు పెరగడం, రూపాయి బలపడడం వంటి కారణాలతో స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 359 పాయింట్ల లాభంతో 26,840 పాయింట్లు, నిఫ్టీ 102 పాయింట్ల లాభంతో 8,124 పాయింట్ల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు ముఖ్యంగా ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం కూడా కలసివచ్చింది. అన్ని రంగాల సూచీలు లాభాల బాట పట్టాయి. అన్ని రంగాల షేర్లు,,, ముఖ్యంగా బ్యాంక్, ఆర్థిక సేవల సంస్థల, టెక్నాలజీ, వాహన, ఆయిల్ షేర్లు లాభపడ్డాయి. కెయిర్న్ ఇండియా 7 శాతం అప్ ఇక నిఫ్టీ ఫిఫ్టీలో కెయిర్న్ ఇండియా షేర్ బాగా లాభపడింది. విలీన ప్రతిపాదన విషయమై చర్చించడానికి వేదాంత, కెయిర్న్ ఇండియా బోర్డ్ సభ్యులు ఈ నెల 14న సమావేశం కానున్నారన్న వార్తల నేపథ్యంలో కెయిర్న్ ఇండియా 6.8 శాతం లాభపడింది. పంచదార పరిశ్రమకు వడ్డీలేని రూ.6,000 కోట్ల రుణాలివ్వాలన్న ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించడంతో పంచదార కంపెనీల షేర్లు పెరిగాయి.