M.Tech course
-
ఎంటెక్: పాత కోర్సులకు కత్తెర.. 7 కొత్త కోర్సులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్తగా పలు ఎంటెక్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు జేఎన్టీయూ చర్యలు చేపట్టింది. గతేడాది కొత్త కోర్సుల్లో ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నిం గ్, డేటా సైన్స్ వంటి ప్రధాన సబ్జెక్టులతోనే కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇవ్వగా, ఈసారి వాటి సంఖ్య పెంచి 7 రకాల కొత్తకోర్సులు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. ఈ జాబితాలో.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సైబర్ సె క్యూరిటీ.. సివిల్ ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ ఎయిడెడ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్.. ఈసీఈలో ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ వీఎల్ఎస్ఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మైక్రో ఎల్రక్టానిక్స్ అండ్ వీఎల్ఎస్ఐ డిజైన్.. మెకా నికల్లో మెకట్రానిక్స్ పీజీ కోర్సులు ఉన్నాయి. కొన్ని కాంబినేషన్లకు కత్తెర! గతేడాది బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో (సీఎస్ఈ) సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సీఎస్ఈ నెట్వర్క్స్ కోర్సులకు జేఎన్టీయూ అనుబంధ గుర్తింపు జారీ చేసింది. అయితే ఈసారి (2021–22లో) బీటెక్ సీఎస్ఈలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెరి్నంగ్, మెకానికల్‌లో ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌కు అనుబంధ గుర్తిం పు ఇస్తామని ప్రకటించింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌ను ప్రత్యేక కోర్సులుగా ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ కోర్సులకు కాలేజీల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవచ్చని జేఎనీ్టయూ వెల్లడించింది. అయితే గతేడాది బీటెక్‌లో ఇచి్చన సీఎస్ఈ నెట్వర్క్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇస్తారా, లేదా? అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. పాత వివరాలతోనే.. రాష్ట్రంలోని వృత్తి, సాంకేతిక విద్యా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు నిర్వహించే ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్ఎఫ్సీ)’తనిఖీలు ఈసారి నిర్వహించే అవకాశం కనిపించడం లేదు. గత ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో తనిఖీలు చేయలేదు. ప్రస్తుతం కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. రెండేళ్ల కిందటి తనిఖీలు, గతేడాది కాలేజీలు అందజేసిన డాక్యుమెంట్ల పరిశీలన, తాజాగా అందజేసే అఫిడవిట్ల ఆధారంగానే అనుబంధ గుర్తింపు జారీ చేసేందుకు యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. మే మొదటి లేదా రెండో వారంలో ‘అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)’నుంచి కాలేజీలకు, కోర్సులకు అనుమతులు లభించనున్నాయి. ఆ వెంటనే రాష్ట్ర యూనివర్సిటీలు ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ కోసం దరఖాస్తులు స్వీకరించనున్నాయి. మరోవైపు ఈసారి ఇంకో 12 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. చదవండి: ఆ రెండు సబ్జెక్టులు రాకుంటే.. ఇంజనీరింగ్‌లో సాధ్యమేనా?! -
మాకొద్దీ ‘టెక్’..
ఎంటెక్ కోర్సుల కొనసాగింపుపై ఇంజినీరింగ్ కళాశాలల వె నకడుగు స్వచ్ఛందంగా వద్దనుకుంటున్న యాజమాన్యాలు నిర్వహణ భారం, అధికారుల తనిఖీలే కారణం సిటీబ్యూరో: సరైన సౌకర్యాలు, అర్హులైన అధ్యాపకులు లేని ఇంజినీరింగ్ కళాశాలలపై ఓయూ అధికారులు సైతం కొరడా ఝళిపిస్తున్నారు. ఇప్పటివరకు జేఎన్టీయూహెచ్ వర్సిటీ నిజ నిర్ధారణ సంఘం తమ పరిధిలోని కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తూ వచ్చింది. అంతేగాక ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగాలేని కళాశాలలకు అనుబంధ గుర్తింపు నిరాకరించిన విషయం తెలిసిందే. తాజాగా త మ పరిధిలోని ఇంజినీరింగ్, పీజీ, వృత్తివిద్యా కళాశాలల్లో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బ్యాచిలర్ ఇంజినీరింగ్‌కు సంబంధించి మౌలిక సౌకర్యాలు, ఫ్యాకల్టీ ఆయా కళాశాలల్లో సరిపడా ఉన్నా.. ఎంటెక్ విషయానికొచ్చే సరికి యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రొఫెసర్ల నియామకంలో వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ప్రొఫెసర్ నెలకు రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని కళాశాలల యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. ట్యూషన్ ఫీజులు తక్కువ మొత్తంలో ఉండడం, మరోపక్క ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వ చెల్లింపులు ఆ స్థాయిలో లేకపోవడం, ఇచ్చే అత్తెసరు రీయింబర్స్మెంట్ కూడా సకాలంలో రాకపోవడంతో కళాశాలలపై పెను ఆర్థిక భారం పడుతోంది. మరోపక్క ఏఐసీటీఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని వర్సిటీ అధికారులు ఖరాకండిగా చెబుతుండడంతో కళాశాలలు తీవ్ర ఆందోళనలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎంటెక్ నిర్వహణతో ఏటేటా ఆర్థికభారం రెట్టింపవడంతో ఆలోచనలో పడ్డాయి. మరోదారి లేక నాలుగైదు కళాశాలలు ఈ విద్యా సంవత్సరానికి ఎంటెక్ కోర్సు కొనసాగించలేమని వర్సిటీ అధికారులకు తేల్చిచెప్పినట్లు సమాచారం. ఉన్న మౌలిక వసతులు, ఫ్యాకల్టీ మేరకే బ్రాంచ్‌లు నడపాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఇంకొన్ని కళాశాలలు పలు బ్రాంచ్‌లు రద్దు చేసుకుంటున్నట్లు సమచారం. వాస్తవంగా ఓయూ పరిధిలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలు పది మాత్రమే. వీటితోపాటు జేఎన్టీయూహెచ్ పరిధిలోని కళాశాలల్లోనూ ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో భారీగానే సీట్లల కోత పడిందని సమాచారం. దీంతో ఈ ఏడాది ప్రవేశాలకు ఎదురుచూసే విద్యార్థుల్లో చాలామందికి నిరాశ తప్పదు. పీజీ కళాశాలల్లోనూ.. మరోపక్క ఎంబీఏ, ఎంఫార్మసీ, పీజీ క ళాశాలలపై కూడా వర్సిటీ అధికారులు దృష్టి సారించారు. ఓయూ పరిధిలో ఎంబీఏ 140, ఫార్మసీ 15, పీజీ కళాశాలలు 75 ఉన్నాయి. ఈ కళాశాలలన్నింటిలో ఇటీవల ముమ్మరంగా అధికారుల తనిఖీలు ముగిశాయి. యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనల మేరకు ఫ్యాకల్టీ, మౌలిక సౌకర్యాలు, లైబ్రరీ, నాన్ టీచింగ్ స్టాఫ్ లేని పదుల సంఖ్యలో కళాశాలలకు నోటీసులు జారీ చేశారు. 20 రోజుల్లో లోపాలు సవరించుకోవాలని యాజమాన్యాలకు గడువిచ్చారు. గతేడాది నిబంధనలు పాటించని పలు కళాశాలల్లో సీట్ల కోత పెట్టిన ట్లు అధికారులు తెలిపారు. అన్ని కళాశాలల్లో కలిపి మూడు వేల సీట్ల వరకు క త్తిరించామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చాలా కళాశాలలు వసతుల కల్పనలో మెరుగుపడ్డాయి. మరికొన్ని రోజుల్లో గడువు ముగియనుందని, ఈలోగా ఫ్యాకల్టీ నియామకాలు, వసతుల కల్పన దాదాపు అన్ని కళాశాల్లో జరగనుందన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. -
మాకొద్దీ ‘టెక్’..
♦ ఎంటెక్ కోర్సుల కొనసాగింపుపై ఇంజినీరింగ్ కళాశాలల వెనకడుగు ♦ స్వచ్ఛందంగా వద్దనుకుంటున్న యాజమాన్యాలు ♦ నిర్వహణ భారం, అధికారుల తనిఖీలే కారణం హైదరాబాద్ : సరైన సౌకర్యాలు, అర్హులైన అధ్యాపకులు లేని ఇంజినీరింగ్ కళాశాలలపై ఓయూ అధికారులు సైతం కొరడా ఝళిపిస్తున్నారు. ఇప్పటివరకు జేఎన్టీయూహెచ్ వర్సిటీ నిజ నిర్ధారణ సంఘం తమ పరిధిలోని కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తూ వచ్చింది. అంతేగాక ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగాలేని కళాశాలలకు అనుబంధ గుర్తింపు నిరాకరించిన విషయం తెలిసిందే. తాజాగా త మ పరిధిలోని ఇంజినీరింగ్, పీజీ, వృత్తివిద్యా కళాశాలల్లో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బ్యాచిలర్ ఇంజినీరింగ్‌కు సంబంధించి మౌలిక సౌకర్యాలు, ఫ్యాకల్టీ ఆయా కళాశాలల్లో సరిపడా ఉన్నా.. ఎంటెక్ విషయానికొచ్చే సరికి యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. ముఖ్యంగా ఫ్రొఫెసర్ల నియామకంలో వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ప్రొఫెసర్ నెలకు రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని కళాశాలల యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. ట్యూషన్ ఫీజులు తక్కువ మొత్తంలో ఉండడం, మరోపక్క ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వ చెల్లింపులు ఆ స్థాయిలో లేకపోవడం, ఇచ్చే అత్తెసరు రీయింబర్స్మెంట్ కూడా సకాలంలో రాకపోవడంతో కళాశాలలపై పెను ఆర్థిక భారం పడుతోంది. మరోపక్క ఏఐసీటీఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని వర్సిటీ అధికారులు ఖరాకండిగా చెబుతుండడంతో కళాశాలలు తీవ్ర ఆందోళనలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఎంటెక్ నిర్వహణతో ఏటేటా ఆర్థికభారం రెట్టింపవడంతో ఆలోచనలో పడ్డాయి. మరోదారి లేక నాలుగైదు కళాశాలలు ఈ విద్యా సంవత్సరానికి ఎంటెక్ కోర్సు కొనసాగించలేమని వర్సిటీ అధికారులకు తేల్చిచెప్పినట్లు సమాచారం. ఉన్న మౌలిక వసతులు, ఫ్యాకల్టీ మేరకే బ్రాంచ్‌లు నడపాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఇంకొన్ని కళాశాలలు పలు బ్రాంచ్‌లు రద్దు చేసుకుంటున్నట్లు సమచారం. వాస్తవంగా ఓయూ పరిధిలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలు పది మాత్రమే. వీటితోపాటు జేఎన్టీయూహెచ్ పరిధిలోని కళాశాలల్లోనూ ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో భారీగానే సీట్లల కోత పడిందని సమాచారం. దీంతో ఈ ఏడాది ప్రవేశాలకు ఎదురుచూసే విద్యార్థుల్లో చాలామందికి నిరాశ తప్పదు. పీజీ కళాశాలల్లోనూ.. మరోపక్క ఎంబీఏ, ఎంఫార్మసీ, పీజీ క ళాశాలలపై కూడా వర్సిటీ అధికారులు దృష్టి సారించారు. ఓయూ పరిధిలో ఎంబీఏ 140, ఫార్మసీ 15, పీజీ కళాశాలలు 75 ఉన్నాయి. ఈ కళాశాలలన్నింటిలో ఇటీవల ముమ్మరంగా అధికారుల తనిఖీలు ముగిశాయి. యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనల మేరకు ఫ్యాకల్టీ, మౌలిక సౌకర్యాలు, లైబ్రరీ, నాన్ టీచింగ్ స్టాఫ్ లేని పదుల సంఖ్యలో కళాశాలలకు నోటీసులు జారీ చేశారు. 20 రోజుల్లో లోపాలు సవరించుకోవాలని యాజమాన్యాలకు గడువిచ్చారు. గతేడాది నిబంధనలు పాటించని పలు కళాశాలల్లో సీట్ల కోత పెట్టిన ట్లు అధికారులు తెలిపారు. అన్ని కళాశాలల్లో కలిపి మూడు వేల సీట్ల వరకు క త్తిరించామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చాలా కళాశాలలు వసతుల కల్పనలో మెరుగుపడ్డాయి. మరికొన్ని రోజుల్లో గడువు ముగియనుందని, ఈలోగా ఫ్యాకల్టీ నియామకాలు, వసతుల కల్పన దాదాపు అన్ని కళాశాల్లో జరగనుందన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. -
ఏం‘టెక్’ కాలేజీలో..!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సుల్లోనే కాదు.. ఎంటెక్ కోర్సుల్లోనూ సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనే ఎంటెక్ కోర్సులను కొనసాగిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. అనేక కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు లేవు. ఒకవేళ ఉన్నా సరిపడా కంప్యూటర్లు సమకూర్చడం లేదు. అధ్యాపకుల కొరత కూడా ఎక్కువే. కొన్ని కాలేజీల్లో బోధనే సరిగ్గా జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మరికొన్ని కాలేజీల్లో అనర్హులతో బోధన కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. 50 శాతం వరకు కాలేజీల్లో అరకొరగా ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నట్లు అంచనా. ఈ పరిస్థితుల్లో ఈ నెల 6వ తేదీ నుంచి ఎంఈ/ఎంటెక్‌లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యా మండలి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అనేక కాలేజీలకు ఇప్పటివరకు అఫిలియేషన్లే లభించలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని గందరగోళం యాజమాన్యాల్లో నెలకొంది. అలాగే బీటెక్ ఇంజనీరింగ్ సీట్లలో కోతపడినట్లే పీజీ సీట్లు కూడా చాలా మేరకు కోత పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఎంటెక్కు బోధించాలంటే పీహెచ్డీ విద్యార్హత అవసరం. కానీ చాలా కాలేజీల్లో పీహెచ్డీ లేని వారితోనే బోధన కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఎంఫార్మసీలోనూ ఇదే పరిస్థితి నెలకొందని ఉన్నత విద్యా మండలి వర్గాలు పేర్కొంటున్నాయి. చాలా ఫార్మసీ కాలేజీల్లో ప్రయోగశాలలు సరిగా లేవని చెబుతున్నారు. ప్రయోగాలు చేసేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. బీటెక్ కోసం ఏర్పాటు చేసిన కొద్దిపాటి సదుపాయాలతోనే ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులను కొనసాగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బీటెక్ కాలేజీల్లో సదుపాయాలపై సీరియస్‌గా ఉన్న ప్రభుత్వం.. ఈ పీజీ కోర్సుల నిర్వహణ తీరుపైనా దృష్టి సారిస్తే మరిన్ని లోపాలు బయటపడే అవకాశం ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 349 ఎంటెక్, 188 ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు సగం కాలేజీలు తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ కాలేజీల్లో ఫస్ట్, సెకండ్ షిఫ్ట్ కలిపి ఎంటెక్‌లో 41,178 సీట్లు ఉండగా, ఎం.ఫార్మసీలో 15,452 సీట్లు ఉన్నాయి. ఎక్కువ కాలేజీల్లో విద్యార్థుల హాజరు అసలే ఉండదని, అవి ఫీజులు వసూలు చేసుకుని సర్టిఫికెట్లు ఇప్పించే కేంద్రాలుగా మారిపోయాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సదరు కాలేజీల అఫిలియేషన్ల విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎంటెక్‌లో ప్రవేశాలకు షెడ్యూల్ జారీ సాక్షి, హైదరాబాద్: ఎంఈ/ఎంటెక్/ఎంఆర్క్/ఎం.ఫార్మసీ/ఫార్మ్-డి కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నేతృత్వంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఈ ప్రవేశాలను చేపడతారు. ఈ నెల 6వ తేదీ నుంచి 19 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. 10 నుంచి 23వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. 2013, 2104 సంవత్సరాల్లో గేట్, జీప్యాట్ లేదా ఓయూ నిర్వహించిన పీజీఈసెట్‌లో అర్హత సాధించిన వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు. పూర్తి వివరాలను వెబ్ సైట్ (http://pgecet.apsche.ac.in, http://appgecet.org)లో ఉన్నాయి.