Mukarram jha
-
ముకరం జా అంతిమ సంస్కారాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: టర్కీలోని ఇస్తాంబుల్‌లో కన్నుమూసిన ఎనిమిదో నిజాం ముకరం జా అంతిమ సంస్కారాలు బుధవారం మక్కా మసీదు ప్రాంగణంలో జరగనున్నాయి. వీటి నేపథ్యంలో పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తూ అదనపు సీపీ జి.సుధీర్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 నుంచి అంతిమ సంస్కారాల తంతు పూర్తయ్యే వరకు ఓల్గా జంక్షన్, ముర్గీ చౌక్, చెలాపుర మహిళ ఠాణా, మిట్టీకా షేర్, మూసాబౌలి జంక్షన్, హిమ్మత్‌పుర జంక్షన్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయి. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మరోపక్క బుధవారం ఉప్పల్‌లో జరిగే భారత్–న్యూజిల్యాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది. నగరంలోని వివిధ హోటళ్లలో బస చేసిన క్రికెటర్లు రోడ్డు మార్గంలో ఉప్పల్ వెళ్తున్నారు. వీరి రాకపోకల నేపథ్యంలో బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల మధ్య సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట, రసూల్‌పురా, సీటీఓ, ఎస్బీఐ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, ఆలుగడ్డ బావి, మెట్టగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్ఐ, ఉప్పల్ మార్గంలో కొన్ని ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. -
Hyderabad: కేబీఆర్ నేషనల్ పార్కు స్థలం 8వ నిజాం రాజుదే..
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్క్ ఒకప్పుడు ఎనిమిదో నిజాం ముకరం జా బహదూర్‌కు చెందినదిగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఇస్తాంబుల్ లో ఆయన కన్నుమూయగా మంగళవారం ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చిన నేపథ్యంలో బంజారాహిల్స్‌తో ఆయనకున్న జ్ఞాపకాలను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. బంజారాహిల్స్‌లో 400 ఎకరాల విస్తీర్ణంలో ముకరంజా 1940లో చిరాన్ ప్యాలెస్‌ను నిర్మించుకొని దానిని తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు. ముకరంజా నిర్మించుకున్న చిరాన్ మసీదు ఇందులో రెండు సెల్లార్లు కూడా ఉన్నాయి. ప్రిన్స్ ఆడుకునేందుకు అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్ తో కూడిన బిలియర్డ్స్ గదులను నిర్మించారు. ఆయుధాలను భద్రపరిచే హాలు కూడా నిర్మించారు. మొదటి అంతస్తులు ఏడు బెడ్ రూములు ఉండగా భార్య పిల్లలతో ఇక్కడే ఉండేవారు. చిరాన్ ప్యాలెస్‌ను ఆనుకొని మోర్ బంగ్లా, గోల్ బంగ్లా, గుర్రాలు ఏనుగుల కోసం షెడ్లు, వాహనాలు భద్రపరిచేందుకు మోటార్ ఖానా ఉండేవి. అలాగే రాజు వాహనాల కోసం ప్రత్యేకంగా పెట్రోల్ బంకులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మంచినీటి సదుపాయం కోసం ప్రత్యేకంగా బావులు, చెరువులను తవ్వించారు. అయితే ముకరంజా ఎక్కువగా ఆ్రస్టేలియా, టర్కీ, లండన్ దేశాలలో ఉంటుండడంతో చిరాన్ ప్యాలెస్ అధ్వానంగా మారింది. ఈ నేపథ్యంలోనే 1998లోనే ఈ 400 ఎకరాల స్థలంలో నుంచి 360 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నేషనల్ పార్కుగా నోటిఫై చేసి దీనికి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి పేరు పెట్టింది. ఇది ఇలా ఉండగా ముకరంజాకు చెందిన చిరాన్ ప్యాలెస్ నిర్మితత 11 ఎకరాలు మాత్రం ఆయనకు కేటాయించారు. ప్రస్తుతం ఈ 11 ఎకరాల్లో ఉన్న చిరాన్ ప్యాలెస్ ఆయన ఆధీనంలోనే ఉన్నది. ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేసి దీనిని సంరక్షిస్తున్నారు. కొద్ది దూరంలోనే రాజు ప్రార్థనలు చేసుకునేందుకు చిరాన్ మసీద్‌ను కూడా నిర్మించారు. 20 సంవత్సరాల క్రితం ఈ మసీదును ప్రార్థనల కోసం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు ముకరంజా కోరుకున్నట్టుగానే పార్కు లో నెమలుల సంఖ్య భారీగా పెరిగింది. చిరాన్ ప్యాలెస్ చుట్టూ నెమళ్లు నిత్యం సందడి చేస్తుంటాయి. పార్కులో చిరాన్ ప్యాలెస్ ఒక అద్భుతమైన కట్టడంగా మిగిలి ఉంది. ముకరంజా మరణంతో చిరాన్ ప్యాలెస్ నిర్వహణ మరింత క్లిష్టంగా మారనుంది. 2004లో చివరిసారిగా ముకరంజా హైదరాబాద్ పర్యటనలో భాగంగా చిరాన్ ప్యాలెస్ సందర్శించి మసీదులో ప్రార్థన నిర్వహించిన స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ప్యాలెస్‌లో ఇప్పటికీ విలువైన, అరుదైన వజ్రాభరణాలు, ఖరీదైన కళాఖండాలు ఉన్నట్లు సమాచారం. -
ముకర్రం ఝా భౌతికకాయానికి నివాళులర్పించిన కేసీఆర్
-
‘నిజాం వారసులకు అధికారిక అంత్యక్రియల లాంఛనాలను ఖండిస్తున్నాము’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించడాన్ని రఘునందర్ రావు తప్పుబట్టారు. కేసీఆర్ చర్యలు కరెక్ట్ కాదంటూ కామెంట్స్ చేశారు. కాగా, ఎమ్మెల్యే రఘునందన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ దెబ్బకొడుతున్నారు. సమైఖ్యవాదానికి మద్దతు తెలిపిన నిజాం వారసులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడాన్ని ఖండిస్తున్నాము. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ ఎవరికి ఊడిగం చేస్తున్నారో ప్రజలు గమనించాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ లాంటి వారి ఆత్మలు కేసీఆర్ చర్యలతో ఘోషిస్తున్నాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
చౌమహల్లా ప్యాలెస్‌లో సీఎం కేసీఆర్.. నిజాం రాజు ముకరం జాకు నివాళులు..
-
Mukarram Jha: నిజాం రాజు ముకరం జాకు సీఎం కేసీఆర్ నివాళులు..
శంషాబాద్/చార్మినార్: టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఈ నెల 14న తుదిశ్వాస విడిచిన ఎనిమిదో నిజాం ముకరంజా బహదూర్ పార్థివదేహం మంగళవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఇస్తాంబుల్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్‌కు తెచ్చారు. భారీ బందోబస్తు నడుమ చౌమహల్లా ప్యాలెస్‌కు తీసుకెళ్లారు. రాత్రి 7 గంటలకు ముకరంజా భౌతికకాయాన్ని సందర్శించి సీఎం కేసీఆర్ నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అలాగే మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ముకరంజా భౌతికకాయానికి నివాళులర్పించారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్యాలెస్ లో ముకరంజా భౌతిక కాయాన్ని సందర్శించేందుకు ప్రజలను అనుమతించనున్నారు. మధ్యాహ్నం ప్యాలెస్ నుంచి మక్కా మసీదు వరకు నిజాం అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. మక్కా మసీదులో తన పూర్వీకులైన నిజాం సమాధుల పక్కన ముకరంజా పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు. అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 1967లో ఎనిమిదో నిజాంగా.. భారత యూనియన్‌లో హైదరాబాద్ చేరిన తర్వాత, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జనవరి 26, 1950 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు రాష్ట్ర రాజ్ ప్రముఖ్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 1967లో ఆయన మరణానంతరం ఏప్రిల్ 6, 1967లో ఎనిమిదవ అసఫ్ జాహీగా ముకరం జాకు పట్టాభిషేకం చేశారు. నిజాం చారిటబుల్ ట్రస్ట్, ముకరంజా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్‌కు ముకరంజా చైర్మన్‌గా వ్యవహరించారు. ఏడో నిజాం వారసుడిగా 1967 భారీ సంపదను ముకరంజా వారసత్వంగా పొందారు. -
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. అద్దె ఇంట్లో మరణించాడు
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన హైదరాబాద్ సంస్థానం 8వ నిజాం రాజు టర్కీలో అద్దె ఇంట్లో మరణించాడు. ఇస్తాంబుల్ నగరంలోని ఓ డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌లో జనవరి 14న మీర్ బర్కత్ అలీ ఖాన్ ముకరంజా బహదూర్ (89) కన్నుమూసినట్లు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. 1967లో కుబేరుడిగా ఉన్న ఆయన తన చివరి రోజుల్లో ఓ సామాన్యుడిలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 1971లో భారత ప్రభుత్వ రాజాభరణాలు రద్దు చేసేంత వరకు ‘ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్’గా ఉన్నారు. అత్యంత విలాసాలు, నలుగురు భార్యలు, పిల్లలో ఆస్తి వివాదాలతో ముకరంజా దివాళా తీశారు. ఆస్తులు అమ్మకుండా కోర్టు ఆంక్షలు విధించడంతో చేతిలో డబ్బుల్లేకుండా పోయాయి. 30 ఏళ్ల వయసులోనే 25 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు వారసుడైన ముకరంజా ఆ తర్వాత నిర్లక్ష్యం కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. కాగా ముకరంజా భౌతికకాయం మంగళవారం హైదరాబాద్ చేరుకుంటుందని నిజాంట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. తన అంతిమ సంస్కారాలను హైదరాబాద్ మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమాధుల వద్ద నిర్వహించాలన్న ఆయన కోరిక మేరకు పార్థీవ దేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ సంస్థానం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ మనుమడే ముకరంజా. 1933 అక్టోబర్ 6న ఫ్రాన్స్‌లో ఆయన జన్మించారు. డెహ్రాడూన్‌లో పాఠశాల విద్య, లండన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 1967లో 8వ అసఫ్ జాహీగా ముకరంజాకు పట్టాభిషేకం 1967లో ఎనిమిదవ నిజాంగా.. భారత యూనియన్‌లో హైదరాబాద్ చేరిన తర్వాత, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ జనవరి 26, 1950 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు రాష్ట్ర రాజ్ ప్రముఖ్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 1967లో ఆయన మరణానంతరం ఏప్రిల్ 6, 1967లో ఎనిమిదవ అసఫ్ జాహీగా ముకరంజాకు పట్టాభిషేకం చేశారు. నిజాం చారిటబుల్ ట్రస్ట్, ముకరంజా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్‌కు ముకరంజా చైర్మన్‌గా వ్యవహరించారు. ఏడో నిజాం వారసుడిగా 1967 భారీ సంపదను ముకరంజా వారసత్వంగా పొందారు. కాగా, మక్కా మసీదులోని అసఫ్‌జాహీ సమాధుల ప్రాంగణంలో ముకరంజా ఖననం కోసం నిజాం ట్రస్టు సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18న నిర్వహించే ముకరంజా అంత్యక్రియలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు సోమవారం పరిశీలించారు. ముందుగా చౌమహల్లా ప్యాలెస్‌ను సందర్శించిన అధికారుల బృందం సభ్యులు అక్కడ ఏర్పాట్లు పరిశీలించింది. ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో.. మంగళవారం ముకరంజా భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకు వచ్చిన అనంతరం చౌమహల్లా ప్యాలెస్‌కు తరలించనున్నారు. 18న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు చౌమహాల్లా ప్యాలెస్‌లో ఆయన పార్థివదేహాన్ని సందర్శించడానికి ప్రజలను అనుమతించనున్నారు. తర్వాత అంత్యక్రియలకోసం పార్థీవ దేహాన్ని తరలిస్తారు. -
ఎనిమిదో నిజాం రాజు ముఖరంజా బహుదూర్ కన్నుమూత
-
చివరి నిజాం రాజు మనవడు కన్నుమూత.. స్పందించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ సంస్థానం చివరి నిజాం రాజు, అసఫ్ జాహీ వంశానికి చెందిన ఉస్మాన్ అలీ ఖాన్ మనవడు మీర్ అలీ ఖాన్ ముకర్రం ఝా (నిజాం 8వ రాజు) మరణించారు. శనివారం రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. పార్థీవదేహాన్ని హైదరాబాద్ తీసుకువస్తారు. అంత్యక్రియలు మక్కా మసీదులో మంగళవారం నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. నిజాం పెద్దకొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతుల కుమారుడు ముకర్రమ్ ఝా 1933లో జన్మించారు. డెహ్రాడూన్, లండన్‌లో చదువుకున్నారు. 1971 వరకు ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్‌గా ఉన్నారు. 1980ల్లో ఈయన దేశంలోనే అత్యంత ధనవంతుడు కావడం గమనార్హం. సీఎం కేసీఆర్ స్పందన ముకరం ఝా మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిజాం వారసుడుగా, పేదల కోసం విద్యా వైద్య రంగాల్లో ముకర్రమ్ ఝా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. ముకర్రమ్ ఝా పార్థివ దేహం హైద్రాబాద్‌కు చేరుకున్న తర్వాత, వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియల సమయాన్ని, స్థలాన్ని నిర్దారించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్‌కు కేసీఆర్ సూచించారు. చదవండి: ఫిబ్రవరి 17న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం -
నిజాం నిధులపై పాక్‌కు చుక్కెదురు
లండన్: 1948 నుంచి లండన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లో డిపాజిట్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన నిజాం రాజుకు చెందిన 35 మిలియన్ పౌండ్ల (రూ. 306.5 వందల కోట్లు)పై దశాబ్దాలుగా నెలకొన్న న్యాయ వివాదం ప్రస్తుతానికి భారత్‌కు అనుకూలంగా ముగిసింది. ఆ నిధులపై పాకిస్తాన్‌కు ఎలాంటి హక్కు లేదని యూకే హైకోర్టు బుధవారం తీర్పునిచ్చింది. అవి భారత్‌కు, నిజాం వారసులకే చెందాలని స్పష్టం చేసింది. 1948లో ఏడవ నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ 10, 07, 940 పౌండ్ల, 8 షిల్లాంగ్ (సుమారు ఒక మిలియన్ పౌండ్లు)లను బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్ బ్యాంక్‌లోని పాకిస్తాన్ హై కమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహ్మతుల్లా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పటికి అవి దాదాపు 35 మిలియన్ పౌండ్లకు చేరాయి. ఆ నిధులు తమవేనని పాకిస్తాన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, నిజాం వారసులు లండన్‌లోని రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్‌లో కేసు వేశారు. ఆ తరువాత, నిజాం వారసులైన ప్రిన్స్ ముఖరం ఝా, ఆయన తమ్ముడు ముఫఖం ఝా భారత ప్రభుత్వంతో చేతులు కలిపి, పాక్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. అనంతరం, తాజా తీర్పులో.. ఆ నిధులపై హక్కు తమదేనంటూ పాకిస్తాన్ చేసిన వాదనను జస్టిస్ మార్కస్ స్మిత్ తోసిపుచ్చారు. ‘ఆ నిధులు ఏడవ నిజాం రాజుకు చెందినవి. అవి వారి వారసులకు, భారత్‌కు చెందుతాయి’అని తీర్పు ప్రకటించారు. ‘ఈ వివాదం ప్రారంభమైనప్పుడు నా క్లయింట్లు చిన్నపిల్లలు.. ఇప్పుడు వారి వయస్సు 80 ఏళ్లకు పైగానే. ఇప్పటికైనా, వారి జీవిత కాలంలోనే ఈ తీర్పు రావడం, అదీ వారికి అనుకూలంగా రావడం సంతోషంగా ఉంది’అని నిజాం వారసుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది పాల్ హెవిట్ వ్యాఖ్యానించారు. విచారణ సందర్భంగా పాక్ రెండు వాదనలు వినిపించింది. పాకిస్తాన్ నుంచి ఆయుధాలు కొనుగోలుకు సంబంధించిన డబ్బును లండన్ బ్యాంక్‌లో ఏడవ నిజాం జమ చేశారని, అందువల్ల ఆ నిధులు తమకే చెందుతాయన్నది ఒక వాదన. భారత్‌కు ఆ నిధులు చెందకూడదనే ఉద్దేశంతోనే లండన్ బ్యాంక్‌కు బదిలీ చేశారన్నది రెండవ వాదన. అలాగే, భారత ప్రభుత్వ ఆధీనంలోకి రాకముందు నిజాం రాజ్యం ప్రభుత్వ హోదాలో ఆ నిధుల బదిలీ చేసిందని కూడా పాక్ వాదించింది. హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కూడా చట్టవ్యతిరేక చర్య అని పేర్కొంది. ఈ వాదనలన్నింటిని కోర్టు తోసిపుచ్చింది. పాక్ నుంచి ఆయుధాల కొనుగోలు నిజమే అని నమ్ముతున్నప్పటికీ.. ఈ నిధులు వాటికి సంబంధించినవే అనేది నిర్ధారణ కాలేదని పేర్కొంది. భారత్‌కు చెందకూడదనే నిధుల బదిలీ జరిగిందని భావించినా.. దానర్థం ఆ నిధులు ఏదో ట్రస్ట్‌కు కాకుండా పాకిస్తాన్‌కే చెందాలనేందుకు ఆధారాలు లేవంది. హైదరాబాద్ రాజ్యం భారత్‌లో కలిసిన విషయం ఈ కేసుకు అప్రస్తుతమని స్పష్టం చేసింది. ఆ నిధులను తిరిగి తనకు ట్రాన్స్ఫర్ చేయాలని ఆ తరువాత నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ కోరిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి భారత ప్రభుత్వం, నిజాం వారసులు గత సంవత్సరం ఒక రహస్య ఒప్పందానికి రావడంతో.. ఈ కేసు భారత్– పాక్‌ల మధ్య వ్యాజ్యంగా మారింది. తీర్పుపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది. తీర్పును అధ్యయనం చేస్తున్నామని, న్యాయ సలహా తీసుకుని తదుపరి ఏం చేయాలనే విషయం నిర్ణయిస్తామని పేర్కొంది. హైదరాబాద్‌ను భారత ప్రభుత్వం అక్రమంగా ఆక్రమించిన విషయాన్ని కోర్టు విస్మరించిందని వ్యాఖ్యానించింది. ఏడవ నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ -
నిజాం‘ఖాన్’దాన్
సాక్షి, హైదరాబాద్: మీర్ ఉస్మాన్ అలీఖాన్.. ప్రపంచంలోనే ధనికుడు. హైదరాబాద్ సంస్థానాన్ని 1911 నుంచి 1948 సెప్టెంబర్ వరకు పాలించిన నిజాం రాజుల్లో చివరివాడు. ఉస్మాన్ అలీఖాన్‌కు ఇద్దరు కుమారులు.. ఆజంజా, మౌజంజా. వీరిని కాదని ఆజంజా కుమారుడు ముకర్రం జాను 8వ నిజాంగా ప్రకటించాడు. హైదరాబాద్ సంస్థానంపై భారత సైనిక చర్యకు కొద్ది రోజుల ముందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ నుంచి పాకిస్తాన్‌లోని బ్రిటిష్ హై కమిషనర్ రహమతుల్లా ఖాతాల్లోకి పలు దఫాలుగా రూ.3.5 కోట్ల నగదు (1,007,940 పౌండ్ల 9 షిల్లాంగ్‌లు) బదిలీ అయింది. ఈ నిధులు తిరిగి ఇవ్వాలని అప్పట్లోనే ఉస్మాన్ అలీఖాన్ కోరినా.. పాకిస్తాన్ పేచీతో వివాదం అరవై ఏళ్లు నలిగింది. ఎట్టకేలకు లండన్ బిజినెస్ అండ్ ప్రాపర్టీ హైకోర్టు ఇటీవల 140 పేజీల తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో ఉస్మాన్ అలీఖాన్ తరఫున అప్పటి హైదరాబాద్ ఆర్థిక మంత్రి మీర్ నవాజ్ జంగ్ జమ చేసిన నిధులకు ఆయన కొడుకులు ఆజంజా, మౌజంజా వారసులని (మనుమలు ముకర్రం జా, ముఫకం జా) తేల్చి, పాకిస్తాన్ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. అయితే అప్పట్లో జమ చేసిన రూ. 3.5 కోట్లు ప్రస్తుతం రూ.306 కోట్లకు పెరిగాయి. ఈ మొత్తం వారసులకే దక్కనున్న నేపథ్యంలో మళ్లీ హైదరాబాద్ ప్రపంచవ్యాప్త చర్చల్లోకి వచ్చింది. ప్రస్తుతం 8వ నిజాం ముకర్రం జా ఐదవ భార్యతో ఆస్ట్రేలియాలో నివసిస్తుండగా, ముఫకం జా ఫ్రాన్స్, లండన్‌లో నివాసం ఉంటూ అప్పుడప్పుడూ హైదరాబాద్ వచ్చి వెళ్తున్నారు. -
రోడ్లూడ్చిన రోల్స్‌రాయ్స్
లండన్‌లోని బాండ్ స్ట్రీట్. ఒకాయన ఆ వీధిలో నడుస్తున్నాడు. మార్గమధ్యంలో రోల్స్‌రాయ్స్ షోరూమ్ కనిపించింది. వెంటనే ఆ షోరూమ్‌లోకి వెళ్లిన ఆయన కార్ల ధరలు, ఇతర ఫీచర్స్ గురించి అడిగాడు. ఇండియా నుంచి వచ్చిన అందరిలాంటి ఓ సాధారణ వ్యక్తి అనుకున్న సేల్స్‌మ్యాన్.. అతడిని అవమానించాడు. బయటికి గెంటేసినంత పని చేశాడు. అలా అవమానం పొందిన వ్యక్తి ఎవరో కాదు హైదరాబాద్ నవాబు ముకర్రమ్ జా. వెంటనే హోటల్‌రూమ్‌కు వచ్చిన నవాబు తన సేవకులతో షోరూమ్‌కు ఫోన్ చేయించాడు. కార్లు కొనడానికి హైదరాబాద్ నవాబు వస్తున్నాడని చెప్పించాడు. ఈసారి పూర్తిగా నవాబు హోదా, రాజఠీవీతో షోరూమ్‌కు బయలుదేరాడు. ఆయన అక్కడికి చేరేటప్పటికే ఫ్లోర్‌పై రెడ్‌కార్పెట్ పరిచి ఉంది. అక్కడ ఉన్న సేల్స్‌మెన్ వంగి వంగి దండాలు పెట్టారు. నవాబు అప్పుడు షోరూమ్‌లో ఉన్న ఆరు కార్లను డెలివరీ ధరలు కూడా చెల్లించి కొనేశాడు. ఇండియాకు చేరుకున్న నవాబు కార్లు రాగానే... ఆ ఆరు కార్లకు పొరకలు కట్టి హైదరాబాద్ రోడ్లను శుభ్రం చేయించాలని మున్సిపల్ డిపార్ట్మెంట్ను ఆదేశించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రోల్స్‌రాయ్స్ కార్లు అలా నగరంలో చెత్తను శుభ్రం చేయడానికి ఉపయోగించారు. ఈ వార్త ఈ పత్రికా, ఆ పత్రికా చేరి చివరకు... ప్రపంచ ప్రఖ్యాత రోల్స్‌రాయ్స్ పరువు మురికి కాలువలో కలిసింది. యూరప్ అమెరికాల్లో ఈ కారును ఉపయోగించిన వారు.. ‘ఏది ఇండియాలో చెత్త మోయడానికి వాడుతున్నారే.. ఆ కారా?’ అని వ్యంగ్యంగా అనేవారట. ఒక్కసారిగా రోల్స్‌రాయ్స్ ప్రతిష్టతోపాటు రెవెన్యూ కూడా తగ్గిపోయింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా అసలుకే ఎసరొస్తుందనుకున్న రోల్స్‌రాయ్స్ యాజమాన్యం..నవాబుకు క్షమాపణలు చెబుతూ టెలిగ్రాం పంపింది. కార్లతో రోడ్లు క్లీన్చేయించడం ఆపేయాలని కోరింది. అంతేకాదు.. తాము చేసిన తప్పుకు బదులుగా ఆరు రోల్స్‌రాయ్స్ కార్లను ఉచితంగా ఇస్తామని కూడా ఆఫర్ చేసింది. 1967లో అతని నాన్నమ్మ మరణానంతరం ముకర్రమ్ జా యువరాజయ్యాడు. ప్రస్తుతం అతని ప్యాలెస్ మ్యూజియంగా మారింది. ఆ రోల్స్‌రాయ్స్ కార్లు కూడా ప్రదర్శనకు ఉంచారు.