Mullah Akhtar Mansour
-
'ఔను.. మా నాయకుడి మృతి వాస్తవమే'
కాబూల్: తాలిబాన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ మృతిపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. ఈ మేరకు మన్సూర్ మృతిని ధృవీకరిస్తూ బుధవారం తాలిబాన్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో మన్సూర్ మృతి చెందిన విషయం వాస్తవమే అని అంగీకరించింది. అలాగే కొత్త చీఫ్‌ను సైతం తాలిబాన్ సంస్థ ప్రకటించింది. ముల్లా హైబతుల్లా అకుంద్ కొత్త చీఫ్‌గా పగ్గాలు చేపట్టినట్లు తాలిబాన్ సంస్థ వెల్లడించింది. తాలిబాన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్ 2013లో పాక్‌లో చనిపోయాక 2015, జూలైలో తాలిబాన్ గ్రూపు పగ్గాలను ముల్లాహ్ అక్తర్ మన్సూర్ చేపట్టాడు. అయితే అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో మన్సూర్ మృతి చెందాడని కొన్ని రోజులుగా వార్తలొస్తుంన్న విషయం తెలిసిందే. కాగా, తమ భూభాగంలో అమెరికా వైమానిక దాడులు జరపడం తమ దేశ సార్వ భౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని పాకిస్తాన్ ప్రభుత్వం దీనిపై మండిపడింది. -
తాలిబాన్ నేత మృతిని ధ్రువీకరించలేం: షరీఫ్
లండన్: ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గ్రూప్ చీఫ్ ముల్లాహ్ అక్తర్ మన్సూర్ మృతిని ధ్రువీకరించలేమని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తెలిపారు. అమెరికా సైనిక దళాలు జరిపిన డ్రోన్ దాడుల్లో మన్సూర్ హతమైనట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నవాజ్ లండన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాలిబాన్ చీఫ్ మృతిపై తమకు ఇంకా నివేదికలు అందాల్సి ఉందన్నారు. మాన్సుర్ మృతిని ధ్రువీకరించేందుకు విచారణ జరుపుతున్నట్లు నవాజ్ పేర్కొన్నారు. అయితే డ్రోన్ దాడులకు సంబంధించి అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి పాక్ ఆర్మీ చీఫ్లో మాట్లాడినట్లు చెప్పారు. మరోవైపు ఘటనా స్థలంలో వలీ మొహమద్ పేరుతో ఉన్న ఓ పాస్‌పోర్టు లభించినట్లు పాక్ అధికారి తెలిపారు. వైమానిక దాడుల్లో మృతి చెందినవారిలో ఓ మృతదేహాన్ని స్థానిక ట్యాక్సీ డ్రైవర్‌గా గుర్తించినట్లు చెప్పారు. మరో మృతదేహాన్ని గుర్తించాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా తమ భూభాగంలో అమెరికా వైమానిక దాడులు జరపడం తమ దేశ సార్వ భౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని పాకిస్తాన్ ప్రభుత్వం మండిపడింది. కాగా తాలిబాన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్ 2013లో పాక్‌లో చనిపోయాక 2015, జూలైలో తాలిబాన్ గ్రూపు పగ్గాలను ముల్లాహ్ అక్తర్ మన్సూర్ చేపట్టాడు. -
అఫ్గాన్ తాలిబాన్ చీఫ్ హతం
పాక్‌లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో మన్సూర్ మృతి వాషింగ్టన్/కాబూల్: అమెరికా సైనిక దళాలు పాకిస్తాన్లో జరిపిన డ్రోన్ దాడుల్లో అఫ్గానిస్తాన్ తాలిబాన్ గ్రూపు అగ్రనేత ముల్లాహ్ అక్తర్ మన్సూర్ హతమయ్యాడు. అఫ్గాన్‌లో శాంతి ప్రక్రియకు పెనుముప్పుగా పరిణమించిన తాలిబాన్ గ్రూపునకు మన్సూర్ మరణం పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. అఫ్గాన్ సరిహద్దులోని పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ ప్రాంతంలో శనివారం అమెరికా ప్రత్యేక దళాలు మానవ రహిత డ్రోన్ల ద్వారా జరిపిన వైమానిక దాడుల్లో మన్సూర్ హతమైనట్టు అమెరికా, అఫ్గాన్ అధికారులు ధ్రువీకరించారు. అహ్మద్ వాల్టౌన్కు సమీపంలోని మారుమూల ప్రాంతమైన దాల్బందిలో ఒక వాహనంలో మన్సూర్, మరొక మిలిటెంట్ వెళుతుండగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడికి అమెరికా అధ్యక్షుడు ఒబామా అనుమతి ఇచ్చారని ఆ దేశ అధికారులు తెలిపారు. తాలిబాన్ గ్రూపు కొత్త నాయకుడిని ఎన్నుకుని కాబూల్‌కు రావాలని, ఒక రాజకీయ పార్టీ మాదిరిగా వ్యవహరించాలని అఫ్గాన్ రక్షణ శాఖ ప్రతినిధి దౌలత్ వాజిరి హితవు పలికారు. మన్సూర్‌తో అమెరికా బలగాలకు, అఫ్గాన్ ప్రజలకు ముప్పు ఉందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ అన్నారు. తాలిబాన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్ 2013లో పాక్‌లో చనిపోయాక 2015, జూలైలో తాలిబాన్ గ్రూపు పగ్గాలను మన్సూర్ చేపట్టాడు. ఇదిలా ఉండగా తమ భూభాగంలో అమెరికా వైమానిక దాడులు జరపడం తమ దేశ సార్వ భౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని పాకిస్తాన్ ప్రభుత్వం మండిపడింది. -
'తాలిబన్ చీఫ్‌తో పుతిన్ భేటీ అయ్యాడు'
లండన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అఫ్ఘానిస్తాన్‌లోని ఓ తాలిబన్ కమాండెర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పుతిన్ తాలిబన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ముల్లా అక్తర్ మన్సౌర్తో గోప్యంగా సమావేశమైనట్టు ఇంగ్లండ్‌కు చెందిన ఓ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అరికట్టడానికి సాయం చేయాల్సిందిగా పుతిన్ తాలిబన్లను కోరినట్టు వెల్లడించాడు. గత సెప్టెంబర్‌లో తజకిస్థాన్‌లోని ఓ మిలటరీ స్థావరంలో ఓ రాత్రి పుతిన్..తాలిబన్ చీఫ్‌ను డిన్నర్ సమావేశానికి పిలిచారని చెప్పాడు. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన తుర్కెమినిస్థాన్, తజకిస్థాన్ సరిహద్దులో ఉన్న అఫ్ఘానిస్తాన్‌లో ఐఎస్ ప్రాబల్యం పెరిగిపోతుండటం పట్ల పుతిన్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తాలిబన్ కమాండర్ చెప్పాడు. ఐఎస్ కార్యకాలపాలను నిర్మూలించేందుకు సాయం చేస్తే తాలిబన్లకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఆయుధాలు అందజేస్తామని రష్యా హామీ ఇచ్చినట్టు తెలిపాడు. అయితే ఈ ఆరోపణలను తాలిబన్ తోసిపుచ్చింది. ఐఎస్‌ను ఎదుర్కోవడానికి రష్యాతో తమ ప్రతినిధులు సమావేశం కాలేదని తాలిబన్ చెప్పింది. మధ్యప్రాచ్యంలోని షారమ్ ఎల్ షేక్ పర్యాటక ప్రాంతంలో అక్టోబర్‌లో రష్యా విమానం కూల్చివేత వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాన కుట్రదారుడని కేజీబీ (ఇప్పటి ఎఫ్ఎస్బీ) ఏజెంట్ బోరిస్ కార్పిఖోవ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులను అమానుషులుగా ముద్ర వేసేందుకు, వారి అంతానికి పలు దేశాల సంఘీభావాన్ని కూడగట్టుకునేందుకు పుతిన్ ఈ దారుణ కుట్రకు తెర లేపారన్నది కార్పిఖోవ్ వాదన. అయితే ఈ వాదనలను రష్యా ఖండించింది. తాజాగా తాలిబన్ కమాండర్.. పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.