చైన్ స్నాచింగ్ కేసుల్లో ముగ్గురి అరెస్టు
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్ : మహిళల మెడలోంచి బంగారు పు స్తెల తాళ్లు, గొలుసులు దొంగతనానికి పా ల్పడిన ముగ్గురు యువకులను పట్టణ పో లీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. శనివారం స్థానిక పట్టణ పో లీస్‌స్టేషన్‌లో నిందితులను విలేకరుల ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా సీఐ శివశంకర్ మాట్లాడుతూ.. సంగారెడ్డి పట్టణంలోని మంజీరా నగర్, ప్రశాంత్ నగర్, బృందావన్ కాలనీ, నాగార్జున కాలే జ్ రోడ్డులో, పోతిరెడ్డిపల్లి, కంది గ్రామా ల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళల మెడల్లోంచి పలు సందర్భాల్లో ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడకు చెందిన షేక్ అంజద్ , కుమ్మరి శ్రీకాంత్, గుంటూరు మురళీవరప్రసాద్, రాజేష్ కుమార్‌లు దొంగతనానికి పాల్పడ్డారని తెలిపారు.
శుక్రవారం పట్టణంలో మార్కెట్ సందర్భంగా నిందితులు స్నాచింగ్‌కు పాల్పడుతుండగా.. తాను క్రైం పార్టీ హెడ్‌కానిస్టేబుల్ ఏ శ్రీనివాస్‌రెడ్డి, కానిస్టేబుల్ నర్సింలు, ఎజాజ్గౌరి, అసద్ అలీ, అశోక్‌లు పట్టుకున్నామన్నా రు. వీరి నుంచి 13 తులాల బంగారు పుసె ్తల తాళ్లు, రెండు గొలుసులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టణంలో కా గా నిందితుల్లో రాజేష్‌కుమార్ పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. జల్సాలకు, వ్యసనాలకు అలవాటు పడి యువకులు పెడతోవ పడుతున్నారన్నారు. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.