mythical
-
NTR Birth Anniversary: దటీజ్ ఎన్టీఆర్.. రెండుసార్లు ఫ్రాక్చర్ అయినా..
శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, కీచకుడు, అర్జునుడు, భీముడు.... ‘శ్రీమద్విరాట పర్వము’లో ఈ ఐదు భిన్న పాత్రల్లో ఎన్టీఆర్ అభినయం చూసి, తెలుగు ప్రేక్షకులు ఆనందించారు.. నటన మాత్రమే కాదు... తెరపై ఆ అందగాడిని చూసి ఆనందించారు. అదే అందగాడు కురూపిగా కనిపించినా ఆనందించారు.. ఆ నటన అలాంటిది. 44ఏళ్ల సినీ కెరీర్లో ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చిన నటుడు ‘నటనానంద తారకరాముడు’ (ఎన్.టి.ఆర్). ఈ తారక దేశంలోనే వంద చిత్రాలు పూర్తి చేసిన తొలి ఘనుడు.. ఆ తర్వాత ఎనిమిదేళ్లల్లో 200 సినిమాలు పూర్తి చేసి, రాష్ట్రంలో రెండొందల సినిమా మార్క్ చేరుకున్న నటుడు. 300 మార్కు కూడా ఈ నటుడి సొంతమే. 13 చారిత్రకాలు, 55 జానపదాలు, 186 సాంఘికాలు, 44 పౌరాణిక చిత్రాలు చేసి, తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు ఎన్టీఆర్. తొలి చిత్రం ‘మనదేశం’తో మొదలుకొని, చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్ ’ వరకూ దాదాపు 300 చిత్రాల్లో నటించారు. వాటిలో 140 వందరోజుల చిత్రాలు కాగా, 33 రజతోత్సవ చిత్రాలు కావడం విశేషం. ఈ ‘నటనానంద తారక’ ‘శత జయంతి’ నేడు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు సినీ జీవిత విశేషాల్లో కొన్ని ఈ విధంగా... పౌరాణికం శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, దుర్యోధనుడు, భీముడు, యముడు, రావణాసరుడు... ఎలా ఉంటారు? ‘ఇలా ఉంటారు?’ అని ఎన్టీఆర్ తన పాత్రలతో చూపించారు. పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు ఎన్టీఆర్. ఆయన నటించిన పౌరాణిక చిత్రాల్లో ఎప్పటికీ ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘దాన వీర శూర కర్ణ’ (1977). ఎన్టీఆర్ ఆరు పడవల ప్రయాణం ఈ సినిమా. అంటే..నటన, దర్శకత్వం, నిర్మాణం.. ఈ మూడు బాధ్యతలతో పాటు కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు... మూడు పాత్రలను చేయడం అంటే ఆరు పడవల ప్రయాణమే కదా. మేకప్ వేయడానికి మూడు గంటలు, తీయడానికి రెండు గంటలు పట్టేదట. మూడు పాత్రల అభినయానికి, దర్శకుడిగా తీసిన విధానానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ సినిమాలో శ్రీకృష్ణుడు పాత్ర కోసం అక్కినేని నాగేశ్వర రావుని సంప్రదిస్తే.. ‘కృష్ణుడిగా ఎన్టీఆర్‌ని చూసిన కళ్లతో ప్రేక్షకులు నన్ను చూడలేరు’ అంటూ చేయనని చెప్పారట. దీంతో కర్ణుడి పాత్ర అయినా చేయమని కోరితే.. ‘ఆ పాత్రకి నా ఆహార్యం సరిపోదు’ అంటూ సున్నితంగా తిరస్కరించారట ఏఎన్ఆర్. శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనుకునేలా ఆ పాత్రకు వన్నె తెచ్చారు. ‘ఇద్దరు పెళ్లాలు’ (1954) చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారి కృష్ణునిగా కనిపించారు. ఆ తర్వాత ‘మాయాబజార్’ (1957), ‘వినాయకచవితి’ (1957), ‘దీపావళి’ (1960), ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’ (1963), ‘శ్రీకృష్ణ తులాభారం’ (1966) ఇలా... పలు చిత్రాల్లో శ్రీకృష్ణుడి పాత్ర పోషించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుంది. ఆయన్ని అపర శ్రీకృష్ణునిగా నిలిపిన చిత్రం ‘మాయాబజార్’. ఈ చిత్రంలో తెలుగు, తమిళ భాషల్లో ఎన్టీఆరే శ్రీకృష్ణునిగా నటించి, తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించారు. ఇక ‘శ్రీకృష్ణ తులాభారం’లో మరోమారు కృష్ణుని పాత్రలో జీవించారు. ఈ చిత్రంలో శ్రీకృష్ణుని పాత్రధారి అయిన ఎన్టీఆర్‌ని సత్యభామ పాత్రధారి జమున కాలితో తన్నే సన్నివేశం ఉంటుంది. అంత పెద్ద స్టార్ హీరో అయినా భేషజాలకు పోకుండా, అభిమానులు, ప్రేక్షకులు ఏమనుకుంటారో? అని ఆలోచించకుండా కథకి అవసరం మేరకు ఆ సన్నివేశంలో నటించి, ‘దట్ ఈజ్ ఎన్టీఆర్’ అనిపించుకున్నారు. శ్రీకృష్ణుడిగా ఒదిగిపోయిన ఎన్టీఆర్.. శ్రీరామునిగానూ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ‘చరణదాసి’ (1956) చిత్రంలో తొలిసారి శ్రీరామునిగా కనిపించారు. ఆ తర్వాత ‘సంపూర్ణ రామాయణం’ (1958)లో తొలిసారి పూర్తి స్థాయిలో శ్రీరామునిగా నటించారాయన. ‘లవకుశ’ (1963) చిత్రంలో శ్రీరాముని పాత్రలో ఎన్టీఆర్ జీవించారు. ఆ తర్వాత ‘శ్రీరామ పట్టాభిషేకం’ (1978)తో పాటు మరికొన్ని చిత్రాల్లో శ్రీరామునిగా ప్రేక్షకులను అలరించారు. సౌమ్యుడైన శ్రీరాముడు పాత్రకు పూర్తి వ్యతిరేకమైన రావణాసురుడి పాత్రలోనూ ఎన్టీఆర్ ఒదిగిపోయిన వైనం అద్భుతం. ‘భూకైలాస్’ (1958) చిత్రంలో ఎన్టీఆర్ తొలిసారి రావణబ్రహ్మ పాత్రలో నటించి, మెప్పించారు. ఆ తర్వాత ‘సీతారామ కళ్యాణం’ (1961), ‘శ్రీరామపట్టాభిషేకం’ (1978) వంటి పలు సినిమాల్లో రావణబ్రహ్మగా శభాష్ అనిపించుకున్నారు. అదే విధంగా ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ (1960)లో తొలిసారి వెంకటేశ్వర స్వామి పాత్ర చేశారు ఎన్టీఆర్. అలాగే ‘పాండవ వనవాసము’ (1965)లో భీమునిగా, ‘ఉమ్మడి కుటుంబం’ (1967)లో తొలిసారి ‘యముడి’ పాత్రలో ఆకట్టుకున్నారాయన. ఇక ‘నర్తనశాల’ (1963)లో బృహన్నల పాత్రలో తన నటనా ప్రతిభను మరోసారి చూపించారు ఎన్టీఆర్. ఇలా పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు. జానపదం ఎన్టీఆర్ నటించిన తొలి జానపద చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ (1950). ఈ చిత్రంలో క్రూరమైన ఎద్దుతో ఎన్టీఆర్ పోరాడే యాక్షన్ సీన్ ఉంది. చిత్రదర్శకుడు బీఏ సుబ్బారావు ఎద్దు కొమ్ములను పట్టుకుంటే చాలని ఎన్టీఆర్‌తో అన్నారు. కానీ, ఎన్టీఆర్ ఆ ఎద్దుతో నిజంగానే పోరాడారు. ఆ యాక్షన్ సీన్ అప్పుడు రెండుసార్లు ఫ్రాక్చరయింది. డాక్లర్టు విశ్రాంతి సూచించినా ‘నో’ అన్నారు ఎన్టీఆర్. కట్టు కనిపించకుండా పొడవు చేతుల చొక్కా ధరించి, నటించారు. ‘పల్లెటూరి పిల్ల’ విడుదలైన మరుసటి సంవత్సరం ‘పాతాల భైరవి’ (1951)లో చేసిన తోటరాముడి పాత్ర గురించి కూడా చెప్పుకోవాలి. ఈ పాత్రకు ఎన్టీఆర్‌ని తీసుకోవాలని నిర్మాతలు నాగిరెడ్డి–చక్రపాణి అనుకుంటే... పెద్దగా ఇమేజ్ లేని నటుణ్ణి అంత పెద్ద పాత్రకా? అనుకున్నారు దర్శకుడు కేవీ రెడ్డి. సరిగ్గా అదే టైమ్‌కి టెన్నిస్ ఆడుతున్న ఎన్టీఆర్ రెండు పాయింట్లు కోల్పోవడంతో బంతిని విసిరి కొట్టారు. అంతే.. జానపద నాయకుడి లక్షణం ఉందని తోటరాముడిగా ఎన్టీఆర్‌ని ఫిక్స్ చేశారు కేవీ రెడ్డి. ఈ పాత్రలో ఎన్టీఆర్ రెచ్చిపోయి నటించారు. ఇంకా ‘గులేబకావళి కథ’, ‘జగదేకవీరుని కథ’, ‘అలీబాబా నలభై దొంగలు’, ‘చిక్కడు దొరకడు’, ‘మంగమ్మ శపథం’, ‘గండికోట రహస్యం’... ఇలా దాదాపు యాభై జానపద చిత్రాల్లో నటించారు ఎన్టీఆర్. సాంఘికం హీరోగా పట్టుమని పది సినిమాలు పూర్తి చేయకుండానే సందేశాత్మక సినిమాలు చేయాలనుకున్నారు ఎన్టీఆర్. వరకట్నం తీసుకోవడం సరైంది కాదని, యువతలో చైతన్యం నింపేలా, అభ్యుదయ భావాలు రేకెత్తించేలా ‘పెళ్లి చేసి చూడు’ (1952)ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఆ తర్వాత 1970లో స్వీయ దర్శకత్వంలో వరకట్నం ప్రధానాంశంగానే ‘వరకట్నం’ సినిమా తెరకెక్కించి, నటించారాయన. ఇక అప్పటి సాంఘిక దురాచారాల్లో ప్రముఖంగా వినిపించే మరో అంశం ‘కన్యాశుల్కం’. ఈ విషయంలో ప్రజల ఆలోచనా సరళిలో మార్పు రావాలనే ఉద్దేశ్యంతో ‘కన్యాశుల్కం’లో గిరీశంగా కనిపించి, మెప్పించారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో గిరీశంగా ఎన్టీఆర్ చేసిన అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ చిత్రాలే కాదు.. ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యతను తెలియజేసేలా, ‘ఉమ్మడి కుటుంబం’, కుటుంబ సంబంధాలకు అద్దంపట్టేలా ‘తల్లా? పెళ్లామా?’ చిత్రం, ఈ కోవలోనే ‘కోడలు దిద్దిన కాపురం’, ‘తాతమ్మ కల’, ‘ఇంటిగుట్టు’ సినిమాలు చేశారు ఎన్టీఆర్. ముఖ్యంగా 1969–1970 దశకంలో ఎన్టీఆర్ నుంచి ఎక్కువగా సాంఘిక చిత్రాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ‘వరకట్నం, తల్లా? పెళ్లామా?, కొడుకులు దిద్దిన కాపురం’ సినిమాల్లో నటించి, స్వీయ దర్శకత్వం వహించారు ఎన్టీఆర్. ఈ చిత్రాలే కాదు.. వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేయాలని గ్రామీణ యువకులను ప్రోత్సహించే విధంగా ‘పల్లెటూరు’, ‘రైతుబిడ్డ’ వంటి వ్యవసాయ ఆధారిత సినిమాల్లో నటించారు. అలాగే వ్యవసాయ రంగంలో పెత్తందార్లను ప్రశ్నించేలా ‘పెత్తందార్లు’లో నటించారు. ఇంకా సమాజంలోని అసమానతను తెలిపేలా ‘రాజూ పేద’, మహిళలకు సమాజంలో దక్కాల్సిన గౌరవాన్ని గుర్తు చేసేలా ‘నాదీ ఆడ జన్మే’, ‘స్త్రీ జన్మ’ వంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు ఎన్టీఆర్. అలాగే దేశభక్తిని చాటేలా ‘బొబ్బిలిపులి’, ‘నా దేశం’, ‘జస్టిస్ చౌదరి, ‘మేజర్ చంద్రకాంత్’, కులమతాలకు అతీతంగా ‘ఒకే కుటుంబం’ వంటి సినిమాలు కూడా ఉన్నాయి. ప్రయోగాత్మకం ‘పిచ్చి పుల్లయ్య’ (1953), ‘బండరాముడు’ (1959), ‘తిక్క శంకరయ్య’ (1968).. ఇవన్నీ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాల టైటిల్సే. వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్టీఆర్‌కు కథ నచ్చితే ఎలాంటి సాహసానికైనా సై అంటారని. అందుకే 31ఏళ్ల వయసులోనే ‘తోడుదొంగలు’ (1954)లో వృద్ధ పాత్రకి ఓకే అన్నారు. అలాగే నాలుగుపదుల వయసు దాట కుండానే ‘భీష్మ’ (1962) చిత్రంలో కురు వృద్ధుడైన భీష్మ పాత్ర చేశారు. అదే విధంగా ‘కులగౌరవం’లో కుటుంబ పెద్దగా వృద్ధ పాత్రలో మరోసారి ఆడియన్స్‌తో క్లాప్స్ కొట్టించారు. ‘తోడు దొంగలు’ వచ్చిన ఏడాదే ‘రాజూ పేద’ చిత్రంలో ఎన్టీఆర్ పూర్తి డీ గ్లామరస్ రోల్ చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. అదే ఏడాది రిలీజైన మరో చిత్రం ‘పరివర్తన’లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ అభినయిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారే కానీ నెగటివ్‌గా తీసుకోలేదు. ఇంకా ‘పిచ్చి పుల్లయ్య’లో మానసిక పరిస్థితి బాగాలేని పుల్లయ్యగా, ‘తిక్క శంకరయ్య’లో శంకరయ్యగా.. ‘కలిసి ఉంటే కలదు సుఖం’, ‘ఆరాధన’ వంటి చిత్రాల్లో దివ్యాంగుడిగా ఎన్టీఆర్ ఒదిగిపోయారు. ఇవే కాదు.. ‘దాసి’లో జట్కా బండి రామయ్యగా... చెప్పుకుంటూ పోతే... ‘బడిపంతులు, ఆత్మ బంధువు, గుడిగంటలు’... ఇలా పలు చిత్రాల్లో ఎన్టీఆర్ కథలోని పాత్రలకే ప్రాధాన్యం ఇచ్చారు. చారిత్రకం ‘నందామయ.. గురుడ నందామయ..’ స్క్రీన్ మీద కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామిగా సాత్వికంగా కనిపించారు ఎన్టీఆర్. ఒక యాక్షన్ హీరో అంత సాఫ్ట్ క్యారెక్టర్ చేయాలనుకోవడం ఓ సాహసం. ఎన్టీఆర్‌కి సాహసాలు ఇష్టం. అందుకే బ్రహ్మంగారి కథతో ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ తీయాలనుకున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమా తీయాలనుకోవడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే... ఓసారి ఎన్టీఆర్ కడప జిల్లా సిద్ధవటంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ ఈ కాలజ్ఞాని చెప్పిన విషయాలు ఆయన్ను ఆకర్షించాయి. అందుకే వీరబ్రహ్మం పాత్ర చేయాలనుకున్నారు... దర్శకత్వం–నిర్మాణం కూడా ఎన్టీఆరే. షూటింగ్ సమయంలో కొన్ని ఆటుపోట్లు ఎదురయితే, పూర్తయ్యాక కొన్ని కారణాలతో మూడేళ్ల పాటు సెన్సార్ అనుమతి లభించలేదు. చివరికి ఆ సమస్య పరిష్కారమై 1984 నవంబరు 29న విడుదలై, ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ చేసిన చారిత్రాత్మక చిత్రాల్లో ఈ చిత్రానిది ప్రముఖ స్థానం కాగా, ఈ సినిమాకన్నా దాదాపు ముప్పై ఏళ్ల ముందు చేసిన చారిత్రాత్మక చిత్రం ‘తెనాలి రామ కృష్ణ’ (1956)లో శ్రీకృష్ణ దేవరాయలుగా రాజసం చూపించారు ఎన్టీఆర్. కొంచెం తారాగణం మార్పుతో తెలుగు, తమిళ (‘తెనాలి రామన్’) భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. తమిళంలోనూ శ్రీకృష్ణ దేవరాయలు పాత్రను ఎన్టీఆర్ చేయగా, తెనాలి రామకృష్ణగా శివాజీ గణేశన్ నటించారు. తెలుగులో ఈ పాత్రను ఏఎన్నార్ చేశారు. రాజదర్బారులో న్యాయమైన తీర్పు ఇచ్చిన దేవరాయలుకి ప్రేక్షకులు కూడా మంచి తీర్పు ఇచ్చి, ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేశారు. అన్నట్లు ‘మహా మంత్రి తిమ్మరసు’లోనూ శ్రీకృష్ణ దేవరాయలుగా మెప్పించారు. ఇంకా ‘అక్బర్ సలీం అనార్కలి’లో అక్బర్ పాత్రలో ఒదిగిపోయారు. ఎన్టీఆర్ ఇష్టపడి చేసిన పాత్రల్లో అశోకుడు ఒకటి. ‘సామ్రాట్ అశోక్’తో అది నెరవేర్చుకున్నారు. ఇంకా ‘చాణక్య చంద్రగుప్త’ (చంద్రగుప్తుడు పాత్ర), ‘శ్రీనాథ కవి సార్వభౌముడు’ (శ్రీనాథుడు పాత్ర)... ఇలా ఎన్టీఆర్ చేసిన చారిత్రాత్మక చిత్రాల్లో చరిత్రలో నిలిచిపోయినవి చాలా ఉన్నాయి. -
ఇంతింతై...వటుడింతై!
బీఏ సుబ్బారావు దర్శక నిర్మాణంలో యస్వీరంగారావు, కాంతారావు, బాలయ్య... ముఖ్య పాత్రలు పోషించిన ఒక పౌరాణిక చిత్రంలోని సన్నివేశాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ‘‘మహాత్మా...తమ ఆగమనంతో ఈ యజ్ఞం సఫలమైంది. అపూర్వ మహిమా శోభితులైన తమ దర్శనభాగ్యంతో నా జన్మచరితార్థం అయింది’’ ఆనందడోలికల్లో ఊగిపోతూ అన్నాడు బలిచక్రవర్తి.‘‘తామెవ్వరు? నివాసస్థానం ఏది?’’ అని అడిగాడు బలిచక్రవర్తి తన ఎదురుగా ఉన్న వటుడిని.‘‘బలిరాజా! తానెవరో తెలసి తెలియజెప్పేవాడు పరమాత్ముడు ఒక్కడే. ఇక నివాసమందువా...ఈ విశాల విశ్వమంతయూ నా ఆవాసమే. సకల సజ్జన హృదయాలు నా సంచార స్థలాలు’’ మార్మికభాషలో తన గురించి చెప్పాడు వటుడు.‘‘వటుడా! బాలుడవైనా పరమార్థజ్ఞానపూర్వకమైన నీ సంభాషణతో నా హృదయంలో అమృతధారలు వర్షించినవి. నా వల్ల తమకు కాగల కార్యం ఏమిటి?’’ అని వినయంగా అడిగాడు బలిచక్రవర్తి.‘‘మహారాజా! బ్రహ్మచారులకు, తాపసులకు లోకకళ్యాణమే ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యసాధనకు నిన్ను యాచించడానికి వచ్చాను’’ అన్నాడు వటుడు.‘‘స్వామి! ఈ యాగదీక్షా సాక్షిగా ఆజ్ఞాపించండి...మీ కామితం ఏదైనా నెరవేరుస్తాను’’ ఆనందంగా అన్నాడు బలిచక్రవర్తి.‘‘నాయనా బలిచక్రవర్తి! తొందరపడకు... ఈ వటువు దేవతలకు బాసటగా వచ్చిన మహావిష్ణువే అని నా భావన’’ అంటూ బలిచక్రవర్తిని అప్రమత్తం చేయడానికి ప్రయత్నించారు ఆయన పక్కనే ఉన్న ఆచార్యులవారు. అయినప్పటికీ...‘‘ఆచార్యా! ఆ మహావిష్ణువు మన చెంతకు వచ్చి అర్థి అయి ప్రార్థిస్తే అంతకంటే మహాభాగ్యం ఉన్నదా’’ అన్నాడు బలిచక్రవర్తి.పరిస్థితిని గ్రహించిన వటువు...‘‘నా రాక మీ గురువర్యులకు కంటకప్రాయమైనట్లున్నది. నా వలన మీకే భేదాభిప్రాయాలు రాకుండా ఉండుగాక... అనుమతి అయినచో వెళ్లివస్తాను’’ అని అన్నాడో లేదో బలిచక్రవర్తి ఆందోళన పడ్డాడు.‘‘నా చెంతకు వచ్చి మీరు రిక్తహస్తాలతో పోవడం యాగసంకల్పానికే కళంకం! నాపై కరుణించి తమ ఈప్సితార్థం ఏమిటో సెలవియ్యండి’’ అని వటువును అడిగాడు.‘‘మహారాజా! ఏకాకి బ్రహ్మచారిని. నాకంటూ కావల్సింది ఏమీలేదు. నీకంత కోరిక ఉంటే మూడు అడుగుల నేల దానం ఇవ్వు’’ అని బలిచక్రవర్తిని కోరాడు వడుగు.‘‘మహాత్మా! ఇదేమి హాస్యం. దాత ఘనతనైనా గుర్తించవద్దా! మేరుపర్వతం దగ్గరకు వెళ్లి తృణఘనం కోరుకుంటారా?’’ ఆశ్చర్యపోయాడు బలిచక్రవర్తి.‘‘ముష్ఠి మూడు అడుగుల దానం అడిగి నన్ను చిన్నబుచ్చుతారా...మరేదైనా అడగండి. కాంచనాలా? సిరులా? చింతామణిపీఠమా? ఇంతెందుకు ఈ త్రిభువనాధిపత్యమే మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా’’ అని కూడా అన్నాడు. ‘‘చక్రవర్తి! యాచకులకు పేరాశ ఉండకూడదు. అదృష్టవంతులకు అణువు లభించినా అదే బ్రహ్మాండం అవుతుంది. నీకిష్టమైతే నా కోరిక తీర్చు’’ అని చల్లగా అడిగాడు వటుడు.‘‘ఇష్టమా! ఇంత చిన్నకోరిక కష్టమా!! ఆవశ్యం నెరవేర్చుతా’’ వటుడి కోరిక తీర్చడానికి సిద్ధపడ్డాడు బలిచక్రవర్తి.మళ్లీ రంగంలోకి దిగారు ఆచార్యులవారు.‘‘బలిచక్రవర్తీ...తొందరపడకు. ఇందులో ఏదో మోసం ఉన్నది. ఈనాడు నీవు కావించే ఈ దానం మన దానవవంశ వైభవానికి అగ్నిపరీక్ష అని మాత్రం గుర్తుంచుకో. ఇతడు దనుజకులాన్నే దగ్ధపటలం చేయడానికి వచ్చాడు. నా మాట విని ఇతడిని తిరస్కరించు. ఆత్మహాని కోరితెచ్చుకుంటావా నాయనా!’’’ అన్నారు ఆచార్యులవారు.‘‘గురుదేవా! ఈ రాజ్యవైభవములు, అధికార ప్రాభవములు దానధర్మముల కన్నా మిన్న కాదు. ఆత్మహాని అని ఆడిన మాట తప్పడం న్యాయమేనా’’ అంటూ వటుడు అడిగినవాటిని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు బలిచక్రవర్తి.‘బ్రహ్మార్పణమస్తు’‘‘బలిచక్రవర్తి! ఇంకో అడుగు?’’ అడిగాడు వటుడు.‘‘ఇదిగో ప్రభు...నా శిరస్సు...దీనిపై మోపండి’’ అని తలవంచాడు బలిచక్రవర్తి. ‘‘శుక్రాచార్యులవారు! శిష్యబృందంతో ఆనందకోలాహలంగా ఉన్నారు, ఏదో విశేషం ఉండకపోదూ’’ అన్నాడు అప్పుడే అక్కడకు వచ్చిన నారదుడు. ‘‘ఉన్నది. ఈనాడు మా దానవజాతికి పర్వదినం. ఇంతకాలం తమకు ఎదురులేదని విర్రవీగిన ఆ దేవతల పతనానికి ఇది ప్రారంభోత్సవం నారదా’’ కసిగా అన్నారు శుక్రాచార్యులవారు.శుక్రాచార్యులవారి మాట విని ‘నారాయణ నారాయణ’ అన్నాడు నారదుడు.‘‘శివ శివా! మా ఆశ్రమప్రాంతంలో అన్యస్మరణ అపచారం నారదా! ఎన్నిసార్లు మందలించినా నీ పెడబుద్ధి మానవా’’ కోపంగా అన్నారు శుక్రాచార్యులు. ఆయన చేతుల్లో శిశువు కనిపిస్తుంది.‘‘నా బుద్ధికేంగానీ, ఈ బుద్ధి నీకెప్పటి నుంచి! పూజాపునస్కారాలు మాని సంసార ఝంజాటనంలో పడినట్లువు. పుత్రుడా. పుత్రికా?’’ శుక్రాచార్యుల వారి చేతుల్లో ఉన్న శిశువును చూస్తూ అడిగాడు నారదుడు.‘‘మాపై అనుగ్రహించి, మా కష్టాలను తొలగించడానికి మహేశ్వరుడు ఒసంగిన వరప్రసాదం ఈ చిరంజీవి. మహత్తర దానవ మహాసామ్రాజ్య పునరుద్ధరణకు అంకురార్పణ జరగబోతుంది. నారదా! సురపక్షపాతి విష్ణువుకుతంత్రాలకు త్వరలోనే తగిన శాస్తి లభిసుం్తది’’ కళ్లనిండా సంతోషంతో అన్నారు శుక్రాచార్యులు.‘‘అయితే మహేశ్వరుని శక్తితో మహావిష్ణువును సాధించడానికి ఈ ప్రయత్నమన్నమాట’’ అన్నాడు నారదుడు.‘‘అవును’’‘‘అంతా నీ వెర్రి. సిద్ధాంతచర్చల్లో శివకేశవుల వాదమే కాని ఆదిమూర్తులకు ఆ భేదమే లేదు. నామరూపాలు వేరైనా లోకపాలకులైన ఆ మహానుభావులు ఇద్దరూ ఒక్కటే. ఒకరు ఎక్కువ కాదు. మరొకరు తక్కువ కాదు.’’ అన్నాడు నారదుడు.‘‘చాలించు నారదా! ఆశ్రితపక్షపాతి అయిన ఆ దామోదరుడికి, భక్తజనసులభుడైన పరమేశ్వరుడికి సామ్యమా! నేను నమ్మిన మహాదేవుడు చతుర్దశ భువనాలకు ఆరాధ్యుడు. ఆ విష్ణువు, జిష్ణువు అతని పాదధూళికి సరిరారు’’ శుక్రాచార్యుల వారి గొంతులో నుంచి ఆగ్రహజ్వాలలు.‘‘ఈ విష్ణుద్వేషమే ఆది నుంచి మీ దానవ జాతిని అడుగంట చేసింది. అయిననూ నాకెందుకు. కైలాసనాథుడు చేసినా వైకుంఠవాసుడు చేసినా నాకు కావల్సింది లోకళ్యాణమే’’ అంటూ అక్కడి నుంచి వెళ్లాడు నారదుడు. -
విశిష్ట దైవం... విశ్వకర్మ
సృష్టిలో ఏదైనా ఒక విశేషమైన శిల్పం చూసినా, ఒక నిర్మాణం కనిపించినా విశ్వకర్మ సృష్టి అంటుంటాం. వేదవిదులు ఆయనను సకల జగత్ సృష్టికర్త అంటారు. పౌరాణికులు మాత్రం సకల లోకాలనూ నిర్మించే దేవశిల్పి అంటారు. ఋగ్వేదంలో సృష్టి సూక్తాలు పేరిట కనిపించే నాలుగు సూక్తాలలో విశ్వకర్మ సూక్తం ఒకటి. ఈ సూక్తమే ఆయనను సకలలోక అధిష్ఠాత అని పిలిచింది. వేదదేవతలలో ఒకడిగా పరిగణించబడిన ఈ స్వామి పురాణాలలో పంచముఖుడిగా దర్శనమిస్తాడు. ఆయన ఐదుముఖాల నుండి ఐదుగురు మహర్షులు ఆవిర్భవించారు. వారే మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞలు. ఈ ఐదుగురికి ఐదు రకాలైన శిల్పకార్యాలను ఉపదేశించి సృష్టిని వృద్ధి చేయమని ఆదేశించాడు. విశ్వకర్మ శిల్పాలు, ఆలయాలు దేశమంతా ఉన్నా అక్కడక్కడా అరుదైన విగ్రహాలు కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో వెలసిన లేపాక్షి ఆలయంలో నిలుచున్న భంగిమలో ఉన్న విశ్వకర్మ శిల్పం స్తంభంపై చెక్కి ఉంది. ఐదు ముఖాలతో, పది చేతులతో దర్శనమిస్తాడు విశ్వకర్మ. నిజహస్తాలలో అభయ–వరదముద్రలతో, పరహస్తాలలో శంఖం, చక్రం, విల్లు, బాణం, త్రిశూలం, డమరుకం, టంకం (సుత్తి), నాగం దర్శన మిస్తాడు. కాగా కేరళ రాష్ట్రంలోని కాన్యంగాడులో పరశివ విశ్వకర్మ ఆలయం అతి పురాతనమైనది. విశ్వకర్మ దర్శనంతో సకల బంధనాలనుండీ విడివడతారనీ, ఈయన వా(క్ప)చస్పతి కనుక విద్య చక్కటి విద్య, సకలైశ్వర్యాలు కలుగుతాయని, ఇహంలో సుఖం, పరంలో మోక్షం లభిస్తాయని పురాణ వచనం. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
పౌరాణిక పాత్రలతో శిఖరాగ్రం
వనపర్తి రమణమ్మ. అలియాస్ రమణశ్రీ.. పుట్టింది పేద కుటుంబం. పొట్టకూటికి కూడా లేని పరిస్థితి. తెలిసీతెలియని వయస్సు నుంచే అన్నతో కలిసి పాటలు పాడుకుంటూ భిక్షమెత్తుకుని పొట్టపోసుకోవాల్సి వచ్చింది. పౌరాణిక రంగంలో రాష్ట్రంలోనే దిగ్గజ కళాకారుడైన రేబాల రమణ చేరదీశాడు. దీంతో ఆమె అనేక జిల్లాల్లో ప్రదర్శనలు ఇచ్చింది. ఆత్మకూరు రూరల్: తోలుబొమ్మలాట కుటుంబాలు ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లోని డీసీపల్లి, బోయలచిరివెళ్ల, నబ్బీనగరం, శంకర్నగరం, లింగంగుంట, వ్వూరుపాడులలో ఉన్నాయి. వీరిలో డీసీపల్లి కళాకారులు దశాబ్దాల క్రితమే విదేశాల్లో సైతం ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకున్నారు. అటువంటి కుటుంబానికి చెందిన వనపర్తి రమణమ్మ, తన అన్న ఆంజనేయులతో కలిసి ఏడేళ్ల పసిప్రాయం నుంచే పొట్టకూటి కోసం ఆత్మకూరు బస్టాండ్‌తో పాటు రోజుకోచోట వీధుల్లో తిరుగుతూ పాటలు పాడుతూ భిక్షమెత్తుకుని పొట్టనింపుకునే వారు. ఈ క్రమంలో ప్రఖ్యాత కళాకారుడు రేబాల రమణ ఓ సారి ఆత్మకూరు విచ్చేసి వీరి గురించి తెలుసుకున్నారు. తన వద్దకు పిలిపించుకుని ఇక నుంచి రోడ్ల వెంబడి తిరగవద్దని, కళాకారులుగా తీర్చిదిద్దుతానని ఆదాయ మార్గం చూపుతానని వెన్నుతట్టి ప్రోత్సహించారు. అనేకప్రదర్శనలిచ్చి.. రమణ ఇచ్చిన ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంది. విజయవాడ, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాల్లో సుమారు వెయ్యి పౌరాణిక నాటకాల్లో నటించింది. చిత్ర, కలహకంటి, మాతంగి, బాలనాగమ్మ, లచ్చి, మంజరి, సంగు, ముత్తి, తదితర పాత్రల్లో నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది. ఓ దశలో ఆమెకు గుండెపోటు రావడంతో పౌరాణిక రంగ కళాకారులు ఆర్థికసాయం చేసి ఆపరేషన్ చేయించారు. ఆ తర్వాత నుంచి నాటకాలు వేస్తూ రంగస్థల ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. పౌరాణికాలకు ఆదరణ తగ్గింది చిన్నతనం నుంచి కళాభిమానంతో ఈ రంగంపైనే ఆధారపడ్డాం. పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తూ దిగ్గజ కళాకారుల సరసన నటించే అవకాశం దక్కింది. పౌరాణికాలకు గతంలో ఉన్న ఆదరణ నేడు లేదు. సహచర కళాకారిణులైన శిరీషా, పద్మ, అపర్ణ, తదితరులం కలిసి తరచూ పౌరాణికాల్లో నటిస్తూ పొట్టకూటికి సరిపడా సంపాదించుకుంటున్నాం. ప్రభుత్వ సహకారం అందించి పౌరాణికాలను కాపాడితే మాలాంటి కళాకారులతో పాటు ఈ కళ కూడా సజీవంగా నిలుస్తుంది. – రమణశ్రీ -
పద్య నాటకం.. పౌరాణిక పరిమళం
- అలరించిన నంది నాటకోత్సవాలు కర్నూలు(కల్చరల్): నంది నాటకోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక టీజీవి కళాక్షేత్రంలో ప్రదర్శించిన పౌరాణిక నాటకాలు పురాణ గాథలకు అద్దం పట్టాయి. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ జనతా సేవా సమితి ఆధ్వర్యంలో ‘అన్నమాచార్య’ నాటకం ప్రదర్శించారు. నందవర వైదిక బ్రాహ్మణ వంశంలో జన్మించిన అన్నమాచార్యులు వెంకటేశ్వరస్వామి భక్తుడిగా మారడం.. ఆయనపై వేలాది కీర్తనలు పాడడం.. శ్రీవారి సన్నిధికి చేరుకునేందుకు అనేక అష్టకష్టాలు ఎదుర్కోవడం.. కాళ్వ నరసింహరాయుడు అనే రాజు అన్నమయ్యను ఆస్థాన గాయకుడుగా నియమించడం..తదితర ఘట్టాలు ప్రేక్షకులను అలరింపజేశాయి. అన్నమయ్య..వెంకటేశ్వరస్వామిని చేరి ఆయనలో ఐక్యవడంతో నాటకం ముగుస్తుది. వరకవుల నరహరి రాజు.. రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపిన సతీసావిత్రి... అనంతపురం లలిత కళాపరిషత్ నాటక సమాజం వారు ప్రదర్శించిన సతీసావిత్రి పద్యనాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. భర్త ప్రాణాలను కాపాడుకోవడంలో సతీసావిత్రి చూపిన చొరవ, అంకితభావాన్ని ఈ నాటకంలో చక్కగా ప్రదర్శించారు. రాజకుమారి అయిన సావిత్రి సత్యవంతుణ్ణి ప్రేమించి వివాహమాడాలని నిశ్చయించుకుంటుంది. అయితే సత్యవంతుడికి వివాహ అనంతరం ప్రాణగండముందని నారదుడు తెలియజేస్తాడు. అయినా సత్యవంతుడినే వివాహమాడతానని సావిత్రి భీష్మించుకుంటుంది. తన ప్రేమను నిరూపించుకున్న సావిత్రికి ఆమె తల్లిదండ్రులు సత్యవంతుడికిచ్చి వివాహం చేస్తారు. వివాహం తర్వాత సావిత్రి, సత్యవంతుడు అడవికి వెళ్లి కట్టెలు కొడుతుంటారు. కట్టెలు కొడుతూ కింద పడిపోయిన సత్యవంతుని ప్రాణాలను యమధర్మరాజు తీసుకెళ్తుంటాడు. తన భర్త ప్రాణాలను తిరిగి ఇవ్వమని వెంటపడిన సావిత్రి వాగులు, వంకలు, అరణ్యాలు దాటి ఇహలోకాన్ని చేరుతుంది. సావిత్రి పాతివ్రత్యాన్ని గ్రహించిన యముడు సత్యవంతుని ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు. భార్యాభర్తల మధ్య అమితమైన అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచిన సావిత్రి కథను ఈ నాటకం అత్యంత హృద్యంగా చిత్రించింది. ఆకట్టుకున్న కృష్ణా నదీ చరిత్ర... తిరుపతి వెంకటపద్మావతి నాట్యమండలి వారు ప్రదర్శించిన కృష్ణానదీ చరిత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. భూలోకంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆకాశవాణి.. ఇంద్రుని వద్దకు వెళ్లి ప్రజల కష్టాలను తీర్చమని వేడుకుంటుంది. ఇంద్రుడు విష్ణుమూర్తిని వేడుకుని కృష్ణవేణిని ఉద్భవింపజేస్తాడు. విష్ణుమూర్తి కృష్ణవేణిని నదీ ప్రవాహినిగా ప్రవహింపజేస్తూ ఆమెకు తగిన ప్రదేశాన్ని చూపించమని బ్రహ్మను కోరతాడు. సహ్యముని తపస్సు చేసి పర్వత ప్రాంతమే కృష్ణవేణికి తగిన ప్రాంతమని సూచిస్తాడు. విష్ణుమూర్తి.. కృష్ణవేణిని పర్వత ప్రాంతానికి పంపించగా సహ్యముని రావి చెట్టుగా మారి కృష్ణవేణిని నదిగా ప్రవహింపజేస్తాడు. వి.ఎస్.భరద్వాజ్ రచన, దర్శకత్వ బాధ్యతలు వహించిన ఈ పద్య నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్నేహభావానికి ప్రతిబింబంగా నిలిచిన కుచేలోపాఖ్యానం... కళామయి సాంస్కృతిక సంస్థ(రంగారెడ్డి జిల్లా) కళాకారులు ప్రదర్శించిన కుచేలో పాఖ్యానం పద్యనాటకం కృష్ణ, కుచేలుర స్నేహబంధానికి ప్రతీకగా నిలిచింది. సాందీపుడు అనే గురువు వద్ద ఆశ్రమ పాఠశాలలో సుధాముడు, శ్రీకృష్ణుడు విద్యను అభ్యసిస్తారు. విద్యను అభ్యసించే క్రమంలో వారిద్దరి మధ్య తరగని స్నేహం ఏర్పడుతుంది. పేద బ్రాహ్మణుడు. తొడుక్కోవడానికి సరిౖయెన దుస్తులు కూడా లేని దుస్థితిలో ఉన్న సుధాముడిని అందరూ కుచేలుడు అని అవహేళన చేస్తుంటారు. అదే అతని పేరుగా ప్రాచుర్యంలోకి వస్తుంది. విద్యాభ్యాసం అనంతరం కృష్ణుడు ద్వారకకు వెళ్లిపోగా కుచేలుడు పౌరహిత్యం చేసుకుంటూ జీవిస్తుంటాడు. వివాహ అనంతరం చాలీచాలని జీతం చూసిన అతని భార్య కృష్ణుని వద్దకు వెళ్లిరమ్మని సలహా ఇస్తుంది. కృష్ణుడిని వెతుక్కుంటూ అరణ్యాలకు వెళ్లిన కుచేలుడిని చూసిన కృష్ణుడు గరుత్మంతుడితో ద్వారకకు తరలిస్తాడు. ద్వారకలో ద్వారపాలకులు కుచేలుడిని అడ్డగిస్తారు. అయితే కృష్ణుడు ప్రత్యక్షంగా కుచేలుడిని చూసి లోపలికి తీసుకెళ్లి సింహాసనంపై కూర్చుండబెట్టి కుచేలుడు తెచ్చిన అటుకులను ఆరగిస్తాడు. కుచేలునికి తగిన సత్కారము చేస్తాడు. నిజమైన స్నేహానికి పేద, ధనిక అనే భేదభావములు ఉండవు అని తెలియజెప్పిన భారత గాథను ఈ నాటకం చక్కగా వివరించింది. ఈ నాటకానికి రచన, దర్శకత్వం బాధ్యతలను అమరలింగ శర్మ నిర్వహించారు. నేటి నాటక ప్రదర్శనలు... ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మార్కండేయ విజయం పద్యనాటకం, సాయంత్రం 4 గంటలకు స్వామి అయ్యప్ప పద్యనాటకం, సాయంత్రం 7 మైరావన పద్యనాటక ప్రదర్శనలు ఉంటాయని లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు. -
శంభల! అద్భుతమా..? అపోహా..?
హిమాలయాల్లో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇంతవరకు హిమాలయాలను ఏ వ్యక్తీ పూర్తిగా సందర్శించలేదనేది వాస్తవం. అక్కడ 'యతి' రూపంలో సంచరించేది హనుమంతుడేనని విశ్వసించేవారూ ఉన్నారు. కొన్ని పరిశోధనలు, మరికొన్ని భారతీయ, బౌద్ధ గ్రంథాల్లో రాసిన దాన్ని బట్టి చూస్తే బాహ్యప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాల్లో దాగి ఉందని తెలుస్తుంది. దాని పేరే 'శంభల' దీన్నే పాశ్చాత్యులు 'హిడెన్ సిటీ' అని పిలుస్తారు. దీనికి సంబంధించి ప్రచారంలో ఉన్న కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..! సాధారణ మానవులు చేరుకోలేని ప్రదేశాలు.. కొన్ని వేల కిలోమీటర్లలో విస్తరించి ఉన్న హిమాలయాల్లో సాధారణ మానవులు చేరుకోలేని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ శంభల ఒకటి. ఇక్కడికి చేరుకోవాలంటే మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢచిత్తులై ఉండాలని, ఎవరికి పడితే వారికి ఇది కనిపించదని.. ఎందుకంటే శంభల అతి పవిత్రమైన ప్రదేశమనీ చాలా మంది విశ్వసిస్తారు. భౌద్ధగ్రంథాల ప్రకారం.. బౌద్ధ గ్రంథాల్లో రాసి ఉన్న దాని ప్రకారం ఇది చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉంటారు. వీరి ఆయుఃప్రమాణం సాధారణ ప్రజల కంటే రెట్టింపు ఉంటుంది. వారు మహిమాన్వితులు. లోకంలో పాపం పెరిగిపోయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంభలలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. అప్పటి నుంచి మరో కొత్త శకం ప్రారంభం అవుతుంది. ఆ కాలం 2424లో వస్తుంది. రష్యా పరిశోధనలు.. 1920లో శంభల రహస్యాన్ని ఛేదించడానికి రష్యా తన ప్రత్యేక మిలటరీ బలగాలను పంపి పరిశోధనలు చేయించింది. ఈ పరిశోధనలో వారికి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అక్కడ ఉండే యోగులు దాని పవిత్రత గురించి వివరించారు. హిట్లర్ ప్రయత్నాలు.. ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ 1930లో శంభల అధ్యయనానికి ప్రత్యేక బృందాలను పంపాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని.. దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భువిపైన ఏర్పడ్డ స్వర్గమని హిట్లర్‌కు చెప్పాడు. అనేక గ్రంథాల్లో.. గోబి ఎడారికి దగ్గరిలో ఉన్న శంభల రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్రం అవుతుందని బుద్ధుడు 'కాలచక్ర'లో రాశారు. ఫ్రాన్స్‌కు చెందిన చారిత్రక పరిశోధకురాలు, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ కొన్ని గ్రంథాలు రచించారు. ఆమె తన 56 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకున్నారు. వారి ద్వారా శంభల వెళ్లి అక్కడి మహిమాన్వితుల ఆశీర్వాదాలు తీసుకోవడం వల్లే ఆమె 101 ఏళ్లు బతికారని చెబుతారు. ఎక్కడ ఉంది..? సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉంటాడని భక్తులు విశ్వసించే కైలాస పర్వతాలకు దగ్గరలో ఈ పుణ్యభూమి ఉందనీ.. ఆ ప్రదేశం అంతా అద్భుతమైన సువాసనలతో నిండి ఉంటుందని, పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంభలను వీక్షించడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందని కొన్ని గ్రంథాల్లో రాసి ఉంది. మరిన్ని విశేషాలు.. పూర్వీకులు తెలిపిన దాని ప్రకారం ఈ నగరం వయస్సు 60 లక్షల సంవత్సరాలు. ఇక్కడ ప్రజలు సుమారు 12 అడుగుల పొడవు ఉంటారు. హిమాలయాల్లో ఎక్కడ ఉందో తెలియని ఈ నగరం చేరుకోవడం చాలా ప్రయాసలతో కూడి ఉంది. ఈ ప్రయాణంలో తొలుత ఎడారి వస్తుంది. అదే గోబి ఎడారి. పరిశోధకులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది కున్లున్ పర్వత శ్రేణులతో కలిసి ఉండొచ్చు. ఆధ్యాత్మి క ధోరణి లేనివారికి ఈ నగరం కనిపించదని చెబుతుంటారు. పాశ్చాత్యులు ఈ నగరాన్ని ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్, ది ఫర్బిడెన్ ల్యాండ్, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్.. అనే పేర్లతో పిలుస్తారు. -
ఒంటరి
తొండమనాటి పరశురామేశ్వరాలయ విప్రపీఠం క్రీ.శ. 850 (నేటి తిరుపతి వద్ద గుడిమల్లం)-పదం నుంచి పథంలోకి 12) ‘ఎండ సలసలమంటాండాది. ఈడ్నే సెట్టు కింద కాసేపాగి పిన్నాలె పోయిడుస్తాం’ అంటూ గుర్రాన్ని చింత చెట్టు కింద ఆపాడు కాటప్ప. ఈడ్నెందుకు? ఆడేదో ఊరు కనిపిస్తాండాది. గుడిమల్లామే! ఆడకే పా. మజ్జిగన్నా దొరకతాది’ అంటూ ముందుకు సాగాడు మునియప్ప. ఇద్దరూ యుద్ధవీరులు. ఏ రాజు అడిగితే ఆ రాజు సైన్యంలో ప్రాణాలొడ్డి ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. వీరబత్యం, రూకలూ, గుళ్లూ, కోటలూ దోచిన నగానట్రా కలిసే అనుభవించారు. కొంపాగోడూ లేని ఏకాకులు. ఒకరికొకరు తోడు. ‘వానాకాలం గడిచిందాంకా నెట్టుకొచ్చేందానికి దుడ్లుండాయి. ఈడ్నన్నా పని చిక్కకుంటే కష్టం’ చల్లాడంలో దోపిన జాలీ సంచి తడుముతూ అన్నాడు మునియప్ప. ‘అవునప్పా! చెడ్డకాలం! మొన్న కాళాస్త్రిలో పంచాంగం బాపనయ్య చెప్పుండాడు. అదేదో పదేళ్ల ‘శాంతి’ అంట! ఏయుద్ధమూ లేని చెడ్డ కాలం వచ్చుండాది’ నిట్టూర్చాడు కాటప్ప. ‘ఊర్లో ఏడకి పోవాల?’ మట్టికోట కావలి వాడు వీరభద్రుడిలా అడ్డం పడ్డాడు. ‘గుళ్లో పెద్దాయన! పేరు తెలియదు. ఇంద... కాళాస్త్రి బాపనయ్య కమ్మ రాసిచ్చుండాడు’ అని బొడ్లో దోపిన తాటాకు పత్రం చేతికందించాడు మునియప్ప. ‘గుర్రాలూ కత్తులూ ఈడ్నెయిడిచి కూడా రాండి’ అని ఇద్దరిని పరశురామేశ్వరస్వామి గుడి ఎదురు రచ్చబండ వద్దకి తీసుకెళ్లాడు కావలివాడు. గావుండు, రడ్డి, కరణం, పూజారి, మిగిలిన పెద్దలతో పంచాయతీ హాజరయింది. తాటాకు కమ్మని ముందు వెనుకా చూసి చదివేందుకు పూజారికి ఇచ్చాడు గవుండు. శ్రీకాళహస్తీశ్వర వరప్రసాద సిద్దిరస్తు! స్వస్తి. శ్రీ వికారి నామ సంవత్సరం, వైశాఖ బహుళ త్రయోదశి నాడు, సదాశివ భక్తుడు శ్రీ కాళహస్తీశ్వర పాదపద్మారాధకుడు అయిన విశ్వేశ్వర దేశికుడు గుడిమల్ల శ్రీపరశురామేశ్వర విప్రపీఠం అర్చకులకు, గ్రామండులకు వ్రాయు సందేశము. దేవాలయ పశుసంపదకు, గ్రామానికి రక్షకులు కావాలని తమరు ఇది వరలో చేసిన విన్నపం అనుసరించి ఇద్దరు ఏకాంగ వీరులను తమ వద్దకు పంపుతున్నాను. వీరు బాణరాజు ప్రభుమేరు సైన్యంలో అత్యంత పరాక్రమం చూపిన మహావీరులు. మీరడిగినట్లు స్త్రీలకూ, పిల్లలకూ ఎన్నడూ అపకారం చేయమని వ్రతం పట్టిన వీరసన్యాసులు. వారి యోగ్యతని పరిశీలించి కొలువు దయచేయగలరు. పునఃస్వస్తి నెలకి పది మాడల బత్యంతో పులినాటి(శేషాచలం) అడవుల్లో మేతకెళ్ళే గోవుల రక్షణ, గ్రామ కావలిదండుకు మందపోట్లను ఎదిరించడంలో తర్ఫీదు ఇచ్చే బాధ్యతలతో ఏ ఉపద్రవం లేకుండా ఐదేళ్ళు గడిచిపోయాయి. గుడిపీఠం ఇచ్చే కావలి బత్యం, కాపులిచ్చే తాంబూళాలతో మిత్రులిద్దరూ ఊర్లో ప్రముఖులూ, ధనవంతులూ అయ్యారు. ఊరి రడ్డి కూతురు చౌడమ్మని పెండ్లాడి, మునియప్పరడ్డి గృహస్తుడయ్యాడు. స్నేహితుడి బిడ్డలతో సాముచేస్తూ ముచ్చట్లాడుతూ అతడి ఇంటనే కాటప్ప నివాసం. ‘కాటప్పన్న ఎటుపోయాడో ఏమో నీవన్నా సాపాడప్పా. పొద్దు కంకుతుండాది’ అని మొగుడిని పిలిచింది మునియప్ప భార్య చౌడమ్మ. ‘నువ్వూరుకోయే! ఒంటరిగా ఏడకి పోయిడుస్తాడు? అయినా ఆడు లేకుంటే నాకేడ ముద్ద దిగతాదీ?’ కత్తికి సానపడుతూ కూర్చున్నాడు మునియప్ప. ‘పోతురాజు జాతరకీ గంగమ్మ తిరునాళకీ వీరంగం చేస్తూ కత్తితిప్పడం తప్ప వీరులకీ గొడ్లుకాసే గొల్లలకీ తేడాయే లేదు. ఇలాగే కొన్నాళ్ళుంటే మగతనం నీరుగారి పోయిడుస్తాది. శత్రువు రక్తం కళ్ళజూసి ఎన్నాళ్ళయిందిరా?’ అని కత్తితో మాట్లాడుతూ తలెత్తి వీధి వంక చూశాడు. ఎదురుగా పరుగెత్తుకు వస్తున్న కావలిబంటు ‘అన్నో.. పులినాటి మొరసులు పొన్నే రు కాడ మందపోటేసిండ్రే..’ ‘బిన్నగా బోయి మనోళ్ళని కూడగట్టు. కోట తలుపులు మూసి ఊర్లో దరువేయించమని జెప్పు’ అని గుర్రాల దొడ్డి వంక ఉరుకుతూ ‘కాటప్ప ఏడుండాడు?’ అని కేకేశాడు. ‘ఒంటరిగా వెంగడం బాటన ఆళ్ళ ఎంటబడి పోయిండాడు’ పది మంది దండుతో ఊరొదిలి వెంగడం బాట పట్టాడు మునియప్ప. కోట బాగిల్లో ఎదురొచ్చి ఆరతి బట్టిన చౌడమ్మ ముఖం అతడి కళ్ళముందు అలాగే నిలిచిపోయింది. ఇన్నాళ్ళూ ఎన్ని యుద్ధాలు చేసినా అతడి కోసం ఎదురు చూసేవాళ్ళు లేరు. ఇప్పుడు కొత్తగా.. ఇల్లూ, పెళ్ళాం.. బిడ్డలూ..! చీకట్లో పులినాటి అడవిలో మంద జాడలు వెదుకుతూ ముందుకు సాగింది. మునియప్ప దండు. చేతిసైగతో దళాన్ని నిలిపి కళ్ళు చిట్లించాడు. లీలగా తోచిన గుర్రపు కదలిక. అది కాటప్పదే! సందేహం లేదు. హుష్ అని వేలితో సైగచేస్తూ ఎదురొచ్చాడు కాటప్ప, దూకుడు నీళ్ల లోయలో రాత్రికి నిలిచారు. పాతిక మందికిపైనే. మందలన్నీ ఆడనే ఉండాయి’ అని దూరంగా మిణుకుమిణుకు అంటున్న మంటలని చూపాడు. ‘పాతిక మందా? మన జనం సరిగ్గా కత్తి తిప్పేది పదిమంది’ ‘అర్ధరాత్రి దాకా ఈడనే ఉండి అదనుచూసి మీద పడితే?’ ‘ఊ! గొల్లలని గుర్రాలతో ఈడనే ఉంచి మనం పదిమందీ ముందుకు పోవాల. కొండగొర్రెలా నేను మూడు తడవలు కూతబెడతా. అదే సైగ! నువ్వు ఐదుగురు బంట్లతో తూర్పున తాకు. నేను మిగిలిన వాళ్లతో పైనుండి పడతా’ ‘ఊహూ! కావలి బంట్లతో నేనే అదిక్కు పోతా’ అని ఐదుగురితో కాలినడకన సాగిపోయాడు కాటప్ప. ఠి ఠి ఠి ఊరి పొలిమేరలో మర్రి చెట్టు కింద పదడుగుల వీరభద్రుని మట్టి బొమ్మ. ముఖంలో కాటప్ప పోలికలు కొట్టొచ్చేలా మలిచాడు ఊరి కుమ్మరి. ఎదురుగా వీరగల్లుపైన కొండగొర్రె బొమ్మ. దాని కింద ఆనాటి మందపోటు కథ. అక్షరాలు చదవలేక పోయినా బాపనయ్య చదివి చెప్పినది ఒక్కముక్క కూడా మరిచిపోలేదు. మునియప్ప. నూరు మంది పులినాటి మొరసులని ఎదుర్కొని విప్రపీఠపు మందలు మళ్లించిన భైరవుడు కాటమయ్య తలవరి పరశురామేశ్వర స్వామి సాక్షిగా కైలాసం నుండి ఈ ఊరికి కాపలా! తన మీద బడిన మొరసులని ఒంటిచేత్తో ఎదుర్కొని కత్తిపోట్లకి నెత్తురు పోతున్నా చలించక వెంటబడి తరిమికొట్టిన మిత్రుడి చావుకి కారణమెవరో మునియప్పకి తెలుసు. బంట్లందరూ చచ్చాక భయంతో కత్తి విడిచి గడ్డి నోటగరిచిన తనవంక చూసిన కాటప్ప కళ్ళలో ఎటువంటి ద్వేషమూ ఏహ్యభావమూ కనపడలేదు. తాను కూడా కత్తిబట్టి ఉంటే కాటప్ప బతికేవాడే! తన పిరికితనానికి కారణం ఇల్లూ, పెళ్లాం, బిడ్డలూ! సూర్యుడు పడమట కుంగుతున్నా మునియప్పకి ఇంటికి వెళ్లేందుకు మనసు రాలేదు. ‘ఏమే కల్యాణి! మన కాటప్ప వీరుల స్వర్గంలో పోయిడ్చుండాడో? మనమూ ఆడకే పోవాల. వస్తావా? అని పక్కన నిలిచిన గుర్రాన్ని అడిగాడు మునియప్ప. సరేనని, గిట్టలతో నేలరాస్తూ సకిలించిందది. కావలి గుడిలో నిలిపిన కాటప్ప కత్తి. వేలకొలదీ శత్రువులని ఊచకోత కోసిన డమస్క (సిరియా లోని డమాస్కస్) ఖడ్గం పెకిలించి, ఒరలో దోపి, పదవే నీకింకా పని ఉంది అని గుర్రమెక్కి, అస్తమిస్తున్న సూర్యుడి వైపు ఒంటరిగా సాగిపోయాడు మునియప్ప. రచయిత: +91 9845034442 - సాయి పాపినేని