nagamma
-
జంగవమ్మ జ్ఞాపకాలు
బాలనాగమ్మ కథలో నాగమ్మకు అన్నీ కష్టాలే.. ఇక్కడ కూడా నాగమ్మ ఎన్నో కష్టాలను, కన్నీళ్లను చూసింది. ఆమెపేరు నాగమ్మ అయినందుకు కావచ్చు. దేశచరిత్రలో చీకటి రోజులుగా మిగిలిన ఎమర్జెన్సీ పిడుగు ముత్తునూరు నాగమ్మ కుటుంబం పైన పడింది. గిన్నెదరి హత్యకేసులో విచారణ పూర్తయిన సమయంలోనే ఎమర్జెన్సీ అమలు కావడంతో భూమయ్య, కిష్టాగౌడ్‌లకు ఉరిశిక్ష తప్పలేదు. వారిద్దరికీ వేసిన ఉరిశిక్షను అమలు చేసేందుకు న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే వారికి క్షమాభిక్ష పెట్టాల్సిందిగా దేశంలోని వివిధ సంఘాలన్నీ రాష్ట్రపతిని కలిశాయి. చివరకు ఎమర్జెన్సీ సమయంలో ప్రశ్నించే గొంతులను అణచివేసే చట్టాలు అమ లు చేయడంతో 1975 డిసెంబర్ 1న ఆ ఇద్దరికీ ముషీరాబాద్ సెంట్రల్ జైలులో ఉరిశిక్ష అమలుచేశారు. ఎమర్జెన్సీ సమయంలో వేసిన ఈ శిక్ష దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఉరిశిక్ష పడిన వారిలో ఒకరైన భూమయ్య భార్య ఇప్పుడు పూజారి జంగవమ్మగా జగిత్యాల ప్రాంతంలోని గొల్లపల్లి మండలం రాజోలుపల్లిలో అనాథగానే జీవితాన్ని గడుపుతోంది. 1975 జూన్ 25 విధించిన ఎమర్జెన్సీ సందర్భంగా నాగమ్మ జ్ఞాపకాలపై.. సాక్షి ఆమెను కలిసింది. కొసగంటి నాగమ్మ.. పూజారి జంగవమ్మగా చుట్టుపక్కల గ్రామాల్లో సంవత్సరీకాల (తద్దినాలు) పౌరోహిత్యంతో రోజులు వెళ్లదీస్తున్న ఆమె ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఇలా వివరించింది. ఉరిశిక్ష పై ఉత్తరం వచ్చింది... 1973 ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం గిన్నెదరి గ్రామానికిచెందిన పెద్ద భూస్వామిని తన భర్త భూమయ్యతో పాటు ఆయన స్నేహితుడు కిష్టాగౌడ్‌లు చంపారు. ఈ కేసు హైకోర్టు విచారించిందని ఆ ఇద్దరికీ ఉరిశిక్ష వేస్తున్నట్లు వైజాగ్ సెంట్రల్ జైలు నుంచి లేఖ అందింది. భూమయ్యను హత్యకేసులో జైలుకు తీసుకెళ్లిన తర్వాత ఓసారి వరంగల్ సెంట్రల్‌జైలుకు వెళ్లి కలిసాను. ఆ తర్వాత దాదాపు ఏడాదికి భూమయ్య, కిష్టాగౌడ్‌లకు ఉరిశిక్ష వేస్తున్నట్లు ఉత్తరం అందింది. ఆతృతతో ఆయనను చూసేందుకు వెళ్లాలని ఎంత ప్రయత్నించినా బస్ చార్జీలు దొరకలేదు. దీంతో ఆయనను కలవలేకపోయాను. భూమయ్య జైలుకు వెళ్లిన తర్వాత పుట్టినిల్లు పుట్నూరుకు మూడేళ్లబాబు శంకరయ్యతో కలిసి చివరిసారిగా కలవాలని ఎంత ప్రయత్నించినా బస్సు చార్జీలు దొరకలేదు. భూమయ్య, కిష్టాగౌడ్‌లను ముషీరాబాద్ జైలులో ఉరితీసినట్లు ఎవరో రేడియో విని తెలిపారు. ఆ మరునాడు నాలుగురోజులకు అందిన ఉత్తరం తీసుకొని ముషీరాబాద్ జైలుకు వెళ్లాను. పోలీసులు తనను అనేక విధాలుగా ప్రశ్నించి చివరికి జైలునుంచి వచ్చిన ఉత్తరం చూపించడంతో భూమయ్యను పూడ్చిపెట్టిన స్థలాన్ని మాత్రం చూపించారు. కనీసం ఆయన జ్ఞాపకంగా ధరించిన బట్టలైనా ఇవ్వాలని జైలు అధికారులను వేడుకున్నా కనికరించలేదు. బట్టలతోపాటు అలాగే పూడ్చిపెట్టామని జైలుసిబ్బంది తెలిపారు. రెండుసార్లు వాయిదా... ఆందోళనలో పాల్గొన్న అటల్ బిహరీ వాజ్‌పేయ్... భూస్వామి లచ్చుపటేల్ హత్యకేసులో మరణశిక్ష ఖాయమైన తర్వాత ముందుగా వైజాగ్ సెంట్రల్‌జైలులో ఇద్దరికీ ఉరిశిక్ష వేసేందుకు తేది ఖరారు చేశారు. అప్పటికే విద్యార్థి ఉద్యమాలు బలంగా ఉండడంతో హక్కుల సంఘాల సహకారంతో వైజాగ్ న్యాయస్థానం ముందు వారిద్దరికీ మరణశిక్ష ఆపాలంటూ ఆందోళనలు చేపట్టారు. మరోసారి రాజమండ్రి జైలులో ప్రయత్నించగా తిరిగి బంద్ పిలుపు ఇవ్వడంతో శిక్షను వాయిదా వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేస్తున్న ఉరిశిక్షను రద్దు చేయాలని ఢిల్లీలో అటల్ బిహారీ వాజ్‌పేయ్, శ్రీశ్రీ, జయప్రకాశ్ నారాయణ, జార్జ్‌ఫెర్నండేజ్, కేజీకన్నాభిరామ్, ఎస్.జైపాల్‌రెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, భూపేశ్‌గుప్త, పత్తిపాటి వెంకటేశ్వర్లు ఇలా పెద్ద సంఖ్యలో మేధావులంతా ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. అప్పటికే ఇలాంటి సంఘటనలు శ్రీకాకుళం జిల్లాలో జరిగాయి. శ్రీకాకుళం జిల్లా తాళ్లపాలెం హత్యకేసులో నెల్లూరు జిల్లాకు చెందిన ఇంత రమణారెడ్డి, శంకర్‌రెడ్డి, రామకృష్ణలకు సెషన్‌కోర్టు మరణశిక్ష విధించగా హైకోర్టు మరణశిక్షను రద్దు చేసి ఆ ముగ్గురిపై సాధారణ శిక్షను అమలుచేశారు. సరిగ్గా తాళ్లపాలెం లాంటి సంఘటనగానే గిన్నదరిలో జరిగిన లచ్చుపటేల్ హత్యకేసును చూడాలంటూ ప్రజాసంఘాలన్నీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. అయితే 1972లో జరిగిన స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా ఒడిశా ప్రభుత్వం మరణశిక్షలను రద్దు చేసిందని దీని ఆధారంగా భూమయ్య, కిష్టాగౌడ్‌ల మరణశిక్షను రద్దు చేయాలంటూ పలు సంఘాలు డిమాండ్లు చేశాయి. ఈ సమయంలోనే 1975, మే11న ఆ ఇద్దరికీ విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ జస్టిస్ చిన్నప్పరెడ్డి, జస్టిస్ గంగాదర్‌రావులు ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో ఇక ఆ ఇద్దరూ విడుదల అవుతారని భావించారు. ఆ తర్వాత జూన్ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించడం వల్ల పాత తీర్పును తిరిగి అమలు చేస్తూ డిసెంబర్ 1న ఉరిశిక్ష విధించారు. దేశంలో ప్రజాస్వామిక హక్కులు రదై్దనసమయంగా ఎమర్జెన్సీ సమయాన్ని వర్ణిస్తుంటారు. కొసగంటి భూమయ్య, గున్నాల కిష్టాగౌడ్‌లు ఎవరు..? ఎమర్జెన్సీ సమయంలో ఉరిశిక్షకు గురైన భూమయ్య జంగం పౌరోహితుడు. పెద్దపల్లి డివిజన్లోని వెల్గటూర్ మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన భూమయ్య పౌరోహితం కోసం ఆదిలాబాద్ జిల్లాలకు వెళ్లేవాడు. ఆ సమయంలో తిర్యాని మండలంలోని గడలపల్లికి చెందిన గున్నాల కిష్టాగౌడ్, అంబారావు సహకారంతో లచ్చుపటేల్ ఆకృత్యాలను తెలుసుకున్నారు. కిష్టాగౌడ్, భూమయ్యలు కలిసి లచ్చుపటేల్‌ను గ్రామ భూస్వామిగా పేర్కొంటూ హతమార్చారు. ఆ తర్వాత ధర్మారం పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి ఆదిలాబాద్ జిల్లా కోర్టులో విచారణ జరిపి వరంగల్, ముషీరాబాద్ జైళ్లకు తరలించారు. అక్కడి నుంచి విచారణ పూర్తికావడంతో వైజాగ్ జైలులో ఉన్న విప్లవకారులు భూమయ్య, కిష్టాగౌడ్‌లకు మద్దతుగా నిలిచి వారిని తమవారిగా, విప్లవపార్టీల కార్యకర్తలుగా ప్రకటించుకున్నారు. అప్పటివరకు ఆ ఇద్దరికీ ఎలాంటి విప్లవపార్టీతో సంబంధం లేకుండానే గిన్నదరి భూస్వామిని హతమార్చి జైలుకెళ్లారు. ఆ తర్వాత 1980లో ఏర్పడిన పీపుల్స్‌వార్ పార్టీ భూమయ్య, కిష్టాగౌడ్‌లను అమరవీరులుగా పేర్కొంటూ నివాళులర్పించింది. కట్టా నరేంద్రచారి, పెద్దపల్లి ఫోటోలు: సతీష్‌రెడ్డి, సాక్షి పెద్దపల్లి -
ముగ్గురి బలవన్మరణం
హిందూపురం రూరల్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు బలవన్మరణం చెందారు. హిందూపురం రూరల్ మండలం బేవినహళ్లిలో మంజునాథ్(26) బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ బాషా తెలిపారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జీవితంపై విరక్తితో ఉరేసుకుని తనువు చాలించినట్లు వివరించారు. ఇదే మండలం చౌళూరులో ఈడిగ నాగమ్మ(35) అనే వివాహిత కూడా బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ బాషా తెలిపారు. కొంతకాలంగా మతిస్థిమితం లేని ఆమె ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందినట్లు వివరించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటు చెప్పారు. మనస్తాపంతో వృద్ధురాలు.. బత్తలపల్లి (ధర్మవరం) : బత్తలపల్లి మండలం గంటాపురంలో చిన్న అప్పస్వామి భార్య పుల్లమ్మ(62) విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. కొంతకాలంగా చిన్న అప్పస్వామి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. పుల్లమ్మ కడుపునొప్పితో బాధపడుతోంది. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ పెళ్లిళ్లైపోయాయి. ఎవరికి వారు వేరుగా కాపురాలుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అనారోగ్యంతో ఉన్న తమను ఆదరించే వారు లేరన్న మనస్తాపంతో ఆమె సోమవారం విషపు గులికలు మింగి సమీపంలోని అప్రాచెరువులో మృతి చెందింది. బుధవారం అటుగా వెళ్లిన గొర్రెల కాపర్లు గుర్తించి ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ హారున్‌బాషా తమ సిబ్బందితో అక్కడికి వెళ్లి పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
వడదెబ్బతో ఇద్దరు మృత్యువాత
కంబదూరు / రొద్దం : జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 40 నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలో ఎక్కువగా తిరిగిన వారు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సోమవారం వేర్వేరు చోట్ల ఇద్దరు వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. కంబదూరు మండలం నూతిమడుగు గ్రామానికి చెందిన రామాంజనేయులు (50) ఆదివారం ఉదయం బంధువుల స్వగ్రామమైన కనగానపల్లికి వెళ్లాడు. అక్కడి నుంచి బండమీదపల్లికి బస్సు సౌకర్యం లేకపోవడంతో మధ్యాహ్నం సమయంలో కాలినడకన బయల్దేరాడు. మార్గమధ్యంలో అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ దారిలో వెళుతున్న కొందరు ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రొద్దం మండలం బూచెర్లలో మహిళా కూలీ నాగమ్మ (55) సోమవారం వడదెబ్బతో మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. -
కూతురుని లైంగికంగా వేధిస్తున్న తండ్రి
అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు విజయవాడ(అజిత్‌సింగ్‌నగర్) : కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తిని నున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజీవ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన ఏడుకొండలు అతని భార్య నాగమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు(15)ను ఏడుకొండలు గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తుండటంతో బుధవారం తల్లి నాగమ్మ సహాయంతో నున్న పోలీసు స్టేషన్లో మైనర్ బాలిక ఫిర్యాదు చేసింది. నున్న పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా గురువారం బాలిక తండ్రి ఏడుకొండలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా విచారణలో తన కూతురుకి మతి స్థిమితంలేదని ఏడుకొండలు చెప్పినట్లు పోలీసుల సమాచారం. -
నాగమ్మ... తొలి నాయకురాలు
మహిళ గడప దాటని కాలం. పాక్షికంగా సహగమనం పాటిస్తున్న రోజులు. అలాంటి సందర్భంలో ఒక మహిళ ధిక్కారస్వరం మహిళా లోకానికి మేలుకొలుపు వంటిదే. ఆమె పురుషాధిక్య సమాజం మీద ఎగసిపడిన తిరుగుబాటు కేతనం. ఆమె ‘నాయకురాలు నాగమ్మ’, పల్నాటి వీరవనిత నాగమ్మ. పల్నాడు మోమున విరిసిన పొద్దుతిరుగుడు పువ్వు. ఒక్క పలనాటి చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే విశిష్టమైన మహిళా మణి. నాగమ్మ చరిత్రలో కనిపించే తొలి దేశీయ మహిళా మంత్రి. 12వ శతాబ్దంలో పల్నాడు రాజ్యానికి మహామంత్రి ఆమె. సుపరిపాలన అందించినట్టు ఖ్యాతి గన్న వనిత. ప్రజానేత. ఆమెతోనే మహిళల రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతోంది. ఆమెను కొన్ని సృజనాత్మక రచనలలో ప్రతినాయకురాలుగా కవులూ నాటకకర్తలూ చిత్రించి ఉండవచ్చు. కానీ చరిత్రలో ఆమె ఆధిక్యానికి గొప్ప నిరద్శనం ఆమెకు మాత్రమే పరిమితమైన ‘నాయకురాలు’ బిరుదు. రాణీ రుద్రమ్మ, ఝాన్సీలక్ష్మీ బాయిల కంటె ముందే పాలన చేపట్టింది. ప్రజారంజకమైన పాలనతో చరిత్రకారుల ప్రశంసలు అందుకున్న దక్షురాలు నాగమ్మ. అత్యంత ఆదర్శనీయమైన విదేశ సంబంధాలకు ఉన్నతమైన మార్గాలను అన్వేషించిన మైత్రీ పరిమళం ఆమె. తమ మధ్య ఉన్న విభేదాలను విస్మరించి పల్నాటి యుద్ధంలో ఆమెకు పొరుగు రాజ్యాల వారు సాయం అందించడం విశేషం. ఇది ఆమె రాజకీయ చతురతకు నిదర్శనం. ఆమె ఖడ్గధారి అయిన యోద్ధ. ఒక అపురూప విదుషీమణి. ఆ రోజుల్లోనే సంస్కృతం, కన్నడ, తమిళ, మలయాళ భాషలను అభ్యసించింది. సంగీతం కూడా నేర్చుకుంది. బ్రహ్మనాయుడికి దీటుగా నిలబడి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్న యుక్తురాలైన రాజకీయవేత్త నాగమ్మ. బ్రహ్మనాయుడి వ్యూహాలను ఛేదిస్తూ తన ప్రభువు నలగామరాజునూ, రాజ్యాన్నీ కాపాడింది ఆమె. రాజ్యం ముక్కలు కాకుండా అడ్డుకుంది. పల్నాటి చరిత్ర తొలి వీరగాథ. అందులో కీలక పాత్ర నాగమ్మదే. పల్నాడులో ఒకవైపు నాగమ్మ, మరోవైపు బ్రహ్మనాయుడు నాయకులుగా ఉండి జరిపించిన యుద్ధం పల్నాటియుద్ధం. గుంటూరు జిల్లాలోని రణస్థలి కారంపూడి. ఈ ఘట్టాన్ని ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు విస్మరించలేదు. తెలుగు ప్రాంతంలో అనేక యుద్ధాలు జరిగాయి. కానీ అందులో పల్నాటి యుద్ధంలో వలె ఇప్పటికీ స్మరించుకుంటున్న యుద్ధాలు కనిపించవు. కార్తీక అమావాస్య రోజున ప్రారంభమైనయుద్ధం ఐదు రోజులు జరిగింది. ఆ యుద్ధంలో మరణించిన బ్రహ్మనాయుడి వర్గం వారి ఆయుధాలను కారంపూడిలో ఇప్పటికీ ఏటా పూజిస్తారు. ఈ ఉత్సవం పేరు ‘కొణతముల’. అక్కడ నుంచి సరిగ్గా ఐదు తెలుగు తిథుల తరువాత వచ్చే మార్గశిర ఏకాదశి నుంచి బహుళ పాడ్యమి వరకు నాగమ్మ, ఆమె పక్షాన పోరాడిన వారి స్మృత్యర్థం గురజాలలో ఉత్సవాలు జరుగుతాయి. పౌర్ణమికి జరిగే సిడిమాను ఊరేగింపు ఇందులో ముఖ్యమైనది. కారెంపూడిలో వీర విద్యావంతులు పల్నాటి వీర చరిత్రను గానం చేస్తారు. గురజాలలో పిచ్చిగుంటల వారు ఆ కథలు చెబుతారు. అక్కడా ఇక్కడా ఐదురోజులు ఈ కథాగానం జరుగుతుంది. కానీ ఇటీవల పిచ్చిగుంటల వారి కథాగానం నిలిచిపోయింది. వెహైచ్కె మోహనరావు పిడుగురాళ్ల, గుంటూరు జిల్లా (నేడు గురజాలలో సిడిమానోత్సవం సందర్భంగా)