nagaprasad
-
ఆధిపత్య పోరుతోనే ప్రసాద్ హత్య
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో వైఎస్సార్సీపీ నాయకుడు గంజి నాగప్రసాద్ హత్యకేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు బజారయ్యతోపాటు మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఏలూరులో బుధవారం జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఎస్పీ తెలిపిన మేరకు.. ఈ హత్యకేసులో అదేరోజు ముగ్గురు నిందితులు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోగా, విచారణ అనంతరం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. జి.కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యుడు బిరుదుగడ్డ బజారయ్య, అదే గ్రామానికి చెందిన మండవల్లి సురేష్, ఉండ్రాజవరపు మోహన్‌కుమార్ అలియాస్ మోహన్, శానం హేమంత్, గంజి నాగార్జున, రెడ్డి సత్యనారాయణ అలియాస్ ఆర్ఎస్ఎన్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. మూడు కత్తులు, ఒక కారు, రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందనే కోణంలోను విచారిస్తున్నారు. హత్యకు పక్కా ప్రణాళిక జి.కొత్తపల్లిలో గంజి నాగప్రసాద్, బజారయ్య వర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. దీనిపై కేసులు కూడా నమోదయ్యాయి. ప్రసాద్‌ను హత్య చేయాలనే ఉద్దేశంతో బజారయ్య తన వర్గాన్ని పెంచుకుంటూ వెళ్లాడు. రెడ్డి సత్యనారాయణ, మండవల్లి సురేష్, శానం హేమంత్, గంజి నాగార్జున, మరికొందరితో గతనెల 20న సమావేశమయ్యాడు. గతనెల 30న ఉదయం సుమారు 7.40 గంటల సమయంలో ఇంటి నుంచి మోటారు సైకిల్‌పై నాగప్రసాద్ బయలుదేరుతుండగా నాగార్జున వారికి సమాచారం అందించాడు. మోహన్‌కుమార్ మోటారు సైకిల్ నడుపుతుండగా కత్తులను తువ్వాలులో చుట్టుకుని సురేష్ మధ్యలోను, హేమంత్ వెనుక కూర్చున్నారు. మోహన్‌కుమార్ మోటారు సైకిల్‌తో ఎదురుగా వెళ్లి నాగప్రసాద్ మోటారు సైకిల్‌ను ఢీకొట్టాడు. కిందపడిపోయిన నాగప్రసాద్‌ను సురేష్, హేమంత్, మోహన్ కత్తులతో నరికి హత్యచేశారు. నాగార్జున అక్కడికి వచ్చి వారిని ప్రోత్సహించాడు. -
పోలీసుల అదుపులో కోడెల బినామీ!
సాక్షి, నరసరావుపేట: కేట్యాక్స్ కేసుల్లో కీలక పాత్రధారి గుత్తా నాగప్రసాద్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది. గత టీడీపీ పాలనలో కోడెల కుటుంబానికి అన్నీ తానై వ్యవహరించి సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు నియోజకవర్గాల్లో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడటంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కావటంతో పరారయ్యాడు. మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారుడు శివరాంలపై నమోదైన కేసుల్లోనూ నాగప్రసాద్ నిందితుడిగా ఉన్నాడు. ప్రభుత్వం మారాక తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివరాం, ప్రసాద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శివరాం కబ్జా చేసిన ఆస్తులను ప్రసాద్ పేరిట రాయించినట్లు తెలిసింది. భూ కబ్జా కేసులో టీడీపీ నేత పోతినేని అరెస్టు మంగళగిరి: భూకబ్జా కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి పోతినేని శ్రీనివాసరావును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని లక్ష్మీనరసింహపురం కాలనీలో బీసీలకు చెందిన రూ.కోట్ల విలువైన భూమిని పోతినేని శ్రీనివాసరావు కబ్జా చేయడంతో పాటు రికార్డులు తారుమారు చేసి ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. భూ యజమాని పోలీసులతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికార యంత్రాంగం అంతా పోతినేనికి అండగా నిలవడంతో భూయజమానినిబెదిరించి ఆ భూమిని ఆక్రమించుకుని భూమికి ఫెన్సింగ్ వేసి నిర్మాణం చేపట్టాడు. అయితే పోతినేని శ్రీనివాసరావు భూ కబ్జాపై భూయజమానురాలు కుంచాల మంగేశ్వరి మళ్లీ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
పెళ్లైన 22 రోజులకే పరలోకాలకు..
పామిడి (గుంతకల్లు) : పామిడిలోని 44వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురిలో ఒకరైన జేఎన్టీయూ వీసీ ఎంఎంఎం సర్కార్ కారు డ్రైవర్ నాగప్రసాద్ (30) జీవితం విషాదాంతమైంది. ఈయనకు ఈ నెల ఒకటో తేదీన తూర్పుగోదావరి జిల్లా బండారులంక గ్రామానికి చెందిన నాగదేవితో వివాహమైంది. తిరుగింపులో భాగంగా అత్తగారి ఊరికెళ్లిన నాగప్రసాద్ విధి నిర్వహణలో భాగంగా భార్యను పుట్టింటిలోనే వదిలి ఇటీవలే అనంతపురం రావాల్సి వచ్చింది. పెళ్లయిన 22 రోజులకే నాగప్రసాద్ రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడటం చూసి స్నేహితులు కంటతడి పెట్టారు. -
10 కిలోల గంజాయి పట్టివేత
పెనుగంచిప్రోలులో ఘటన పోలీసుల అదుపులో యువకుడు పెనుగంచిప్రోలు : పెనుగంచిప్రోలులో పోలీ సులు ఆదివారం 10 కిలోల గంజాయిని ఎక్సైజ్, స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొందరు వ్యక్తులు అందించిన సమాచారంతో ఎస్సై నాగప్రసాద్, నందిగామ ఎక్సైజ్ సీఐ సురేంద్రరెడ్డి, రెవెన్యూ అధికారులు సిబ్బంది తో స్థానిక తుఫాన్ కాలనీలోని గుండగాని గోపాలరావు ఇంటిపై దాడి చేశారు. అక్కడ 10 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకు ని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గ్రామానికి చెందిన పెనుగొండ గోపాలరావు, తాను కలిసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నవరంగ్‌పూర్ పట్టణంలో ఒక వ్యక్తి నుంచి కిలో రూ.2,500 ధరకు 20 కిలోల గంజాయిని కొనుగోలు చేశామని గుండగాని గోపాలరావు పోలీసుల విచారణలో చెప్పాడు. అక్కడినుంచి సరుకును తీసుకువచ్చి ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఖమ్మం పట్టణంలో రక్తపరీక్ష కేంద్రం నిర్వహిస్తున్న శ్యామ్ అనే వ్యక్తి వద్దకు వెళ్లామని తెలిపాడు. కిలో ధర రూ.9 వేలు అని చెప్పగా, తాను ఇప్పుడు కొనుగోలు చేయలేనని శ్యామ్ చెప్పాడని గోపాలరావు చెప్పాడు. దీంతో 10 కిలోల గంజాయి ప్యాకెట్‌ను వైరా వద్ద కాల్చివేశామన్నా డు. మిగతాది ఇంటికి తీసుకువచ్చి దాచామని తెలి పాడు. దీనిని కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నాడు. గతంలో ఎప్పుడూ గంజాయి అమ్మలేదని పోలీసులకు వివరించాడు. ఆర్ఐ రవి, వీఆర్వో లావణ్యల సమక్షంలో పంచనామా నిర్వహించి గోపాలరావును ఎస్సై, ఎక్సైజ్ సీఐకు అప్పగించారు. ఈ మేరకు గుండగాని గోపాలరావు, పెనుగొండ గోపాలరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎక్సైజ్ సీఐ తెలిపారు. పెనుగొండ గోపాలరావు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా తుఫాన్ కాలనీ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. ముఖ్యంగా సారా విక్రయా లు, జూద శిబిరాల నిర్వహణతో పాటు తా జా గా గంజాయి అమ్మకాలకు నిలయంగా మా రింది. అధికారులు కూడా అంతగా పట్టించుకోకపోవటంతో అక్రమార్కులు యథేచ్ఛగా తమ వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అసాంఘిక కార్యక్రమాలకు అడ్టుకట్ట వేయాలని స్థానికులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
టికె ట్ ఇవ్వకుంటే తీర్థయాత్రలకే....!
ఖమ్మం, న్యూస్‌లైన్: ‘తుమ్మల నాగేశ్వరరావు కోసం పాలేరు నియోజకవర్గం.. బాలసాని, నాగప్రసాద్ కోసం ఖమ్మం.. కోనేరు చిన్ని కోసం కొత్తగూడెం నియోజకవర్గాలు వదులుకుంటే మన పార్టీకి ఇంకేమి మిగులుతాయి.. టీడీపీతో పొత్తు కుదిరే పక్షంలో జిల్లాలో ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే జిల్లా పార్టీ అంతా కలిసి తీర్థయాత్రలకు వెళ్లడం తప్ప మరో మార్గం లేదు’ అని జిల్లా బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకత్వం ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పొత్తుల నేపథ్యంలో తమకు కనీసం ఒక్క అసెంబ్లీ స్థానం అయినా దక్కేలా టీడీపీతో చర్చించాలని జిల్లా నాయకులు కోరుతున్నారు. అయితే తెలంగాణలో ఒక ఖమ్మం జిల్లాలోనే తమ పార్టీ బలంగా ఉందని, ఇక్కడ ఒక్క స్థానాన్ని కూడా కమలనాథులకు ఇవ్వబోమని టీడీపీ నేతలు అంటుండడంతో జిల్లా బీజేపీ కేడర్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు స్థానాలు కావాలని అధిష్టానంపై ఒత్తిడి... ‘జిల్లాలో అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యాం. గతంతో పోలిస్తే పార్టీని మారుమూల ప్రాంతాల్లోకి కూడా తీసుకెళ్లి శాఖలు ఏర్పాటు చేశాం. దీనిని సద్వినియోగం చేసుకోవాలంటే పార్టీ అభ్యర్థులను పోటీలో దింపాల్సిందే’ అని జిల్లా బీజేపీ నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని, సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయను ఇటీవల కలిసి విన్నవించారు. పాలేరు లేదా కొత్తగూడెం జనరల్ స్థానంతో పాటు పినపాక, మధిర సీట్లు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న అభ్యర్థులు ఇప్పటికే పార్టీ అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారని, కార్యకర్తల్లో కూడా మంచి స్పందన ఉందని వివరించినట్లు సమాచారం. తెలంగాణలోని ఇతర జిల్లాల మాదిరిగానే ఖమ్మంలోనూ పార్టీ బలపడిందని, మిగిలిన జిల్లాల్లో ఇచ్చే ప్రాధాన్యతనే ఇక్కడ కూడా ఇవ్వాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి రాష్ట్ర నాయకత్వాన్ని కోరినట్టు తెలిసింది. పోటీలో లేకుంటే ప్రజల్లోకి వెళ్లలేం.. ఇంతకాలం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, విద్యుత్ చార్జీల పెంపు, రైతులు, ఇతర వర్గాల సమస్యలపై ఉద్యమాలు నిర్వహించడంతో జిల్లాలో కొంతమేర బలపడ్డామనే ఆలోచనలో బీజేపీ జిల్లా నాయకత్వం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలలోనే పోటీచేయకుంటే ఇక భవిష్యత్తు ఏముంటుందనే ప్రశ్న వారిని వేధిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలతోపాటు మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు పలుచోట్ల బరిలోకి దిగారని, గతంతో పోలిస్తే ఓటు బ్యాంకు పెరిగిందని, ఇప్పుడు అసెంబ్లీ బరిలో లేకుంటే ప్రజల్లోకి ఎలా వెళ్లాలని జిల్లా నాయకులు అధిష్టానం ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీట్లు కేటాయిస్తే జిల్లాకు వెళ్తామని, లేదంటే ఇటునుంచి ఇటే తీర్థయాత్రలకు వెళ్లడం తప్ప మరో గత్యంతరం లేదని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో గత రెండు రోజులుగా జిల్లా నాయకులు భీష్మించారు. ఈ పరిస్థితిలో జిల్లాలో మొత్తం స్థానాల్లో టీడీపీ పోటీలో ఉంటుందా.. బీజేపీకి ఒకటి రెండు సీట్లు ఇస్తారా.. అనేది చర్చనీయాంశమైంది.