nakirekhal
-
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ప్రేమ జంటపై దాడి
-
పదోసారి పోటీకి సై.. ఓడినా పట్టింపు నై..
సాక్షి, నల్లగొండ: ‘‘ప్రజాసేవ చేయాలన్నదే నా ఆశయం. అందుకోసం జీవితాంతం పోటీ చేస్తూనే ఉంటా.. ఒక్క ఓటు వచ్చినా.. రాకున్నా పోటీ చేస్తూనే ఉంటాను. డిపాజిట్లు ముఖ్యం కాదు. నాకు ఆశయమే ముఖ్యం. అందుకోసం నేను బతికున్నంత కాలం ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటా’’ అని ఇండిపెండెంట్ అభ్యర్థి మర్రి నెహెమియా అంటున్నారు. నల్లగొండ లోక్‌సభకు శుక్రవారం నామినేషన్ వేసిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇప్పటి వరకు ఆయన నామినేషన్ వేయడం పదోసారి. దీనిపై ఆయన మాట్లాడుతూ ‘నా అభిమానులు నాకున్నారు. ప్రతిసారీ నేను పోటీ చేస్తూనే ఉన్నాను. ప్రతిసారీ ఓట్లు పెరుగుతూనే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో అత్యధికంగా అభిమానులు ఓట్లు వేశారు’ అని అంటున్నారు. సూర్యాపేట పట్టణానికి చెందిన తనకు మొదటి నుంచి రాజకీయాలంటే ఎంతో అభిమానమని, కేవలం కరపత్రాలు, పోస్టర్లు మినహా పెద్దగా ఖర్చు పెట్టడం లేదని తెలిపారు. తాను బతికున్నంతకాలం పోటీ చేస్తూనే ఉంటానన్నారు. 1984 నుంచి అప్పటి మిర్యాలగూడ లోక్‌సభ స్థానానికి, మిర్యాలగూడ రద్దయిన తర్వాత నల్లగొండ లోక్‌సభ స్థానానికి ఆయన నామినేషన్లు వేసి పార్లమెంట్‌కు పోటీ చేస్తూనే ఉన్నట్లు తెలిపారు. 2014 ఎన్నికల్లో 9వ సారి పోటీ చేశాను. 56 వేల ఓట్ల పైచిలుకు వచ్చాయని, 10వ సారి నల్లగొండ ఎంపీగా నామినేషన్ సమర్పించినట్లు తెలిపారు. అంతకుముందు నకిరేకల్, సూర్యాపేట నియోజకవర్గాల్లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశానని, మరో మూడు పర్యాయాలు సూర్యాపేట మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేసినట్లు చెప్పారు. – మీసాల శ్రీనివాసులు, సాక్షి– నల్లగొండ -
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి
సాక్షి,నకిరేకల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయని బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశాన్ని గెలిపించాలని కోరుతూ నకిరేకల్ మండలం నోముల గ్రామంలో సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ కేసీఆర్ సీఎం అయితేనే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు మహ్మద్ హాజీ హుస్సేన్, మార్కెట్ వైస్ చైర్మన్ వీర్లపాటి రమేశ్, నాయకులు సామ సురేందర్‌రెడ్డి, కుంచం సోమయ్య, బాదిని సత్తయ్య, కే. శ్రీనివాస్‌రెడ్డి, ఎర్ర వెంకన్న, మాచర్ల శ్రీను, భూపతి నర్సింహ, బాదిని సత్తయ్య, శ్రీధర్, మాదాసు నాగరాజు, కొమ్ము రాములు, అబ్జల్, ఖదీర్, మద్గుమ్, వెంకన్న తదిత రులు ఉన్నారు. నకిరేకల్‌లోని 19వ వార్డులో ప్రచారం.. నకిరేకల్‌లో ప్రచారం.. టీఆర్ఎస్ను గెలిపించాలని కోరుతూ నకిరేకల్‌లోని 19, 20వ వార్డుల్లో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొండ వెంకన్నగౌడ్, నాయకులు సోమా యాదగిరి, పెండెం సదానందం, సామ శ్రీనివాస్‌రెడ్డి, మంగినపల్లి రాజు, రాచకొండ వెంకన్న, కందాళ భిక్షంరెడ్డి, శేఖర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, కొరిమి వెంకన్న, గునగంటి రాజు, వంటెపాక శ్రీను, చౌగోని సైదులు, నార్కట్‌పల్లి రమేశ్, పందిరి యాదమ్మ, కనుకు సహాని, కొండ సబిత, షబానా, చిట్యాల నిర్మల తదితరులు పాల్గొన్నారు నార్కట్‌ల్లిలో ప్రచారం చేస్తున్న ఎంపీపీ. నార్కట్‌పల్లి : శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం గెలుపునకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎంపీపీ రేగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి తెలిపారు. సోమవారం నార్కట్‌పల్లి పట్టణ కేంద్రంలోని 2వ వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షడు సట్టు సత్తయ్య, వైస్ ఎంపీపీ పుల్లెంల పద్మముత్తయ్య, మాజీ సర్పంచ్ పుల్లెంల అచ్చాలు, మాజీ ఉప సర్పంచ్ దుబ్బాక కళమ్మ రాంమల్లేశం, బాజ యాదయ్య, వేముల నర్సింహ, పుల్లెంల శ్రీనివాస్, రహీం, ముంత వెంకన్న, రమణ, ప్రజ్ఞాపురం రామకృష్ణ, బోయపల్లి శ్రీను, ఆజీజ్, విజయలక్ష్మి, దేవేందర్, టీజీ లింగం, తదితరులు ఉన్నారు. -
టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలు చేస్తోంది
కట్టంగూర్ (నకిరేకల్) : నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడతోందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషిచేస్తున్న కోమటిరెడ్డిని అణగదొక్కాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. అసెంబ్లీలో జరిగిన సంఘటనపై కోర్టులో కేసు వాదనలో ఉండగానే గన్మెన్లను ఉపసంహరించుకోవడం నియంత పాలనకు నిదర్శనమన్నారు. తీర్పు కోమటిరెడ్డికే అనుకూలంగా వస్తుందని.. దాంతో కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు అవుతుందన్నారు. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు పోగుల నర్సింహ, మాజీ జెడ్పీటీసీ సుంకరబోయిన నర్సింహ, పెద్ది సుక్కయ్య, వల్లపు శ్రీనివాసరెడ్డి, బీరెల్లి ప్రసాద్, పుట్ట నర్సింహారెడ్డి, ముక్కాముల శేఖర్, బొజ్జ శ్రీను, నోముల వెంకటేశ్వర్లు, అంజయ్య తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో కిరాణవ్యాపారి మృతి
రామన్నపేట (నకిరేకల్) : రోడ్డు ప్రమాదంలో కిరాణవ్యాపారి మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం రామన్నపేట శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన వీర్లపాటి పెద్దయ్య(45) గ్రామంలో కిరాణవ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం కిరాణాసామాను కొనుగోలు చేసేందుకు తన బైక్‌పై రామన్నపేటకు వెళ్లాడు. మధ్యాహ్నం సామాను తీసుకుని దుబ్బాకకు వెళ్తుండగా.. రామన్నపేట శివారులోని మూలమలుపువద్ద ఎదురుగా వస్తున్న టాటామ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని 108లో రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించి మృతిచెందాడు. పెద్దయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య రమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.నాగన్న తెలిపారు. -
పరిశ్రమలో విషవాయువు వెలువడి..
చిట్యాల (నకిరేకల్) : పరిశ్రమలో విషవాయువు వెలువడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోని అతులిత రసాయన పరిశ్రమలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని ఏపూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఉప్పల అంజయ్య కుమారుడు సాయికిరణ్(20) రెండు నెలలుగా మండలంలోని అతులిత రసాయన పరిశ్రమలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం పరిశ్రమలోని ఓ యూనిట్లో అకస్మాత్తుగా విషవాయువులు వెలువడ్డాయి. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న సాయికిరణ్ ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో సాయికిరణ్‌ను పరిశ్రమ నిర్వహణ అధికారులు ఆ గ్రామ శివారులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సాయికిరణ్‌ను పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. పరిశ్రమ ఎదుట ఆందోళన.. సాయికిరణ్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్నేహితులు పరిశ్రమ వద్దకు భారీగా చేరుకున్నారు. సా యికిరణ్ మృతదేహాన్ని పరిశ్రమ ఆవరణలో ఉంచి ఆందోళనకు దిగారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సాయికిరణ్ మృతి చెందాడని ఆరోపించారు. యజమాన్యం సాయికిరణ్ కుటుంబానికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. పరిశ్రమ యజమాన్యం కొంత పరిహారం చెల్లించేందుకు అంగీకరించటంతో ఆందో ళన విరమించారు. కాగా చేతికందిన కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
'సారీ అమ్మా.. నీ పేరు నిలబెట్టలేకపోయా..'
నకిరేకల్: బీటెక్ మూడో సంవత్సరంలో నిర్దేశిత ప్రమాణాలను చేరుకోలేకపోయిన ఓ విద్యార్థిని మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు.. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందిన రొట్టెల స్వాతి హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో బ్రిలియంట్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే, మూడో ఏడాదిలో ఆమెను కళాశాల డిటెయిన్డ్ చేసింది. దీంతో తాను ఫెయిల్ అయినట్టేనని, అమ్మా, నాన్నలకు ముఖం చూపించుకోలేనని మనస్తాపం చెందిన స్వాతి నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలోని అమ్మమ్మ వాళ్లి ఇంటికి వచ్చి, శుక్రవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. చనిపోయే ముందు స్వాతి రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 'సారీ అమ్మా నేను కాలేజీ డిటెంట్ అయ్యాను. అంటే ఫెయిల్ చేస్తారు. నీ పేరు నిలబెట్టలేకపోయాను అమ్మా, మీరు బాగుండాలి. తమ్ముళ్లను బాగా చదివించు అమ్మా' అంటూ సూసైడ్ నోట్లో స్వాతి రాసింది. -
లక్షణంగా దొరికిపోయారు
నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో డ్రిప్ వైర్లు దొంగిలించిన వ్యక్తులు పోలీసులకు దొరికిపోయారు. శుక్రవారం వారు దొంగలించిన వైర్లను అమ్మేందుకు యత్నించి నర్సంపేటలో పోలీసులకు చిక్కారు. వారంతా నల్లగొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రానికి చెందిన వారిగా పోలీసుల విచారణలో తేలింది. వైర్ల విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నకిరేకల్లుకు చెందిన రావుల రాజేష్, సారంగి శ్రీను, బాలరాజు, యాదగిరిలు కలిసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.