సమావేశంలో మాట్లాడుతున్న చిరుమర్తి లింగయ్య
కట్టంగూర్ (నకిరేకల్) : నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి పెరుగుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడతోందని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషిచేస్తున్న కోమటిరెడ్డిని అణగదొక్కాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. అసెంబ్లీలో జరిగిన సంఘటనపై కోర్టులో కేసు వాదనలో ఉండగానే గన్‌మెన్లను ఉపసంహరించుకోవడం నియంత పాలనకు నిదర్శనమన్నారు. తీర్పు కోమటిరెడ్డికే అనుకూలంగా వస్తుందని.. దాంతో కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు అవుతుందన్నారు. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు పోగుల నర్సింహ, మాజీ జెడ్పీటీసీ సుంకరబోయిన నర్సింహ, పెద్ది సుక్కయ్య, వల్లపు శ్రీనివాసరెడ్డి, బీరెల్లి ప్రసాద్, పుట్ట నర్సింహారెడ్డి, ముక్కాముల శేఖర్, బొజ్జ శ్రీను, నోముల వెంకటేశ్వర్లు, అంజయ్య తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment