సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి | BC Finance Corporation Chairman P shambaiah Talks About TRS Development | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి

Published Tue, Nov 13 2018 10:48 AM | Last Updated on Wed, Mar 6 2019 5:57 PM

BC Finance Corporation Chairman P shambaiah Talks About TRS Development - Sakshi

నకిరేకల్‌ : ప్రచారం చేస్తున్న పూజర్ల శంభయ్య

సాక్షి,నకిరేకల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయని బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పూజర్ల శంభయ్య అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశాన్ని గెలిపించాలని కోరుతూ నకిరేకల్‌ మండలం నోముల గ్రామంలో సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ కేసీఆర్‌ సీఎం అయితేనే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు మహ్మద్‌ హాజీ హుస్సేన్, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ వీర్లపాటి రమేశ్, నాయకులు సామ సురేందర్‌రెడ్డి, కుంచం సోమయ్య, బాదిని సత్తయ్య, కే. శ్రీనివాస్‌రెడ్డి, ఎర్ర వెంకన్న, మాచర్ల శ్రీను, భూపతి నర్సింహ, బాదిని సత్తయ్య, శ్రీధర్, మాదాసు నాగరాజు, కొమ్ము రాములు, అబ్జల్, ఖదీర్, మద్గుమ్, వెంకన్న తదిత రులు ఉన్నారు. 

నకిరేకల్‌లోని 19వ వార్డులో ప్రచారం..
నకిరేకల్‌లో ప్రచారం..
టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరుతూ నకిరేకల్‌లోని 19, 20వ వార్డుల్లో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొండ వెంకన్నగౌడ్, నాయకులు సోమా యాదగిరి, పెండెం సదానందం, సామ శ్రీనివాస్‌రెడ్డి, మంగినపల్లి రాజు, రాచకొండ వెంకన్న, కందాళ భిక్షంరెడ్డి, శేఖర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, కొరిమి వెంకన్న, గునగంటి రాజు, వంటెపాక శ్రీను, చౌగోని సైదులు, నార్కట్‌పల్లి రమేశ్, పందిరి యాదమ్మ, కనుకు సహాని, కొండ సబిత, షబానా, చిట్యాల నిర్మల తదితరులు పాల్గొన్నారు

నార్కట్‌ల్లిలో ప్రచారం చేస్తున్న ఎంపీపీ.
నార్కట్‌పల్లి : శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల వీరేశం గెలుపునకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎంపీపీ రేగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి తెలిపారు. సోమవారం నార్కట్‌పల్లి పట్టణ కేంద్రంలోని 2వ వార్డులో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షడు సట్టు సత్తయ్య, వైస్‌ ఎంపీపీ పుల్లెంల పద్మముత్తయ్య, మాజీ సర్పంచ్‌ పుల్లెంల అచ్చాలు, మాజీ ఉప సర్పంచ్‌ దుబ్బాక కళమ్మ రాంమల్లేశం, బాజ యాదయ్య, వేముల నర్సింహ, పుల్లెంల శ్రీనివాస్, రహీం, ముంత వెంకన్న, రమణ, ప్రజ్ఞాపురం రామకృష్ణ, బోయపల్లి శ్రీను, ఆజీజ్, విజయలక్ష్మి, దేవేందర్, టీజీ లింగం, తదితరులు ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement