నలియా వద్ద తీరం దాటనున్న నీలోఫర్ తుపాన్
ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం నిలోఫర్ తుపానుగా మారి నవంబర్ 1న తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గుజరాత్‌లోని నలియా వద్ద తీరం దాటనున్నట్లు వారు తెలిపారు.
గుజరాత్ సహా పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలపై తుపాను ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితులలో ముందు జాగ్రత్త చర్యగా గుజరాత్‌కు ఎన్డీఆర్ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బలగాలను తరలించారు.
**