nalla surya prakash rao
-
ప్రజల పై భారం వేయడమే కార్యక్రమంగా పెట్టుకున్నారా?
-
జగన్‌తోనే సమైక్యాంధ్ర
పామర్రు, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాడుతున్న ఏకైక నేత వైఎస్.జగన్మోహన్రెడ్డి మాత్రమేనని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్ అన్నారు. మంగళవారం పామర్రులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్రలో ఒక మాట, తెలంగాణాలో మరోక మాట మాట్లాడుతూ ఇరుప్రాంతాల ప్రజలను మోసం చేసే చంద్రబాబుకు జగన్‌ను విమర్శించే నైతికహక్కు లేదన్నారు. సమైక్యం కోసం పోరాడుతున్న మడమ తిప్పని జననేత జగన్‌ను విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. కాక తాళీయంగా హిట్లర్ పుట్టిన రోజునే పుట్టిన చంద్రబాబుకు ఆయన బుద్ధులే అబ్బాయన్నారు. ఒక అబద్దాన్ని 100 సార్లు చెబితే నిజంగా మార్పు చేయడం కోసం హిట్లర్ తన పక్కన గ్లోబెల్‌ను మంత్రిగా ఉంచుకున్నాడని తెలిపారు. నాటి గ్లోబెల్ తరహాలోనే ప్రస్తుతం చంద్రబాబుకు వర్ల రామయ్య దొరికాడని చెప్పారు. కిరణ్, చంద్రబాబుల కారణంగానే రాష్ట్రం రావణ కాష్టంలా తయారయిందని విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్‌లా జగనే సమర్థుడు.... ఆంధ్రప్రదేశ్‌లో దివంగత మహానేతలు ఎన్టీఆర్, వైఎస్సార్ తరహాలో రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించగలిగిన ఏకైకనేత జగన్మోహన్రెడ్డి మాత్రమేనని సినీనటుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీన ర్ విజయ్‌చందర్ అన్నారు. పామర్రులోని పార్టీ కార్యాలయంలోని దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి , ఈ మధ్యనే మృతి చెందిన మాజీ జెడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయ్‌చందర్ మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని కాపాడి భావితరాలకు ఆదర్శ నాయకుడుగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహనరెడ్డి నిలుస్తారన్నారు. రాష్ట్రంలో విభజన వాదాన్ని అనుసరిస్తున్న చంద్రబాబు, కిరణ్‌లు తెలుగు జాత్రి ద్రోహులు గా, చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. చంద్రబాబు తొత్తు వర్ల రామయ్య జననేత జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదమని చెప్పారు. చిరంజీవి తన గురించి తాను కలలు కనడం తప్ప.... రాష్ట్ర సమస్యలపై ఏనా డూ స్పందించలేదని విమర్శించారు. పార్టీ కేంద్రపాలక మండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన, గ్రేటర్ హైదరాబాద్ ఎస్సీ కన్వీనర్ ఎన్.రవిబాబు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు రాహుల్ రెడ్డి, వైఎస్సార్ సీపీ విద్యార్థి నాయకులు సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు. -
'బాబు పెంపుడు కుక్కలా మందకృష్ణ పని చేస్తున్నారు'
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కలా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పనిచేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత నల్లా సూర్యప్రకాశ రావు మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీని అవకాశవాద రాజకీయ పార్టీగా మందకృష్ణ వ్యాఖ్యానించడాన్ని సూర్య ప్రకాశ్ తూర్పరా బట్టారు. ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు-మందకృష్ణ కలిసి ఆడుతున్న డ్రామాపై విరుచుపడ్డారు. మాదిగ ప్రయోజనాలను పక్కనబెట్టిన మందకృష్ణ చంద్రబాబుపై ప్రేమ కురిపించడానికి కారణమేమిటని ప్రశ్నించారు. బాబు ప్రయోజనాల కోసం మాత్రమే మందకృష్ణ పనిచేస్తున్నారని సూర్య ప్రకాశ్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీని అవకాశవాద రాజకీయ పార్టీగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి సమన్యాయం చేయలేనప్పుడు సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి కోరడాన్ని తప్పుబట్టిన మందకృష్ణ చంద్రబాబు పెంపుడు కుక్కలా వ్యవహరించడం సరికాదని నల్లా విమర్శించారు. -
తెలంగాణ కన్నా దళితులకు సంక్షేమమే ముఖ్యం
వైఎస్సార్ సీపీ నేత నల్లా సూర్యప్రకాశరావు సాక్షి, హైదరాబాద్: తెలంగాణకన్నా దళితలకు సంక్షేమమే ముఖ్యమని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్య ప్రకాశరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని దళితుల ప్రయోజనాలను ఏ విధంగా పరిరక్షిస్తారో రాష్ట్ర విభజనకు ముందే కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగడానికేనని స్పష్టంచేశారు. విభజన ప్రకటనతో సీమాంధ్రులు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, జేఏసీ నాయకులు మాట్లాడుతున్న భాష దారుణంగా ఉందన్నారు. ‘తెలంగాణలో సీమాంధ్రులకు రక్షణ కల్పించడం మా బాధ్యత అంటున్నారు. ఇంతకు రక్షణ కల్పించడానికి వారెవరు?’ అని ప్రశ్నించారు. విభజన జరిగితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కాకుండా పోతాయనే భయం కలుగుతుందన్నారు. తెలంగాణ వచ్చినా, రాకున్నా దళితులకు కావాల్సింది సంక్షేమ పథకాలేనని చెప్పారు. -
వైఎస్ఆర్ సిపి ఎస్సి సెల్ కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్‌రావుతో సాక్షి వేదిక