nandyala municipality
-
YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కి అల్లు అర్జున్ ప్రచారం!
-
90.61 లక్షల మంది ‘పుర’ ఓటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి 10న జరగనున్న పురపాలక ఎన్నికల్లో 90,61,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో 2,794 డివిజన్లు, వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 12 నగరపాలక సంస్థల్లో 671 డివిజన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 2,123 వార్డులు ఉన్నాయి. పురపాలక ఎన్నికల ఓటర్ల జాబితాలను పురపాలకశాఖ ఖరారు చేసింది. ఓటర్లలో పురుషులు కంటే మహిళలే అధికంగా ఉన్నారు. నగరపాలక సంస్థల్లో విశాఖపట్నంలోను, పురపాలకసంఘాల్లో నంద్యాలలోను ఎక్కువమంది ఓటర్లున్నారు. ► మొత్తం ఓటర్లు 90,61,806 మంది. వీరిలో పురుషులు 44,59,064 మంది, మహిళలు 46,01269 మంది. ఇతరులు 1,473 మంది. ► 12 నగరపాలికల్లో ఓటర్ల సంఖ్య 52,52,355. వీరిలో పురుషులు 25,97,852 మంది, మహిళలు 26,53,762 మంది, ఇతరులు 741 మంది. ► 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ఓటర్ల సంఖ్య 38,09,451. వీరిలో పురుషులు 18,61,212 మంది, మహిళలు 19,47,507 మంది, ఇతరులు 732 మంది. ► నగరపాలక సంస్థల్లో మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ (జీవీఎంసీ) విస్తీర్ణంలోను, ఓటర్ల సంఖ్యలోను మొదటి స్థానంలో ఉంది. 98 డివిజన్లున్న జీవీఎంసీలో ఓటర్ల సంఖ్య 17,52,927. వీరిలో పురుషులు 8,80,481 మంది, మహిళలు 8,72,320 మంది, ఇతరులు 126 మంది. ► మచిలీపట్నం నగరపాలక సంస్థలో తక్కువ మంది ఓటర్లున్నారు. 50 డివిజన్లు ఉన్న ఈ నగరపాలక సంస్థలో ఓటర్ల సంఖ్య 1,31,829. వీరిలో పురుషులు 63,883 మంది, మహిళలు 67,936 మంది, ఇతరులు 10 మంది. ► ఓటర్ల సంఖ్యలో కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం మొదటి స్థానంలో ఉంది. 42 వార్డులున్న నంద్యాలలో ఓటర్ల సంఖ్య 1,86,310. వీరిలో పురుషులు 90,597 మంది, మహిళలు 95,640 మంది, ఇతరులు 73 మంది. ► గూడూరు నగర పంచాయతీ చివర్లో ఉంది. 20 వార్డులున్న ఈ నగర పంచాయతీలో ఓటర్ల సంఖ్య 15,789 మాత్రమే. -
మున్సిపల్ కేసులన్నీ సీబీ సీఐడీకి?
రంగం సిద్ధం చేసిన పోలీసులు నంద్యాలటౌన్: నంద్యాల మున్సిపాలిటీలో జరిగిన ఆస్తి పన్నుల కుంభకోణం, రికార్డుల గది దగ్ధం, మినీట్స్ బుక్ అదృశ్యం కేసులను సీబీ సీఐడీకి అప్పగించాలని పోలీసులు నిర్ణయించారు. మహా శివరాత్రి వేడుకలు పూర్తయ్యాక జిల్లా ఎస్పీ రవికృష్ణ ద్వారా వీటిని బదిలీ చేయడానికి రంగం సిద్ధం చేశారు. గత ఏడాది జూలై 11న మున్సిపల్ కార్యాలయంలోని రికార్డుల గది అగ్ని ప్రమాదానికి గురైంది. సిబ్బంది అవినీతి వెలుగులోకి రాకుండా నివారించడానికి గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల గదిని తగలబెట్టినట్లు ఆరోపణలు వినిపించాయి. అధికారులు ఒక చిరుద్యోగి సస్పెండ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. స్పెషల్ ఆఫీసర్ పాలనలో చేసిన తీర్మానాలకు సంబంధించిన కీలక మినీట్స్ బుక్ గత ఏడాది జూన్‌లో అదృశ్యమైంది. దీనికి సంబంధించి ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. ఇప్పటికీ మినీట్స్ బుక్ ఆచూకీ లేదు. గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన ఆడిటింగ్‌లో రెవెన్యూ సెక్షన్లో ఆస్తి పన్నులకు సంబంధించి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై 13 మంది ఉద్యోగులను మున్సిపల్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు అప్పటి కమిషనర్ రామచంద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. 13 మంది ఉద్యోగులపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసు విచారణ ఇప్పటి వరకు ముందుకు సాగడం లేదు. పోలీసులు కేసు విచారణ చేపడితే 300 మంది ఆస్తి పన్నుల యజమానులను విచారించాల్సి ఉంది. విచారణలో మరో 300 మంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం పనిభారం అధికంగా ఉన్నందున ఈ కేసుల విచారణ ముందుకు సాగడం లేదు. దీంతో వీటి విచారణ బాధ్యతలను సీబీ సీఐడీకి బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు.