napkins
-
ఈ ఫొటో ప్రత్యేకత ఏమంటే..
ఈ ఫొటో ప్రత్యేకత ఏమంటే.. ఈ అమ్మాయి ధరించిన వెడ్డింగ్ డ్రెస్‌ను టాయిలెట్ పేపర్‌తో తయారు చేశారు. న్యూయార్క్‌లో నిర్వహించిన ఓ పోటీలో ఈ డ్రెస్‌ను ఉత్తమమైనదిగా ఎంపికచేశారు. -
ఫ్రెండ్లీ పీరియడ్
ప్లాస్టిక్‌తో తయారైన ఒక శానిటరీ ప్యాడ్ మట్టిలో కలిసిపోవడానికి 500–800 ఏళ్లు పడుతుందని అంచనా! ఇంత ప్రమాదకరమైన మెటీరియల్‌ని కొని, వాడి.. టన్నులకొద్దీ చెత్త పోగయ్యాక ప్రభుత్వాలని ప్రశ్నించడం సరైన పనేనా? మనలోనే ఒక సాధారణ మహిళ మదిలో ఈ ప్రశ్న తలెత్తింది. అందుకు సమాధానంగా తనే ముందడుగు వేసి, పర్యావరణహితమైన ప్యాడ్లను ఉత్పత్తి చేస్తోంది. ఆ మహిళే చదురుపల్లి పరమేశ్వరి. దుకాణాల్లో దొరికే శానిటరీ ప్యాడ్లు సింథటిక్, ప్లాస్టిక్‌తో తయారు చేసినవి. వీటిని నాలుగు గంటలకొకసారి మార్చుకోవాలి. లేకపోతే వ్యాధులు సోకే అవకాశం ఉంది. వాడి పడేసిన ఈ ప్యాడ్లు పర్యావరణానికి హాని కలిగిస్తాయి కూడా. అదే కలపగుజ్జుతో తయారు చేసే ప్యాడ్లు ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడటమే కాకుండా తొందరగా భూమిలో కలిసిపోతాయి అంటారు పరమేశ్వరి. ‘షైన్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, ఆ సంస్థ ద్వారా ఎకోఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్ల తయారీ, వాటి వినియోగంపై అవగాహనతో పాటు ఎంతమంది మహిళలకు జీవనోపాధి కూడా కల్పిస్తున్నారామె. కష్టాలనుంచి ‘షైన్’ అయ్యారు పరమేశ్వరిది పేద కల్లుగీత కార్మిక కుటుంబం. కుటుంబంలోని నలుగురు పిల్లల్లో ఆమె ఒకరు. కూలి పనులు చేసుకుంటూ చదువుకున్నారు. పలు వృత్తివిద్యా కోర్సులూ నేర్చుకున్నారు. 2009లో పెళ్లయ్యాక భర్త ప్రోత్సాహంతో పీజీ చేశారు. ‘‘కొన్నేళ్ల క్రితం నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అప్పుడు నేను గర్భిణిని. ఎముకలు బలహీనంగా ఉన్నాయి, ఇక బతకటం కష్టం అని చెప్పారు. కాని సకాలంలో చికిత్స అందటం వల్ల బతికాను. ఏడాదిపాటు మందులు, ఆసుపత్రి ఖర్చుల తర్వాత నాలుగు లక్షల అప్పు నెత్తిన పడింది’’ తన కష్టకాలం గురించి చెప్పారు పరమేశ్వరి. ‘‘ఆ సమయంలోనే నాన్నకు పక్షవాతం రావడంతో అమ్మ వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని నడిపేందుకు పడిన బాధలు గుర్తొచ్చాయి. ఆమెలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న స్త్రీలకు సహకారం అందించాలనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలోనే నాలుగేళ్ల క్రితం ‘సొసైటీ ఫర్ హెల్పింగ్ ఇంటిగ్రిటీ నెట్వర్క్ ఫర్ ఎంపవర్మెంట్’(షైన్) సంస్థను ప్రారంభించి, నేను, మరికొందరం కలిసి పేద మహిళలకు టైలరింగ్, బ్యూటీ కోర్సులూ, కంప్యూటర్ బేసిక్స్ నేర్పించాం. దేశంలో పది రాష్ట్రాల్లో శానిటరీ ప్యాడ్ల తయారీ ప్రారంభించాం. మా నిర్వహణ, అవగాహన కార్యక్రమాల విషయంలో మా సెంటర్‌కు మొదటి స్థానం దక్కింది. కేంద్ర ప్రభుత్వం నుండి నాకు ‘స్త్రీ స్వాభిమాన్ ఎక్స్‌లెన్స్ అవార్డు’ వచ్చింది. భవిష్యత్తులో మహిళలకు నైపుణ్య శిక్షణలతో పాటు ఆరోగ్యం–పరిశుభ్రతలపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాను’’ అని చెప్పారు పరమేశ్వరి. ఇప్పుడు వీరి సంస్థ ‘షైన్’.. నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో భాగస్వామి! ఆలోచన ఎలా వచ్చింది? శానిటరీ ప్యాడ్స్ తయారీకి ముందు పరమేశ్వరి వివిధ జీవన నైపుణ్యాలపై అనేక శిక్షణా తరగతులు నిర్వహించారు. వాటన్నిటినీ పక్కకు నెట్టి పూర్తిగా ప్యాడ్ల తయారీలో నిమగ్నం అయ్యారు. అందుకు కారణాలు లేకపోలేదు. ‘‘షైన్‌ని స్థాపించే ముందు నేను కొన్ని పల్లెటూళ్లకి వెళ్లి రుతుస్రావ సమయంలో వారి అలవాట్లను పరిశీలించాను. చాలా ఆశ్చర్యకరమైన, ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని తండాల్లో మహిళలు నెలసరి సమయంలో బట్టలో ఇసుక చుట్టి వాడడం గమనించాను. కొంతమంది జనపనారను వాడుతున్నారు. దేవరకొండలో అయితే మరీ దారుణం. కట్టెల పొయ్యి బూడిదను పాతబట్టలో చుట్టి వాడుతున్నారు. దీని వల్ల వాళ్లకు ఇన్ఫెక్షన్లు వచ్చి, రోగాల బారిన పడుతున్నారు. నెలసరి సమయంలో యావరేజ్‌గా ఒక మహిళకు ఏడు శానిటరీ ప్యాడ్ల అవసరం ఉంటుంది. అయితే, ప్రతినెల వాటిని కొనే స్థోమత లేని వారు మోటు పద్ధతులను పాటిస్తున్నారు. దీనిని నివారించేందుకే చెట్టుబెరడుతో తయారైన పర్యావరణహిత శానిటరీ ప్యాడ్ల తయారీ చేపట్టాం. అవి ఇటు ఆరోగ్యానికి, ఇటు పర్యావరణానికీ మేలు చేస్తాయి’’ అన్నారు పరమేశ్వరి. మెటీరియల్ ఎలా లభిస్తుంది? కేంద్ర ఐటీ శాఖ మహిళల ఆరోగ్య రక్షణ, పర్యావరణహితం అనే రెండు లక్ష్యాలతో చేపట్టిన ‘స్త్రీ స్వాభిమాన్’ పథకంలో భాగంగా 2017 సెప్టెంబర్‌లో తొలిసారిగా షైన్ పర్యావరణ హిత ప్యాడ్స్ తయారీని ప్రారంభించింది. అది విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలకు ఈ పథకాన్ని విస్తరించారు. అమెరికా నుండి దిగుమతి చేసుకున్న చెట్ల గుజ్జు రంగారెడ్డిజిల్లా, తుర్కయాంజల్‌లోని షైన్ సంస్థకు తరలిస్తారు. అక్కడ ఎనిమిది దశల్లో గుజ్జును ప్యాడ్‌గా రూపొందిస్తారు. వీటిని పూర్తిగా చేతితో తయారు చేస్తున్నారు. ప్రస్తుతం పది మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. నెలకు 40 నుండి 50 వేల ప్యాడ్లను ఉత్పత్తి చేసి గ్రామాలకు పంపుతున్నారు. ప్యాడ్ల వాడకంపై అవగాహన కల్పించడం కోసం ఇరవై గ్రామాలు తిరిగారు. సెర్వైకల్ క్యాన్సర్‌పైనా అవగాహన ‘‘మార్కెట్లో దొరికే ఇతర రకాల శానిటరీ ప్యాడ్ల ధర ఎక్కువగా ఉంటోంది. అందుకే పేద మహిళలందరికీ అందుబాటులో ఉండేలా మా షైన్ సంస్థ ఎనిమిది ప్యాడ్ల ప్యాక్‌ను రూ.28 కే అందజేస్తోంది. మనదేశంలో మహిళ సెర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీనిని నివారించాలంటే నెలసరి గురించి బాలికలకు సరైన అవగాహన కల్పించాలి. ఇందుకు కావలసిన అవగాహన కార్యక్రమాలను కూడా మా వంతు బాధ్యతగా నిర్వహిస్తున్నాం. ఆర్థికంగా సహాయం లభిస్తే ఈ కార్యక్రమాలను మరింత విస్తృత పరచగలం’’ అని అశాభావ్యం వ్యక్తం చేస్తున్నారు పరమేశ్వరి. తాము తయారు చేసిన ప్యాడ్స్‌ను స్థానిక విద్యార్థినులకు, చుట్టుపక్కల మహిళలకు ఉచితంగా అందజేశారు. వాళ్లిచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో తయారీలో లోపాలను సవరించుకుంటూ ప్యాడ్స్‌ను అత్యుత్తమ స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులతో శిబిరాలు ఏర్పాటు చేసి పర్యావరణహిత ప్యాడ్ల వాడకం వల్ల కలిగే ప్రమోజనాలను వివరిస్తున్నారు.– ఓ మధు, సాక్షి, సిటీ బ్యూరో -
రేషన్‌షాపుల ద్వారా శానిటరీ నేప్కిన్స్ విక్రయం
లక్కవరపుకోట(శృంగవరపుకోట) : రేషన్ డిపోల ద్వారా త్వరలో మహిళలకోసం శానిటరీ నేప్కిన్స్ అమ్మకాలు చేపట్టనున్నామనీ... ఇందుకోసం రూ. 120కోట్లు కేటాయిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. నవనిర్మాణ దీక్షలో భాగంగా లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో సోమవారం గ్రామదర్శిని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వీధుల్లో పర్యటించి పింఛన్, రేషన్ సక్రమంగా అందుతున్నదీ లేనిదీ అడిగితెలుసుకున్నారు. తూనికల్లో తేడాలుంటున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో రావి, వేప మొక్కలను నాటారు. అనంతరం అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రచ్చబండపై నిర్వహించిన గ్రామసభలో మాట్లాడుతూ రేషన్ షాపుల ద్వారా త్వరలో ఆడవారికి సంబంధించిన నేప్కిన్స్ అందజేస్తాం అమ్మకాలు చేస్తావా అంటూ డీలర్‌ను ప్రశ్నించారు. చంద్రన్నబీమా, సాధికార మిత్ర, ఉపాధిహామీ పథకాల వివరాలపై చర్ఛించారు. సాధికార మిత్రలు ప్రభుత్వ పథకాలపై గ్రామంలో మరింతగా ప్రచారం చేయాలని సూచించారు. జమ్మాదేవిపేటకు వరాలు గ్రామంలో గల రామాలయం పునర్నిర్మాణానికి రూ. 50లక్షలు, కల్యాణ మండపానికి రూ. 50లక్షలు, దళిత వాడలో అంబేడ్కర్ భవనానికి రూ. 15లక్షలు, బీసీ కాలనీలో సామాజిక భవనానికి రూ. 10లక్షలు, నంది కళ్లాలవద్ద సామాజిక భవనం నిర్మాణానికి రూ. 10లక్షలు, రంగాపురం–జమ్మాదేవిపేట గ్రామాల అనుసంధానానికి బీటీ రోడ్డు, ఇంటింటికి తాగునీటి కుళాయిలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దళిత సర్పంచ్‌పై చిన్నచూపు కాగా ముఖ్యమంత్రి కార్యక్రమం మొత్తం వైస్ సర్పంచ్ కొట్యాడ ఈశ్వరరావు అధ్యక్షతనే నిర్వహించారు. వాస్తవానికి దళిత కులానికి చెందిన మెయ్యి కన్నయ్య సర్పంచ్ అయినా ఆయన్ను సీఎం పట్టించుకోలేదు. గ్రామ సభలోకి కూడా ఆహ్వానించలేదు. ఇక సీఎం గ్రామ సందర్శనలో అన్ని వీధుల్లోనూ పర్యటించి చివరిలో దళిత వాడలో మాత్రం పర్యటించలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభ స్వాతిరాణి, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, విజయనగరం ఎంపీ ఆశోక్‌గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి తదితరులు పాల్గొన్నారు. -
అవగాహన కల్పిస్తూ..నాప్కిన్లు అందిస్తూ..
‘ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెలలో వారం రోజులు బాలికల హాజరు తక్కువగా ఉండడం గమనించాం. ఇందుకు కారణం ఏంటని విశ్లేషిస్తే... స్కూళ్లలో టాయ్‌లెట్స్, డిస్పోసల్స్ లేకపోవడం, నీళ్లు రాకపోవడం తదితరకారణాలతో విద్యార్థినులు నెలసరి సమయంలో పాఠశాలకు రావడం లేదని తేలింది. దీనిపై మా టీమ్ అంతా కలిసి ఆలోచించాం. శానిటరీ ప్యాడ్స్ అందజేయాలని ‘ప్యూర్ ఫెమ్’ ప్రోగ్రామ్‌ను ఐదు నెలల క్రితంప్రారంభించామ’ని చెప్పారు సిటీ కేంద్రంగా పనిచేస్తున్న ప్యూర్ (పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్) ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సంధ్య గొళ్లమూడి. ఈ మంచి పనికి శ్రీకారం చుట్టిన సంధ్య... ‘నేను శక్తి’ శీర్షికతో తమ సేవలను వివరించారు. సాక్షి, సిటీబ్యూరో : మా స్వస్థలం పశ్చిమ గోదావరి. ప్రస్తుతం నగరంలోని సన్‌సిటీలో నివాసం. మా ఆయన బ్యాంక్ ఉద్యోగి. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాలకు బదిలీ కావాల్సి వచ్చేది. ఆ సమయంలో అక్కడి పిల్లలకు నావంతుగా చదువు చెప్పేదాన్ని. ఈ క్రమంలో ఖమ్మంలోని ఓ పాఠశాలలోని పిల్లలు పుస్తకాలు కొనుక్కునే స్థోమత లేక చదువు మానేయడం గమనించాను. ఈ పరిస్థితిపై నా స్నేహితురాలితో చర్చించగా, తాను అక్కడి పిల్లల కోసం పుస్తకాలు, స్టేషనరీ, ప్లేట్లు, గ్లాస్లు ఉచితంగా అందజేసింది. అయితే ఇంకెంతో మంది పేద విద్యార్థులు, కనీస సౌకర్యాలు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి కదా! మరి అక్కడ పరిస్థితి ఏంటనే ఆలోచన నన్ను తొలిచేసింది. విద్యాభివృద్ధికి నావంతు సహకారం అందించేందుకు మరికొంత మంది స్నేహితులతో కలిసి ‘ప్యూర్ ఫౌండేషన్’ను ప్రారంభించాను. విద్యార్థులు అవసరమైన పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ, స్కాలర్షిప్స్ అందజేయడం, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడం తదితర మా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నాం. ఇదీ ‘ప్యూర్ ఫెమ్’ ఉద్దేశం... తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. శానిటరీ ప్యాడ్స్ వినియోగాన్ని వివరిస్తున్నాం. ఇందుకు ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తున్నాం. రుతుక్రమం సమయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో..? ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. నాప్కిన్లు అందజేస్తున్నాం. అవి కూడా సహజ సిద్ధంగా తయారు చేసిన నాప్కిన్లనే ఇస్తున్నాం. ఏలూరులోని ‘ఆశ జ్యోతి’ సంస్థ ఆధ్వర్యంలో అరటి నార, కాటన్లతో ప్రకృతి సహజంగా రూపొందిస్తున్న శానిటరీ ప్యాడ్స్‌ను ‘పరి ప్యాడ్స్’ పేరుతో విద్యార్థినులకు అందజేస్తున్నాం. రూ.5కు రెండు... విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్స్ కోసం పాఠశాలల్లో ప్రత్యేకంగా వెండింగ్ మెషిన్లు ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని 58 స్కూళ్లలో వీటిని అందుబాటులో ఉంచాం. వీటిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ పరిధిలోని 18 పాఠశాలలు, రాజేంద్రనగర్ మండలంలోని 14 పాఠశాలలు ఉన్నాయి. ఈ మెషిన్లలో రూ.5 కాయిన్ వేయగానే రెండు న్యాప్కిన్లు వస్తాయి. సోషల్ మీడియా వేదికగానే మేం నిధులు సేకరిస్తున్నాం. విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారు కొందరు స్పాన్సర్ చేసేందుకు ముందుకొస్తున్నారు. -
చెప్పుకోవాలా... నేస్తం!
ఆడపిల్లలు. అందులోనూ పాఠశాలకువెళ్లే బాలికలు. ‘నెలసరి’కి వారికి తోడ్పడే పథకానికి మంగళం పాడేశారు. ఇక్కడా వ్యాపార దృక్పథాన్ని పాటిస్తున్నారు. సరఫరాకు ఒకే కాంట్రాక్టర్‌ను నియమించాలన్న ఉద్దేశంతో ఎడతెగని జాప్యం చేస్తున్నారు. దేశం మొత్తం ఇప్పుడు శానిటరీ నాప్కిన్స్(ప్యాడ్స్)పై విస్తృత చర్చ జరుగుతోంది. మహిళల కనీస అవరసంగా వాటిని గుర్తించి అందుబాటులో ఉంచాలనే డిమాండ్ పెరుగుతోంది. బాలీవుడ్లో ఇదే విషయాన్ని కథాంశంగా తీసుకుని నిర్మించిన చిత్రంతో మొదలైన చైతన్యం ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ అందరినీ కదిలిస్తోంది. అయినా మన సర్కారు మాత్రం కరగడం లేదు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు 1,11,857 మంది ఉన్నారు. వీరిలో దాదాపు 60 శాతం మందికి శానిటరీ నాప్కిన్స్ అవసరం ఉంటుందని అంచనా. కానీ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుతున్న వారికి మాత్రమే నాలుగేళ్లుగా ప్రభుత్వం నాప్కిన్స్ అందజేస్తోంది. అదీ కేజీబీవీల్లో 6,600 మంది ఉంటే 4,400 మందికే ఇస్తోంది. వీరికి కూడా నిత్యం కాకుండా అప్పుడప్పుడూ సరఫరా చేస్తోం ది. గడచిన ఏడాదిలో కేవలం రెండు నెలలకు సరిపడా మాత్రమే ఇచ్చింది. దేశవ్యాప్తంగా శానిటరీ నాప్కిన్స్పై చర్చ జరుగుతున్నప్పటికీ రాష్ట్రంలో గాని, జిల్లాలో గాని అధికారుల్లో చలనం రావడం లేదు. ఒకే కాంట్రాక్ట్ కోసం కాలయాపన గత ప్రభుత్వం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న బాలికలకు నాప్కిన్స్ని సర్వశిక్షా అభియాన్ పథకం ద్వారా పంపిణీ చేసింది. తర్వాత వచ్చినటీడీపీ ప్రభుత్వం కేవలం కేజీబీవీ బాలికలకు మాత్రమే పరిమితం చేసింది. వారికి కూడా ఈ విద్యాసంవత్సరంలో డిసెంబర్ 2017 పంపిణీ చేయనేలేదు. జనవరి 2018లో రెండు నెలలకు సరిపడినన్ని మాత్రమే పంపిణీ చేశారు. అంటే అవి ఈ నెల వరకూ వస్తాయి. ఒక ప్యాక్‌లో 7 వరకు నాప్కిన్స్ ఉంటాయి. ఆ ప్యాక్ ఖరీదు రూ.35 ఉంటుంది. ఏటా ఎన్ని అవసరం అనేది లెక్కగట్టి సర్వశిక్ష అభియాన్ ఇచ్చే ప్రతిపాదనల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంటుంది. అయితే రాష్ట్రం మొత్తం మీద ఒకే కాంట్రాక్టు విధానాన్ని అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ యోచన విద్యార్ధినులకు శాపంగా మారింది. రెండేళ్లలో రెండు నెలలకే గ్రామీణ ప్రాంతాల్లోని కౌమార బాలికలు, విద్యార్థినుల వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో సర్వశిక్షాభియాన్ నిధులతో కేంద్ర ప్రభుత్వం ‘నేస్తం’ పథకం పేరుతో నాప్కిన్లు సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ఏడు, ఎనిమిదోతరగతి విద్యార్థినుల కోసం 2012–13, 2013–14 సంవత్సరాల్లో వాటిని పంపిణీ చేశారు. ఆయా పాఠశాలల్లో మహిళా సైన్సు ఉపాధ్యాయినుల ఆధ్వర్యంలో ఉంచి అవసరమైనప్పుడు విద్యార్థులకు అవగాహన కలిగిస్తూ, వాటిని వినియోగించేలా చర్యలు తీసుకునేవారు. జిల్లాలో గత కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లాలోని 33 కేజీబీవీల్లో 13 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న బాలికలకు నాప్కిన్స్ను 2014–15లో పంపిణీ చేశారు. ఎవరికి చెప్పుకోలేక... కేజీబీవీల్లో చదివే విద్యార్థినుల్లో అత్యధికులు పేద, మధ్య తరగతి వారే అయినందున వారి వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రభుత్వమే శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా శానిటరీ నాప్కిన్లు పంపిణీ పథకాన్ని సక్రమంగా అమలు చేయాల్సి ఉంది. అలా చేస్తే పాఠశాలకు వెళ్లిన సమయంలో నెలసరి వస్తే విద్యార్ధినులకు నాప్కిన్లు పాఠశాలలోనే అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం ఆ పథకం పాలకుల స్వార్ధానికి బలైపోతుండటంతో విద్యార్ధినులు ఆ సమయంలో ఇళ్లకు పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. తమ ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక, ఈ విషయంపై నోరు మెదపలేక బాలికలు, వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. -
హ్యాపీ జర్నీ
అత్యవసర పనుల రీత్యా ఆడవారు దూర ప్రదేశాలకు ప్రయాణం చేయవలసి వస్తుంది. గబగబా సామాన్లు సర్దుకుని రైలు ఎక్కడానికి స్టేషన్‌కి వచ్చేస్తారు. తీరా అక్కడికి వచ్చాక అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆడవారికి నెలసరి సమస్య సహజం. ఆ సమయంలో అవసరమయ్యే న్యాప్కిన్లు మరచిపోతే ... ఆ ఇబ్బంది రెట్టింపవుతుంది. వారి అవసరాలకు అనుగుణంగా భోపాల్ రైల్వే స్టేషన్ శానిటరీ న్యాప్కిన్ వెండింగ్ మెషీన్‌ను ప్రారంభించింది. సాధారణంగా అన్ని రైల్వే స్టేషన్లలోనూ టికెట్ కౌంటర్, ప్యాసెంజర్ హెల్ప్ డెస్క్, తిండి పదార్థాల స్టాల్స్, వెయిటింగ్ రూమ్స్... కనిపిస్తాయి. భోపాల్ రైల్వే స్టేషన్ ఒక అడుగు ముందుకు వేసింది. అతి తక్కువ ధరకే శానిటరీ న్యాప్కిన్స్ అందించే మెషీన్‌ను రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసింది. ఒక శానిటరీ న్యాప్కిన్ ఐదు రూపాయలే. ఒక్కొక్కరు రెండు న్యాప్కిన్స్ తీసుకోవచ్చు. భోపాల్ రైల్వే మహిళా సంక్షేమ శాఖ ఈ మెషీన్‌కి ‘హ్యాపీ నారీ’ అని పేరుపెట్టింది. జనవరి 1, 2018 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. రాజకీయ నాయకులు, అధికారులు కాకుండా, రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగి అంజలి థాంకూ ఈ మెషీన్ ను ప్రారంభించారు. ఈ సదుపాయం నచ్చడంతో ఎంతోమంది ముందుకు వచ్చి న్యాప్కిన్లను ఉచితంగా అందించారు. స్థానికంగా ఉన్న ఆరుషి అనే ఎన్జీవో ప్రతినిధులు 500 న్యాప్కిన్లను ఉచితంగా అందించారు. మెషీన్ ప్రారంభించిన పది గంటలలోపే 600 న్యాప్కిన్లను మహిళలు ఈ మెషీన్ నుంచి తీసుకున్నారు. ఈ మెషీన్‌ను తయారీకీ, సిబ్బందికీ అయిన ఖర్చు కేవలం రూ. 20 వేలు మాత్రమే. భోపాల్ డివిజన్ రైల్వే మేనేజర్ శోభన్ చౌదరి ఆలోచన నుంచి ఏర్పడినదే హ్యాపీ నారీ. ‘ఇది ఒక మంచి ఆలోచన. రైళ్లలో ప్రయాణం చేసే మహిళలు పీరియడ్స్ సమస్య వల్ల ఇబ్బంది పడకుండా ఈ మెషీన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ ప్రయాణికులకు సైతం అందుబాటలో ఉండేలా అతి తక్కువ ధరకు అందచేస్తున్నారు’ అంటున్నారు చౌదరి. కేవలం రైలు ప్రయాణికులు మాత్రమే కాకుండా, చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తున్న సామాన్యులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ మెషీన్‌ను ఎలా ఉపయోగించాలి, న్యాప్కిన్స్ లోడ్ చేయడం, డబ్బులు వేయగానే బయటకు తీయడం... వంటి అంశాలలో రైల్వే ఉద్యోగులకు ఎన్జీవోలు శిక్షణ ఇస్తున్నారు. వారు ఇక్కడితో ఆగిపోవట్లేదు. మరొక కొత్త ఆలోచన చేస్తున్నారు. ఉపయోగించిన న్యాప్కిన్లను పారేయడానికి అనుగుణంగా మహిళలు వేచిచూసే గదుల దగ్గర, వీటిని కాల్చి బూడిద చేసే యంత్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ వెండింగ్ మెషీన్ విధానం విజయవంతమైతే కనుక, మరిన్ని న్యాప్కిన్ మెషీన్లను మధ్య ప్రదేశ్ అంతటా ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. ఎన్జీవోలతో పాటు, కొన్ని కంపెనీల దగ్గరకు కూడా వెళ్లి, తక్కువ ధరలకు న్యాప్కిన్స్ను సరఫరా చేయమని అడగాలనే ఉద్దేశంతో ఉన్నారు. మహిళలకు అత్యవసరమైన న్యాప్కిన్లను ఈ విధంగా సరఫరా చేస్తున్న భోపాల్ రైల్వే అధికారులను ప్రశంసించడమే కాకుండా, వారిని స్ఫూర్తిగా తీసుకుని అన్ని రైల్వే స్టేషన్లలోనూ వీటిని ఏర్పాటుచేస్తే బావుంటుందని మహిళలు భావిస్తున్నారు. -
అమ్మకానికి ఉచిత నాప్కిన్స్
నెల్లూరు , సోమశిల : కౌమార దశలో ఉన్న బాలికలకు అవసరమయ్యే నాప్కిన్ల పంపిణీ విషయంలోనూ ప్రభుత్వం కక్కుర్తి చూపుతోంది. నాసిరకమైన నాప్కిన్లు పంపిణీ చేసి.. వాటిపై పూర్తి ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ముద్రించింది. అయితే, ఆరోగ్య శాఖ సిబ్బంది వాటికి సొమ్ములు వసూలు చేస్తున్నారు. అనంతసాగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి 15,800 నాప్కిన్లు సరఫరా చేశారు. వీటిని ఒక్కొక్కటి రూ.7 చొప్పున గ్రామాల్లో ఉండే ఆశా వలంటీర్లకు ఏఎన్ఎంలు పంపిణీ చేస్తున్నారు. వాటిని కౌమార దశలో ఉన్న బాలికలకు రూ.8కి విక్రయించాలని సూచిస్తున్నారు. అవన్నీ నాసిరకంగా.. చాలీచాలని సైజులో ఉంటున్నాయి. కనీసం 9 సంవత్సరాల వారికి కూడా సరిపోవడం లేదు. వాటిపై ‘నాట్ ఫర్ సేల్’ అని ముద్రించి ఉండగా.. విక్రయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రభుత్వ దుకాణం
- నాట్ ఫర్ సేల్ ఉన్నా రూ.8 చొప్పున వసూలు - సమాధానం చెప్పలేకపోతున్న ఏఎన్ఎంలు - ఉచితంగానే పంపిణీ చేస్తున్న కేంద్రం - విమర్శలకు తావిస్తున్న సర్కారు తీరు యుక్త వయస్సు బాలికల వ్యక్తిగత పరిశుభ్రతకు కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా పంపిన శానిటరీ న్యాప్కిన్లను రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటోంది. వీటిపై ‘నాట్ ఫర్ సేల్’ అని ముద్రించి ఉన్నా అధికారికంగా వీటిని రూ.8లకు విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు(హాస్పిటల్): రాష్ట్రీయ కిశోర స్వాస్త్య కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం యుక్త వయస్సు బాలికలకు శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు కర్నూలుకు న్యాప్కిన్లు సరఫరా చేశారు. వీటిని ఏపీఎంఎస్ఐడీసీ కొనుగోలు చేసి జిల్లా కేంద్రాలకు పంపిణీ చేసింది. ఇక్కడి నుంచి పీహెచ్‌సీలకు.. అక్కడ నుంచి ఏఎన్ఎంలకు, వారి నుంచి ఆశా వర్కర్లకు ఈ న్యాప్కిన్లు చేరుతున్నాయి. వారు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోని యుక్త వయస్సు బాలికలకు వీటిని ఉచితంగా అందజేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిని ఒక్కొక్కటి రూ.8లకు విక్రయించాలంటూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు ఇప్పటికే 10 పీహెచ్‌సీలకు ఇవి చేరాయి. నన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో రెండు రోజులుగా వీటిని యుక్త వయస్సు బాలికలకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ఆశా వర్కర్లు రూ.8ల చొప్పున వీటిని విక్రయిస్తున్నారు. ఇందుకు ఒక్కో ప్యాకెట్‌కు ఒక్క రూపాయి కమీషన్ వస్తుంది. మిగిలిన రూ.7లను ఆశా వర్కర్లు డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీకి జమ చేయాలి. జిల్లా సొసైటీ వారు ఈ మొత్తాన్ని స్టేట్ హెల్త్ సొసైటికి డిపాజిట్ చేస్తారు. కాగా ఈ ప్యాకెట్లపై నాట్ ఫర్ సేల్(విక్రయించకూడదు) అని ఉండటంతో వాటిని కొనుగోలు చేసిన బాలికలు, వారి తల్లిదండ్రులు ఆశాలను, ఏఎన్ఎంలను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తే మీరు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆశాలు తీవ్ర మనోవేదనకు లోనవుతున్నారు. రూ.8ల చొప్పున కొన్నాం మా పిల్లల కోసం రూ.8ల చొప్పున న్యాప్కిన్లు కొనుగోలు చేశాం. కానీ ప్యాకెట్లపై నాట్ ఫర్ సేల్ అని ముద్రించి ఉంది. ప్రభుత్వం ఉచితంగా ఇవ్వమని చెబితే వీరు అమ్ముకుంటున్నారనే అనుమానం వస్తోంది. వీరు చూస్తే ప్రభుత్వమే మాకు అమ్మాలని చెప్పిందని చెబుతున్నారు. –ఆనంద్, నన్నూరు విక్రయించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు యుక్త వయస్సు బాలికలకు పంపిణీ చేసే శానిటరీ న్యాప్కిన్లను ఉచితంగా పంపిణీ చేయడం కుదరదు. వాటిపై పొరపాటుగా నాట్ ఫర్ సేల్ అని ముద్రించినట్లు ఉన్నారు. వీటిని ఒక్కొక్కటి రూ.8ల చొప్పున విక్రయించాలని ప్రభుత్వమే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. –హేమలత, ఆర్బీఎస్కే జిల్లా కో ఆర్డినేటర్ -
‘బయట’కు చెప్పుకోలేక..
►హైస్కూళ్లు, కేజీబీవీల్లో నేప్కిన్ల పంపిణీ కరువు ►ప్రతి‘నెలా’ బాలికల తిప్పలు–‘ఆ రోజుల్లో’ సెలవుతో ‘సరి’ అయ్యో..ఆ సమస్య బయటకు చెప్పుకోలేక..అందుబాటులో నేప్కిన్లు లేక..ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయాల్లోని యుక్తవయస్సు ఆడపిల్లలు అవస్థ పడుతున్నారు. నేప్కిన్ల పంపిణీ నిలిచి..పేద బాలికలు కొనలేక, మరికొందరు అవగాహన లేక నెలసరి వచ్చినప్పుడు బడికి దూరమవుతున్నారు. అమ్మ ఆలనకు దూరంగా ఉండి చదువుకుంటున్న అమ్మాయిలు..‘ఆ రోజుల్లో’ కుమిలిపోతున్నారు. సర్కారు కనికరించి..గతంలో మాదిరి నేప్కిన్ల పంపిణీ కొనసాగించాలని దీనంగా వేడుకుంటున్నారు. కొత్తగూడెం రూరల్: సున్నిత అంశం..పట్టింపు శూన్యం జిల్లాలో మొత్తం 333 హైస్కూళ్లు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 22,340 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. కస్తూర్బాగాంధీ విద్యాలయాలు 26 ఉండగా 5,200 మంది చదువుతున్నారు. యుక్తవయస్సు ఆడపిల్లలకు ప్రతి నెలా నెలసరి అప్పుడు నేప్కిన్లు అవసరం. గతంలో ప్రభుత్వమే సరఫరా చేసేది. కానీ రెండేళ్లుగా వీటి పంపిణీ నిలిచింది. నేప్కిన్లు ఉంటే నెలసరి సమస్యను అధిగమించి పాఠశాలల్లో చదువుకోవచ్చు. కానీ..అవి లేక..ప్రధానంగా 8, 9, 10వ తరగతుల విద్యార్థినులు చాలా మనోవేదనకు గురవుతున్నారు. బాధతో బడికి రాలేక ఇళ్లకు, హాస్టళ్లకు పరిమితమవుతున్నారు. బడికి దూరం..లేదంటే భారం ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే చదువుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పూర్తిస్థాయిలో అవగాహన లేదు. నెలసరి క్రమంలో డబ్బు పెట్టి నెప్కిన్లు కొనే స్థోమత లేని అమ్మాయిలు అనేకమంది ఉన్నారు. ప్రతి నెలా ఐదు రోజుల పాటు పాఠశాలకు దూరం కావాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఇంకొందరు అమ్మాయిలైతే..ఈ సమస్య బాధతోనే బడిని మానేస్తున్నారని కూడా తెలుస్తోంది. పదో తరగతి చదివే వారు ఇలా..కొన్ని రోజుల పాటు పాఠశాలకు రాకుంటే..జరిగిన పాఠాలు అర్థంకాక.. ఆ ప్రభావం వార్షిక పరీక్షలపై పడే అవకాశం ఉంది. ‘కస్తూర్బా’లో అవస్థ.. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో మధ్యలో బడిమానేసిన, తల్లితండ్రి లేదా, ఇద్దరింట్లో ఎవరోఒకరు లేనివారే ఎక్కువ మంది చదువుకుంటున్నారు. సెలవులొస్తే..తమవారంటూ లేక..ఇళ్లకు వెళ్లలేక విద్యాలయంలోనే ఉండి కుమిలిపోతుంటారు. వీరికి పౌష్టికాహారం అందించి, విద్యాబుద్ధులు నేర్పాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసినప్పటికీ..కనీస బాధ్యతను విస్మరించడం పట్ల బాలికలు బాధపడుతున్నారు. గతంలో మాదిరి నేప్కిన్లు పంపిణీ చేయాలని కోరుతున్నారు. నిధులు లేక నిలిచింది.. బాలికలకు నేప్కిన్ల పంపిణీ నిలిచిపోయింది. రాజీవ్ విద్యామిషన్‌లో నిధుల కొరత వల్లే ఈ సమస్య నెలకొంది. గతంలో నేప్కిన్లు పంపిణీ జరిగేది. తిరిగి వీటిని సరఫరా చేసేందుకు కృషి చేస్తాం. –వెంకటనర్సమ్మ, కొత్తగూడెం డిప్యూటీ డీఈఓ -
కిషోరీ యోజన రద్దు వెనుక సీబీఐ అధికారి?
ఇటీవల ఢీల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీసుకునే నిర్ణయాలన్నీ వార్తల్లోకెక్కుతుండటంతో ఆయన చేసే ప్రతి పనిని జనం సునిశితంగా గమనిస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని సర్కారు బడుల్లో అమల్లో ఉన్న కిషోరీ యోజన కార్యక్రమాన్ని నిలిపివేయడంపై స్థానిక మీడియా దృష్టి పెట్టింది. ఢిల్లీ స్కూళ్లలోని సుమారు 7.5 లక్షలమంది విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్లు అందించే సౌకర్యాన్ని రద్దు చేయడం వార్తల్లో కెక్కింది. నాప్కిన్లు అందించే సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అగ్రిమెంటును సీబీఐ అధికారి ఒకరు తీసుకోవడంతోనే సర్కారు ఈ సౌకర్యాన్నిరద్దుచేసిందంటూ వచ్చిన వార్తలకు కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. సీబీఐ అధికారి రాజీందర్కు, కంపెనీకి సంబంధం ఏమిటంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీ విద్యార్థినులకు కిషోరీ స్కీమ్ ద్వారా 2012 నుంచి ప్రభుత్వం ఉచితంగా శానిటరీ నాప్కిన్లను అందజేస్తోంది. అయితే సదరు కంపెనీ కాంట్రాక్టును ఢిల్లీ సర్కారుకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి... సీబీఐ అధికారి తీసుకోవడమే విద్యార్థులకు అందించే సౌకర్యాన్ని నిలిపివేయడానికి కారణంగా తెలుస్తోంది. ఇప్పటివరకూ అమల్లో ఉన్న ఈ సౌకర్యాన్ని ఇకపై నిలిపివేస్తున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీ నుంచి ఇకపై విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ అందవన్న వివరాలతో మార్చి 2న ఢిల్లీ విద్యా శాఖకు చెందిన కేర్ టేకింగ్ బ్రాంచ్ కు ఓ లేఖ అందింది. ఇప్పటివరకు లక్ష్మీ ఎంటర్ ప్రైజెస్ ద్వారా విద్యార్థులకు శానిటరీ నాప్కిన్స్ అందిస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ లక్ష్మీ ఎంటర్ ప్రైజెస్ కు కూడా సదరు నిర్దేశాలు జారీచేస్తూ లేఖ పంపింది. అయితే ఢిల్లీ సర్కార్ లోని సీబీఐకి చెందిన దినేష్... సదరు కంపెనీ కాంట్రాక్ట్ ను తీసుకోవడంతోనే ఈ కిషోరీ యోజన కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా నిర్విరామంగా, నిర్వివాదంగా, ఎటువంటి సమస్యలు లేకుండా నడుస్తున్న కిషోరీ యోజనా కేవలం సీబీఐ అధికారి చేతుల్లోకి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కాంట్రాక్టు వెళ్ళడంతోనే రద్దు అయినట్లు తెలుస్తోంది. సదరు సీబీఐ అధికారి సర్కారు బడులకు నాప్కిన్ల సరఫరా నిలిపివేయమంటూ ఆదేశించడంతోనే ఈ పథకం నిలిపివేసినట్లు సమాచారం. అయితే ఇటీవల విద్యా సంస్థల విషయంలో అనేక సరికొత్త నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. సాఫీగా కొనసాగుతున్న పథకాన్ని నిలిపివేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో స్పందించిన కేజ్రీవాల్.. వార్తల వెనుక కథను పరిశీలించే పనిలో పడ్డారు. -
బేబీ కోసం సీట్...
కార్లు రకరకాలు.. అందులోని సీట్ల డిజైన్లు రకరకాలు.. కానీ చిన్నపిల్లల పరిస్థితి ఏమిటి? అమ్మా లేదా నాన్న ఒళ్లో పెట్టుకోవాల్సిందే.. దీనికి పరిష్కారంగా వోల్వో బేబీ సీట్‌ను డిజైన్ చేసింది. డ్రైవర్ పక్కనున్న సీటుకు బదులుగా.. దీన్ని ఏర్పాటు చేసింది. ఇది చిన్నపిల్లలకు చాలా అనువుగా ఉంటుందట.. వారిని నిద్రపుచ్చేలా చేయడానికి వీలుగా ఇది ఉయ్యాల ఊగినట్లుగా కొంచెం అటూఇటూ కదులుతుంది. సీటు ముందుకు, వెనక్కు తిరిగేలా ఏర్పాటు చేశారు. దీని వల్ల ఇదిగో చిత్రంలో చూపినట్లు మీ పిల్లలను ఆడిస్తూ.. వారితో ముచ్చట్లాడొచ్చు. వారి నాప్కిన్స్ వంటివి పెట్టుకోవడానికి కింద జాగా కూడా ఇచ్చారు. ప్రస్తుతానికి ఇది డిజైన్ దశలో ఉంది. భవిష్యత్తులో వీటిని కొన్ని మోడళ్లలో ప్రవేశపెట్టే అవకాశముందని చెబుతున్నారు. -
ఆడవారి కష్టం తెలిసిన ఓ మగాడు...
చూసిన అతడు... మొత్తం మహిళా జాతికే ఆ ఇబ్బంది నుంచి విముక్తి కలిగించాలనుకున్నాడు, కలిగించాడు. నిజాయతీ, నిబద్ధతలతో కూడిన ప్రయత్నం ఎప్పుడూ గొప్ప ఫలితాలనే ఇస్తుంది అన్నది ఎంత నిజమో అతణ్ణి చూస్తే తెలుస్తుంది. పెళ్లైన కొత్తలో ఓ రోజు... పాత బట్టల కోసం వెతుకుతున్న భార్యను చూశాడు అరుణాచలం. వాటితో పనేంటని అడిగాడు. నెలసరి సమయంలో అవి అవసరం అని చెప్పిందామె. ‘పాత గుడ్డలు వాడతావా’ అన్నాడు ఆశ్చర్యపోతూ. ‘ఏం చేస్తాం, మాకివే అలవాటు, పల్లెటూరివాళ్లకి, పేద మహిళలకి శానిటరీ నేప్కిన్స్ కొనే స్థోమత ఉండదుగా’ అందామె అతడి మాటను తేలికగా తీసేస్తూ. కానీ అరుణాచలం మాత్రం భార్య మాటల్ని తేలికగా తీసుకోలేదు. వారి కష్టాన్ని ఆరా తీశాడు. వారు పడే ఇబ్బందిని అంచనా వేశాడు. వారి సమస్యను తీర్చాలనుకున్నాడు ఆలోచన తేలిగ్గానే వచ్చింది. కానీ ఆచరణ అంత సులభం కాదు కదా! కానీ ఎంత కష్టమైనా వెనకడుగు వేయలేదతడు. శానిటరీ నేప్కిన్స్ మీద రీసెర్చ్ చేశాడు. ఎలా తయారవుతాయి, ఏమేం వాడతారు, ఎంత ఖర్చవుతుంది, ఎంత రేటు పలుకుతున్నాయి... ఇలా అన్నీ తెలుసుకున్నాడు. తయారీ ఖర్చు ఎక్కువ ఉండడం వల్ల నేప్కిన్స్ ధర ఎక్కువ ఉంటోందని అర్థమైంది. నేప్కిన్స్ తయారు చేసే యంత్రమే కోటిన్నర రూపాయలుండడం చూసిన తరువాత... ముందు అతి తక్కువ ఖర్చుతో ఓ యంత్రాన్ని తయారు చేయాలనుకున్నాడు. కేవలం లక్షన్నరతో ఓ యంత్రాన్ని కనిపెట్టాడు. ఇక మిగిలింది... తక్కువ ఖర్చుతో ఎక్కువ మేలు చేసే నాప్కిన్ తయారు చేయడమే. ఏం చేయాలన్నా ముందు నేప్కిన్స్ వాడకం గురించి, లాభనష్టాల గురించి తెలుసుకోవాలి. కానీ ఎలా? దాని గురించి మాట్లాడదామంటే భార్యే సిగ్గుపడుతోందాయె. దాంతో మెడికల్ కాలేజీలకు వెళ్లి, వైద్య విద్యార్థినులతో చర్చలు జరపడం మొదలెట్టాడు. స్పష్టత వచ్చింది. ఏం చేస్తే తక్కువ ఖర్చుతో నేప్కిన్ తయారవుతుందో అర్థమైంది. వెదురు, పేపర్, దూది వంటి వాటితో ప్రయోగాలు చేశాడు, ఫలితం సాధించాడు. అయితే అది ఎలా పని చేస్తుందో తెలుసుకోవడం పెద్ద పని అయిందతడికి. ఎవరినీ అడగలేడు. చివరికి భార్య కూడా సహకరించలేదు. దాంతో జంతువు రక్తంతో ప్రయోగాలు చేశాడు. తన ప్రయత్నం ఫలించిందని అర్థం చేసుకున్నాడు. కానీ అది సాధించేలోపే అతడికి పిచ్చివాడిగా ముద్ర వేశారు కొందరు. భార్య కూడా అపార్థం చేసుకుని వెళ్లిపోయింది. విడాకుల నోటీసు కూడా పంపింది. కానీ అరుణాచలం మనసు మార్చుకోలేదు. లక్ష్యం మీదే దృష్టిపెట్టాడు. తొలి విడతగా ఓ వెయ్యి నాప్కిన్స్ తయారుచేశాడు అరుణాచలం. వాటిని ప్యాక్ చేసి, బ్యాగులో పెట్టుకుని బయలుదేరాడు. పేద మహిళల దగ్గరికెళ్లి శానిటరీ నేప్కిన్స్ వాడాల్సిన అవసరంతో పాటు తన నేప్కిన్స్ లాభాలను కూడా వివరించాడు. మారుమూల గ్రామాల్లోని మహిళలకు సైతం వాటిని అందుబాటులోకి తెచ్చాడు. అంతటితో ఆగిపోలేదు. తాను కనిపెట్టిన యంత్రాన్ని పెద్ద మొత్తంలో తయారుచేసేందుకు ‘జయశ్రీ ఇండస్ట్రీస్’ని స్థాపించాడు. వెనుకబడిన మహిళలను కూడగట్టాడు. యంత్రాలు తక్కువ ధరకే ఇస్తాను. మీరే నేప్కిన్స్ తయారుచేసి జీవనభృతిని పొందండి అన్నాడు. వాటిని కొనే స్థోమత కూడా లేనివారికి బ్యాంకు ఋణాలు ఇప్పించాడు. ఓ పక్క వారికి మేలు చేస్తూనే ఇంకోపక్క ఆర్థిక స్వావలంబన చేకూర్చాడు. అప్పటికి అతడికి మనసు అందరికీ అర్థమయింది. వదిలి వెళ్లిపోయిన భార్య సైతం తిరిగి వచ్చింది. ‘‘రుతుక్రమం మహిళలకు సహజమైనది. కానీ అది వాళ్లకు నరకంగా మారకూడదు. మన దేశంలో కేవలం రెండు శాతం మంది మహిళలే నేప్కిన్స్ వాడుతున్నారు. నూటికి నూరుశాతం అందరూ వాడేలా చేయాలి’’ అంటాడు అరుణాచలం. కార్యేషు దాసిగా, కరణేషు మంత్రిగా, భోజ్యేషు మాతగా, శయనేషు రంభగా జీవితాన్ని ధారపోసే స్త్రీ జాతి రుణం తీర్చుకోవడానికి ఈ మార్గం ఎంచుకున్నానంటారు అరుణాచలం. మరి మీ సంగతేంటి!