నాట్ ఫర్ సేల్ అని ముద్రించి విక్రయిస్తున్న నాసిరకం నాప్‌కిన్స్
నెల్లూరు , సోమశిల : కౌమార దశలో ఉన్న బాలికలకు అవసరమయ్యే నాప్‌కిన్ల పంపిణీ విషయంలోనూ ప్రభుత్వం కక్కుర్తి చూపుతోంది. నాసిరకమైన నాప్‌కిన్లు పంపిణీ చేసి.. వాటిపై పూర్తి ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ముద్రించింది. అయితే, ఆరోగ్య శాఖ సిబ్బంది వాటికి సొమ్ములు వసూలు చేస్తున్నారు. అనంతసాగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి 15,800 నాప్‌కిన్లు సరఫరా చేశారు.
వీటిని ఒక్కొక్కటి రూ.7 చొప్పున గ్రామాల్లో ఉండే ఆశా వలంటీర్లకు ఏఎన్‌ఎంలు పంపిణీ చేస్తున్నారు. వాటిని కౌమార దశలో ఉన్న బాలికలకు రూ.8కి విక్రయించాలని సూచిస్తున్నారు. అవన్నీ నాసిరకంగా.. చాలీచాలని సైజులో ఉంటున్నాయి. కనీసం 9 సంవత్సరాల వారికి కూడా సరిపోవడం లేదు. వాటిపై ‘నాట్ ఫర్ సేల్’ అని ముద్రించి ఉండగా.. విక్రయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.