పద్మావతీ పరిణయోత్సవం ఏర్పాట్ల పరిశీలన
తిరుమల: తిరుమలలో మే 16వ తేదీ నుంచి నారాయణగిరి ఉద్యానవనంలో పద్మావతీ పరిణయోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో పరిణయోత్సవం ఏర్పాట్లను శనివారం జేఈవో కె.శ్రీనివాసరాజు పరిశీలించారు. అలాగే శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ బాగా పెరిగిపోయింది. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూలో వెలుపలకు వచ్చారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలసి జేఈవో తనిఖీలు నిర్వహించారు. భక్తుల సత్వర దర్శనానికి వీలుగా ఆయన పలు సూచనలు చేశారు.