narayanarao
-
మెగాస్టారైనా తలవంచాల్సిందే!
సుల్తాన్‌బజార్: నిరుద్యోగ యువతకు క్షురక వృత్తిలో మెలకువలు నేర్పుతూ అధునాతన శిక్షణ ఇస్తూ తోడ్పాటునందిస్తున్నారు. చౌటపల్లికి చెందిన ఎస్. నారాయణ. యువకుడిగా ఉన్నప్పుడు ఆయన పొట్ట చేతపట్టుకుని తెలిసిన వృత్తి చేస్తూ కడుపునింపుకునే వారు. కాల క్రమేణా హైదరాబాద్ నగరంలో పాటు ఇతర రాష్ట్రాల్లో క్షురక వృత్తిలోని మెలకువలను నేర్చుకున్నారు. నారాయణ చిన్నప్పటి నుంచే తనకు వచ్చిన దానిలో ఇతరులకు తనవంతు సాయం చేసేవాడు. అలా ఓ శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి, యువకులకు నేటి ఫ్యాషన్‌కు అనుగుణంగా శిక్షణలు ఇస్తూ ఉపాధి కల్పిస్తుండడం విశేషం.. ప్రముఖుల హెయిర్ స్టైలిస్ట్‌గా.. మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్‌కళ్యాణ్, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్‌లతో పాటు దాసరినారాయణరావు లాంటి డైరెక్టర్లకు నారాయణరావు వ్యక్తిగత బార్బర్‌గా పనిచేశాడు. పవన్‌కళ్యాణ్ మొదటి సినిమాకు పవన్‌కళ్యాణ్ హెయిర్ కటింగ్‌ను తీర్చిదిద్దాడు. అంతేకాకుండా క్రికెటర్ అజారుద్దీన్ లాంటి క్రీడాకారులకు ఆయన హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేశారు. దీంతో ఆయనకు ప్రముఖ హెయిర్ సెలూన్లలో పనిచేసే అవకాశం వచ్చింది. తన కుటుంబానికి అవరమైన డబ్బు సరిపోవడంతో తనకు చిన్ననాటి నుంచి అలవాటు ఉన్న సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తూ వచ్చాడు. దీంతో షోలోపూర్ సేవారత్న బిరుదుతో అక్కడి స్వచ్ఛంద సంస్థలు సత్కరించాయి. దీంతో అనాధాలకు వృద్ధులకు ఉచితంగా క్షవరం చేస్తూ తృప్తి పొందుతూ ఉంటారు. షోలాపూర్‌లో సేవారత్న పురస్కారం ఔత్సహికులు శిక్షణ... నగరంలో నిరుదోగ్య యువత చదుకుని ఖాళీగా ఉంటుడం తన దృష్టికి రావడంతో ఆయన యువతకు తమతమ ఉద్యోగాన్వేషణ కొనసాగిస్తూనే తమ కులవృత్తిలో మెలుకువలు నేర్చుకోవాలని వారికి అవగాహన కల్పిస్తూ సికింద్రాబాద్‌లో ఛార్మ్స్ పేరిట ఓ శిక్షణాకేంద్రాన్ని ప్రారంభించి నేటి టెక్నాలజీకి అనుగుణంగా నమామాత్రపు రుసుంతో యువతకు శిక్షణలు ఇస్తున్నాడు. ఇక్కడ శిక్షణ పొందిన వారి నగరంలో ఎంతో ఫెమస్ సేలూన్లు ఏర్పాటు చేసుకుని అతని బాటలో నడుస్తుండడం విశేషం. సమాజ సేవ ఎంతో సంతృప్తి నిస్తోంది.. నా యవ్వనంలో నా కుటుంబ కడుపునింపేందుకు పనిచేసాను. ప్రస్తుతం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఓ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారికి అదునిక టెక్నాలజీతో బార్బర్ వృత్తిలో శిక్షణ ఇస్తున్నాను. శిక్షణ పొందిన పొందిన వారి ఉపాధి పొందితుండడం చూస్తే ఎంతో సంతృప్తిగా ఉంటుంది.మహిళలు సైతం బ్యూటీ పార్లర్ లాంటివి నా శిక్షణ ద్వారా ఏర్పాటు చేసుకోవడంపై ఎంతో సంతోషంగా ఉంటుంది. తన కుమారుడు సంపత్ సైతం ఇదే బాటలో నడవడం మనస్సుకు సంతృప్తి. -
‘క్రైం థ్రిల్లర్’లా ఉన్నతాధికారికి టోకరా!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వానికి సరెండర్ అయిన ఓ జిల్లా స్థాయి ఉన్నతాధికారిని.. మంచి పోస్టింగ్ ఇప్పిస్తానని ఓ నకిలీ ఉన్నతోద్యోగి నమ్మబలికి రూ.3 లక్షలు వసూలు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారమంతా ఫోన్లోనే సాగగా.. లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారా జరిగాయి. అనుమానం వచ్చిన సదరు అధికారి, బ్యాంకు అధికారులకు ఫోన్‌చేసి చెల్లింపు నిలిపివేయాలని కోరడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పటికే సొమ్ము విత్ డ్రా అయినట్లు గుర్తించిన బ్యాంకు సిబ్బంది ఖాతాదారు ఇంటికి వెళ్లారు. అక్కడ ఖాతాదారుణ్ణి కూలి పనులు చేసుకునే ఒక మహిళగా గుర్తించారు. కానీ, ఈ బాగోతమంతా ఓ ఆర్ఎంపీ డాక్టర్ నడిపిస్తున్నట్లు తెలుసుకుని అతని నుంచి సొమ్మును రికవరీ చేశారు. కానీ, నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. బాధితుడు ప్రకాశం జిల్లాలో డీఎం అండ్ హెచ్ఓగా పనిచేసిన బి. వినోద్‌కుమార్. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించిన ఈ ఘటన వివరాలివీ.. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు గ్రామానికి చెందిన రోజూ వారి కూలీ చింతల పద్మకు గత కొన్ని నెలలుగా ఖాతాలోకి డబ్బులు వస్తున్నాయి. ఆమె భర్త ప్రసాద్ వచ్చిన డబ్బులు వచ్చినట్లు విత్‌డ్రా చేసి తన మిత్రుడు నారాయణరావుకు అందించేవాడు. ఇలా రూ.10 లక్షల వరకు పద్మ ఖాతా ద్వారా లావాదేవీలు జరిగాయి. గతేడాది జూలై 15న రూ. 20 వేలతో మొదలైన వ్యవహారం ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన రూ.3 లక్షలు జమ అయ్యే వరకు సాగింది. కాగా, గురువారం పద్మతోపాటు ఆమె భర్త ప్రసాద్ అంపోలు ఆంధ్రాబ్యాంకుకు వచ్చారు. రెండు లక్షలు విత్‌డ్రా చేశారు. పద్మ ఖాతాలోకి సొమ్ము బదిలీ చేసిన ప్రకాశం జిల్లా పూర్వ డీఎం అండ్ హెచ్ఓ బి.వినోద్ కుమార్ కొద్ది నిమిషాల్లోనే ఆంధ్రాబ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ‘పొరపాటున నా నగదు పద్మ ఖాతాలోకి వెళ్లింది. దయచేసి రికవరీ చేయాల’ని ఆయన సమాచారం అందించారు. వెంటనే స్పందించిన బ్యాంకు మేనేజర్ సురేష్ తన సిబ్బంది సహకారంతో పద్మ ఇంటికి వెళ్లగా, డబ్బులు తనవి కావని, ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేస్తున్న నారాయణరావుకు చెందినవని సమాధానం చెప్పారు. ఆ సొమ్మును ఇప్పుడే అతనికి ఇచ్చేశామని ప్రసాద్ చెప్పడంతో బ్యాంకు సిబ్బంది అవాక్కయ్యారు. గ్రామంలోనే ఉంటున్న నారాయణరావును వెంటనే పట్టుకుని నగదు రికవరీ చేశారు. నారాయణరావు ఎవరని తెలుసుకునేలోపే నిందితుడు పరారయ్యాడు. నారాయణరావు బాగోతమేంటి? వీరి వెనక ఎవరున్నారు? ఇలాంటి వాళ్లు ఇంకెంతమంది ఉన్నారు? అనేది తెలియాల్సి ఉంది. -
రెబల్‌గా బరిలో..
తాండూరు: కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు స్వతంత్ర అభ్యర్థిలో బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల తాండూరు కాంగ్రెస్ అభ్యర్థిగా రోహిత్‌రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ముందు నుంచి నారాయణరావు తన కుటుంబీకులు లేదా అనుచరులకు టికెట్ కేటాయించాలని పట్టుబట్టారు. తనదైన శైలిలో లాబీయింగ్ చేసినా టికెట్ లభించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందారు. ఈనేపథ్యంలో ఆయన ఇటీవల తన అనుచరగణంతో సమావేశమై కార్యాచరణ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీలో చేరిన రోహిత్‌రెడ్డికి టికెట్ ఇవ్వడం ఏంటని ఆయన పీసీసీ నేతలపై భగ్గుమంటున్నారు. దశాబ్ధాల కాలం నుంచి తమ కుటుంబం హస్తం పార్టీకి సేవ చేశామని పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో ఈనెల 18న ఆయన నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు. చీలనున్న ఓటు బ్యాంకు.. మహరాజుల కుటుంబం సభ్యులు తాం డూరు అసెంబ్లీ బరిలో నిలబడితే కాం గ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్ర భావం పడే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మహరాజుల కుటుంబీకులు చాలాకాలంగా ఎన్నోవేల కుటుంబాలకు మేలు చేశారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన పలువురు వారికి మద్దతుగా నిలిచారు. ఈనేపథ్యంలో హస్తం ఓటు బ్యాంకు భారీగా చీలిపోయే కాంగ్రెస్ అభ్యర్థికి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. తాండూరులో మహరాజులు గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై పడే ప్రభావం ఉందని స్థానికంగా చర్చించుకుంటున్నారు. -
మూడింటా ముసలం..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అభ్యర్థుల ఖరారుతో కాంగ్రెస్‌లో అసమ్మతి తారాస్థాయికి చేరింది. టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు పార్టీ నాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించారు. అభ్యర్థుల ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వికారాబాద్, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాలలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగాలని నిర్ణయించారు. తాండూరు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావుకు నిరాశే మిగిలింది. కొత్తగా పార్టీలో చేరిన పైలెట్ రోహిత్‌రెడ్డికి టికెట్ కేటాయించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మహారాజ్ కుటుంబీకులు లేదా డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వాలని గాంధీభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. తాజాగా ప్రకటించిన తొలి జాబితాలోనే పైలెట్‌కు టికెట్ రావడంతో కినుక వహించిన ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. అంతే కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని స్పష్టంచేయడం చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ సాబ్‌కు నిరాశే.. మాజీ మంత్రి డాక్టర్ ఎ.చంద్రశేఖర్‌కు టికెట్ కేటాయింపులో భంగపాటు తప్పలేదు. వికారాబాద్ సీటు తనకే దక్కుతుందని గంపెడాశతో ఉన్న ఆయనకు పార్టీ మొండిచేయి చూపింది. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ను ఈ స్థానం నుంచి బరిలోకి దింపడంతో చంద్రశేఖర్‌కు నిరాశే మిగిలింది. ఒకానొక దశలో వికారాబాద్ స్థానే చేవెళ్ల దక్కుతుందని భావించిన ఆయనకు.. అది కూడా రత్నం ఎగరేసుకుపోవడంతో రెంటికీచెడ్డ రేవడిలా తయారయ్యారు. ఈ పరిణామాలతో ఖిన్నుడైన చంద్రశేఖర్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. మంగళవారం సన్నిహితులతో సంప్రదింపులు జరిపిన ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని దాదాపుగా నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న స్థానిక టీఆర్ఎస్ నాయకత్వం గులాబీ గూటికి రావాలని ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో గులాబీ బాస్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరిన చంద్రశేఖర్‌కు అక్కడి నుంచి సానుకూల స్పందన వస్తుందో రాదో వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పడాలాకు రిక్తహస్తమే.. చేవెళ్ల టికెట్‌పై కన్నేసిన సీనియర్ నేత, డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామికి మరోసారి రిక్తహస్తమే మిగిలింది. గత నాలుగేళ్లుగా టికెట్ తనకు దక్కుతుందని భరోసాతో ఉన్న ఆయనకు కొత్తగా పార్టీలో చేరిన రత్నం రూపేణా దురదృష్టం వెంటాడింది. మాజీ మంత్రి సబితను నమ్ముకున్న ఆయనకు అధిష్టానం ఆశీస్సులు దక్కలేదు. రెండు నెలల క్రితం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రత్నంకు టికెట్ కట్టబెట్టడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం అనుయాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ జరిపారు. ఇందులో వెంకటస్వామికి జరిగిన అన్యాయాన్ని ఏకరువు పెట్టిన సీనియర్లు.. ఇండిపెండెంట్‌గా పోటీచేయాలని ఒత్తిడి చేసినట్లు తెలిసింది. వెంకటస్వామి మాత్రం ఈ అంశంపై నేడో రేపో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించినట్లు సమాచారం. -
గెలిపిస్తే.. మీ జీతగాళ్లలా పనిచేస్తాం
బషీరాబాద్(తాండూరు) : ‘మా కాందాని నుంచి ఇద్దరు మీ ఆశీర్వాదంతో మంత్రులయ్యారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మా కుటుంబ గొడవల కారణంగా పోయిన ఎన్నికల్లో రెండుసార్లు ఓడిపోయాం. ఇప్పుడు మాకు బుద్దొచ్చింది.. మీరంతా ఒక్క అవకాశం ఇవ్వండి. రమేష్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ జీతగాళ్లలా పనిచేస్తాం..’’ అంటూ తాండూరు మాజీ ఎమ్మెల్యే ఎం.నారాయణరావు ఆసక్తికర వాఖ్యలు చేశారు. బషీరాబాద్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. శక్తియాప్ ద్వారా గ్రామాల్లో ఓటర్లకు సభ్యత్వం చేయించాలని సూచించారు. రాజకీయాలు గతంలో మాదిరిగా లేవని, అబద్దాలు చెప్పేవారిని, మోసం చేసేవారినే నమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహరాజుల కుటుంబానికి మోసం చేయడం, బెదిరించడం తెలియవన్నారు. మా ఇద్దరు అన్నలు మాణిక్‌రావు, చంద్రశేఖర్‌లను గెలిపించి మంత్రులుగా ఎదగడంలో మీ పాత్ర మరువలేనిదని తెలిపారు. ఈ సారి అన్న కొడుకు రమేష్‌ను గెలిపించి రాజకీయాలకు ఉండాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. శక్తియాప్ ద్వారా ప్రతీ గ్రామంలో 60 శాతానికి పైగా సభ్యత్వం చేయించాలని కార్యకర్తలకు సూచించారు. వారం రోజుల్లో మళ్లీ గ్రామాల్లో పర్యటిస్తానని తెలిపారు. డబ్బు రాజకీయాలు ఎక్కువకాలం సాగవ్ అన్నిసార్లు డబ్బుతోనే రాజకీయాలను నడిపిస్తామంటే మూర్ఖత్వమే అవుతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు చెంగోల్‌లో కాంగ్రెస్ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారని, రెండు రోజుల్లో తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తాండూరు ఎంపీపీపై సొంత పార్టీ ఎంపీటీసీలు అవిశ్వాసం పెడితే.. తమ పార్టీ ఎంపీటీసీని కిగ్నాప్ చేసి దాచిపెట్టారని మండిపడ్డారు. ఇవన్నీ జిల్లా మంత్రి సూచనల మేరకే జరుగుతున్నాయని ఆరోపించారు. రేపటిలోగా ఎంపీటీసీని అప్పగించకపోతే టీఆర్ఎస్ నాయకులపై కిడ్నాప్ కేసు పెడుతామని ఆయన హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో తాండూరులో టీఆర్ఎస్ పార్టీ రూ.30 కోట్లు ఖర్చు పెట్టినా.. గెలిచేది మాత్రం కాంగ్రెస్ పార్టీయేనని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ హరిగౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజరత్నం, శివప్రసాద్, నరేష్ చౌహన్, ఉల్గప్ప, మంతట్టి సురేష్, రాములు, వీరారెడ్డి, జీవన్గీ నర్సిములు, మస్తాన్, మునీర్, రాజన్‌గౌడ్, కాశప్ప, సాయిలుగౌడ్, పవన్, జగన్నాథ్, ధన్సింగ్, రాజన్‌గౌడ్, పెంటప్ప, మాధవరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, మోహన్, లక్ష్మన్, వడ్డే శీను, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
గాంధీ భవన్ ట్రస్ట్ ఛైర్మన్ నారాయణరావు మృతి
హైదరాబాద్: గాంధీభవన్ ట్రస్ట్ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి, వాసవి కేంద్రాల మాజీ చైర్మన్ నారాయణరావు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, గాంధీభవన్ ట్రస్ట్ సభ్యుడు సూర్యనాయక్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. -
బౌన్ నిఘంటువులోబ్రౌన్ కృషి ఎంత?
పండితులను పునర్దర్శించడం, పెద్దలు చేసిన కృషిని పునర్మూల్యాంకనం చేయడం జిజ్ఞాసువులు తరచూ చేసే పని. ఇప్పుడు ఇద్దరి దృష్టి సి.పి. బ్రౌన్ (1798 - 1884) వైపు మళ్లింది. బ్రౌన్కు మనం ఇవ్వవలసిన గౌరవం కంటే ఎక్కువ ఇస్తున్నామా ఈ ఆరాధన వెనుక వలసవాద (బానిస) ధోరణి ఉన్నదా చూడమంటున్నారు. బౌన్ వచ్చే నాటికి తెలుగులో ఆకారాది నిఘంటువులు లేవు. అప్పటికి ఉన్న ఆంధ్రనామ సంగ్రహము, ఆంధ్ర నామశేషము... వీటిలోని మాటలు వర్గాలుగా విభజించబడ్డాయి. అంటే ఏదైనా తెలియని మాట వస్తే వెంటనే ఆ పుస్తకాలు చూసి ఆ మాటకి అర్థం తెలుసుకోవడానికి ఈ నిఘంటువులు ఉపయోగపడవు. అమరకోశంలాగే ఈ నిఘంటువులను బట్టీయం వేయాలి. తెలుగు నేర్చుకుంటున్న ఇంగ్లిష్ ఉద్యోగులకు ఇది కష్టం కనుక నిఘంటు నిర్మాణంలో పాశ్చాత్య పద్ధతిని (ఆకారాది నిఘంటు పద్ధతిని) తెలుగులోకి పట్టుకురావడం తప్పనిసరైంది. వాళ్ల అవసరం కోసం బ్రౌన్ మొదలుపెట్టిన నిఘంటువు కేవలం అతని పట్టుదల వల్ల, క్రమశిక్షణ వల్ల, అంతకన్నా ముఖ్యంగా అనేకమంది పండితుల సహాయం వల్ల చెప్పుకోదగ్గ పెద్ద నిఘంటువుగా తయారయ్యింది. అయితే ఈ పనిలో అతనికి ఎంతమంది పండితులు, ఎంతమంది వ్యవహర్తలు తోడ్పడ్డారో మనం స్థూలంగా గ్రహించవలసిందే కాని నిక్కచ్చిగా మనకి తెలియదు. వాళ్ల పేర్లని నిఘంటు వులో రాసి వాళ్లకు పేరుపేరుగా కృతజ్ఞత చెప్పే అవసరం బ్రౌన్కి కలగలేదు (బ్రౌన్ తను పరిష్కరించిన ప్రతి పుస్తకంలోనూ ఠఛ్ఛీట ఝడ జఠజీఛ్ఛీఛ్ఛి అని రాయించే వాడు. ఆ సంగతి మనం గుర్తు పెట్టుకో వాలి). ఆయా మాటలకి అర్థ నిర్ణయ విషయంలో సహాయకుల బుద్ధి ఎంత పని చేసిందో బ్రౌన్ అవగాహన ఎంత తోడ్పడిందో మనం స్పష్టంగా చెప్పడానికి అవకాశాలు లేవు. మాటకి ఇంగ్లిష్‌లో అనువాదం మాత్రం బ్రౌన్దే. అయితే అనువాదం మాటకి ఉన్న అర్థ సూక్ష్మతని నిశితంగా పట్టుకుందా అన్న సంగతి ఇప్పటికీ ఎవ్వరూ విచారించలేదు. ఈ నిఘంటువు గురించి గిడుగు రామమూర్తి పంతులుగారి దగ్గర నుంచి దీపాల పిచ్చయ్య శాస్త్రిగారి వరకు తెలుగువాళ్లు రకరకాల అభిప్రాయాలు చెప్పారు. ఉదాహరణకి గిడుగుగారు ‘బ్రౌణ్య నిఘంటువు రచించిన పండితులు ప్రఖ్యాతులైన జూలూరు అప్పయ్య పండితులు మొదలయినవారు’ అన్నారంటే బ్రౌన్ నిఘంటువులో పండితుల ప్రమేయం చాలా ఎక్కువగా ఉందని మనకి బోధపడుతుంది. బ్రౌన్ పట్ల ఉన్న ఆరాధనా భావాన్ని పక్కనపెట్టి ఈ నిఘంటువు ఒక పెద్ద సమిష్టి కార్యమని దీనికి బ్రౌన్ పేరు పెట్టడం కేవలం వ్యవహార సౌలభ్యం కోసమని మనం గమనించాలి. కానీ ఈ నిఘంటు నిర్మాణంలో ప్రధాన దృక్పథం భాషా వ్యవహార సౌలభ్యమే అని గుర్తించి దానిని అమలు పెట్టిన గౌరవం మాత్రం ఒక్క బ్రౌన్కే ఇవ్వాలి. - పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు (మనకు తెలియని బ్రౌన్‌దొర - ఈమాట వెబ్ మేగజీన్ తాజా సంచికలో వచ్చిన ప్రధాన వ్యాసం నుంచి స్వల్పభాగం) వ్యాసంలోని కొన్ని వ్యాఖ్యలు {బౌన్కి వచ్చిన తెలుగు లండన్లోగాని కలకత్తా ఫోర్ట్ విలియమ్ కాలేజీలో సంస్కృతం నేర్చుకుంటున్న పండితులకుగాని ముఖ్యమైనదిగా కనిపించలేదు. అక్కడి వాళ్లు బ్రౌన్‌ని ఇండియాలో తెలుగు నేర్పే చిన్న వ్యక్తిగానే చూశారు తప్ప భారతీయ భాషల్లో ఒక స్కాలర్‌గా గుర్తించలేదు. అప్పుడే ఆ గుర్తింపు పొందాలనే తపన బ్రౌన్లో మొదలయ్యింది. అది 1837 నుంచి 1855 వరకు గడిపిన బ్రౌన్ జీవితంలో ముఖ్య ఆశయం. {బౌన్ తెలుగు దేశానికి అధికారిగా, దొరగా వచ్చాడు. తన కింద పని చేసే పండితులను సేవకులుగానే చూశాడు. వాళ్లందరూ బ్రౌన్‌ను మహారాజుగానే చూశారు. బ్రౌన్ గొప్ప పరిపాలనా దక్షుడు. తన కింద ఉన్నవాళ్లను ఎక్కడ ఉంచాలో చూసుకొని చవకగా జీతాలు ఇస్తూ ఎక్కువ పనిని రాబట్టుకోవడం బ్రౌన్కు బాగా తెలుసు. మనలో పాతుకుపోయిన వలసవాదపు సాహిత్య భావాలకి ఆద్యుడు బ్రౌన్. ఆ భావాలని అంత అనాలోచితంగా మనం అందిపుచ్చుకోవడానికి కారణం మనలోని సాంస్కృతిక దైన్యం. ఆ దైన్యాన్ని యథాశక్తి పోషించి అదే విజ్ఞానంగా ప్రచారం చేసిన మహానుభావులు కట్టమంచి రామలింగారెడ్డిగారు, వీరేశలింగం పంతులుగారు. ఈనాడు వీళ్ల పాండిత్యపు పునాదుల్ని మనం సగౌరవంగా ఒప్పేసుకోవడానికి బ్రౌన్‌ని మనం ఈవేళ పొగడడానికి ప్రత్యక్ష సంబంధం ఉంది.