మాజీ ఎమ్మెల్యే నారాయణరావు
తాండూరు: కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు స్వతంత్ర అభ్యర్థిలో బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల తాండూరు కాంగ్రెస్ అభ్యర్థిగా రోహిత్‌రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ముందు నుంచి నారాయణరావు తన కుటుంబీకులు లేదా అనుచరులకు టికెట్ కేటాయించాలని పట్టుబట్టారు. తనదైన శైలిలో లాబీయింగ్ చేసినా టికెట్ లభించకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందారు. ఈనేపథ్యంలో ఆయన ఇటీవల తన అనుచరగణంతో సమావేశమై కార్యాచరణ తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీలో చేరిన రోహిత్‌రెడ్డికి టికెట్ ఇవ్వడం ఏంటని ఆయన పీసీసీ నేతలపై భగ్గుమంటున్నారు. దశాబ్ధాల కాలం నుంచి తమ కుటుంబం హస్తం పార్టీకి సేవ చేశామని పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో ఈనెల 18న ఆయన నామినేషన్ వేయనున్నట్లు ప్రకటించారు.
చీలనున్న ఓటు బ్యాంకు..
మహరాజుల కుటుంబం సభ్యులు తాం డూరు అసెంబ్లీ బరిలో నిలబడితే కాం గ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుపై తీవ్ర ప్ర భావం పడే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మహరాజుల కుటుంబీకులు చాలాకాలంగా ఎన్నోవేల కుటుంబాలకు మేలు చేశారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన పలువురు వారికి మద్దతుగా నిలిచారు. ఈనేపథ్యంలో హస్తం ఓటు బ్యాంకు భారీగా చీలిపోయే కాంగ్రెస్ అభ్యర్థికి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. తాండూరులో మహరాజులు గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై పడే ప్రభావం ఉందని స్థానికంగా చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment