హైదరాబాద్: గాంధీభవన్ ట్రస్ట్ ఛైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి, వాసవి కేంద్రాల మాజీ చైర్మన్ నారాయణరావు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, గాంధీభవన్ ట్రస్ట్ సభ్యుడు సూర్యనాయక్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.