narayanpur district
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు, స్పెషల్ టాస్‌్కఫోర్స్(ఎస్టీఎఫ్) జవాను నితీశ్ ఎక్కా మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. లేఖారమ్ నేతమ్, కైలాశ్ నేతమ్ అనే మరో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, బ్యారెల్ గ్రనేడ్ లాంచర్‌తోపాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అబూజ్మడ్ అడవిలో ఈ నెల 12న ప్రారంభమైన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా శనివారం ఉదయం భద్రతా సిబ్బంది గాలింపు కొనసాగిస్తుండగా, మావోయిస్టులు తారసపడ్డారని, ఇరువర్గాల మధ్య చాలాసేపు కాల్పులు కొనసాగాయని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులతోపాటు ఐటీబీపీ, బీఎస్ఎఫ్ సిబ్బంది సైతం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని వివరించారు. మావోయిస్టుల వైపునుంచి కాల్పులు ఆగిపోయిన తర్వాత వెళ్లి పరిశీలించగా 8 మృతదేహాలు కనిపించాయని స్పష్టం చేశారు. గాయపడిన ఇద్దరు జవాన్లను చికిత్స కోసం హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవలి కాలంలో భద్రతా సిబ్బంది దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. కాంకేర్, కొండగావ్, నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాలో కూడిన బస్తర్ డివిజన్లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 131 మంది మావోయిస్టులు మరణించారు. ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 29 మంది మావోయిస్టులు మృతిచెందిన సంగతి తెలిసిందే. నక్సలైట్లను పూర్తిగా ఏరివేయడమే తమ లక్ష్యమని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రకటించారు. -
ఛత్తీస్‌లో దారుణం
చర్ల/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లా కదేనార్ క్యాంపులో దారుణం జరిగింది. కదేనార్ ఐటీబీపీ 45వ బెటాలియన్ క్యాంపులోని మసుదుల్ రహమాన్ అనే జవాన్ బుధవారం ఉదయం తన సర్వీస్ గన్‌తో అయిదుగురు సహచర జవాన్లను కాల్చి చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రహమాన్‌ను అడ్డుకోబోయిన మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించారు. జవాన్ కాల్పులకు దిగడానికి గల కారణాలు తెలియనప్పటికీ.. సెలవు మంజూరు చేయలేదని మనస్తాపం చెంది ఈ ఘటనకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని పేర్కొన్నారు. -
సహచరులపై జవాన్ కాల్పులు.. 6 గురు మృతి
రాయ్‌పూర్ : ఇండో టిబెటన్ బార్డర్ పోలీసుల మధ్య తలెత్తిన వివాదం.. కాల్పులకు దారితీసింది. దీంతో ఆవేశానికి లోనైన ఓ జవాన్ తన సహచరులపై కాల్పులు జరిపాడు. ఆ కాల్పులో అతనితో పాటు మరో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నారాయణపూర్‌లోని కేదార్‌నార్ క్యాంప్‌లోని ఐటీబీపీ 45వ బెటాలియన్‌కు చెందిన కొందరు జవాన్ల మధ్య బుధవారం ఉదయం వివాదం తలెత్తింది. ఈ సందర్భంగా ఆగ్రహానికి లోనైన ఐటీబీపీ కానిస్టేబుల్ మసుదుల్ రెహమాన్.. తన సర్వీస్ రివాల్వర్‌తో సహచరులపైకి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రెహమాన్‌తో సహా 6గురు జవాన్లు మరణించగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని హెలికాఫ్టర్‌లో రాయ్‌పూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని బస్తర్ రెంజ్‌ఐజీ సుందర్రాజ్ ధ్రువీకరించారు. ఈ ఘటనపై సుందర్రాజ్ మాట్లాడుతూ.. ‘జవాన్ల మధ్య వివాదం తలెత్తడంతో రెహమాన్.. తన తోటి సహచరులపైకి కాల్పులు జరిపాడు. అయితే రెహమాన్ తనను తాను కాల్చుకున్నాడా లేక అతని సహచరులు ఎదురుకాల్పులు జరపడం వల్ల మరణించాడా అనేది తెలియాల్సి ఉంది. ఇందుకోసం ఈ ఘటనలో చనిపోయిన జవాన్ల రివాల్వర్లను పరిశీలించాల్సి ఉంద’ని తెలిపారు. మృతులను ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్స్ దుల్జీత్, ఎమ్ సింగ్, కానిస్టేబుల్స్ సుజిత్ సర్కార్, బిశ్వరూప్, బ్రిజేష్‌లుగా గుర్తించారు. గాయపడ్డవారిలో కానిస్టేబుల్స్ ఎస్బీ ఉల్లాస్, సీతారామ్‌లు ఉన్నారు. -
మావోయిస్టులు అరెస్ట్ :భారీగా మందుపాతర్లు స్వాధీనం
ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా దౌడాయి అటవీ ప్రాంతంలో సోమవారం మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురు కాల్పులకు తట్టుకోలేక మావోయిస్టులు పరారైయ్యారు. ఆ క్రమంలో పోలీసు బలగాలు ఇద్దరు మావోయిస్టులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని తమ దైన శైలిలో పోలీసులు విచారించారు. దాంతో దంతెవాడ జిల్లా నకుల్నార్ అటవీ ప్రాంతంలో భారీగా మందుపాత్ర నిల్వ ఉంచినట్లు వారు పోలీసులకు తెలిపారు. దాంతో పోలీసులు నకుల్నార్ అటవీ ప్రాంతంలో నిల్వ ఉంచిన మందుపాత్రలను పోలీసులు భారీ సంఖ్యలో స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.