National Movement
-
9 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’
సాక్షి, న్యూఢిల్లీ: ‘హర్ ఘర్ తిరంగా’ప్రచారంలో భాగంగా ఈ నెల 9 నుంచి 15వ తేదీ వరకు ప్రతీ ఒక్కరూ తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అంతేగాక ప్రజలు త్రివర్ణ పతాకంతో దిగిన సెలీ్ఫలను ‘హర్ ఘర్ తిరంగా’వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని శనివారం ఆయన ‘ఎక్స్’లో కోరారు. ప్రధాని మోదీ ప్రారంభించిన హర్ ఘర్ తిరంగా ప్రచారం రెండేళ్లలో జాతీయ ఉద్యమంగా మారిందని అమిత్ షా పేర్కొన్నారు. -
మన దౌత్యం...కొత్త శిఖరాలకు
న్యూఢిల్లీ: గత నెల రోజుల్లో భారత దౌత్య ప్రతిభ నూతన శిఖరాలను తాకిందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా 21వ శతాబ్దిలో ప్రపంచ గతిని నిర్ణయించే పలు కీలక నిర్ణయాలకు ఢిల్లీ వేదికగా ఇటీవల జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు వేదికైందన్నారు. నేటి భిన్న ధ్రువ ప్రపంచంలో అన్ని దేశాలను ఒకే వేదిక మీదికి తేవడం చిన్న విషయమేమీ కాదన్నారు. ‘దేశ వృద్ధి ప్రస్థానం నిర్నిరోధంగా సాగాలంటే స్వచ్ఛమైన, స్పష్టమైన, సుస్థిరమైన పాలన చాలా ముఖ్యం. ప్రస్తుతం దేశంలో చోటుచేసుకుంటున్న సానుకూల పరిణామాలు, మార్పులకు రాజకీయ స్థిరత్వం, విధాన స్పష్టత, పాలనలో ప్రతి అడుగులోనూ పాటిస్తున్న ప్రజాస్వామిక విలువలే ప్రధాన కారణం‘ అని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఇక్కడ జీ20 కనెక్ట్ లో విద్యార్థులు, బోధన సిబ్బంది, విద్యా సంస్థల అధిపతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అవినీతిని, వ్యవస్థలో లీకేజీలను అరికట్టేందుకు, దళారుల జాడ్యాన్ని నిర్మూలించేందుకు, పథకాల అమలుకు టెక్నాలజీని గరిష్టంగా వాడుకునేందుకు గత తొమ్మిదేళ్లలో తమ సర్కారు చిత్తశుద్ధితో ప్రయతి్నంచిందని చెప్పారు. భారత్, ద హ్యాపెనింగ్ ప్లేస్! భారత్ ఇప్పుడు ఎన్నో కీలక సంఘటనలకు వేదికగా మారుతోందని మోదీ అన్నారు. ‘గత నెల రోజుల ఘటనలే ఇందుకు నిదర్శనం. దానిపై ప్రగతి నివేదిక ఇవ్వదలచుకున్నా. అప్పుడు నూతన భారతం వృద్ధి పథంలో పెడుతున్న పరుగుల తాలూకు వేగం, తీవ్రత అర్థమవుతాయి. గత నెల వ్యవధిలో నేను ఏకంగా 85 దేశాల అధినేతలతో భేటీ అయ్యా. ఇక ఆగస్టు 23ను మనమెప్పటికీ గుర్తుంచుకోవాలి. అది భారత్ సగర్వంగా చంద్రుని మీద అడుగు పెట్టిన రోజు. ప్రపంచమంతా మన వాణిని విన్న రోజు. మనందరి పెదవులపై గర్వంతో కూడిన దరహాసం వెలిగిన రోజు. అందుకే జాతీయ అంతరిక్ష దినంగా ఆగస్ట్ 23 మన దేశ చరిత్రలో అజరామరంగా నిలవనుంది. ఆ విజయపు ఊపులో వెనువెంటనే సౌర యాత్రకు మనం శ్రీకారం చుట్టాం‘ అన్నారు. ఇక మామూలుగా కేవలం ఒక దౌత్య భేటీగా జరిగే జీ20 సదస్సును మన ప్రయత్నాలతో పౌర భాగస్వామ్యంతో కూడిన జాతీయ ఉద్యమంగా మలచుకున్నాం. ఢిల్లీ డిక్లరేషన్‌కు జీ20 దేశాల నుంచి 100 శాతం ఏకాభిప్రాయం దక్కడం ప్రపంచ స్థాయిలో పతాక శీర్షికలో నిలిచింది. ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్య దేశంగా చేరింది. ఇలాంటివన్నీ ఆ సదస్సు సారథ్య సందేశంగా మనం సాధించిన ఘనతలే. అంతేకాదు, భారత ప్రయత్నాల వల్ల మరో ఆరు దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరాయి‘ అని వివరించారు. వీరికి అందలం, వారికి అరదండాలు! నేడు మన దేశంలో నిజాయితీపరులకు గుర్తింపు, అవినీతిపరులకు తగిన శిక్ష దక్కుతున్నాయని మోదీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మధ్య తరగతి శ్రేయస్సు కోసం గత నెల రోజుల్లో కేంద్రం ఎన్నో పథకాలు తెచ్చింది. పీఎం విశ్వకర్మ యోజన, రోజ్ గార్ మేళాతో లక్ష మంది యువతకు ఉపాధి వంటివన్నీ వాటిలో భాగమే‘ అన్నారు. ‘మన దేశం మీద అంతర్జాతీయంగా భరోసా ఇనుమడిస్తోంది. విదేశీ పెట్టుబడుల వెల్లువ రికార్డులు తాకుతోంది. కేవలం ఐదేళ్లలో 13.5 కోట్ల భారతీయులు పేదరికం నుంచి బయటపడి నూతన మధ్య తరగతిగా రూపుదాల్చారు‘ అని వివరించారు. యువతా! కలసి నడుద్దాం...! జీ20 సదస్సు ఘన విజయానికి యువత భాగస్వామ్యం ప్రధాన కారణమని మోదీ అన్నారు. లోకల్ నినాదానికి ఊపు తెచ్చేందుకు కాలేజీ, వర్సిటీ క్యాంపస్ లు కేంద్రాలుగా మారాలని ఆశాభావం వెలిబుచ్చారు. ‘ఖాదీ దుస్తులు ధరించడం ద్వారా వాటికి ప్రాచుర్యం కల్పించండి. క్యాంపస్‌లలో ఖాదీ ఫ్యాషన్ షోలు పెట్టండి’ అని యువతను కోరారు. ‘మన స్వాతంత్య్ర యోధుల్లా దేశం కోసం మరణించే అదృష్టం మనకు లేదు. కనీసం దేశం కోసం జీవితాలను అంకితం చేసే సదవకాశం మాత్రం మనందరికీ ఉంది’ అని గుర్తు చేశారు. వందేళ్ల క్రితం యువత స్వరాజ్య భారతం కోసం కదం తొక్కింది. మనమిప్పుడు సమృద్ద భారతం కోసం పాటుపడదాం. రండి, కలసి నడుద్దాం!‘ అని పిలుపునిచ్చారు. -
జాతీయోద్యమ కెరటాలు నాటి తెలుగు పత్రికలు
భారత స్వాతంత్య్రోద్యమంలో తెలుగు పత్రికలు గణనీయమైన పాత్ర పోషించాయి. ‘వందేమాతరం’ ఉద్యమం నుండి ‘క్విట్ ఇండియా’ ఉద్యమం దాకా సుమారుగా నాలుగు దశాబ్దాల పాటు స్వాతంత్య్ర ఉద్యమ బాటలో నడిచాయి. మొదట్లో మత పరమైన పత్రికలు తెలుగునేలపై ఆవిర్భవించాయి. వీరేశలింగం పంతులు 1874లో ‘వివేక వర్ధిని’ పత్రికను వెలువరించడంతో తెలుగు సమాజంలో నూతన శకం ఆరంభమైంది. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి తెలుగు పత్రికా రంగం వికాస దశను అందుకుంది. ఈ దశలో అవి ప్రజల్లో ఒక వంక ఆంధ్రాభిమానాన్నీ, మరో వంక జాతీయ భావాన్నీ పెంపొందించాయి. కొండా వెంకటప్పయ్య వంటి దేశభక్తుల కృషి ఫలితంగా ‘కృష్ణా జిల్లా సంఘం’ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో నెలకొన్న ‘కృష్ణా పత్రిక’ (1902) తెలుగు పత్రికా రంగంలో ఒక మైలు రాయిలా నిలిచింది. ముట్నూరి కృష్ణారావు దీని ప్రధాన సంపాదక బాధ్యతలను చేపట్టి జాతీయోద్యమానికి సంబంధించిన వ్యాసాల ద్వారా ఆంధ్రుల్ని ఉత్తేజితుల్ని చేశారు. తెలుగు ప్రాంతంలో కాశీనాథుని నాగేశ్వరరావు స్థాపించిన ‘ఆంధ్ర పత్రిక’ కూడా (1908) జాతీయ ఉద్యమంలో భాగస్వామి అయింది. బోడి నారాయణరావు, పింగళి లక్ష్మీనారాయణలతో కలిసి గాడిచర్ల హరిసర్వోత్తమరావు 1908లో బెజవాడ నుండి ‘స్వరాజ్య’ వార పత్రికను ప్రారంభించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రచనలు చేశారని ఈయనకు మూడు సంవ త్సరాలు కఠిన కారాగార శిక్ష విధించారు. ఒక రచనతో జైలు పాలైన మొదటి దక్షిణాది వ్యక్తి గాడిచర్ల. 1923లో ‘ఆంధ్ర పత్రిక’, ‘కృష్ణా పత్రిక’, ‘కాంగ్రెస్’ వంటి పత్రికలు నిషేధానికి గురైనాయి. 1925లో ‘మాతృసేవ’, ‘పశ్చిమాంధ్ర’, ‘శారద’, ‘స్వధర్మ’, ‘స్వతంత్ర’ పత్రికలకూ అదే గతి పట్టింది. కమ్యూనిస్టు పార్టీని నిషేధించక ముందు గద్దె లింగయ్య కృష్ణా జిల్లా నుండి ‘ప్రభా’ పత్రిక తొలి సంచికను 1935లో విడుదల చేశారు. అయితే అది బ్రిటిష్ వారు విధించిన రూ. 8,000 జరిమానా చెల్లించలేక మూతపడింది. సోషలిస్ట్ పార్టీ తరఫున ‘నవశక్తి’ పత్రిక అన్నపూర్ణయ్య సంపాదకత్వంలో వెలువడింది. ఆ తర్వాత దీనిని పుచ్చలపల్లి సుందరయ్య, చంద్రశేఖరరావు, మరికొంతమంది కలిసి నడిపారు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు ‘నవశక్తి’ పత్రికను కూడా బ్రిటిష్ వారి కఠిన నిర్ణయాల వలన ఆపివేయ వలసిన పరిస్థితి ఏర్పడింది. ‘గోల్కొండ పత్రిక’ ద్వారా సురవరం ప్రతాపరెడ్డి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు. నరసింహారావు ‘రయ్యత్’ దినపత్రిక ద్వారా ఉద్యమంలోకి వచ్చారు. గద్దె లింగయ్య ‘ప్రభా’ పత్రిక, మద్దూరి అన్నపూర్ణయ్య సంపాదకత్వంలో ‘నవశక్తి’, కాళీపట్నం కొండయ్య ‘వీరభారత్’ పోషించిన పాత్ర అమోఘం. కాండ్రేగుల రామచంద్రారావు, చుండ్రుపట్ల హనుమంతరావు తమదైన శైలిలో పత్రికల ద్వారా ప్రజలను ఉత్తేజ పరుస్తూ ఉద్యమాన్ని నడిపారు. ప్రకాశం పంతులు ‘స్వరాజ్య’ ఆంగ్ల దినపత్రిక ప్రజలను ఉద్యమం వైపు నడిపింది. అంతేకాదు పప్పూరు రామాచార్యులు 1922లో మిత్రుల సహాయంతో ‘పినాకిని’ పత్రికను అనంతపురంలో ప్రారంభించారు. దీనితో పాటే ‘శ్రీసాధన’ పత్రికను కూడా నడిపారు. ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రిక, శ్రీసాధన పత్రికలతో తాము బలవంతులమయ్యామని స్వయంగా వావిలాల గోపాలకృష్ణయ్య అన్నారు. సర్కారులో కొండా వెంకటప్పయ్య, రాయలసీమలో పప్పూరు రామాచార్యులు, తెలంగాణలో మాడపాటి హనుమంతరావు ముఖ్యు లుగా ఉన్నారని కూడా వావిలాల చెప్పారు. ఇక ముట్నూరి కృష్ణారావు, కాశీనాథుని నాగేశ్వరరావు, కందుకూరి వీరేశ లింగం – ఈ ముగ్గురిని కలిపితే సురవరం ప్రతాపరెడ్డి అవుతారని అనుకునే వాళ్లు. ఆంధ్ర, కృష్ణా పత్రికలను కలిపితే ‘గోల్కొండ పత్రిక’ అవుతుందని కూడా! ‘జన్మభూమి’ పత్రిక కోసం రాసిన వ్యాసం కారణంగా నార్ల వెంకటేశ్వరరావును పోలీసులు చితక బాదారు. గాడిచర్ల హరి సర్వోత్తమరావు, ఖాసా సుబ్బా రావు, కోటంరాజు రామారావు, పప్పూరు రామాచార్యులు కఠినమైన జైలు శిక్షలు అనుభవించారు. అనిబీసెంట్ అరెస్టును ‘దేశమాత’ పత్రికలో ఖండించారని చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుకు వెయ్యి రూపాయల అపరాధ రుసుము విధించారు. ఆ యా పత్రికలు దేశకాల పరిస్థితులకు అనుగుణంగా తెలుగువారి మనోభావాల్ని మలచడంలో చరిత్రాత్మక పాత్రను పోషించాయి. అనేకమంది పత్రికా సంపాదకులు తమ శక్తికి మించి స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వి.వి. రమణ వ్యాసకర్త ఉపాధ్యాయుడు -
AICC Steering Committee meet: చేతగానోళ్లు తప్పుకోండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలకు పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గట్టి హెచ్చరికలు చేశారు. ‘‘లెక్క లేకుండా ప్రవర్తించినా పర్లేదనేలా కొందరు వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతమాత్రమూ సరికాదు. ఆమోదయోగ్యం అసలే కాదు. బాధ్యతలు సజావుగా నిర్వర్తించడం చేతగానివాళ్లు తప్పుకుని ఇతరులకు దారివ్వాల్సి ఉంటుంది’’ అంటూ కుండబద్దలు కొట్టారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి దాకా నాయకులంతా జవాబుదారీతనంతో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆదివారం కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ తొలి భేటీలో మాట్లాడిన ఆయన, నేతలనుద్దేశించి పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీ పట్ల, దేశం పట్ల మనకున్న బాధ్యతల్లో అత్యంత ముఖ్యమైనది జవాబుదారీతనమే. పార్టీగా కాంగ్రెస్ పటిష్టంగా ఉండి ప్రజల అంచనాలను అందుకున్నప్పుడే మనం ఎన్నికల్లో నెగ్గగలం. దేశానికి, ప్రజలకు సేవ చేయగలం’’ అని అభిప్రాయపడ్డారు. ఈ దృష్ట్యా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జిలు తమ సొంత బాధ్యతలను, తమపై ఉన్న సంస్థాగత బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై మరింతగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రధాన కార్యదర్శులుగా, రాష్ట్రాల ఇన్చార్జిలుగా మీ బాధ్యతా పరిధిలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం నెలకు 10 రోజులైనా పర్యటిస్తున్నారా? ప్రతి జిల్లా, ప్రతి యూనిట్లో పర్యటించారా? స్థానిక సమస్యలు తదితరాలపై లోతుగా ఆరా తీశారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి’’ అంటూ హితవు పలికారు. ‘‘మీ పరిధుల్లోని రాష్ట్రాల్లో జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాయా? జిల్లా, బ్లాక్ స్థాయిల్లో వీలైనంత మంది కొత్తవారికి అవకాశాలిచ్చారా? ఐదేళ్లుగా ఎలాంటి మార్పులూ చేయని జిల్లాలు, బ్లాక్లున్నాయా? ప్రజా సమస్యలపై అవి నిత్యం గళమెత్తుతున్నాయా? ఐఏసీసీ పిలుపు మేరకు స్థానిక సమస్యలపై ఎన్నిసార్లు ఆందోళనలు, ధర్నాలు చేశాయి?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. ‘‘ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జిలు, పీసీసీ చీఫ్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా కలిసి క్షేత్రస్థాయిలో 90 రోజుల పాటు కార్యచరణకు విస్పష్టమైన బ్లూప్రింట్ సిద్ధం చేయాలి’’ అని ఆదేశించారు. లేదంటే బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహించనట్టేనని స్పష్టం చేశారు. ‘‘సంస్థాగత ప్రక్షాళనకు, భారీ జనాందోళనలకు మీరంతా తక్షణం బ్లూప్రింట్ సిద్ధం చేస్తారని ఆశిస్తున్నా. అలా చేసి 15 నుంచి 30 రోజుల్లో సమర్పించండి. వాటిపై నాతో చర్చించండి’’ అని ఆదేశించారు. స్టీరింగ్ కమిటీ నేతలు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు. జాతీయోద్యమంగా జోడో యాత్ర భారత్ జోడో యాత్ర కూడా భేటీలో చర్చకు వచ్చింది. యాత్ర చరిత్ర సృష్టిస్తోందంటూ ఖర్గే కొనియాడారు. ‘‘అధికార పార్టీ విద్వేష రాజకీయాలు, జనం నడ్డి విరుస్తున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక, సామాజిక అసమానతలపై నిర్ణాయాక పోరుగా యాత్ర రూపుదిద్దుకుంటోంది. ప్రజల భాగస్వామ్యంతో జాతీయ జనాందోళనగా మారింది. యాత్ర సాధించిన అతి పెద్ద విజయమిది’’ అన్నారు. దీన్ని ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఊరికీ తీసుకెళ్లడంలో కాంగ్రెస్ శ్రేణుల పాత్ర కీలకమంటూ కొనియాడారు. భేటీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీనియర్ నేతలు కె.సి.వేణుగోపాల్, పి.చిదంబరం, ఆనంద్ శర్మ, మీరాకుమార్, అంబికా సోని, అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగెల్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంకగాంధీ కూడా గైర్హాజరయ్యారు. మోదీ ప్రభుత్వంపై నిప్పులు ప్రజల ఆకాంక్షలపై, హక్కులపై మోదీ ప్రభుత్వం క్రూరంగా దాడి చేస్తోందంటూ ఖర్గే దుయ్యబట్టారు. ‘‘హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన విద్వేషపు వ్యాఖ్యలు దేశాన్ని మరింతగా విభజించాయి. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మన భూభాగాన్ని ఆక్రమించాలన్న చైనా ప్రయత్నాలను తిప్పి కొట్టే దిక్కు లేదు. ఈ సమస్యల నుంచి దేశాన్ని వారిని కాపాడాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది’’ అన్నారు. ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్లీనరీ మార్చి నుంచి ‘చేయీ చేయీ కలుపుదాం’ కాంగ్రెస్ 85వ ప్లీనరీని వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో జరిగే ఈ మూడు రోజుల ప్లీనరీలో పార్టీ అధ్యక్షునిగా ఖర్గే ఎన్నికకు ఆమోదముద్ర పడనుంది. ముగింపు నాడు భారీ బహిరంగ ఉంటుందని పార్టీ నేత కె.సి.వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. జనవరి 26న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను ముగించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘చేయీ చేయీ కలుపుదాం’ పేరుతో యాత్ర స్ఫూర్తిని మార్చి 26 దాకా దేశవ్యాప్తంగా కొనసాగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో పాదయాత్రలు జరుగుతాయి. ప్రియాంకగాంధీ వధ్రా సారథ్యంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు రాష్ట్రాల స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తారు. జోడో యాత్ర ముగిశాక మోదీ ప్రభుత్వంపై రాహుల్ చార్జిషీట్ విడుదల చేయనున్నారు. -
కొల్లాయి కట్టి... 99 ఏళ్లు!
‘‘కొల్లాయిగట్టితేనేమీ మా గాంధీ..’’ అంటూ తెలుగు నాట వీర విహారం చేసిన స్వాతంత్య్ర పోరాట గీతం రాసిన కవి బసవరాజు అప్పారావు. సిని మాలో పాటగా, 1938 మాలపిల్ల సినిమాలో సూరి బాబు పాడిన గీతం. నిజానికి ఈ కొల్లాయి కట్టే ఘట్టం ఎప్పుడు జరిగింది అంటే మనం కొంత ఆలోచిస్తాం కానీ, ఎవరీ వ్యక్తి అంటే, ఒక్క క్షణమైనా తడుముకోకుండా, కొల్లాయి కట్టినది గాంధీజీ అని చెప్పేస్తాం. పైపెచ్చు తెలుగు సాహిత్యంలో, ‘కొల్లాయిగట్టితేనేమి’ ఒక ప్రఖ్యాత తెలుగు నవల కూడా. 1960లలో ఈ నవల రాసింది మహీధర రామమోహనరావు. 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డ్ పొందిన నవల ఇది. అయితే గాంధీజీ జీవితంలో కూడా ఇది జరిగింది సెప్టెంబర్ 1921లో. తన పత్రిక నవజీవన్‌లో గాంధీ ఇలా చెప్పారు. ‘‘మదరాసు నుంచి మదురైకి రైలుబండిలో వెళ్తుండగా, ఏమీ పట్టనట్టుగా రైలు పెట్టెలో ఉన్న జనాలను చూశాను. అందరూ విదేశీ దుస్తుల్లో ఉన్నారు. వారితో మాట్లాడుతూ, ఖాదీ ధరించవలసిన ఆవశ్యకత గురించి నేను నచ్చచెప్పబోయాను. వారు తలలు అడ్డంగా ఊపి ‘‘మేం చాలా పేదవారం, ఖాదీ ధారణ చేయడానికి, కొనాలంటే ఖాదీ చాలా ఖరీదు’’ వారి మాటల అంతరార్థం నేను గ్రహించాను. నేను పూర్తి దుస్తుల్లో ఉన్నాను, తలపై టోపీతో సహా. వీరు చెప్పింది కొంతవరకూ సత్యమే అయినా, కోట్లాదిమంది ప్రజలు కేవలం ఒక్క లంగోటీతో కాలం గడుపుతూ ఇదే నిజాన్ని చెప్తున్నారనిపిం చింది. వారికి నేనేమని సరైన జవాబివ్వగలను, నా వంటిమీది అదనపు దుస్తులను ప్రతి అంగుళమూ గనుక వదులుకుంటే, అలా చేయడం ద్వారా, ఈ దేశపు కోట్లాది మందికి దగ్గర కాగలిగితే.. మరునాడు ఉదయం మదురై సమావేశం తరువాత, వెంటనే నేను ఆ పని చేశాను’’. అలా మదురై మహాత్మునికి కొల్లాయి కట్టించిన తల్లి. తన దుస్తుల ధారణ, జాతీయోద్యమంలో భాగం చేయగల మేధావి గాంధీజీ. కొల్లాయి గాంధీజీ బ్రాండ్‌గా ప్రజల మనసుల్లో నిలబడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ అరకొర దుస్తుల ఫకీరు, అతిపెద్ద ఉపఖండ స్వాతంత్య్ర పోరాట నాయకుడని, గాంధీజీ ఆకర్షణ వలయంలో పడిపోయింది. ఈ దుస్తుల పద్ధతి, ఒకసారి అయిదో జార్జ్ చక్రవర్తిని బకింగ్ హామ్ భవంతిలో కలవడానికి వెళ్లాల్సివచ్చినప్పుడు, ఇవే దుస్తులా అని ప్రపంచం, పాలక వర్గాలు విస్మయంలో పడ్డాయి. చక్రవర్తిని కలవడానికి వెళ్ళేటప్పుడు ఇలా చాలీ చాలని దుస్తుల్లోనే వెళ్తారా? అన్నది మీడియా ప్రశ్న. ‘‘మా ఇద్దరికీ సరి పడా దుస్తులు చక్రవర్తి ధరించే ఉన్నారు కదా’’ అన్నది గాంధీజీ ఇచ్చిన చురుకైన జవాబు. విదేశీ వస్త్ర బహిష్కరణ ద్వారా ఆ రోజుల్లో ఆ దుస్తుల అమ్మకాలను సగానికి పడిపోయేలా బ్రిటిష్ వారి పై ఆర్థిక పరమైన దెబ్బ తీశారు గాంధీజీ. ఇలా కొల్లాయి కట్టిన ఘట్టానికి నాంది, సెప్టెంబర్ 1921లో గాంధీజీ బస చేసిన మదురైలోని పడమటి మాసి స్ట్రీట్‌లోని డోర్ నంబర్ 251 ఇల్లు. ఇప్పుడు అదే భవనంలో ఖాదీ ఎంపోరియం నడుస్తున్నది. కొల్లాయిగట్టితేనేమి, మహీధర వారి నవల 1920 డిసెంబర్–1921 ఏప్రిల్ వరకూ కథా కాలంగా నడుస్తుంది. టెక్నికల్‌గా, ఈ నవలలో కథనడిచే కాలానికి ఇంకా గాంధీజీ (సెప్టెంబర్ 1921 దాకా) కొల్లాయి కట్టడం ప్రారంభించలేదు. అందుకే మహీధర వారు, ఎంత చారిత్రక దృష్టితో చెప్పారు అంటే, ఈ నవల కథాకాలం పూర్తి అయిన కొద్ది నెలలకు కానీ గాంధీజీ కొల్లాయి కట్టడం మొదలు కాలేదు. అంటే గాంధీజీ కొల్లాయి కట్టడానికి ముందర కాలంలో, అసలు కొల్లాయి కట్టు గురించి ఏ పాటలూ లేని కాలంలోకి వెళ్ళి (1920–21) తను 1960లో రాసిన నవలకి ఇలా పేరు పెట్టిన సంగతి వివరించారు. అలా 1921లో తన దుస్తుల ధారణ కూడా స్వాతంత్య్ర పోరాటంలో భాగం చేసిన వ్యూహకర్త గాంధీజీ. ఆ దుస్తుల వ్యూహానికి ఇది 99వ వత్సరం. 70ఏళ్ల రిపబ్లిక్ దినోత్సవ సందర్భంలో, గాంధీజీ కొల్లాయి ధారణ ఈ దేశానికి చేసిన మేలు ఎంతో, స్వదేశీ ఉత్పత్తుల సమాదరణ వల్ల ఎంత అభివృద్ధి సాధించగలమో కూడా ఇంకా మనం గ్రహించవలసి ఉన్నది. (నేడు కృష్ణానదీ నౌకావిహార సాహిత్య సభలో మహీధర ‘కొల్లాయిగట్టితేనేమి’ నవలపై సాయంత్రం 5 గంటలకు రామతీర్థ ప్రసంగం) వ్యాసకర్త కవి, విమర్శకులు‘ 98492 00385 రామతీర్థ -
సమర అమ్మాళ్
భారత స్వాతంత్య్ర సంగ్రామ ధీరవనిత.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పిన నాయిక.. దక్షిణ భారతంలో అరెస్టయిన తొలి మహిళ.. తొలి రోజుల్లో.. నాటకరంగ కళాకారిణి. తర్వాత.. సమర యోధురాలు.. జానకీ అమ్మాళ్! స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమ్మాళ్ పునఃపరిచయం ఇది. (డెమొక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ సభ్యులతో జానకి అమ్మాళ్ (మధ్యలో)) జానకి అమ్మాళ్ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) నాయకురాలు, డెమొక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు. (తమిళనాడులో ప్రారంభమైన ఈ సమాఖ్య ఆల్ ఇండియా డెమొక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్– ఐద్వా స్థాపన తర్వాత అందులో విలీనమైంది) తమిళనాడు 1967 సార్వత్రిక ఎన్నికల్లో మదురై (ఈస్ట్) నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారామె. రంగస్థలం మీద గాయనిగా మొదలైన ఆమె ప్రస్థానం అనతికాలంలోనే ప్రధాన నాయిక పాత్రలోకి మారింది. రంగస్థలం నుంచే జాతీయపోరాటాన్ని ప్రారంభించారు జానకి అమ్మాళ్. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గళం విప్పడానికి రంగస్థలాన్నే ఆమె వేదిక గా చేసుకున్నారు. వేదిక మీద భారతమాత కీర్తిప్రతిష్ఠలను ఎలుగెత్తి పాడారు. వలస పాలనలో మగ్గుతున్న భారతావని కడగండ్లను రాగయుక్తంగా ఆలపించారు.. శ్రోతల నరాల్లో రక్తం ఉడికిపోయేట్లుంది ఆమె గానం. జనంలో ఉద్రేకం.. కట్టలు తెగడానికి సిద్ధంగా ఉండేది. అప్పుడు అరెస్టు చేశారామెని.. బ్రిటిష్ ఆదేశాలతో ఉద్యోగం చేస్తున్న దేశీయ పోలీసులు. ఒక ఏడాది పాటు ఆమె ఆచూకీ తెలియదెవ్వరికీ. జైలు నుంచి విడుదలైన తర్వాత మునుపటి పౌరుషం, జాతీయతాభావం అడుగంటి పోయి ఉంటాయనుకున్నారు పాలకులు. అదే జరిగి ఉంటే... జానకి అమ్మాళ్కి చరిత్రలో ఇన్ని పేజీలు ఉండేవి కాదేమో! జానకి అమ్మాళ్ 1917లో మదురైలో పుట్టారు. పద్మనాభన్, లక్ష్మి ఆమె తల్లిదండ్రులు. ఎనిమిదేళ్ల వయసులో తల్లిపోయింది. అమ్మమ్మ పెంపకంలో ఎనిమిదవ తరగతితో చదువు ఆపేయాల్సి వచ్చింది. సంగీత సాధన కొనసాగించి, పన్నెండేళ్ల వయసులో పళనియప్ప పిళ్లై బాయ్స్ నాటక కంపెనీలో నెలకు పాతిక రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరారు. కొద్దికాలంలోనే కథానాయిక పాత్రల స్థాయికి చేరారు. ఆమె వేతనం కూడా నెలకు మూడు వందల రూపాయలకు చేరింది. ఆమెను ఎవరూ చేయి పట్టుకుని నడిపించలేదు. కానీ ఆమె జీవితంలో ప్రతి అడుగూ విప్లవాత్మకమైనదే అయింది. అప్పటి సమాజంలో అంటరానితనం బలంగా వేళ్లూనుకుని ఉండేది. ఆ సమయంలో కులమతాలకతీతంగా సమసమాజ నిర్మాణాన్ని ఆకాంక్షించారు జానకమ్మ. తమ నాటక కంపెనీలో కథానాయకుడి పాత్రలో విశ్వనాథదాస్తో కలిసి నటించడానికి సహ నటీమణులు ఇష్టపడని సందర్భంలో జానకమ్మ ముందుకు వచ్చారు. వారిద్దరి కాంబినేషన్‌తో అనేక సాంఘిక నాటకాలు ఆదరణ పొందాయి. జాతీయోద్యమ భావనను పెంచేవిధంగా సాగిన నాటకాల్లో ఆమె దేశభక్తి గేయాలు ఆలపించేవారు. అలా రంగస్థలం మీద దేశభక్తి గీతం పాడుతున్న సమయంలోనే ఆమెను అరెస్టు చేశారు. తిరునల్వేలిలో 1930లో అరెస్టయినప్పుడు ఆమె ఏడాది పాటు జైల్లో గడిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తిరుచ్చిలో యాంటీ వార్ ప్రాపగాండ చేస్తోందన్న కారణంగా(డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ నిబంధనల ప్రకారం) మరోసారి అరెస్టు చేశారు. పోరాటమూ స్వతంత్రమే సత్యాగ్రహ ఉద్యమంలో ఆమె స్వతంత్రంగా ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేకుండా ఆమె వంతుగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు జానకమ్మ. ఆమె చొరవ ఉద్యమానికి ఊతమిస్తుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారామెను. అలా మదురై కాంగ్రెస్ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారామె. కొంతకాలానికే ఆమె కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలోకి మారిపోయారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మదురై సందర్శించిన సందర్భంగా ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ను సమర్థంగా నిర్వహించారామె. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను కూడా అంతే హుందాగా స్వీకరించారు జానకమ్మ. ఆ తర్వాత కొన్నాళ్లకే... 1940లోనే కమ్యూనిస్ట్ పార్టీలో చేరిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ రెండుగా చీలిపోయినప్పుడు జానకి అమ్మాళ్ మార్క్సిస్టు పార్టీతో పనిచేశారు. జానకమ్మ పార్టీ జానకమ్మ కాలి నడకన గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను చైతన్యవంతం చేసేవారు. అనేక మందిని ఉద్యమం వైపు నడిపించారు కూడా. జాతీయోద్యమం ఇతివృత్తంతో పాటలు రాసుకునేవారు. భర్త గురుస్వామి (ఆయన హార్మోనియం వాయిద్యకారుడు) సహకారంతో మ్యూజిక్ కంపోజ్ చేసుకుని స్టేజి మీద పాడేవారు. ఆమె ప్రభావం ఆ పార్టీ మీద ఎంతగా ఉండేదంటే... తమిళనాడులోని తువారిమన్, శోలవందన్, తిరుమంగళం పరిసరగ్రామాల్లో కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీ అని చెప్పడానికి ‘జానకి అమ్మ కచ్చి (జానకమ్మ పార్టీ)’ అనే చెప్పుకునేవారు. సగం చేవ చచ్చిపోతే... మహిళలు ఇల్లు వదిలి బయటకు రాని రోజుల్లో... ఆమె, ‘వలస పాలన నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి సమాజంలో సగభాగం అయిన మహిళలు చేవలేక చూస్తూ ఉంటే కుదరద’ని చెప్పి చైతన్యపరిచారు. ఆమె ప్రసంగాల్లో మహిళల సాధికారత, మహిళల స్వయంప్రతిపత్తి, లింగ వివక్షలేని సమానత్వంతో కూడిన సమాజ సాధన, పరిశ్రమల్లో పని చేసే కార్మికుల హక్కులు, వారి ప్రయోజనాలు, అసంఘటిత రంగంలోని శ్రామికుల శ్రేయస్సు ప్రధానాంశాలుగా ఉండేవి. ఆమె ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన మహిళలు తర్వాతి కాలంలో మంచి హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారని ఆమె స్నేహితురాలు నాగమ్మాళ్ చెప్పేవారు. జానకమ్మ స్వీయ క్రమశిక్షణ విషయంలో ఎంత కచ్చితంగా ఉండేవారో, అంతే సున్నితమనస్కురాలు కూడా. ‘ఎమర్జెన్సీ సమయంలో పార్టీ కేడర్ పడుతున్న కష్టాలు చూసి తన నగలన్నీ అమ్మేసి వారిని కాపాడుకున్నారు. ఆ డబ్బు ఖర్చయిపోయిన తర్వాత పట్టు చీరలు అమ్మేయాల్సి వచ్చింది. ఖరీదైన ఆమె పట్టు చీరలకున్న జరీలో బంగారు, వెండి ఉండేది. జరీ అంచులను కాల్చి బంగారు చేసి అమ్మి రోజులు గడిపాం’ అని గుర్తుచేసుకున్నారు జానకమ్మ స్నేహితురాలు నాగమ్మాళ్. పెట్టే చెయ్యే కానీ... జానకమ్మ ఒకరికి పెట్టడమే కానీ ఎవరి నుంచి ఏమీ ఆశించే తత్వం కాదు. నాగమ్మాళ్ పెళ్లి కోసం జానకమ్మ తన ఖరీదైన పట్టుచీరను రెండో ఆలోచన లేకుండా ఇచ్చేసిన వైనాన్ని చెప్పుకుంటారు ఆమె స్నేహితులు. ఆమె తన పట్టుచీరలన్నింటినీ ఒక్కో సందర్భంలో ఒక్కో మంచి పని కోసం ఇచ్చేశారు. ఇక ఆ తర్వాత ఆమె పట్టుచీరలను కొనుక్కోలేదు. నూలు చీరల్లో నిరాడంబరంగా జీవించారు. ఎవరు బహుమతులిచ్చినా స్వీకరించేవారు కాదు. స్వాతంత్య్ర సమరయోధులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కూడా తీసుకోలేదామె. తన మీద అభిమానంతో కలిసిన వారిని ఆమె ఒక్కటే కోరేవారు. ‘తాను పోయిన తర్వాత అంత్యక్రియలను కమ్యూనిస్టు పార్టీ వాళ్లందరూ కలిసి చేయ’మని అడిగేవారు. ఆమె చివరి రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్‌లోనే గడిపారు. తిరునగర్‌లో నివసిస్తున్న కూతురు, అల్లుడు తమతోపాటు ఉండమని ఎంత కోరుకున్నా జానకమ్మ పార్టీ ఆఫీస్‌లో ఉండటానికే ఇష్టపడేవారు. దాంతో ఆఫీస్‌లోనే ఆమె కోసం ఒక గదిని కేటాయించారు. ఆస్త్మాతో బాధపడుతూ 1992, మార్చి ఒకటవ తేదీన చివరి శ్వాస తీసుకున్నారు. రంగస్థలం వేదికగా మొదలైన జాతీయోద్యమ స్ఫూర్తిని చివరి వరకు కొనసాగించారామె. సామాన్యుని హక్కుల కోసం పోరాటంలోనే జీవితాన్ని గడిపారు. అరెస్టులు, జైలు జీవితం ఆమెను ఏనాడూ భయపెట్టలేదు. కులమతాలు, స్త్రీ–పురుష వివక్షను తీవ్రంగా వ్యతిరేకించే జానకమ్మ సిద్ధాంతం, మనిషిని మనిషిగా స్వీకరించాలనే ఆమె తత్వం... చివరి వరకు అలాగే కొనసాగాయి. అవి తరువాతి తరానికి ఆమె వదిలిన పాదముద్రలు. జాతీయోద్యమంలో పాల్గొన్న జానకమ్మ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోలేదు. స్వతంత్ర భారతదేశంలో ఆమె ప్రజాసమస్యల మీద ఉద్యమించారు, అనేక దఫాలు అరెస్టయ్యారు కూడా. ఆమెలో స్త్రీశక్తిని చూసిన వాళ్లున్నారు. స్నేహమూర్తిని చూసినవాళ్లున్నారు. ఆత్మీయతను పంచే తల్లిని చూసిన వాళ్లూ ఉన్నారు. జానకమ్మలో... శ్రామికుల తరఫున పోరాడేటప్పుడు అకుంఠిత దీక్షతో పని చేసే శక్తిస్వరూపిణి కనిపించేది. వారి హక్కుల కోసం అధికారులతో చర్చించేటప్పుడు ఆమెలో అపర మేధావి కనిపించేది. జానకమ్మను అమితంగా ఇష్టపడిన వాళ్లు... ఆమె మీద ప్రేమతో ఆమె జ్ఞాపకార్థం ‘జానకి అమ్మ మెమోరియల్ ట్రస్ట్’ ప్రారంభించారు. ఆ ట్రస్ట్ మహిళాశిశు అభివృద్ధి కోసం పని చేస్తోంది. ఆడశిశువును పుట్టగానే చంపేయడం, కడుపులోనే చంపేయడం అనే దురాలోచనను తుడిచిపెట్టాలన్న సదుద్దేశంతో పనిచేస్తోంది జానకి అమ్మ మెమోరియల్ ట్రస్ట్. – మంజీర -
తూర్పు కనుమల పరిరక్షణకు జాతీయ ఉద్యమం
సాక్షి, న్యూఢిల్లీ: తూర్పు కనుమల పరిరక్షణకు జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్(సీజీఆర్) సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. అపార ఖనిజ, వృక్ష, జంతు, ఆయుర్వేద, జల సంపద కలిగి ఉన్న తూర్పు కనుమలు విధ్వంసానికి గురవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీజీఆర్ సంస్థ ఆరేళ్లుగా పర్యావరణం కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ సంస్థ జస్టిస్ కుల్దీప్ సింగ్ జాతీయ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ అవార్డును సీజీఆర్ సంస్థ శనివారం ఢిల్లీలో అందుకోనుంది. ఈ సందర్భంగా సంస్థ స్థాపకుడు లక్ష్మారెడ్డి, అధ్యక్షురాలు లీలా లకా్ష్మరెడ్డి, సీఈవో నారాయణరావు, గ్రేస్ సంస్థ చైర్మన్ ఆర్. దిలీప్‌రెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త ప్రొ.పురుషోత్తంరెడ్డి శుక్రవారం ఇక్కడి ఏపీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఆరేళ్లుగా పర్యావరణ పరిరక్షణకు సీజీఆర్ చేస్తున్న కృషికి క్యాపిటల్ ఫౌండేషన్ అవార్డు ప్రకటించడం అభినందనీయం. ఈ ఏడాది వ్యక్తిగత అవార్డు విభాగంలో ఏపీ, తెలంగాణ నుంచి ఫ్లోరోసిస్ విమోచనా సమితిని స్థాపించి నల్లగొండ జిల్లాలో విశేష కృషి చేసిన డా.కె.గోవర్దన్‌రెడ్డికి లభించింది’ అని ప్రొ.పురుషోత్తంరెడ్డి తెలిపారు. లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ‘జస్టిస్ కుల్దీప్సింగ్ అవార్డుకు సీజీఆర్‌ను ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ఆరేళ్లుగా సీజీఆర్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా స్కూల్ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నాం. సుమారు ఆరు లక్షల మంది విద్యార్థుల సాయంతో ఇప్పటి వరకు 30 లక్షల మొక్కలు నాటాం. విద్యార్థులు నాటిన మొక్కకి రాఖీ పండుగ రోజున రాఖీ కట్టించడం, మొక్కనాటి ఏడాది పూర్తై దానికి పుట్టినరోజు కార్యక్రమం నిర్వహించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. ఈ కృషికి గుర్తింపుగా అవార్డు లభించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. తూర్పు కనుమల పరిరక్షణకు కృషి దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సీజీఆర్ ఆరు సంవత్సరాలుగా చేసిన కృషికి తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర స్థాయిలో ‘హరిత మిత్ర’ అవార్డు ప్రదానం చేసింది. సీజీఆర్ ఆధ్వర్యంలోనే ఐదేళ్ల క్రితం గ్రీన్స్ అలయన్స్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఈస్ట్రన్ ఘాట్స్(గ్రేస్) అనే ఉమ్మడి వేదికను ఏర్పాటు చేశాం. 1,700 కిలోమీటర్ల పరిధిలో బెంగాల్, ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న తూర్పు కనుమల పరిరక్షణకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా అన్ని యూనివర్సిటీల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తూర్పు కనుమల పరిధితో అనుసంధానమై ఉన్న 48 మంది ఎంపీలకు లేఖలు రాశాం. వారందరితో డిసెంబర్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఒక సమావేశాన్ని నిర్వహించి వీటి పరిరక్షణపై చర్చిస్తాం. పశ్చిమ కనుమలను ఏవిధంగా అయితే కేంద్ర ప్రభుత్వం గుర్తించిందో.. అదే విధంగా అపారమైన ఖనిజ, జల, వృక్ష సంపదను కలిగి ఉన్న తూర్పు కనుమలను గుర్తించాలి. దీని కోసం జాతీయ స్థాయిలో ఉద్యమిస్తాం. తూర్పు కనుమలను బయోడైవర్సిటీ హాట్ స్పాట్‌గా ఐక్యరాజ్యసమితి గుర్తించేలా భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలి’ అని కోరారు. -
గతించిన గతంపై నిరర్థక పోరు
గ్లోబలైజేషన్ తెచ్చిన మార్పులు నెహ్రూ, ఇందిరలకు కాలదోషం పట్టించేశాయి. అయినా ఆర్ఎస్ఎస్, బీజేపీలు వారి వెంట ఎందుకుపడ్డట్టు? ఆర్ఎస్ఎస్ హిందుత్వీకరించిన కరడుగట్టిన జాతీయవాద భావజాలాన్ని వ్యాపింపజేస్తోందే గానీ, దానికి తమవారుగా కొలువుదీరిన ఆధునిక జాతీయవాద వేలుపులెవరూ లేరు. జాతీయోద్యమానికి దూరంగా ఉండిపోయిన దానికి జాతీయ హీరోలు అవసరమయ్యారు. కాంగ్రెస్ నుంచి మాలవీయ, పటేల్‌వంటి వారిని తెచ్చుకున్నారు. భగత్‌సింగ్ నుంచి నేతాజీ వరకు జాతీయ విప్లవకారులందరినీ దొంగిలించారు. మీరే గనుక మీ ఉద్యోగపు దరఖాస్తుల్లో స్టాంపుల సేకరణను హాబీగా పేర్కొ న్న బాపతైతే, నాలాగే మీలో చాలా మందికి కూడా మీ మొదటి ఉద్యోగంలోని కీలక విధుల్లో స్టాంపులను నాకడమూ ఒక ముఖ్యమైన పని అయి ఉంటుంది. నా వరకు నాకైతే అది రచయితలకు పారితోషికంగా చెల్లించాల్సిన రూ.75 చెక్కులను, వారి వ్యాసాల క్లిప్పింగులను కవర్లలో పెట్టి వాటి మీద స్టాంపులు అంటించాల్సిన పని. టైపురైటర్లు, సైక్లోస్టైల్, గ్రామ ఫోన్లు, నలుపు, తెలుపు దూరదర్శన్, టెలిగ్రాఫ్, మనీ ఆర్డర్లు, స్టీమ్ఇం జన్, దూరప్రాంతాలకు లైట్నింగ్ కాల్స్, పీపీ (ఫలానా మనిషికి) కాల్స్ లాగే స్టాంపులు కూడా మన జీవితాల్లో ముఖ్యమైన పాత్రను పోషిం చాయి. అంతేకాదు, మీరు చాలా చాలా పాత తరం మనిషని కూడా అర్థం. ప్రత్యేకించి నేడు ప్రతి ఏడేళ్లకూ తరాల అంతరం ఏర్పడుతున్న దని నా విశ్వాసం. ఒకప్పుడు ముఖ్యమైనవిగా నేను ఇక్కడ పేర్కొన్న వన్నీ, పోస్టల్ స్టాంపులుసహా ప్రజాజీవితానికి దూరమైపోయాయి. మీరీ రోజన ఎవరైనా యువకుడి తొలి ఉద్యోగ విధుల్లో కవర్ల మీద స్టాంపులు అంటించడం కూడా ఒకటని చెబితే... ‘‘నాకడమా, ఈ నాకడం ఏమిటి? స్టాంపులా, ఈ స్టాంపులేమిటి?’’ అని అడిగే అవకాశాలే ఎక్కువ. పాత శవపేటికకు కొత్త మేకు కనీసం రెండు తరాల భారత నవ యువ ఓటర్లకు పోస్టల్ స్టాంపుల వాడ కంలో దాదాపుగా అనుభవం ఉండి ఉండదు (తరం మార్పునకు కొలబద్ధను ఏడేళ్లుగా తీసుకుంటే). ఇక ఫిలటెలీ (స్టాంపుల సేకరణ) అనే మాటైతే దాదాపు అందరినీ గందరగోళపరుస్తుంది... ఒకవేళ వారేమైనా అమెరికన్ కళాశాలల ప్రవేశార్హతకు ప్రామాణిక పరీక్షైన ‘సాట్’కు సంసిద్ధమౌ తున్న వారైతే తప్ప. ఈమెయిల్, కొరియర్ల శకంలో నత్తనడక మెయిల్ చాలా వరకు ‘‘సర్కారు’’ వారి కోసమే. దేశంలో 30 ఏళ్లలోపు వయస్కులు చాలా మందే ఉంటారు. వారిలో అతి కొద్దిమంది మాత్రమే స్టాంపులు కొనడానికి పోస్టాఫీసుకు వెళ్లి ఉంటారని లేదా ఎవైరె నా ఎన్నారై అంకుల్ రాసిన ఉత్తరం మీది స్టాంపులను వదులుచేసి, తీసుకోవాలని ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి చూసి ఉండరని పందెం కాస్తాను. వారంతా ఈ వారం పేపర్ల మొదటి పేజీల్లో ఇద్దరు అపరిచిత వ్యక్తుల చిత్రాలున్న స్టాంపులను ఆసక్తిగా చూసి ఉంటారు. ఇందిరాగాంధీ ఇప్పటికీ బాగా సుపరిచితురాలే. నెహ్రూ మాత్రం మరు పున పడిపోతున్న జ్ఞాపకం. ఆర్థిక విధానాల నుంచి విదేశాంగ విధానం వరకు నెహ్రూ భావాలపై నాకుండే విభేదాలు నాకున్నాయి. నెహ్రూకు సంబంధించి మణిశంకర్ అయ్యర్ పేర్కొన్న ‘‘కరడుగట్టిన’’ లౌకికవాదం నిజానికి అజ్ఞేయ వాదానికి (దేవుని ఉనికి నిజమో కాదో ఇదమిత్థంగా చెప్పలేమనే తాత్విక ధోరణి) మరో పేరు మాత్రమే. నెహ్రూ పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌కున్న తృణీకార భావం అందరికీ తెలిసిందే. అయినాగానీ, ఇప్పుడాయన భావజాలపరమైన వారసత్వాన్ని రూపుమాపుతున్నట్టుగా నటించడం కాలాన్ని వృథా చేసు కోవడమే అవుతుంది. ఇప్పటికే అది చచ్చిపోయింది, నిశ్శబ్దంగా సమాధి చేసేశారు కూడా. ఎన్నడో చనిపోయిన నెహ్రూవియనిజం శవపేటికపై మరో మేకును దిగ్గొట్టాలని ఆర్ఎస్ఎస్/బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పాత పోస్టల్ స్టాంపుల సిరీస్‌ను నిలిపివే యడ ం రాజకీయ పెట్టుబడిని వృథా చేసుకోవడమే. వారిని ఇది భావజాలపరమైన పోటీ విషయంలో మూర్ఖపు పట్టుదల, భ్రమాత్మక మనస్కతలతో ‘‘విజేతదే సర్వస్వమూ’’ అనే తీరున ప్రవర్తిస్తున్న ట్టుగా చూపుతుంది. అది మధ్యయుగాల నాటి దుర్మార్గవైఖరి. పాత, కనుమరుగైపోతున్న నెహ్రూవాదులను మేల్కొల్పి, ఆయన భావాలను తిరిగి చర్చకు తేవడానికి మాత్రమే తోడ్పడుతుంది. అంతేకాదు ఫిలటెలీ అనేపాత హాబీపట్ల కొంత ఆసక్తిని రేకెత్తించడం సైతం చేయవచ్చు. లండన్ స్ట్రాండ్ కూడలిలోని ప్రముఖ దర్శనీయ స్థలంగా ఉండిన స్టాన్లీ గిబ్సన్ స్టాంపుల దుకాణాన్ని మూసేయడంతో చాలా ఏళ్లక్రితమే ఆ హాబీ చచ్చిపోయిందనే మాటా నిజమేననుకోండి. పోస్టల్ స్టాంపులు నెహ్రూపట్ల, ఆయన కూతురు పట్ల ఆరాధనాభావాన్ని పెంపొందింపజేస్తున్నాయని ఆర్ఎస్ఎస్ విశ్వసిం చడమే గొప్ప ప్రజ్ఞ. కనుమరుగైన భావజాలంపై యుద్ధం పోస్టల్ స్టాంపులలాగే, నెహ్రూ-ఇందిర భావజాలాలు కూడా వాడుక నుంచి కనుమరుగయ్యాయి. 51 ఏళ్ల క్రితమే నెహ్రూ చనిపోయాడు. ఆయన తర్వాత వచ్చిన ప్రతి ప్రభుత్వమూ, ప్రత్యేకించి 16 ఏళ్లకు పైబడిన ఆయన కుమార్తె ఇందిర ప్రభుత్వం ఆయన వారసత్వాన్ని రూపుమాపడానికి కృషిచేశాయి. ఇందిర తాంత్రికులను ఆశ్రయించడం, ప్రత్యేక పూజలను, హోమాలను నిర్వ హించడం ప్రారంభించారు, మన స్వేచ్ఛలను హరించారు, అలీన విధానాన్ని పునర్లిఖించి, సోవియెట్ యూనియన్‌కు దాసోహానికి కుదించారు. 1971లో ఆమె బంగ్లాదేశ్‌ను విముక్తి చేశారు. కానీ అందుకు మూల్యంగా సోవియెట్ యూనియన్‌తో రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. పందొమ్మిది వందల డెబ్భై, ఎనభై దశాబ్దాలలో ఇందిర తీసుకున్న వైఖరులకు, ప్రత్యేకించి అఫ్ఘానిస్థాన్‌పై సోవియెట్ దురాక్రమణపట్ల ఆమె వైఖరికి నెహ్రూ... ల్యూటెన్ రోడ్ల పేర్లను మార్చినందుకంటే ఎక్కువగా సిగ్గుపడి ఉండేవాడు. పైగా ఇందిర ఆర్థిక విధానాలు, నెహ్రూ మిశ్రమ ఆర్థికవ్యవస్థ భావనలకంటే ఎక్కువ వామపక్ష పంథాకు చెందినవి. ఆమె పరిశ్రమలను, కంపెనీలను, బ్యాంకింగ్ నుంచి ఇన్సూరెన్స్ వరకు, బొగ్గు నుంచి పెట్రోలియం, టెక్ట్స్‌టైల్స్ వరకు అన్నిటినీ వినాశకరంగా జాతీయం చేసింది. నెహ్రూ తన వరకు తాను ప్రభుత్వరంగ సంస్థలనే మహా అనర్థాలను నిర్మించినా, ప్రైవేటు పర్యాటక సంస్థలను వర్థిల్లనిచ్చాడు. ఇందిర వాటిని సైతం వదలలేదు. నెహ్రూ-ఇందిరాగాంధీల తదుపరి వారసునిగా వచ్చిన రాజీవ్‌గాంధీ కూడా ఇదే క్రమాన్ని కొనసాగించాడు. ఆయన షాబానో కేసులో జోక్యం చేసు కోవడం, బాబ్రీ మసీదు/రామజన్మభూమి తాళాలను తెరిపించడం, ఆ తద పరి శిలాన్యాస్, మండల్ కమిషన్ సిఫారసులపై ఊకదంపుడుతో నిర్ణయ రాహిత్యంగా గడపడమూ.. ఏవీ నెహ్రూకు సంతోషాన్ని కలిగించి ఉండేవి కావు. ఇందిర లేదా నెహ్రూల పట్ల పీవీ నరసింహారావు నామమాత్రపు గౌరవాన్నయినా చూపలేదు. లెసైన్స్-కోటా రాజ్‌ను ఆయన తుత్తు నియలు చేశారు, బాబ్రీ మసీదును కూలగొట్టనిచ్చారు, ఇజ్రాయెల్‌తో భారత్ సంబంధాలను పై మెట్టుకు తీసుకుపోయారు. ఆ తదుపరి, సోనియాగాంధీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఇందిర పేదరికవాదాన్ని పునరుజ్జీ వింపజేసిందే గానీ, నెహ్రూ తరహా పెద్ద డ్యామ్‌లు, భారీ పారిశ్రామిక ఎస్టే ట్లు, మెగా విద్యుత్ ప్రాజెక్టులు, గనుల ప్రాజెక్టులతో కూడిన బ్రహ్మాండమైన అభివృద్ధివాదాన్ని అనుమానాస్పదంగా చూసేది. నదుల అనుసంధానం వంటివాటి పట్ల సైతం అదే వైఖరిని అవలంబించింది. జాతీయ హీరోల అన్వేషణలో... సాంకేతికాభివృద్ధి పోస్టల్ స్టాంపు విషయంలో చేసినట్టే... గ్లోబలైజేషన్ తెచ్చిన మార్పు నెహ్రూని, అంతకన్నా ఎక్కువగా ఇందిరను కాలదోషం పట్టించేసింది. అయినా ఆర్ఎస్ఎస్/బీజేపీలు ఇప్పుడు వారి వెంట ఎందుకు పడ్డట్టు? ఆర్ఎస్ఎస్ హిందుత్వీకరించిన కరడుగట్టిన జాతీయవాద భావజా లాన్ని వ్యాపింపజేస్తోందేగానీ, దానికి గొప్ప ఆధునిక భారత జాతీయవాదులుగా కొలువుదీరిన తమ వారైన వేలుపులెవరూ లేరు. అదే అది ఎదుర్కొంటున్న పెద్ద సమస్య. ఆర్ఎస్ఎస్ భారత జాతీయోద్యమానికి దూరంగా ఉండిపోయిందనేది వివరంగానే స్పష్టమౌతోంది. కొన్ని విధాలుగా చూస్తే, ముస్లింలీగ్, ఆ తర్వాతి కాలంలో కమ్యూనిస్టులు కూడా దానిలాగే జాతీయోద్యమానికి దూరంగా ఉన్నారు. అందుకే ఆర్ఎస్ఎస్/బీజేపీ జాతీయ హీరోల కోసం మరెక్కడో వెతుక్సోవాల్సివస్తోంది. కాంగ్రెస్ నుంచి అరువు తెచ్చుకోగలిగిన మదన్ మోహన్ మాలవీయ, సర్దార్ పటేల్ వంటి వారిని తెచ్చుకున్నారు. ఇక భగత్‌సింగ్ నుంచి నేతాజీ వరకు మొత్తంగా జాతీయ విప్లవకారులందరినీ దొంగిలించేశారు. వారిలో కొందరు వామ పక్ష తీవ్రవాదులైనా ఫర్వాలేదనుకున్నారు. వారెవరి కోవకూ చెందని తమవాడిగా చెప్పుకోదగినది సావార్కర్ ఒక్కడే. కశ్మీర్, 1962 చైనా యుద్ధ వైఫల్యాలతో నెహ్రూని తోసిపుచ్చడం సులువే. పాకిస్తాన్‌ను యుద్ధంలో ఓడించి, అణ్వస్త్ర పరీక్ష జరిపి ఆర్ఎస్ఎస్ చెప్పే బలమైన భారతదేశమనే భావజాలాన్ని ఢీకొన్న ఇందిరే కొరకరాని కొయ్య. 2014 ఎన్నికల విజయం భావజాలపరంగా కూడా పరిపూర్తి కావా లంటే ఆమె వారసత్వాన్ని కూడా ధ్వంసం చేయాలి. ఇప్పటికింకా ఆమె పట్ల ప్రజల్లో ఉన్న ప్రశంసాభావం పూర్తిగా చెరిగిపోలేదు. ఢిల్లీలోని 1, సఫ్దర్‌జంగ్ మార్గ్‌లోని ఒకప్పటి ఇందిర నివాసాన్ని ఆమె స్మారక చిహ్నంగా మార్చారు. ఆ దారి గుండా మీరు వెళ్లేట్టయితే, ప్రత్యేకించి వారాంతాల్లో మన గ్రామాల నుంచి బస్సుల్లో అక్కడికి గుంపులు గుంపులుగా వచ్చే వారిని చూడొచ్చు. ఇందిర విధించిన అత్యవసర పరిస్థితిని ఆమెను నాశనం చేయడానికి ఇప్పుడు వాడుకుంటున్నారు. అందుకే ఇందిర, నెహ్రూల స్టాంపులను ఉపసంహరించి, ఆమెకు బద్ధ శత్రువులైన లోహియా, జయప్రకాష్ నారాయణ్‌ల స్టాంపులను విడుదల చేస్తున్నారు. వారిద్దరూ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించిన వారనేదిగానీ, వారి నిజమైన వారసులు వచ్చే నెలలో బిహార్‌లో జరిగే ఎన్ని కల్లో బీజేపీని ఢీకొంటున్నారనేది గానీ అనవసరం. భారత జాతీయవాదాన్ని అతి మొరటుగా పునర్ నిర్వచించడానికి ఆర్ఎస్ఎస్ ఐదు దశాబ్దాల వెనక్కు వెళ్లి... శత్రువుకు శత్రువు ఆదర్శ మిత్రుడు అనే నీతిని పాటిస్తోంది. ఇక స్టాంపులంటారా, అవి ఈ పోరుకి సంబంధించిన బాధితులు మాత్రమే. తాజా కలం: భావజాలపరమైన ఈ పవిత్రయుద్ధం కేవలం ఆర్ఎస్ఎస్/ బీజేపీలకే పరిమితం కాలేదు. 2005 ఫిబ్రవరి 26న పార్లమెంటు ప్రాంగ ణంలో సావార్కర్ విగ్రహావిష్కరణ జరగాల్సి ఉండగా... ఆ ఉదయాన్నే జైరాం రమేష్ ఆగ్రహ స్వరాన్ని వినాల్సివచ్చింది. వాజ్‌పేయీ ప్రభుత్వం ఒక మతోన్మాదిని, ద్రోహిని గొప్ప జాతీయ నాయకుల సరసన నిలపడం ద్వారా భారతదేశం పట్లనే అపరాధానికి పాల్పడుతోందని ఆయన అన్నారు. మా పత్రిక ఈ అంశంపై యుద్ధానికి దిగడం లేదేమని ప్రశ్నించాడు. twitter@shekargupta - శేఖర్ గుప్తా -
జాతీయ స్థాయిలో పోలవరం ఉద్యమం
ముంపుప్రాంతాలపై టీ-టీడీపీ వైఖరి వెల్లడించాలి: తమ్మినేని భద్రాచలం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు జాతీయస్థాయిలో ఉద్యవుం చేపడతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ముంపు మండలాల బదలాయింపు ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరుతూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ దీక్షకు ఆదివారం ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ ఇంత హడావిడిగా ముంపు మండలాల బదలాయింపుపై ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ముంపు ప్రాంతాలపై తెలంగాణ ప్రాంత టీడీపీ నాయకులు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని తమ్మినేని డిమాండ్ చేశారు.