nederland
-
టీ20 వరల్డ్‌కప్‌కి ఐర్లాండ్ జట్టు ప్రకటన..
డబ్లిన్: యూఏఈ, ఒమన్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ఐర్లాండ్ తమ జట్టును ప్రకటించింది. ఆండ్రూ బాల్బిర్నీ సారథ్యంలో15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఐర్లాండ్ అక్టోబర్ 18 న నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్‌ను ఆడనుంది. అయితే ఆ మ్యాచ్‌కు ముందు, వారు పాపువా న్యూ గినియాతో వార్మప్ మ్యాచ్‌లు ఆడతారు. కాగా ఆక్టోబర్7నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఐర్లాండ్ జట్టు: ఆండ్రూ బాల్బిర్నీ (సి), మార్క్ అడైర్, కర్టిస్ క్యాంపర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, జోష్ లిటిల్, ఆండ్రూ మెక్‌బ్రిన్, కెవిన్ ఓబ్రెయిన్, నీల్ రాక్, సిమి సింగ్, పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, లార్కాన్ టక్కర్ , బెన్ వైట్, క్రెయిగ్ యంగ్ చదవండి: ఘనంగా దీపక్ చాహర్ లవ్ ప్రపోజల్ సెలబ్రేషన్స్.. ధోని, రైనా హంగామా చూడండి -
వైరస్‌కు హాట్‌బెడ్‌గా హాలండ్
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో! ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడకుండా రక్షించుకోవడానికి ప్రపంచ ప్రజలంతా ముఖాన మాస్కులు ధరించి తిరుగుతుంటే నెదర్లాండ్స్ ప్రజల్లో ఎక్కువ మంది ఎలాంటి మాస్కులు ధరించకుండానే సాధారణ రోజుల్లాగే తిరిగారు. ఫలితంగా అతి తక్కువగా ఉన్న కరోనా కేసులు అతి ఎక్కువగా పెరిగిపోయాయి. వైరస్‌కు హాట్‌బెడ్‌గా మారిపోవడంతో హాలండ్ (నెదర్లాండ్స్) కరోనా బారిన పడి కొట్టుమిట్టాడుతున్న టాప్ దేశాల్లో ఒకటిగా చేరింది. దీంతో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలంటూ అత్యవసర చట్టం తీసుకరావడం కోసం అక్కడి ప్రభుత్వం డచ్ పార్లమెంట్లో బుధవారం ఓ బిల్లును ప్రవేశపెట్టి చర్చ చేపట్టింది. ప్రతి లక్ష మందిలో 160 మందికి వైరస్ సోకుతోందని, ప్రతి రోజుకు ఐదువేల మంది వైరస్ బారిన పడుతున్నారని అక్కడి వైద్యులు తెలిపారు. మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనాను నియంత్రించవచ్చని ప్రపంచ బ్యాంకు చేసిన సూచనలను పెడ చెవిన పెట్టిన హాలండ్ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే మాత్రం మొదటి నుంచి ఒకటే మాట చెబుతూ వస్తున్నారు. ప్రజలు బలవంతంగా మాస్కులు ధరించేలా చేయలేనంటూ వచ్చారు. ఇప్పుడేమో బిల్లు పాస్ కాగానే మాస్క్‌లను తప్పనసరి చేస్తూ చట్టం తీసుకొద్దామని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాల ప్రకారం కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రభుత్వం నిర్వహించడం లేదని, దేశంలో కరోనా ప్రభావం ఇంకా ఎక్కువే ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
తీరని వేదన
భువనేశ్వర్: నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలనుకున్న భారత ఆశలు అడియాసలయ్యాయి. ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లో భారత్ 1–2తో ప్రపంచ మాజీ చాంపియన్ నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పాలైంది. సొంతగడ్డపై అశేష ప్రేక్షకుల జయజయధ్వానాల మధ్య బరిలో దిగిన మన్‌ప్రీత్ సింగ్ సేన ఆరంభంలో ఆకట్టుకున్నా... చివర్లో ప్రత్యర్థికి ఆధిక్యం సమర్పించుకునే పాత అలవాటును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించి మూల్యం చెల్లించుకుంది. గురువారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (13వ నిమిషంలో) ఏకైక గోల్ చేయగా... నెదర్లాండ్స్ తరఫున బ్రింక్‌మన్ థీరీ (15వ నిమిషంలో), వాన్ డెర్ వీర్డెన్ మింక్ (50వ నిమిషంలో) చెరో గోల్ చేసి జట్టును గెలిపించారు. ఆరంభంలో అదరగొట్టి... తొలి క్వార్టర్లో డిఫెన్స్‌తో పాటు అటాకింగ్‌లో అదరగొట్టిన ప్రపంచ ఐదో ర్యాంకర్ భారత జట్టు... ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై పదేపదే దాడులకు యత్నిస్తూ నాలుగో ర్యాంకర్ నెదర్లాండ్స్‌పై ఒత్తిడి పెంచింది. దీనికి తోడు రక్షణ పంక్తి కూడా డచ్ ఆటగాళ్లను సమర్థంగా అడ్డుకుంది. ఈ క్రమంలో ఆట 13వ నిమిషంలో వచ్చిన పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని భారత్ గోల్‌గా మలిచింది. హర్మన్‌ప్రీత్ సింగ్ కొట్టిన షాట్‌ను ముందు ప్రత్యర్థి గోల్‌కీపర్ అడ్డుకున్నా... గోల్ పోస్ట్ దగ్గరే కాచుకొని ఉన్న స్ట్రయికర్ ఆకాశ్‌దీప్ సింగ్ రివర్స్ ఫ్లిక్ ద్వారా మెరుపు వేగంతో బంతిని నెట్లోకి పంపి తొలి గోల్ అందించాడు. దీంతో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. మన్‌ప్రీత్ సేనకు ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. మరి కొద్ది క్షణాల్లో తొలి క్వార్టర్ ముగుస్తుందనగా... బ్రింక్‌మన్ థీరీ కళ్లు చెదిరే ఫీల్డ్‌గోల్‌తో స్కోరు సమం చేశాడు. రెండో క్వార్టర్లోనూ పదే పదే దాడులకు యత్నించిన భారత్ ఓ దశలో ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టింది. దీంతో నెదర్లాండ్స్ ఆటగాళ్లు దాడులు చేయడం మాని తమ గోల్‌పోస్ట్‌కు అడ్డుగోడలా నిలిచారు. మూడో క్వార్టర్లో ఇరు జట్ల రక్షణాత్మక ధోరణి కారణంగా ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. చివర్లో డచ్ జట్టు దాడులు ఉధృతం చేసింది. మూడు క్వార్టర్ల పాటు ప్రత్యర్థిని కాచుకున్న భారత్ ఆఖర్లో తేలిపోయింది. ప్రత్యర్థి దాడులను అడ్డుకోలేక చేతులెత్తేసింది. 50వ నిమిషంలో లభించిన పెనాల్టీని వీర్డెన్ మింక్ గోల్‌గా మలచడంతో నెదర్లాండ్స్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట చివర్లో భారత్ గోల్కీపర్ను ఉపసంహరించుకొని అదనపు ఆటగాడితో ఆడినా ఫలితం లేకపోయింది. చివర్లో ప్రత్యర్థికి మరో పెనాల్టీ కార్నర్ అవకాశం దక్కింది. మన ఆటగాళ్లు ఆ షాట్‌ను సమర్థంగా అడ్డుకోగలిగారే కానీ... స్కోరు సమం చేయడంలో విఫలమయ్యారు. ప్రపంచకప్ హాకీలో భారత్ ప్రస్థానం క్వార్టర్స్‌లోనే ముగియడంతో ఆటగాళ్లు కన్నీరుమున్నీరవుతూ మైదానాన్ని వీడారు. బెల్జియం తొలిసారి సెమీస్‌కు... ఒలింపిక్ రన్నరప్ బెల్జియం ప్రపంచకప్‌లో చరిత్రకెక్కే విజయాన్ని సాధించింది. తొలిసారి మెగా ఈవెంట్లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ప్రపంచ మూడో ర్యాంకరైన బెల్జియం ఇప్పటివరకు క్వార్టర్ ఫైనల్ అంచెను దాటలేకపోయింది. అయితే గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బెల్జియం జట్టు 2–1 స్కోరుతో జర్మనీపై విజయం సాధించింది. అలెగ్జాండర్ హెండ్రిక్స్ (18వ ని.), టామ్ బూన్ (50వ ని.) చెరో గోల్ చేసి బెల్జియంను సరికొత్త చరిత్రలో భాగం చేయగా, జర్మనీ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను డిటెర్ లిన్నెకొగెల్ (14వ ని.) తొలి క్వార్టర్లో సాధించాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో రెడ్ లయన్స్ మరిన్ని గోల్స్ సాధించాల్సింది. కానీ 9 పెనాల్టీ కార్నర్లను పటిష్టమైన జర్మనీ డిఫెన్స్ ఆటగాళ్లు అడ్డుకున్నారు. -
వెనిస్ను మించిన అందాలు
ఇటలీలోని వెనిస్ నగరం పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది... నగరం నడిబొడ్డులోని నీటి మార్గాలు. బోట్లలో వెళుతూ షాపింగ్ చేయడం, కాయగూరలు, పళ్లు కొనడం... ఇవన్నీ తెలిసినవే. అయితే వెనిస్ నిత్యం విపరీతమైన పర్యాటకుల రద్దీతో గోలగోలగా ఉంటుంది. అలాకాకుండా ప్రకృతి ఒడిలో సేదదీరుతున్న అనుభూతిని కలిగించే పట్టణమే నెదర్లాండ్‌లోని ఓవరిజ్సెల్ ప్రావిన్స్‌లోని ఐడిలిక్ గిథూర్న్. 2,600 మంది నివసించే ఈ పట్టణంలో రోడ్లుండవు. దారులన్నీ నీటి మార్గాలే. ఏ వీధికి, ఏ ఇంటికి వెళ్లాలన్నా... బోటులోనే ప్రయాణం. అదీ అసలు శబ్దం చేయని ఇంజిన్లను బిగించిన బోట్లు. లేదా నదికి ఇరువైపులా పేవ్మెంట్లలా ఉండే మార్గాలపై నడిచివెళ్లాలి. నడిచి వెళ్లేవారికోసం నీటి మార్గాలపై ఏకంగా 176 చెక్క బ్రిడ్జిలు ఉన్నాయట. చాలా ప్రశాంతంగా ఉండే ఈ పట్టణాన్ని చూడటానికి ఇప్పుడిప్పుడే పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తున్నారట. అయితే వాహనాలనీన టౌన్ ఎంట్రెన్స్‌లోనే వదిలి... ఇదిగో పక్క చిత్రంలో కనిపిస్తున్నట్లుగా బోటు పట్టాల్సిందే.