nethaji
-
Asha Sahay: 17 ఏళ్ల వయసులో దేశం కోసం! జపాన్‌లో పుట్టి.. నేతాజీ ఆర్మీలో
కొందరు అందరిలా ఉండరు.... ‘ఎందుకీ పక్షులు కొమ్మల్ని విడిచి పారిపోతున్నాయి ఆకాశాల బరువుల్ని మోసుకుంటూ? ఎందుకీ చెట్లు ఇలా వలస పోతున్నాయి పువ్వుల భారాన్ని మోసుకుంటూ? ఎవరైనా వాటి నేత్రాల్లో ఉన్న శోకసముద్రాలు గుర్తించారా? దేశపు గొంతులో ఉన్న ఆక్రోశం ఎవరైనా విన్నారా?’ అంటూ దేశం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు. అలాంటి వారిలో ఒకరు ఆశా సహాయ్. పదిహేడు సంవత్సరాల వయసులో దేశం కోసం యుద్ధక్షేత్రాల్లోకి వెళ్లింది... జపాన్‌లోని కోబ్ నగరంలో జన్మించింది ఆశా సహాయ్. తండ్రి ఆనంద్ మోహన్ సహాయ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు రాజకీయ సలహాదారు. అంతకుముందు బాబూ రాజేంద్రప్రసాద్‌కు సెక్రెటరీగా పనిచేశాడు. బిహార్‌లోని భాగల్పూర్కు చెందిన ఆనంద్ మోహన్ ఆనాటి నిర్బంధ పరిస్థితుల్లో జపాన్‌కు వెళ్లాడు. అక్కడ బతుకుదెరువు కోసం జపాన్ పిల్లలకు ఇంగ్లీష్ బోధించేవాడు. ‘దేశానికి దూరంగా ఉన్నా, మా నుంచి దేశం ఎప్పుడూ దూరంగా లేను. నా దేశానికి స్వేచ్ఛాస్వాతంత్య్రాలు రావాలని ఆబాలగోపాలం కోరుకునే రోజులవి’ అంటున్న ఆశా సహాయ్ తల్లిదండ్రుల ద్వారా మాటలు, పాటల రూపంలో దేశభక్తిని ఆవాహన చేసుకుంది. పదిహేడు సంవత్సరాల వయసులో నేతాజీ భారత జాతీయ సైన్యంలోని రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో చేరింది. జపాన్ నుంచి తైవాన్ అక్కడి నుంచి థాయిలాండ్ వరకు ప్రయాణించి రాణి ఝాన్సీ రెజిమెంట్‌లోకి వెళ్లింది. రైఫిల్ హ్యాండ్లింగ్ నుంచి యాంటీ–ఎయిర్ క్రాఫ్ట్గన్స్ వరకు తొమ్మిది నెలల పాటు రకరకాల విద్యల్లో కఠినమైన శిక్షణ తీసుకుంది. గెరిల్లా యుద్ధతంత్రాలలో ఆరితేరింది. సింగపూర్, మలేసియా, బర్మా... యుద్ధకేత్రాల్లో పని చేసింది. తాగడానికి నీరు, తినడానికి తిండి దొరకని ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నో రోజులు బర్మా అడవుల్లో గడిపింది. తన పోరాట అనుభవాలను ఎప్పటికప్పుడు డైరీలో రాసుకునేది. ఆశా సహాయ్ని సైనిక దుస్తుల్లో చూసిన రోజు తల్లి సతీ సహాయ్... ‘నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించవద్దు. ఇప్పుడు నువ్వు మా బిడ్డవి కాదు, భరతమాత బిడ్డవు’ అని ఆశీర్వదించింది. బెంగాల్‌కు చెందిన సతీ సహాయ్ ప్రఖ్యాత స్వాతంత్య్ర సమరయోధుడు చిత్తరంజన్‌దాస్‌కు సమీప బంధువు. ‘బాంబుగాయాలతో బాధ పడుతున్నా సరే వెనకడుగు వేసేవాళ్లం కాదు’ అని ఆ రోజులను గుర్తు చేసుకుంటుంది ఆశా సహాయ్. తాను డైరీలో రాసుకున్న విషయాలను ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్ కోలిన్స్ తాజాగా ‘ది వార్ డైరీ ఆఫ్ ఆశా–సాన్: ఫ్రమ్ టోక్యో టు నేతాజీస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ’ పేరుతో పుస్తకంగా ప్రచురించింది. పుస్తకాన్ని ఇంగ్లిష్‌లో ప్రచురించడం ఇదే తొలిసారి. ఆశా మునిమనవరాలు తన్వీ శ్రీవాస్తవ ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ‘ఈ పుస్తకం చదువుతున్నప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. ఆ రోజుల్లో యువతరంలో ఉప్పొంగే దేశభక్తి భావాలు, చేసిన త్యాగాల గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిన ఆశా ఏరోజూ వెనకడుగు వేయలేదు’ అంటుంది తన్వీ శ్రీవాస్తవ. ‘ఇది వ్యక్తిగత పుస్తకం కాదు. ఆ రోజుల్లోని పోరాటస్ఫూర్తికి అద్దం పట్టే పుస్తకం’ అంటున్న 94 సంవత్సరాల ఆశా సహాయ్ తన కుమారుడితో కలిసి పట్నా (బిహార్)లో నివసిస్తోంది. చదవండి: అలనాటి ఆకాశ వాణి Alpana Parida: క్షేమంగా... లాభంగా.. ఫైబర్ హెల్మెట్.. తక్కువ బరువు! -
ఎలాంటి పాత్రలైనా ఓకే
‘‘చిన్నప్పటి నుంచి నటన అంటే ఆసక్తి. ‘భేతాల మాంత్రికుడు, ఐ యామ్ ఇండియన్’ వంటి చిత్రాల్లో బాల నటుడిగా నటించాను. హీరోగా నా తొలి చిత్రం ‘ఇట్స్ మై లైఫ్’’ అన్నారు రామ్ కార్తీక్. ఆయన హీరోగా అశోక్ కుమార్ దర్శకత్వం వహించిన ‘మౌనమే ఇష్టం’, కిషోర్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ’ సినిమాలు ఈ నెల 15న రిలీజయ్యాయి. ఈ సందర్భంగా రామ్‌కార్తీక్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మా నాన్న సత్యనారాయణ బిజినెస్‌మేన్.. అమ్మ రమాదేవి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ‘జూడో’ టీమ్‌కి రిప్రజెంటేటివ్. అమ్మ మంచి క్లాసికల్ డ్యాన్సర్ కూడా. తమ్ముడు కిరీటి ఫారిన్లో జాబ్ చేస్తున్నాడు. నేను బీబీఏ చేశా. ఎంబీఏ చదువుతున్నప్పుడు నటనలో శిక్షణ తీసుకుందామనుకున్నా. ఆడిషన్స్ ఎలా జరుగుతాయోనని చూడ్డానికి రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌కి వెళితే, డైరెక్టర్ రామినేని నేతాజీగారు నటనపై ఆసక్తి ఉందా? అంటే.. అవునన్నా. నాకొచ్చింది చేసి, చూపించా. మూడు రోజుల తర్వాత ‘ఇట్స్ మై లైఫ్’కి నువ్వే హీరో అని నేతాజీగారు అనడంతో షాకయ్యా. మా పేరెంట్స్‌తో చెబితే, ‘ఎందులోనైనా కష్టపడటం అన్నది ముఖ్యం. నీ బెస్ట్ ఇవ్వు’ అని ప్రోత్సహించారు. సినిమాల ఎంపికలో నా తొలి ప్రాధాన్యం కథ, నా పాత్రకే. హీరోగానే కాదు.. బలమైన పాత్ర ఉంటే ఎలాంటి రోల్స్ చేయడానికైనా సిద్ధమే. కాంచిగారి దర్శకత్వంలో నేను చేసిన ‘షో టైమ్’లో నాది నెగటివ్ రోల్. ‘అర్జున్‌రెడ్డి’లో విజయ్ దేవరకొండ, ‘96’లో విజయ్ సేతుపతిగారు చేసినటువంటి పాత్రలు చేయాలనుంది. ‘దృశ్యకావ్యం, మామ ఓ చందమామ’ చిత్రాలకు నటుడిగా మంచి పేరొచ్చింది. ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ, మౌనమే ఇష్టం’ సినిమాలకు మంచి స్పందన రావడం హ్యాపీగా ఉంది. అయితే ఇప్పటివరకూ నాకు సరైన గుర్తింపు రాలేదనిపిస్తోంది. అందుకు కారణం నా చిత్రాలకు సరైన ప్రమోషన్స్ లేకపోవడమే. ప్రస్తుతం చదలవాడ శ్రీనివాస్‌గారి బ్యానర్లో చేస్తున్న సినిమా పూర్తి కావచ్చింది. మరో సినిమా కథాచర్చలు, అలాగే తెలుగు, తమిళ్లో రూపొందనున్న మరో సినిమాకి కూడా చర్చలు జరిగాయి. -
ఔడదం చిత్ర ఆడియో ఆవిష్కరణ
తమిళసినిమా: ఔడదం చిత్రం గీతాలావిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక వడపళనిలోని ఆర్కేవీ.స్టూడియోలో జరిగింది. చిత్ర ఆడియోను దర్శకుడు పేరరసు ఆవిష్కరించగా తొలి సీడీని దర్శకుడు నితిలన్ అందుకున్నారు. రెడ్‌చిల్లీ బ్లాక్ పేపర్ సినిమాస్ పతాకంపై నేతాజీ కథ రాసి, నిర్మించి కథానాయకుడిగా నటించిన చిత్రం ఔడదం. ఢిల్లీకి చెందిన సమీరా కథానాయకిగా, సంతోష్ రెండవ కథానాయకుడిగానూ నటించిన ఈ చిత్రానికి కథనం, దర్శకత్వం బాధ్యతలను రమణి నిర్వహించారు. దర్శి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ద్వారా ప్రఖ్యాత రచయిత పట్టుకోట్టై కల్యాణసుందరం అన్న కొడుకు షణ్ముగసుందరం గీత రచయితగా పరిచయం అవుతున్నారు. ఆయనతో పాటు సింగపూర్ కల్వైందన్, తమిళ్ ముదన్, చో.శివకుమార్, విజయ్‌కృష్ణన్ ఈ చిత్రానికి పాటలు రాశారు. ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది మెడికల్ థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు. ప్రజలకు హాని కలిగించే మందులను తయారు చేసి అధికారులు, రాజకీయనాయకుల సహకారంతో వాటిని మార్కెటింగ్ చేసే సంఘద్రోహుల గురించిన చిత్రంగా ఔడదం చిత్రం ఉంటుందన్నారు. చెన్నైకి చెందిన ఇక మధుమేహ వైద్యుడు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే మందులను నిషేధించేలా చేసి మళ్లీ అవి అమల్లోకి వచ్చే 10 రోజుల్లో జరిగే మెడికల్ థ్రిల్లర్ సంఘటనల సమాహారంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. చిత్రాన్ని కమర్శియల్ అంశాలతో పాటు ప్రజలకు మంచి సంధేశానిచ్చే చిత్రంగా ఔడదం చిత్రం ఉంటుందని తెలిపారు. జాగ్వుర్‌తంగం, శ్రీరామ్, కేవీ.గుణశేఖర్ పాల్గొన్నారు. -
నేతాజీ కోసం శాస్త్రీజీ విశ్వప్రయత్నం!
- సుభాష్ చంద్రబోస్ ను భారత్ రప్పించేందుకు రష్యన్లతో చర్చలు - లాల్ బహదూర్ శాస్త్రి మనవడి తాజా వ్యాఖ్యలు న్యూఢిల్లీ: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ రష్యాలో తలదాచుకున్నారా? ఆయనను భారత్‌కు తిరిగి రప్పించేందుకే లాల్ బహదూర్ శాస్త్రి విశ్వప్రయత్నం చేశారా? శాస్త్రీజీ తాష్కెంట్ (నాటి రష్యన్ యూనియన్‌లోని) పర్యటన వెనుక సిమ్లా ఒప్పందమే కాక మరో ఉద్దేశం కూడా ఉందా? ఇప్పటికే ఈ కోణంలో పలు విషయాలు వెలుగులోకి రాగా, బుధవారం లాల్ బహదూర్ శాస్త్రి మనవడు సిద్ధార్థ సింగ్ వెల్లడించిన అంశాలు మరింత సంచలనం కలిగించాయి. 'ఒక ముఖ్య వ్యక్తిని తిరిగి రప్పించేందుకు మా తాత (లాల్ బహదూర్ శాస్త్రి) సోవియెట్ యూనియన్‌కు చెందిన కీలక వ్యక్తులతో చర్చలు జరుపుతున్నారని మా నాన్న ద్వారా తెలిసింది' అని సిద్ధార్థ్ సింగ్ మీడియాకు చెప్పారు. ముఖ్యవ్యక్తి పేరేంటో చెప్పలేదు గానీ, దేశమంతా ఎంతగానో ఎదురుచూస్తున్న వ్యక్తి అని కూడా చెప్పడంతో.. అది నేతాజీయేనని తాము అర్థం చేసుకున్నామన్నారు. శాస్త్రీజీ.. నేతాజీని ఎంతగానో ఆరాధించేవారని, బోస్ అంతర్థానానికి సంబంధించిన రహస్య ఫైళ్లు వెల్లడించి ఆయన గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని సిద్ధార్థ అన్నారు. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై తమకు అనుమానాలున్నాయని, తాష్కెంట్లో చోటుచేసుకున్న సంఘటనల పూర్వాపరాలు వెల్లడించాలని శాస్త్రి కుటుంబసభ్యులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. నేతాజీని తిరిగి భారత్ రప్పిస్తున్న ప్రయత్నాలు చేయడం వల్లే తాష్కెంట్ లో శాస్త్రీజీపై విషప్రయోగం జరిగిందని కాంగ్రెస్ బద్ధవ్యతిరేకులు కొందరు వదంతులు సృష్టించడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. -
నేతాజీ ప్రేమ పెళ్లి చేసుకున్నారా?
నేతాజీగా ప్రసిద్ధి చెందిన గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్. భారత స్వాతంత్య్ర సాధనకై గాంధీజీ వంటి నాయకులు అహింసావాదాన్ని ఎంచుకుంటే, బోస్ మాత్రం సాయుధ పోరాటంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు. ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగే అతికొద్దిమందిలో ఈయన అగ్రగణ్యులు. నేతాజీ మరణం నేటికీ ఓ మిస్టరీనే. దీని గురించి ప్రపంచవ్యాప్తంగా వాదప్రతివాదాలు జరుగుతూనే ఉన్నాయి. బోస్‌కు చెందిన కొన్ని రహస్య పత్రాలను తాజాగా బెంగాల్ ప్రభుత్వం బయటపెట్టడంతో దేశమంతా మరోమారు ఆయన్ను జ్ఞప్తికి తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో సుభాష్ చంద్రబోస్ జీవిత విశేషాలు తెలుసుకుందాం..! బాల్యం.. సుభాష్ చంద్రబోస్ 1897లో నాటి బెంగాల్ ప్రావిన్సులోని కటక్‌లో (ఒడిశా) జన్మించారు. తండ్రి జానకీనాథ్ బోస్ పేరొందిన లాయరు. కరడుగట్టిన జాతీయవాది. ఈయన బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు కూడా ఎన్నికయ్యారు. తల్లి ప్రభావతి. సంపన్న కుటుంబంలో జన్మించిన బోస్ విద్యాభ్యాసం కటక్‌లోని రావెన్షా కాలేజియేట్ స్కూలు, కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజి, ఫిట్జ్ విలియం కాలేజి, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలలో సాగింది. 1920లో భారత సివిల్ సర్వీసు పరీక్షలకు హాజరై నాలుగో ర్యాంకు సాధించారు. ఆంగ్లంలో అత్యధిక మార్కులు పొందారు. అయితే, 1921లో భారత స్వాతంత్య్ర ఉద్యమం కోసం సివిల్ సర్వీసు నుంచి వైదొలిగారు. ప్రేమ.. పెళ్లి.. బోస్ ఐరోపాలో ఉండే సమయంలో ఆస్ట్రియా దేశస్తురాలైన ఎమిలీ షెంకెల్ను ప్రేమించారు. ఈమెనే 1937 డిసెంబర్ 26న వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా 1942లో అనిత జన్మించింది. బోస్ తన భార్యకు రాసిన ఎన్నో ఉత్తరాలను ‘లెటర్స్ టూ ఎమిలీ షెంకెల్’ పేరుతో సంకలనంగా అతని మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్, సుగతా బోస్ ప్రచురించారు. కాంగ్రెస్‌లో.. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర పోషించిన బోస్‌ను సహాయ నిరాకరణ సమయంలో గాంధీజీ కలకత్తా పంపారు. అక్కడ చిత్తరంజన్ దాస్‌తో కలిసి బెంగాల్ ఉద్యమం నిర్వహించారు బోస్. ఉద్యమాల్లో చురుగ్గా ఉంటూ 1938లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే, ఈ ఎన్నిక గాంధీకి రుచించలేదు. బోస్ ప్రత్యర్థి పట్టాభి రామయ్య పరాజయాన్ని గాంధీజీ తన పరాజయంగా భావించారు. ఇలా పార్టీలో ఏర్పడిన సంక్షోభం కారణంగా బోస్ కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. ప్రత్యామ్నాయంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. స్వాతంత్య్ర ప్రణాళిక.. బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరాక స్వతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ లాంటి నేతలు భావించేవారు. అయితే, బోస్ ఆలోచనలు మాత్రం వేరుగా ఉండేవి. రెండో ప్రపంచయుద్ధంలో తలమునకలై ఉన్న బ్రిటిష్ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టడానికి అదే సరైన సమయమని బోస్ నమ్మేవారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశం కనీసం రెండేళ్లపాటు సోషలిస్టు నియంత్రణలో ఉండాలని ఆయన కోరుకున్నారు. స్వతంత్ర సాధన కోసం బోస్ ఎందరో బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకున్నారు. అయితే, అప్పుడు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ నేతలు బోస్‌ను కలిసేందుకు ఇష్టపడలేదు. తర్వాతికాలంలో లేబర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించడం గమనార్హం. అజ్ఞాతంలోకి.. కాంగ్రెసును సంప్రదించకుండా భారత్‌ను బ్రిటిష్ వారు యుద్ధంలోకి దింపడం బోస్‌కు మింగుడుపడలేదు. వెంటనే ఆయన నిరసన ప్రదర్శనలు ప్రారంభించారు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసిన బ్రిటిష్ ప్రభుత్వం, తరువాత విడుదల చేసి ఇంటి చుట్టూ నిఘా ఉంచింది. తనను దేశం దాటి బయటకు వెళ్లనీయకుండా కుట్ర జరుగుతుందని గ్రహించిన బోస్.. మారువేషంలో దేశం దాటారు. బ్రిటిష్ వారికి శత్రువులైన జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాలతో చేయి కలపాలని, తద్వారా స్వాతంత్య్రం సాధించాలని నిర్ణయించుకున్నారు. అయితే, దీనిపై చాలా విమర్శలు ఉన్నాయి. అనుమానాస్పద మరణం.. అధికారిక ప్రకటన ఆధారంగా బోస్ 1945, ఆగస్టు 18న మరణించారు. తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురికావడంతో ఆయన మరణించారని చెబుతారు. అయితే, ఆయన శవం మాత్రం దొరకలేదు. దీంతో ఆయన బతికే ఉన్నారన్న కథలు ప్రచారంలో ఉన్నాయి. సోవియెట్ యూనియన్ బందీగా ఉండగా సైబీరియాలో బోస్ మరణించారనే కథనంపై భారత ప్రభుత్వం విచారణకు చాలా కమిటీలను నియమించింది. సన్యాసిగా..? 1985లో అయోధ్య సమీపంలోని ఫైజాబాదులో సంచరించిన భగవాన్జీ అనే సన్యాసే బోస్ అని చాలామంది నమ్మేవారు. ‘మారువేషంలో ఉన్న బోస్‌ని’ అని కనీసం నాలుగు సార్లు ఆయన చెప్పుకొన్నారు. భగవాన్జీ మరణానంతరం అతని వస్తువులను ప్రభుత్వం నియమించిన ముఖర్జీ కమిటీ పరిశీలించింది. అందులో స్పష్టమైన ఆధారాలేవీ దొరక్కపోవడంతో ఈ వాదనను కమిటీ కొట్టివేసింది. తర్వాతి కాలంలో పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో కమిటీ నిర్ణయం తప్పని తేలడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. -
నేతాజీ ఫైళ్ల బహిర్గతంపై కమిటీ!
అధికార రహస్యాల చట్టాన్ని సమీక్షించే పేరుతో ఏర్పాటు చేసిన కేంద్రం న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్‌చంద్రబోస్ అదృశ్యానికి సంబంధించి రహస్య పత్రాలను బయటపెట్టాలన్న డిమాండ్ల నేపథ్యంలో.. ఆర్టీఐ, అధికార రహస్యాల చట్టాలను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నేతాజీ మనవడు సూర్యకుమార్‌బోస్ జర్మనీలో ప్రధాని మోదీని కలిసి నేతాజీ విషయంపై విజ్ఞప్తి చేసిన మరునాడే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేంద్ర హోం, న్యాయ, సిబ్బంది వ్యవహారాల శాఖల కార్యదర్శులతో కూడిన ఈ కమిటీ.. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన పత్రాలను బహిర్గతం చేయడంలో సాధ్యాసాధ్యాలను, అధికారిక ఫైళ్లను ఎంతకాలం తర్వాత బయటపెట్టవచ్చన్న అంశాలను పరిశీలించనున్నట్లు సమాచారం. ప్రభుత్వం మాత్రం ఆర్టీఐ, అధికార రహస్యాల చట్టాల (ఓఎస్ఏ)ను సమీక్షించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొంది. గురువారమే ఈ కమిటీ తొలి కీలక సమావేశం జరిగే అవకాశమున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. నేతాజీకి సంబంధించి ఉన్న మొత్తం 90 ఫైళ్లలో 27 విదేశాంగ శాఖ అధీనంలో, మిగతావి ప్రధాని కార్యాలయం అధీనంలో ఉన్నాయని తెలిపాయి. ఈ కమిటీ ఏర్పాటుపై నేతాజీ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.