neti vidyasagar
-
బడ్జెట్ సమావేశాల ఏర్పాట్లపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం సమీక్ష నిర్వహిం చారు. స్పీకర్ చాంబర్లో జరిగిన ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ స్పీకర్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్‌కు సంబంధించిన పలు అంశాలతోపాటు, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా అధికారులు సమాచారం సిద్ధం చేసుకోవాలని స్పీకర్ సూచించారు. మీడియా ప్రతినిధులకు పాస్‌ల జారీ, శాంతిభద్రతలకు సంబంధించిన అంశాలపైనా స్పీకర్ సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణతో పాటు పరిసరాల్లో చేపట్టిన బందోబస్తు వివరాలను పోలీసు అధికారులు స్పీకర్‌కు వివరించారు. సమావేశంలో శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులుతో పాటు, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన శాసనసభ చీఫ్ మార్షల్ టి.కరుణాకర్‌ను స్పీకర్ ఈ సందర్భంగా అభినందించారు. మండలిలో బడ్జెట్ ప్రతిపాదన.. ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను చూస్తున్న సీఎం కేసీఆర్.. శాసనసభలో స్వయంగా 2019–20 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు బడ్జెట్ ప్రసంగ పాఠాన్ని సిద్ధం చేయగా, బడ్జెట్ సమావేశం ప్రారంభమయ్యేలోగా మంత్రిమండలి ఆమోదం పొందాల్సి ఉంది. ఇదిలా ఉంటే శాసనమండలిలో బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెడతారనే అంశంపై గోప్యత కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రతిపాదించగా, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాననమండలిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం జరిగే సమావేశాల్లో శాసనమండలిలో ఈటల రాజేందర్ మరోమారు బడ్జెట్‌ను ప్రవేశపెడతారా లేక ఇతరులకు అవకాశం ఇస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ప్రత్యామ్నాయంగా మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్లు సైతం వినిపిస్తున్నాయి. -
సాక్షర కో ఆర్డినేటర్లకు జీతాల చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అధ్యక్షతన శాసనమండలి పిటిషన్ల కమిటీ బుధవారం సమావేశమైంది. శాసనమండలి సమావేశాల్లో మండలి సభ్యులు వివిధ సమస్యలపై ఇచ్చిన పిటిషన్లు, వాటి పరిష్కార పురోగతిపై ఈ భేటీలో చర్చించారు. మండలి సభ్యులు వివిధ అంశాలపై ఇచ్చిన నాలుగు పిటిషన్లపై చర్చించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాక్షర భారత్ కో ఆర్డినేటర్ల (సమన్వయకర్తల)కు చెల్లించాల్సిన జీతాలపై చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి ఇచ్చిన పిటిషన్‌పై ఈ సమావేశంలో చర్చించారు. 2017 అక్టోబర్ నుంచి మార్చి 2018 వరకు పెండింగ్‌లో ఉన్న జీతాలను త్వరలోనే చెల్లించనున్నట్టు అధికారులు కమిటీకి తెలిపారు. సాక్షర భారత్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చినప్పటికీ ఇప్పుడున్న వారినే మున్ముందు కూడా కోఆర్డినేటర్లుగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని అధికారులు తెలిపారు. మోడల్ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి కూడా మండల, జిల్లా పరిషత్ స్కూళ్ల మధ్యా హ్న భోజన పథకం సిబ్బంది తరహాలో వేత నాలు ఇవ్వాలని పాతూరి ఇచ్చిన పిటిషన్‌ను ప్రభుత్వం పరిశీలిస్తోందని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించారు. శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌లో శిథిలావస్థలో ఉన్న జిల్లాపరిషత్ స్కూల్ భవనాన్ని కూల్చివేసి అక్కడే కొత్తభవనాన్ని నిర్మించాలన్న పిటిషన్‌పై అధికారులు సానుకూలంగా స్పందించారు. దేవరయాంజాల్‌లో పాఠశాల భవన నిర్మాణ పనులు త్వరలోనే మొదలవుతాయన్నారు. యూజీసీ కింద వేతనాలు పొందే అధ్యాపకులకు రాష్ట్రంలో ఏడో వేతన సవరణ సంఘం సిఫారసుల కనుగుణంగా 2016 నుంచి జీతాలు చెల్లించాలన్న పిటిషన్‌పై కూడా తగిన కసరత్తు జరుగుతోందని అధికారులు చెప్పారు. -
మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్
* ఏకపక్షంగా ఓటింగ్.. పోలైనవన్నీ స్వామిగౌడ్‌కే * ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే బరి నుంచి తప్పుకున్న కాంగ్రెస్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనమండలి తొలి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నికయ్యారు. మండలిలో బుధవారం జరిగిన చైర్మన్ ఎన్నిక పూర్తిగా ఏకపక్షమైంది. మొత్తం 35 మంది సభ్యులున్న మండలిలో 21 మంది మాత్రమే ఓటువేయగా... వాటన్నింటినీ స్వామిగౌడ్ కైవసం చేసుకున్నారు. మండలి తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు సైతం స్వామిగౌడ్‌కే ఓటేయడం విశేషం. అయితే స్వామిగౌడ్‌కు పోటీగా అభ్యర్థిని బరిలో దింపిన కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఎన్నిక నుంచి తప్పుకొంది. చైర్మన్ ఎన్నిక విషయంలో ప్రభుత్వం అనుసరించిన అప్రజాస్వామిక వైఖరికి నిరసనగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లుగా పేర్కొంటూ మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ సహా పలువురు కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లిపోయారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం సభాధ్యక్ష స్థానంలో ఉన్న నేతి విద్యాసాగర్‌రావు... నూతన చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇప్పుడంత అవసరమేముంది..: విపక్షం బుధవారం ఉదయం 11 గంటలకు మండలి ప్రారంభమైన వెంటనే చైర్మన్ పదవికి ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు ప్రకటించారు. దీనిపై అభ్యంతరం తెలిపిన డీఎస్.. ప్రతిపక్షాల అభిప్రాయం వినకుండానే ఓటింగ్ నిర్వహించడమేంటని ప్రశ్నించారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పినా తమ పార్టీ సభ్యులను ఆకర్షించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వర్షాల్లేక, విద్యుత్ లేక ప్రజలు అల్లాడుతుంటే ఇంత అత్యవసరంగా చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలను ప్రోత్సహించేందుకే బ్యాలెట్ ద్వారా ఎన్నిక చేపట్టారని మండిపడ్డారు. వాయిదా కోరి నామినేషన్ వేశారేం..: టీఆర్ఎస్ అయితే డీఎస్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు.. బ్యాలెట్ ద్వారానే చైర్మన్ ఎన్నిక నిర్వహించాలనే నిబంధన ఉందంటూ సభ ప్రొసీజర్లను చదివి వినిపించారు. ఎన్నికను వాయిదా వేయాలని కోరుతున్న కాంగ్రెస్ నేతలు నామినేషన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఈ దశలో తాత్కాలిక చైర్మన్ నేతి విద్యాసాగర్‌రావు జోక్యం చేసుకుని అక్షర క్రమంలో సభ్యులను పిలవాలని శాసనసభ కార్యదర్శి రాజా సదారాంను ఆదేశించారు. వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు దూసుకొచ్చారు. మండలిలో కాంగ్రెస్ ఉపనేత షబ్బీర్‌అలీ తన చేతిలో ఉన్న పత్రాలను చింపి గాల్లోకి విసిరేశారు. ఆయనను అడ్డుకోబోయిన ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డిని నెట్టివేశారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య వివాదం మొదలైంది. ఒకదశలో పొంగులేటి, ఈటెల తదితరుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఇదంతా జరుగుతుండగానే ఓటింగ్ ప్రారంభమై డీఎస్ వంతు రావడంతో.. ఆయన అసహనం వ్యక్తం చేస్తూ.. ‘‘నేను మాట్లాడుతుంటే ఓటింగ్ ప్రారంభిస్తారా? దీనిని బట్టి సభలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. దీనికి నిరసనగా మా అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకుంటున్నాం..’’ అంటూ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుల్లో ఏడుగురు డీఎస్‌ను అనుసరించి వెళ్లిపోగా... మరో 8 మంది సభలోనే ఉండి స్వామిగౌడ్‌కు అనుకూలంగా ఓటేశారు. ఇందులో సభాధ్యక్ష స్థానంలో ఉన్న నేతి విద్యాసాగర్‌రావు కూడా ఉండటం గమనార్హం. మరోవైపు చైర్మన్ ఎన్నిక సమయంలో ప్రభుత్వ తీరు సక్రమంగా లేదని, ఇతర పక్షాల మద్దతు తీసుకునే విషయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ విఫలమైందని పేర్కొంటూ మండలిలో టీడీపీ ఫ్లోర్‌లీడర్ అరికెల నర్సారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. కానీ, ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు (పట్నం నరేందర్‌రెడ్డి, సలీం, బోడకుంటి వెంకటేశ్వర్లు) ఓటింగ్‌లో పాల్గొని స్వామిగౌడ్‌కు ఓటేశారు. ఇక టీఆర్ఎస్ ప్రతిపాదించిన అభ్యర్థికి ఓటేయడం సుముఖంగా లేని ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్ సమావేశానికి రాలేదు. అసమ్మతి నేతల హైడ్రామా.. అయితే మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్సీల వద్దకొచ్చి కాంగ్రెస్ సభ్యులతోపాటు వారు కూడా బయటకు వెళ్లిపోవాలని.. విప్ ధిక్కరణ నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తూ వారిని బయటకు తోడ్కొని వెళ్లారు. తరువాత కొద్ది నిమిషాలకే మళ్లీ ఆ నేతలంతా సభలోకి వచ్చి ఓటు వేశారు. ఎన్నికకు సీఎం దూరం శాసనమండలి చైర్మన్ ఎన్నిక కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దూరంగా ఉన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమై.. మధ్యాహ్నం 3.15 గంటల వరకు కొనసాగినప్పటికీ సీఎం సభకు రాలేదు. అయితే దాదాపు మంత్రులంతా సభకు హాజరై తొలిరోజు ఎజెండా ముగిసే వరకు ఉన్నారు. -
ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి ప్రమాణ స్వీకారం
-
ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా కుందూరు జానారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా నేతి విద్యాసాగర్ ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. ఈ నెల 10న శాసనసభ స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. 11న తేదీన 11 గంటలకు గవర్నర్ నరసింహన్ తెలంగాణ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.