new bus
-
కొత్త బస్సులు సమకూర్చుకోండి
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన ఆర్టీసీ ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా సేవలను అందించడానికి కొత్త బస్సులను సమకూర్చుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ సీఎండీ సజ్జనార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ తదితరులతో మంత్రి పొన్నం శనివారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 1,389 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసిందన్నారు. మొదటి విడతలో మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని మహి ళా స్వయం సహాయక సంఘాల మండల సమాఖ్యలకు అద్దె బస్సులను అందజేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించిందన్నారు. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఒక్కటి చొప్పున అద్దె బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల ప్రారంభించిన కార్గో హోం డెలివరీ సదుపాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. మరణించిన, మెడికల్లీ అన్‌ఫిట్ అయిన సిబ్బంది జీవిత భాగస్వాములకు, పిల్లలకు ఇచ్చే కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రూ. 3,747 కోట్ల మేర చార్జీల ఆదా! మహాలక్ష్మి పథకం కింద ఈ నెల 20 వరకు మొత్తం 111 కోట్ల జీరో టికెట్లను సంస్థ జారీ చేసిందని, రూ.3747 కోట్ల చార్జీలను మహిళలు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం తెలిపారు. జీరో టికెట్లను ఎప్పటికప్పుడు ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు.రవాణా ఆదాయ లక్ష్యాలను సాధించాలి.. ఆదాయ పెంపుదల లక్ష్యాలను సాధించాలని శాఖ అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఆదాయార్జన మార్గాలను అన్వేషించాలని సమీక్షలో సూచించారు. -
'త్వరలో వెయ్యి బస్సులు రయ్..రయ్'
న్యూఢిల్లీ: త్వరలో ఢిల్లీ నగర వీధుల్లో కొత్తగా వెయ్యి ఆరెంజ్ బస్సులు రయ్‌రయ్‌మంటూ తిరగనున్నాయి. బస్సుల కొరత రాజధాని తీవ్రంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరో ఆరు నెలల్లో ఢిల్లీలోని అన్ని బస్సు ఢీపొల్లో కొత్తగా బస్సులు ప్రారంభంకావాలని ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టం(డీఐఎంటీఎస్)కు ఆదేశించారు. ఈ వెయ్యి బస్సుల్లో 300 ఏసీ బస్సులు ఉన్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం ఢిల్లీలో 5,500 బస్సులు ఉండాల్సి ఉండగా అవి కొరతగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని పౌరులు ఇతర వాహనాలను ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. -
కొత్తబస్సు విషయంలో కేసీఆర్ అసంతృప్తి
-
ఆర్టీసీకి 2 వేల కొత్త బస్సులు
* ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: పోలీస్ విభాగం రూపురేఖలు మార్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఆర్టీసీపై దృష్టి సారించారు. సంస్థ పనితీరును మెరుగుపరిచేందుకు ఆయన చర్యలు చేపట్టారు. కాలం చెల్లిన పాత బస్సుల స్థానంలో రెండు వేల కొత్త బస్సులను సమకూర్చుకోవాలని తాజాగా నిర్ణయించారు. తొలి విడతగా రెండు మూడు నెలల్లోనే వెయ్యి కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీకి సీఎం అనుమతించారు. ఇందులో ఆర్టీసీ సొంతంగా 500 బస్సులను కొనుగోలు చేయనుండగా, మిగతా వాటిని ప్రైవేటు నుంచి అద్దెకు తీసుకోనుంది. ఇందుకోసం రూ. 150 కోట్లను ముఖ్యమంత్రి మంజూరు చేశారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఉన్నతాధికారులతో గురువారం రాత్రి సమావేశమైన కేసీఆర్.. ఆర్టీసీ పరిస్థితి, పనితీరుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులు అందజేసిన పలు ప్రతిపాదనలను పరిశీలించి కొన్నింటికి అక్కడికక్కడే ఆమోదం తెలిపారు. మరికొన్నింటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. కొత్త బస్సులకు రూ.150 కోట్ల కేటాయింపుపై హర్షం తెలంగాణలో ఆర్టీసీకి కొత్త బస్సులు కొనేందుకు ముఖ్యమంత్రి రూ.150 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించటం అభినందనీయమని ఆర్టీసీ టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఆర్టీసీ కొత్త రూపును సంతరించుకుంటుందని హర్షం వ్యక్తం చేశారు.